బొంక నేర్చిన మేళం


Wed,March 6, 2019 12:28 PM

katta-shekar-reddy
లోక్‌సభ ఎన్నికల సమయం సమీపించే కొద్దీ మళ్లీ ఒక కుటిల ప్రచారయుద్ధాన్ని నడిపించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాండుమేళం సిద్ధమవుతున్నది. అందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వేల పేరిట సకల అబద్ధాలను కుమ్మరించి బొక్కబోర్లా పడ్డ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఫలితాలు వచ్చినవెంటనే రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతాడని, సర్వేలు తలకిందులైనందుకు క్షమాపణ లు కోరుతారని ఆశించినవారికి ఆయన అసలు స్వభావమేమిటో అర్థమైంది. రెండురోజుల క్రితం ఒక పత్రికాధిపతితో చంద్రబాబు ను కలిసి దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిపిన పిమ్మ ట ఢిల్లీ వెళ్లి చిన్నగా తనపై పడిన దొంగ సర్వేల మకిలిని కడిగేసుకుని, ఇంకా తనే దో గొప్ప సర్వేయర్ను అని చెప్పుకునేందుకు, చరిత్రలో తనసర్వేలు ఎప్పుడూ తప్పుకాలేదని బొంకేందుకు, తెలంగాణ ఎన్నికల ఫలితాల పై ఏవేవో అనుమానాలను రేకెత్తించేందుకు చాలా సెకలు పడ్డారు. పోలైన ఓట్ల జాబి తా సకాలంలో అందలేదని, అందులో ఏదో పెద్ద మతల బు ఉందని చెప్పడానికి ప్రయత్నించాడు. నిజానికి రాజగోపాల్ ఎంత అజ్ఞానో ఈ ఒక్క మాటతోనే తేలిపోయింది. పోలైన ఓట్ల వివరా లు ప్రాథమికంగా ఒకసారి, తుది వివరాలు మరోసారి ఇవ్వడం అన్నది ప్రతి ఎన్నికలోనూ జరుగుతూ వచ్చిందే. ప్రాథమికంగా చెప్పిన శాతాలకు, తుది శాతాలకు తేడా ఉండటం అన్నది ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అందరికీ తెలిసిన విషయమే. పూర్వం జరిగిన ఎన్నికలనాటి పత్రికలను తిరిగేస్తే ఈ వాస్తవం తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పుడు స్థానిక ఎన్నికల నాటికి పరిస్థితిలో తేడా వచ్చిందని, ప్రతిపక్షాలకు బాగా సర్పంచులు వచ్చాయని, అదేదో తన సర్వేకు అనుకూలంగా ఉన్నాయన్న భావన కలిగించేందుకు మరో పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ప్రకటించాడు.


ఎంత కష్టపడినా చంద్రబాబుకు రావలసినంత గొప్పపేరు రావడం లేదని, ఆయనను అక్కడి మంత్రులు సరిగ్గా పొగడటం లేదని, తెలంగాణలో మంత్రులు, పార్టీ నాయకులంతా పొగడటం వల్లనే కేసీఆర్ విజయాలు సాధించారని చంద్రబాబు చేత, చంద్రబాబు యొక్క, చంద్రబాబు కొరకు శ్రమించే ఒక సీనియర్ జర్నలిస్టు ఇటీవల సూత్రీకరణ చేశారు. పొగిడించుకొని పెద్దవాళ్లయిన నాయకులు చరిత్రలో లేరు. తమ పనుల వల్ల, తమ దక్షత వల్ల, సమర్థత వల్ల నాయకులైన వారే చరిత్రలో నిలిచారు. వందలాది జాకీలు, క్రేన్లు పెట్టి ఆకాశానికి ఎత్తించుకున్నవాళ్లు ఏనాడైనా చంద్రబాబులాగే ఉంటారు.

పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మునుపెన్నడూ లేని రీతిలో 67.7 శాతం గ్రామాలను కైవసం చేసుకున్నది. మొత్తం ఎన్నికలు జరిగిన 12,711 పంచాయతీల్లో 8,606 పంచాయతీలను గెల్చుకున్నది. అయితే రాజగోపాల్‌కు ఈ విషయాలు తెలియక కాదు. తెలిసీ బొంకడం బరితెగించినవాళ్ల లక్షణం. తాను ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాని కి ఇప్పుడు సాకులు వెతుకుతున్నాడు. తానేదో కరెక్టుగా సర్వే చేశానని ఎక్కడో ఏదో జరిగిందని, ఎన్నికల తర్వాత ఆ విషయాలు మాట్లాడుతానని చెప్పి, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఒక కొత్త ఎంట్రీని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఆడిన నాటకాన్నే ఆంధ్రలో ఆడటానికి బాబుతో కలిసి రంగం సిద్ధం చేస్తున్నాడని ఆ అర్ధరాత్రి మీటింగు, ఆ మరుసటిరోజే ఢిల్లీలో మీడియా తో మాటలు తెలియజేస్తున్నాయి.


