ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు


Wed,March 6, 2019 12:50 PM

katta-shekar-reddy
బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయనిపిస్తోం ది. విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఏర్పాటు చేయాలని డిమాండు చేయడం, అది కేంద్రం మంజూరు చేయడం అన్నీ అనుకున్న ప్రకారం జరిగిపోయాయి. ఆలస్యం అయి ఉండవచ్చు, కానీ జోను ఏర్పాటు చేసి కేంద్రం మాట నిలబెట్టుకుంది. చంద్రబాబు ఊరుకుంటాడా. ఆయన తనది తనకే కావాలి, మంది దీ తనకే కావాలని కోరే రకం. ఆయన డిమాండ్లకు ఉచితానుచితాలు, న్యాయాన్యాయాలు ఏమీ ఉండవు. వాల్టే రు డివిజను నుంచి రాయగడను తీసేయడంపై ఆయన గగ్గోలు పెడుతున్నారు. ఆదాయాన్నిచ్చే రాయగడను తీసేస్తరా అని ఆగ్రహం ప్రకటిస్తున్నారు.

విచిత్రం ఏమంటే సగానికంటే తగ్గిపోయిన దక్షి ణ మధ్య రైల్వే ప్రాంతం వారూ ఎవరూ గోల పెట్టడం లేదు. ఈస్ట్ కోస్టు రైల్వే వాళ్లూ ఏమీ అనడం లేదు. కొత్తగా డివిజను దక్కిన ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రే అడ్డగోలుగా మాట్లాడుతున్నా రు. రాయగడ ఒరిస్సాకు కూడా అవసరమే కదా. వారు కూడా డిమాండు చేస్తారు కదా అన్న సోయి కూడా లేకుండా ఎంత వీలైతే అంత అథమస్థాయికి దిగి మాట్లాడుతున్నారు. నరేంద్రమోదీపై రాజకీయయుద్ధం చేయడానికి ఇంత గా దిగజారాల్సిన అవసరం లేదు. నిజాయితీగా, రాజకీయంగానే కొట్లాడవచ్చు. నేలబారు రాజకీయాలకు ఎందుకు పాల్పడాలన్నదే ప్రశ్న. తెలంగాణలో బీబీనగర్ సమీపంలోని పగిడిపల్లి నుంచి వాడపల్లి దాకా ఉన్న స్టేషన్లను అప్పట్లోనే అన్యాయంగా గుంటూరు డివిజనులో కలిపారు. అయినా ఇప్పటిదాకా తెలంగాణ గోల చేయలేదు. రైల్వే డివిజన్ల పునర్విభజన సందర్భంగానయినా నల్లగొండ పరిధిలోని స్టేషన్లను సికింద్రాబాద్ డివిజనుకు మార్చాల్సిన అవసరం ఉంది. చిన్న దొంగతనం జరిగినా, సేవలకు సంబంధించి ఏదైనా తెలుసుకోవలసి వచ్చినా, ఫిర్యాదు చేయవలసి వచ్చినా నల్లగొండ రైల్వే ప్రయాణికులు గుంటూరుకు వెళ్లి చేయాలి. ఇప్పు డు చంద్రబాబునాయుడు ఎలాగూ మనకు ఒక లాజిక్కు ఇచ్చారు కాబట్టి మన ప్రాంతాలను దక్షిణ మధ్య రైల్వేలో కలిపే విధంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.పెద్ద నోట్లు రద్దయితే ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు కట్టడి అవుతాయని ప్రధాని చెప్పారు. కానీ గత ఐదేళ్లలో జరిగినన్ని ఉగ్రదాడులు ముందు జరుగలేదు. పఠాన్‌కోట్, యురీ, పుల్వామా అందులో చాలా తీవ్రమైనవి. ఇవన్నీ మన గూఢచార వ్యవస్థలు, భద్రతా వ్యవస్థల వైఫల్యం కారణంగా జరిగినవే. ఇంటిని చక్కబెట్టుకోవడంలో మన వైఫల్యం ఈ దాడులకు కారణం. ఢిల్లీ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అన్ని వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను తరలిస్తుంటే ఎంత జాగ్రత్త తీసుకుని ఉండాలి? ఎంత నిఘా పెట్టి ఉండాలి? ఆ వైఫల్యాలకు కారణాలను అన్వేషించకుండా జైషే మహమ్మద్ దాడి తామే చేశామని ప్రకటించింది కాబట్టి, దాని ప్రధాన శిబిరాలన్నీ పాకిస్తాన్‌లో ఉన్నాయి కాబట్టి ఉరుకులబెట్టి సర్జికల్ ైస్ట్రెక్స్ జరిపారు. దాని పర్యవసానాలు ఏమయ్యాయి?


చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశు తెలంగాణపై పడి ఏడ్వడం ఇంకా కొనసాగించడం చూస్తే అసహ్యం కలుగుతున్నది. అప్పుడు ఆదాయాన్నిచ్చే హైదరాబాద్‌ను కోల్పోయారట, ఇప్పుడు రాయగడను కోల్పోయారట. వారి చారిత్రక అజ్ఞానానికి, అవగాహనారాహిత్యానికి ఇంతకంటే నిదర్శనం అక్కరలేదు. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందనీ, హైదరాబాద్‌లో రాజధానికి అవసరమైన సకల సదుపాయాలు ఉన్నాయనీ, అక్కడ ఆదాయం వస్తుందనీ, బాగా బతుకవచ్చుననీ కర్నూలును వదలి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తండ్రీ కొడుకులు సమయానుకూలంగా మర్చిపోతున్నారు. లేదంటే తెలిసి అబద్ధాలాడుతున్నారు. ఇక్కడేదో వారు వదలిపెట్టి పోయారన్నది పచ్చి అబద్ధం. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని బెదిరించి ఇతర పార్టీలలోకి మలుపుతున్నార ని కూడా చంద్రబాబు, ఆయనను ఊరేగించే పచ్చమీడియా ఒక ప్రచారం మొదలుపెట్టారు. అలా జరిగి ఉంటే చంద్రబాబును ఊరేగించే పచ్చమీడియా ముందుగా ఆయనను వదలి వేరే పార్టీలకు మద్దతు ప్రకటించి ఉండాలి. మమ్మల్ని బెదిరిస్తున్నారని ఒక్కరంటే ఒక్కరు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర వ్యాపారవేత్తలు ఫిర్యాదు చేశారా? రాయపాటి ఒక దివాలాకోరు వ్యాపారవేత్త. ఆయనకు ఇక్కడ ఆస్తులు ఉండటం, వాటికోసం ఆయనను బెదిరించడం ఎంత హాస్యాస్పదమో అందరికీ తెలిసిన విషయం. ఆయన కాంట్రాక్టు సంస్థ ఎంత పనికిమాలినది కాకపోతే చంద్రబాబునాయుడే ఆయనను పీకేసీ నవయుగకు పోలవరం ప్రాజెక్టు అప్పగిస్తాడు? అటువంటి నాయకులు కూడా తెలంగాణ గురించి మాట్లాడటం.

నిజానికి చంద్రబాబు వెంట ఉన్నవాళ్లలో ఎక్కువమంది దివాలాకోరు రాజకీయ వ్యాపారవేత్తలే. బ్యాంకులను, కంపెనీలను ముంచినవారే ఎక్కువమంది. అయినా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న స్పృహతో తెలంగాణ ప్రభుత్వం వారిని ఏనాడూ పనిగట్టుకుని ఇబ్బందిపెట్టింది లేదు. అయినా గోబెల్స్ మానస పుత్రులుగా అనేక విజయాలు సాధించిన అనుభవంతో ఆ ముఠా పదేపదే అబద్ధాలనే ఆశ్రయిస్తున్నది.

చంద్రబాబుకు కంటే అనేక రెట్లు పెద్దమనిషి నరేంద్రమోదీ. నిర్మలాసీతారామన్ దేశానికి తొలి మహిళా రక్షణ మంత్రి అని ఒక పెద్ద అబద్ధాన్ని నిస్సంకోచంగా చెప్పేశారు. ఆయనకు చరిత్ర తెలియదా లేక ఎవరయినా రాసిస్తే మాట్లాడతారో తెలియదు. కొన్నాళ్ల కింద కబీర్, గురునానక్, గోరఖ్‌నాథ్ ఇక్కడే కలిసి కూర్చుని మాట్లాడుకునేవారని విన్నాను అని ఉత్తరప్రదేశ్‌లో మగర్‌లో జరిగిన సభలో చెప్పారు. గోరఖ్‌నాథ్ కాలానికి, కబీర్, గురునానక్‌ల కాలానికి మధ్య మూడునాలుగు వందల యేళ్ల అంతరం ఉంటుంది. మరోసారి బీహార్ శక్తి గురించి చెబుతూ అశోక చక్రవర్తి, పాటలీపుత్ర, నలందా, తక్షశిల ఈ నేల విశిష్టతలని చెప్పారు. తక్షశిల ఇప్పటి పాకిస్థాన్‌లో ఉందన్న విషయం ఆయనకు తెలుసో లేదో. అలాగే కోణార్క సూర్య దేవాలయాన్ని రెండు వేల ఏళ్ల కిందట నిర్మించారని ఇంకో సందర్భంగా చెప్పారు.