చంద్రబాబుకే కాదు, ఆయన బ్యాండు మేళానికంతటికీ తెలంగాణ ఎన్నికలు ఒక ఆటస్థలం. ఆం ధ్ర ఎన్నికలు జీవన్మరణ సమస్య. అందుకే తెలంగాణలో చేసిన తప్పుడు ప్రచారాలకు వంద రెట్లు ప్రచారాలు అక్కడ చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. దానికి ఇప్పటినుంచే సన్నాహాలు. సర్వే తప్పయితే ఒప్పుకుంటా.. నాకు సిగ్గు లేదు అని యథాలాపంగా రాజగోపాల్ అన్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజగోపాల్‌కు, చంద్రబాబు బృందానికి సిగ్గూ ఎగ్గూ లేదని రాజకీయాల్లో వారి అష్టవంకరలు, విపరీత పోడకలు చాలాసార్లు రుజు వు చేశాయి. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా, భ్రమను బ్రహ్మరాక్షసిగా, బ్రహ్మరాక్షసిని ఉత్త భ్రమగా, భయంకర వ్యవస్థాగత అవినీతిని, మహోద్ధారక కార్యంగా, ఉద్ధారక కార్యాలను అవినీతి చర్యలుగా, వెన్నుపోటును ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్యా న్ని వెన్నుపోటుగా చిత్రించగల చిత్రాంగులు వీరు. వీరిగురించి ఇలా ఎన్ని అలంకారాల్లోనైనా వర్ణించవచ్చు. చంద్రబాబునాయు డు కానీ, ఆయనను మోసిన మీడియా కానీ, ఇతర వ్యవస్థలు కానీ ఏ రోజూ తాము చేసిన తప్పులకు విచారం ప్రకటించిన సందర్భం లేదు.

ఎన్టీఆర్‌ను అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి చంపినవా రు కనీసం తాము చేసింది తప్పని ఇంతవరకు అధికారికంగా ప్రకటించుకున్నది లేదు. బుకాయింపులతో, ప్రచారాలతో, వక్రీకరణలతో, అబద్ధాలతో బతికేయడం ఆ బృందానికి అలవాటైంది. ఎన్టీఆ ర్‌పై చంద్రబాబు కుట్రచేసిన రోజున తండ్రిని కాదని బావకు మద్దతుగా వెళ్లిన ఆయన తనయులు ఒక్కసారి కూడా నాన్నా మళ్లీ ఎప్పుడు పుడతావు అని తప్ప నాన్నా మమ్మల్ని క్షమించు అని ప్రకటన ఇవ్వలేదు. మళ్లీ ఎప్పుడు పుడతావు అన్న ప్రకటన చూసినప్పుడల్లా 1995 ఆగస్టు నుంచి 1996 జనవరి 18 దాకా జరిగి న పరిణామాలను చూసినవారు వికలమవుతుంటారు. ఎందుకూ మళ్లీ చంపడానికా అని ఆవేదనగా నిందిస్తుంటారు. చంద్రబాబునాయుడైతే కొంతకాలం ఆయన విగ్రహాలు, ఫొటోలు లేకుండా చేసి, అంతా తానే అని నడిపించుకోవాలని చూశాడు. తన ముఖానికి విలువ లేదని, ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటేనే బతుకు ఉంటుందని గ్రహించిన తర్వాత మళ్లీ విగ్రహ పూజ మొదలుపెట్టారు. చం ద్రబాబు ఆయన బృందాన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. అందుకే ఆయన ఇప్పుడు కేంద్రంపై యుద్ధం చేస్తున్నానం టే ఇదంతా నాటకమని జనానికి అర్థమైపోతున్నది. నాలుగేండ్లు అంటకాగి ఇప్పుడు ఏదో పోరాటయోధునిలా పోజు పెడితే జనం ఎలా నమ్ముతారు? ఎంత కష్టపడినా చంద్రబాబుకు రావలసినంత గొప్పపేరు రావ డం లేదని, ఆయనను అక్కడి మంత్రులు సరిగ్గా పొగడటం లేదని, తెలంగాణలో మంత్రులు, పార్టీ నాయకులంతా పొగడటం వల్లనే కేసీఆర్ విజయాలు సాధించారని చంద్రబాబు చేత, చంద్రబాబు యొక్క, చంద్రబాబు కొరకు శ్రమించే ఒక సీనియర్ జర్నలిస్టు ఇటీవల సూత్రీకరణ చేశారు. పొగిడించుకొని పెద్దవాళ్లయిన నాయకు లు చరిత్రలో లేరు. తమ పనుల వల్ల, తమ దక్షత వల్ల, సమర్థత వల్ల నాయకులైన వారే చరిత్రలో నిలిచారు.

వందలాది జాకీలు, క్రేన్లు పెట్టి ఆకాశానికి ఎత్తించుకున్నవాళ్లు ఏనాడైనా చంద్రబాబులాగే ఉంటారు. కేసీఆర్ పొగడ్తల వల్ల ఎదుగలేదు. ఆయన రాజకీ య దార్శనిక దృష్టి, ఆయన పంతంగా అమలుచేసిన పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులు ఆయనకు చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించిపెట్టాయి. కేసీఆర్ స్వయం సాధకుడు. స్వయం ప్రకాశం కలిగిన నేత. పార్టీ, ఉద్యమం, తెలంగాణ సాధన, ప్రభుత్వ సాధన అన్నీ ఆయన స్వయం కృషి ఫలితాలు. ప్రేరక శక్తులు, కారక శక్తులు ఉండవని కాదు. కానీ ఆయనే అందరికీ లీడర్. చంద్రబాబుకు ఆయన స్వయంగా సాధించింది ఒకటి చెప్పండి. మామ పెట్టిన పార్టీని లాక్కున్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ కొత్త పిల్లిమొగ్గ వేసి ఏదో ఒక పార్టీని కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చాడు. 1996, 98లలో యునైటెడ్ ఫ్రంట్. 1999లో రాత్రికి రాత్రి వాజపేయి ఫ్రంట్‌లో. 2009లో కేసీఆర్‌తో ఫ్రంట్. 2014 లో బీజేపీ-పవన్‌కల్యాణ్‌తో ఫ్రంట్. ఆయన పరాన్నజీవి. స్వయంప్రకాశం లేని నేత. మ్యానిపులేటర్. గాలివాటంగా ప్రయాణం చేయడం ఆయనకు అలవాటు. అందులో ఎటువంటి విలువలు, సూత్రబద్ధత, నిజాయితీ ఏవీ ఉండవు. తన లాభం, తన మనుగ డ. వాడు మనకు పనికొస్తాడా లేదా. మనం నిలవడానికి నిచ్చెనగా ఉపయోగపడుతాడా లేదా.. అంతే.. అంత రాజకీయ అవకాశవా ది. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఒక మహాకీర్తి కిరీటం పెట్టి శంకుచక్ర గదాయుధాలు ధరింపజేసి ఆంధ్ర ప్రజల ముందు మరోసారి మహా నాయకునిగా నిలబెట్టాలని రాజగోపాల్, బాబు మీడియా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు చరిత్రను చెరపలేరు. ఆయన గీతను పెద్ద గా చేయలేరు కాబట్టి అవతలివారి గీతలను చిన్నగా చేయాలి. వైసీపీ నేత జగన్‌ను, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ను తక్కువచేసి చూపా లి. వారి ప్రతిష్ఠను దెబ్బతీయాలి. ముగ్గురు మోదీల ప్రచారం అటువంటిదే. నరేంద్ర మోదీతో వైసీపీ-టీఆర్‌ఎస్‌లకు లేని సంబంధాలను అంటగట్టి ప్రచారం చేయాలి. ఆంధ్రలో సెంటిమెంటును రెచ్చగొట్టాలి. తెలంగాణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడినట్టు అక్కడ చంద్రబాబు బ్యాండుమేళం అంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలి.

కానీ తెలంగాణకు అంధ్రకు తేడా ఉన్నదన్న సంగతి ఈ మేళానికి అర్థం కావడంలేదు. తెలంగాణలో చంద్రబాబు ప్రవేశించక ముందునుంచే కేసీఆర్‌కు అనుకూల పవనాలు ఉన్నాయి. ఆయన పాలనకు ప్రజలు మరోసారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని కనీసం నాలుగైదు జాతీయ సర్వేలు వెల్లడించాయి. చంద్రబాబును తిట్టి కేసీఆర్ గెలిచారనే ఒక అల్పపు సూత్రీకరణతో ఇప్పుడు ఆంధ్రలో కూడా అదే సూత్రాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబుకు అనుకూల ఓటు లేదని, ఆయన ఓడిపోబోతున్నారని ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలూ సూచిస్తున్నాయి. ఆయన సెట్టింగులూ, షూటింగులూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు తప్ప నిర్మాణాత్మకంగా సాధించిందేమీ లేద ని అక్కడి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. పైగా రక రకాల విపరీత రాజకీయ కెలుకుళ్లతో కొన్ని బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో మరిం త విస్మయం, పంతంతో కూడిన వ్యతిరేకత పెంచుకునే దిశగా విపరీతమైన రాజకీయ కొనుగోళ్లకు దిగుతున్నారు. ఎవరికి ఎంతయి నా డబ్బు ఇచ్చి పార్టీలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నాయకులతో చర్చలు జరుపడమే గాక తన తండ్రి హత్య కేసుకు టీడీపీకి సంబంధం లేదని ప్రకటించడం రంగా అభిమానుల్లో ఆగ్రహావేశాలు జనింపజేసింది. పవన్‌కల్యాణ్‌పై ఒకవైపు అత్యంత నీచమైన ప్రచారం సాగిస్తూ మరోవైపు ఆయనను దారికి తీసుకొచ్చుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు ఎంతో ప్రయాసపడి ఇతర పార్టీల నాయకుల ను తెచ్చుకుంటున్నారు. చాలామంది టీడీపీ, ఇతర పార్టీల నేతలు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వైసీపీలో చేరుతున్నారు. బాబుకు అనుకూల పవనాలు లేవు. అనుకూల రాజకీయ ఫిరాయింపులు లేవు. ఆయనకున్నదల్లా అనుకూల మీడియా. అబద్ధాల ప్రచార యంత్రాంగం. ఇవి ఏదీ సాధించబోవు అనడానికి తెలంగా ణ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