అది నిర్మించింది ఏడువందల సంవత్సరాల క్రితమే అని చరిత్ర చెబుతున్నది. ఇలా ఆయన చారిత్రక తప్పిదాలు చాలాసార్లు బయటపడ్డాయి. ఇక రాజకీయాలకు సంబంధించి ఆయన మాటలు కోటలు దాటుతాయి. చేతలు ప్రజలకు చేరవు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చెప్పిన కారణాలు, రాగల ఫలితాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. అవన్నీ అబద్ధాలుగానే మిగిలిపోయాయి. నల్లధనం గురించి ఆయన చెప్పిన లెక్కలు కూడా రుజువు కాలేదు. ప్రజల ఖాతాల్లోకి లక్షల రూపాయలు రాలేదు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడే రైతులకు ఏదో చేద్దామనుకున్నానని, ఇప్పుడు ప్రవేశపెట్టిన రైతు సమ్మాన్ అందులో భాగమేనని ఆయన చెబుతున్నారు. ఇది మరో పెద్ద అబద్ధం. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత, ఆ పథకాన్ని అనేక రాష్ర్టాలు స్వీకరించిన తర్వాత, చివరకు ఇప్పుడు నరేంద్రమోదీ అనుకరించారు. అది కూడా కంటితుడుపుగా. అర్ధమనస్కంగా. అనివార్యంగా. కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నది నెరవేరలేదు. ఆయన ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశాలపై కాకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలను ప్రచారాంశాలుగా మార్చారు. కారణం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే గొప్ప పథకాలేవీ అమలు చేయకపోవడమే. అందుకే ఆయన భావోద్వేగాలను రెచ్చగొట్టడంపై ఆధారపడుతున్నారు.

పెద్ద నోట్లు రద్దయితే ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు కట్టడి అవుతాయని ప్రధాని చెప్పారు. కానీ గత ఐదేళ్లలో జరిగినన్ని ఉగ్రదాడులు ముందు జరుగలేదు. పఠాన్‌కోట్, యురీ, పుల్వామా అందులో చాలా తీవ్రమైనవి. ఇవన్నీ మన గూఢచార వ్యవస్థలు, భద్రతా వ్యవస్థల వైఫల్యం కారణంగా జరిగినవే. ఇంటిని చక్కబెట్టుకోవడంలో మన వైఫల్యం ఈ దాడులకు కారణం. ఢిల్లీ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అన్ని వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను తరలిస్తుంటే ఎంత జాగ్రత్త తీసుకుని ఉండాలి? ఎంత నిఘా పెట్టి ఉండాలి? ఆ వైఫల్యాలకు కారణాలను అన్వేషించకుండా జైషే మహమ్మద్ దాడి తామే చేశామని ప్రకటించింది కాబట్టి, దాని ప్రధాన శిబిరాలన్నీ పాకిస్తాన్‌లో ఉన్నాయి కాబట్టి ఉరుకులబెట్టి సర్జికల్ ైస్ట్రెక్స్ జరిపారు. దాని పర్యవసానాలు ఏమయ్యాయి? మనం ఒకటంటే వాడొకటంటాడు. వాళ్లూ మన భూభాగంలోకి రావాలని ప్రయత్నించడం. వాటిని వైమానిక యోధులు ప్రతిఘటించడం. ఒక కార్గో యుద్ధ విమానం కూలిపోయి ఆరుగురు వైమానికులు చనిపోవడం, మన యోధుడు అభినందన్ విమానం కూలిపోయి సరిహద్దుకు ఆవల పడిపోవడం, అతనిని విడిపించుకోవడం కోసం ఒక అడుగు వెనుకకు వేయడం...ఇవన్నీ తొందరపాటును, వ్యూహరాహిత్యాన్ని తెలియజేస్తాయి. ఎన్నికల వేళ కలిసొచ్చిందన్న ఉబలాటంతో మనం ప్రతీకారానికి దిగినట్టుగా ఉందే తప్ప పాకిస్థాన్‌కు, అక్కడి ఉగ్రవాద సంస్థలకు తగిన గుణపాఠం చెప్పే సమగ్ర వ్యూహమేదీ ఇందులో కనిపించలేదు. పైగా ఇలా మాట్లాడితే అదేదో దేశద్రోహం అని బట్టగాల్చి మీద వేయడం. అక్కడ అభినందన్ కోసం దేశం అంతా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తుంటే ఇక్కడ ఆయన రాజకీయసభలు సమావేశాలు బురద విమర్శలు చేసుకుంటూ తిరగడం. ఇది దేశభక్తి ఎలా అవుతుందో నమో భక్తులు చెప్పాలి.

3097

KATTA SHEKAR REDDY

Published: Sun,November 3, 2019 07:11 AM

మర మనుషులు

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గు

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్