3548

KATTA SHEKAR REDDY

Published: Sun,March 24, 2019 07:06 AM

పదహారు గెలుపుతోనే మలుపు

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా

Published: Mon,February 18, 2019 05:08 PM

నిరంతర శ్రామికుడు

గోదావరి, కృష్ణా నదీజలాలు తెలంగాణ నేలను పునీతం చేయాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. రిజర్వాయర్లు జలకళతో కళకళలాడాలి. ఆ నీటితో ప్రతి

Published: Tue,February 5, 2019 11:07 AM

మోదీ రాజకీయ జూదం

ప్రధాని నరేంద్ర మోదీ బాగా అప్రమత్తమయ్యారని ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చెప్పకనే చెప్పింది. ఆయ న ఇటువంటి కానుకలు ఇంకా మరికొన్ని ప్రక

Published: Sun,December 23, 2018 08:51 AM

ఫెడరల్ మార్గం మేలు

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం

Published: Mon,November 26, 2018 04:57 PM

ఇటు వెల్లువ, అటు వెలవెల

కాంగ్రెస్ నాయకులు నోరుపారేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. వారి రాజకీయ స్థాయి అంతే అని. ప్రొఫెసర్ కోదండరాం సారు గొంతులో కూడా అక్కసు, ద

Published: Sun,November 11, 2018 10:22 AM

కేసీఆర్ కావాలె, కేసీఆర్ రావాలె

టీడీపీ ఓటు బ్యాంకు లెక్కలు నమ్మి పొత్తులకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశ

Published: Mon,November 5, 2018 12:35 PM

ఆయా బాబు గయా బాబు

చంద్రబాబుతో దోస్తానా మాకు కూడా ఇష్టంలేదు. కానీ జాతీయ అవసరాల కోసం చంద్రబాబు కావాలని మా నాయకత్వం మాపై రుద్దింది. ఒప్పుకోక చస్తామా

Published: Sat,November 3, 2018 05:19 PM

ఆడలేక మద్దెల ఓడు

ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీశైలం నీటిపై కేవలం 30 టీఎంసీల హక్కు మాత్రమే కలిగిన రాయలసీమకు 130 టీఎంసీలు తరలించుకుపోయారు. అన్ని హక్కులున్న

Published: Mon,September 24, 2018 12:11 PM

భిక్షకాదు, దీక్షాఫలం

అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాల

Published: Mon,September 10, 2018 12:07 PM

తెలంగాణ ద్రోహకూటమి

తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు కుట్రలను సకాలంలో పసిగట్టి తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమేసింది. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా

Published: Sun,July 29, 2018 08:39 AM

మునుపటి గుణమేల మాను..

మార్పును ఆహ్వానించలేనివారు మచ్చల కోసం భూతద్దం పెట్టి వెదుకుతుంటారు. జీవితకాలమంతా సాగించే ఆ మచ్చల అన్వేషణే ఒక మహా విప్లవకార్యంగా భా

Published: Thu,July 19, 2018 01:15 PM

ముసుగువీరుల అసలు లక్ష్యం

సైంధవులను, శిఖండులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తేనే సమస్య. ముసుగు యుద్ధాలతోనే ప్రమాదం. కర్ణాటక, మహారాష్ట్రలో ఏదో ఒక సేన ఏర్పాట

Published: Mon,July 2, 2018 05:54 PM

మోదీ, బాబు.. ఎదురీత‌

కేసీఆర్ ఒక్కరే వీరిద్దరికీ భిన్నం. ఆయన ఈ నాలుగేండ్లూ ప్రజలకు గరిష్టంగా, గుణాత్మకంగా, నేరుగా మేలుచేసే అంశాలపైనే దృష్టిపెట్టారు. గత

Published: Mon,June 11, 2018 03:03 PM

తెలంగాణ ఓ ఫీనిక్స్

కాంగ్రెస్ ఏనాడైనా ప్రజాకేంద్రకంగా ఆలోచనలు చేసిందా? ప్రజలు ప్రాధాన్యంగా ప్రణాళికలు చేసిందా? ప్రజల కష్టనష్టాలు తెలిసిన నేత, తెలంగాణ

Published: Sat,May 26, 2018 11:05 PM

పాపాలు వెంటాడుతాయి

చంద్రబాబుకు మతిపోతున్నది. సమయం, సందర్భం, ఉచితానుచితం ఏదీ పట్టడం లేదు. ఏది పడితే అది మాట్లాడే స్థితికి జారిపోతున్నాడు. పాపం నిన్నగా

Published: Sun,April 29, 2018 06:19 AM

దేశానికి ఒక కొత్త ఎజెండా

ఏకపక్ష రాజకీయాధికారం చెలాయించే ఏ పార్టీనుంచి అటువంటి కేంద్రాన్ని ఊహించలేము. కేంద్రీకృత లక్ష్యాలు లేని ఒక సమాఖ్య కూటమి(ఫెడరల్ ఫ్రంట

Published: Sun,April 15, 2018 10:47 AM

దోషుల శాపనార్థాలు

ఇప్పటికీ కాంగ్రెస్, ఇతర పక్షాలకు రాజకీయ ఎజెండా తప్ప తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను చూపాలన్న సోయిలేదు. అసలు అటువంటి ర

Published: Mon,April 9, 2018 10:48 AM

కేంద్రానికి ఒక కేసీఆర్ కావాలి

తెలంగాణ నమూనానే కేంద్రంలో అమలు చేయాలి. అలా జరుగాలంటే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ రాజకీయ వేదికపై ప్రధాన భూమిక పోషించాలి. భారతదేశం పే

Published: Mon,March 19, 2018 11:30 AM

మొగులు మీద మన్నుపోస్తే!

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో గత నాలుగేండ్లలో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ మూడు నాలుగు దశాబ్దాల క్రితం మన నాయకు

Published: Sat,February 10, 2018 11:40 PM

ఆది నుంచీ అదే అక్కసు

సమైక్య రాష్ట్రంలో సాగునీరు విషయంలో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ. ఆగమేఘాలపై ప్రాజెక్టులు నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది తెలంగాణకే.

Published: Mon,January 29, 2018 10:38 PM

సైంధవుల సయ్యాట

వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుంది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్

Published: Sun,January 21, 2018 10:48 AM

భూములేలినా బుద్ధి మారదా!

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది.హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింద

Published: Sun,January 14, 2018 07:26 AM

ముంజేతి కంకణానికి అద్దమేల

తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజువు చేసుకోవా

Published: Sun,November 19, 2017 01:47 AM

తెలుగు మూలాల అన్వేషణ

ఆంధ్రలో సీపీ బ్రౌన్ చేసిన కృషిలో కొంతయినా తెలింగ వ్యాకరణంపై విలియం కేరీ చేశారు. శ్రీరాంపూర్ ఫోర్టు విలియం కళాశాలలో సంస్కృ తం, బెంగ

Published: Sun,November 12, 2017 12:05 PM

త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక

Published: Sun,November 5, 2017 08:35 AM

ప్రత్యేక ప్రతిపక్షం

ప్రాజెక్టులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతసేపూ గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమీషన్లు. కానీ ప్రాజెక్టులంటే నీళ్లొస్తాయని, రైతుల పొలాల

Published: Sun,July 9, 2017 01:47 AM

ప్రతిపక్షానిది ఇప్పటికీ పరాయితనమే

హైదరాబాద్‌లో రెవెన్యూ రికార్డులను మాయంచేసి, ఫోర్జరీ చేసి, కార్యాలయాలను తగులబెట్టి, మనుషులను మాయం చేసి, ఎన్ని దారుణాలకు పాల్పడాలో

Published: Sun,June 4, 2017 01:14 AM

ఊసరవెల్లి చంద్రబాబు

చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఈ పాటికి రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. ఎన్ని అంతస్తుల భవనమైనా మూడేండ్లకు మించి పట్టదు. ఆయన చేసిన వృథా ఖర

Published: Sat,May 27, 2017 11:32 PM

ఏమిటీ బీజేపీ గొప్ప

పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఏడు మండలాలను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలన

Published: Sat,April 15, 2017 11:42 PM

కృషితో నాస్తి దుర్భిక్షం

ప్రభుత్వం ప్రాజెక్టుల వెంట, ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. ఇలాగే ముందుకుపోతే ప్రతిపక్షాలకు నూకలుండవు. వారేదైనా మంచిపేరు

Published: Sun,March 5, 2017 01:02 AM

వీరా ఉద్ధారకులు?

తెలంగాణ అంతటా స్వరాష్ట్ర నినాదంతో కుతకుత ఉడికిపోతుంటే, సబ్బండవర్ణా లు, ఉద్యోగులు సమ్మెలు హర్తాళ్‌తో వీధుల్లోకి వస్తుంటే, వందలాదిమ

Published: Sun,February 12, 2017 01:18 AM

జీవనదిగా గోదావరి

సీమాంధ్ర నాయకులకు తమ ఆత్మలను, తనువులను, రాజకీయాలను అమ్ముకున్న కొందరు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర నాయకులకంటే హీనంగా మాట్లా

Published: Sun,February 5, 2017 02:19 AM

సాగునీరే సమాధానం

తెలంగాణ వచ్చిన తర్వాతనే అన్ని ప్రాజెక్టుల్లో మన వాటాను గరిష్టమొత్తంలో వాడుకోవడం మొదలైంది. ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ ప

Published: Sun,December 11, 2016 01:33 AM

గొంగట్లో పాశం

గొంగడి లాంటి వ్యవస్థలను సంస్కరించకుండా జనం దగ్గర సొమ్ము లాగేసుకోవడం వల్ల నల్లధనం నిర్మూలన జరుగదు. కొత్తగా విడుదల చేసిన నోట్లు ప్రజ

Published: Sun,December 4, 2016 01:08 AM

తెలంగాణ ఏం తెచ్చింది-ఏం ఇచ్చింది?

మనుషుల్లో మానవత్వాన్ని, మంచితనాన్ని ఇసుమంతయినా చూడలేకపోవడం, మనుషులకు, మనిషితత్వానికి దూరంగా సిద్ధాంతమనే ఒక కంచెలో నిలబడి, అందులోనే

Published: Sun,October 16, 2016 02:48 AM

మోదీ ఉత్తరాదితో కనెక్టు కాలేదా?

ఆప్ గానీ, టీఆర్‌ఎస్ గానీ జనంతో కనెక్టు అయ్యే అంశాలపై పనిచేస్తున్నాయి. సామాన్యులకు పెద్ద పెద్ద విషయాలతో పనిలేదు.రోజువారీ జీవితాన్ని

Published: Sun,October 9, 2016 02:04 AM

సూక్ష్మ పాలన-సత్వర ఫలితాలు

అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉం

Published: Sun,October 2, 2016 02:26 AM

స్వయంపాలనే పరమావధి

జిల్లాల విభజన వల్ల కలిగే ప్రయోజనాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒనగూరుతున్న ప్రయోజనాలే జిల్లాల

Published: Sun,September 25, 2016 02:42 AM

వాన కష్టం, వాన ఇష్టం

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ముంపు బాధలు, అక్కడక్కడా పంట నష్టాలు తప్ప ఈ వర్షాలు ఎక్కువమందికి హర్షాన్నే మిగిల్చాయి. కాలం దాటిపోయి

Published: Sun,August 28, 2016 10:13 AM

దాచేస్తే దాగని సత్యం

నీటి విలువ కంటే ఏదీ విలువైంది కాదు. కరెంటు ఖర్చు, ప్రాజెక్టు వ్యయం అంటూ తెగ మాట్లాడుతున్న వారంతా ఒకటి గమనించాలి. తెలంగాణలో సుమార

Published: Sun,August 21, 2016 01:42 AM

తెలివితక్కువ ప్రదర్శన

తెలంగాణ ఇప్పుడు జలఫలాలను తీసుకోవలసి ఉంది. వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకోవలసి ఉంది. మహబూబ్‌నగర్‌లో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ నీర

Published: Sun,August 14, 2016 01:22 AM

నయీం ఒక గుణపాఠం

నయీం ఉదంతం రెండు దశాబ్దాలుగా పోలీసులపై స్థిరపడిపోయిన ఒక మచ్చను కొంత చెరిపేసింది. సమైక్య పోలీసులు నాటిపోయిన ఒక విషవృక్షాన్ని నేలమట్

Published: Sun,August 7, 2016 12:58 AM

నీటి విలువ తెలుసుకుందాం

భూ నిర్వాసితులను రెచ్చగొట్టి, అయోమయం పాలు చేసి, కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపించి, తెలంగాణలోని మెజారిటీ ప్రజానీకానికి ద్రోహం చేస్తున

Published: Sun,July 31, 2016 02:11 AM

పద్మవ్యూహం ఛేదించడమెలా?

రోడ్లు సరిపోను ఉంటే కదా ఎవరయినా నియంత్రించగలిగేది? రోడ్లు విస్తరిస్తున్నాం. విస్తరించే లోపే రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య

Published: Sun,July 24, 2016 12:37 AM

రిజర్వాయర్లే ఎందుకు?

ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు చేసే అధికారం తెలంగాణ చేతికి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడయినా ప్రాజెక్టుల మొఖాన చూశారా. మనిషి మనుగడ

Published: Sun,July 17, 2016 01:40 AM

జ్ఞాన శూన్యులు

తెలంగాణ విషాదం ఈ సంవత్సరం మన కళ్లముందే ఆవిష్కృతం అయింది. సింగూరు, మంజీరా, నిజాంసాగర్, ఎగువ మానేరు, దిగువ మానేరులకు చుక్క నీరు రాలే

Published: Sun,July 10, 2016 01:51 AM

చెట్టూ మనం కలిసి బతుకుదాం

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంచి అదను చూసి మొక్కలు నాటే ఉద్యమాన్ని ముందుకు తెచ్చారు. జనం కరువుతో కటకటపడుతున్న సందర్భం. నీరు లేక

Published: Sun,June 26, 2016 01:24 AM

ప్రతిపక్షాలకు లెక్కలు రావా?

ఈ ఆరు దశాబ్దాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు, ఇక్కడ జరిగిన అవినీతికి భాగస్వాములుగా, ప్రత్యక్ష సాక్షులుగా అద్దాల మేడలు నిర్మించుకు

Published: Sun,June 19, 2016 01:38 AM

ప్రతినాయకగణం

ఏటిగడ్డ కిష్టాపూర్ రైతాంగం అర్థం చేసుకోవలసింది ఒక్కటే. రాజకీయాల కోసం తమను ఎగదోసేవారిని నమ్మకండి. నాయకుల లక్ష్యమల్లా ప్రాజెక్టును వ

Published: Sun,June 5, 2016 12:56 AM

దీక్షా దినమా? ఏడుపు దినమా?

జగన్ జనంతో కలుస్తున్నారు కానీ ఆయన నాయకులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాజశేఖర్‌రెడ్డి తనకు అండగా నిలిచిన చిన్న నాయకుడు ఎదురయినా

Published: Sun,April 17, 2016 01:57 AM

చెట్టులో మనిషి ప్రాణం

చందమామ కథల్లో మాంత్రికుడి ప్రాణం చెట్టు తొర్రలో ఉందని తరచూ చదువు కునేవాళ్లం. అది నిజమో కాదో తెలియదు కానీ మనిషి ప్రాణం మాత్రం చెట్ట

Published: Sun,April 10, 2016 01:00 AM

యథాజ్ఞానం తథా ప్రజెంటేషన్

తెలంగాణ నేతలను ఎగతాళి చేసిన శక్తులన్నీ వాస్తవంలోకి వచ్చి ఇప్పుడు పాహిమాం పాహిమాం అని చేతులు జోడిస్తున్నాయి. తెలంగాణ సమాజానికి మును

Published: Sun,April 3, 2016 03:23 AM

కేసీఆర్ విశ్వరూపం

కేసీఆర్ విశ్వరూపం చూశాం. ఆయన గురించి మేము ఇంతకాలం విన్న వ్యతిరేకాంశాలు దూదిపింజల్లా తేలిపోయాయి. ఆయనను ఇప్పటిదాకా పరిపాలించిన మరో మ

Published: Sun,March 6, 2016 12:48 AM

ఐక్యంగా సాగాల్సిన సందర్భమిది

తెలంగాణలో ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వచ్చిందో మనకు తెలుసు. ఈ డబ్బులు ఎక్కడకు పోయాయో తెలుసు. మన రాష్ట్రం మనం సాధించుకునే లోపే

Published: Sun,February 7, 2016 01:35 AM

సంపూర్ణ తెలంగాణం

రాజధాని, రాష్ట్రం కలిసి ప్రయాణం సాగిస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్న టీఆర్‌ఎస్ వాదన అందరికీ నచ్చింది. నగరంలో పనులు జరగాలంటే, నిధులు

Published: Sun,January 31, 2016 12:20 AM

హైదరాబాద్‌ను గెలిపించాలి

చంద్రబాబు అప్పటికీ ఇప్పటికీ అవే మాయప్రచారాలతో బతకాలని చూస్తున్నారు. ఆయనకు ఆరోవేలుగా మారిన బీజేపీ పరిస్థితీ తెలంగాణకు అనుకూలంగా ఏమీ

Published: Sun,November 8, 2015 03:22 AM

స్టార్టప్ తెలంగాణ..

తెలంగాణ రాష్ర్టాన్ని ఒక తిరుగులేని రాష్ట్రంగా నిర్మించాలన్నా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచనలన్నీ పూర్తిస్థాయిలో క

Published: Sun,November 1, 2015 03:18 AM

తెలంగాణే గెలువాలె

తెలంగాణ కిందపడితే నవ్వాలనుకుని నవ్వలేకపోయినవారు, ఓడిపోతే సంబరాలు చేసుకోవాలని చేసుకోలేకపోయినవారు, అల్లకల్లోలమైతే ఆనందతాండవం చేయాలని

Published: Sun,October 25, 2015 01:00 AM

అమరావతి నేర్పిన పాఠం ఏమిటి?

తెలంగాణలో కేసీఆర్‌పై కత్తులు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనక

Published: Sun,October 18, 2015 12:03 AM

మనిషా? మతమా?

మతస్వేచ్ఛ ఉండాలని కోరుకున్నట్టే మతాచరణ లేకుండా జీవించే స్వేచ్ఛ కూడా ఎప్పటిలాగే వర్ధిల్లాలి. మతం కంటే మానవత్వాన్ని మన పతాకంగా మార్

Published: Sun,October 11, 2015 12:03 AM

సమస్యంతా ఈగోనే..

ప్రకృతి సహకరించలేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టింది.ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మెదక్, నల్లగొండతో సహా అన్ని జిల్లాల్లో రైతులకు భరోసా

Published: Mon,October 5, 2015 10:59 AM

వంచకుల విప్లవగీతాలు

ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప

Published: Sun,August 23, 2015 01:41 AM

డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు

తెలంగాణకోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చ

Published: Sun,August 9, 2015 01:20 AM

ప్రాజెక్టులు కడదాం, పంచాయితీ తర్వాత

చంద్రబాబు, ఆయన రాజకీయ లక్ష్యాలు స్పష్టం. ఆయన ఆంధ్ర మేలుకోరకపోతే తెలంగాణ మేలు ఎలా కోరతారు? మన మేలు మనమే చూసుకోవాలి. ఇక్కడి రాజకీయ

Published: Sun,July 26, 2015 02:41 AM

పుష్కరాలు ఆత్మగౌరవ సంబురాలు

చంద్రబాబునాయుడు కానీ, ఆయన పల్లకీ మోసే సమైక్య వాదులు కానీ తమకు గత్యంతరం లేక హైదరాబాద్‌కు వచ్చామని, హైదరాబాద్‌తోపాటు తామూ పెరిగామని

Published: Sun,July 5, 2015 01:39 AM

అడవి, నీరు, మనిషి

విదర్భ కరువు కాటకాలతో విలవిలలాడుతున్నది. అదే విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లా అపారమైన వర్షాలతో అలరారుతున్నది. ఇటు ప్రాణహితను, అ

Published: Sun,June 14, 2015 05:17 AM

తన నేరం ప్రజల నేరమా?

ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట

Published: Sun,June 7, 2015 12:11 AM

నిజమే..మేము తెలంగాణ పక్షం

విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు

Published: Sat,May 23, 2015 11:36 PM

ఘనమైన ఆరంభం

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, తొలిసారి ముఖ్యమంత్రి, తొలిచూరు మంత్రివర్గం...అంతా కొత్తకొత్త... సగంసగం అధికార యంత్రాంగం... పూర్తి

Published: Sun,May 10, 2015 01:01 AM

తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది?

చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పు

Published: Sun,April 26, 2015 12:37 AM

చంద్రబాబూ.. ఇక చాలించు!

నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవా

Published: Thu,April 23, 2015 01:36 PM

ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ

తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఒక్కరి తపన చాలదు. పదిమంది మంత్రులు పనిచేస్తే చాలదు. మిషన

Published: Sun,April 12, 2015 04:01 AM

చెరువులతోపాటే ప్రాజెక్టులు

ప్రాజెక్టులను, కాలువలను పూర్తి చేసి, వాటిని గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేసి వరుసగా మూడు నాలుగేళ్లు చెరువులను నింపితే తప్ప మళ్

Published: Sun,April 5, 2015 12:42 AM

నీటికోసం కలిసి సాగాలి

నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప

Published: Wed,March 18, 2015 11:51 PM

తరగతి గదిని సజీవం చేసిన ఆచార్యుడు రామయ్య

తత్వశాస్ర్తాన్ని ఎవరికీ అర్థం కాని జడ పదార్థంగా పరిచయం చేయడం కాకుండా దానిని ప్రేమించి, శ్వాసించి, బోధించిన వారు అరుదు. ప్రొఫెసర్ చ

Published: Sun,March 15, 2015 06:33 AM

ఇదా రాజకీయం?

తెలంగాణ ప్రభుత్వం ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా తెలంగాణ వచ్చిన ప్రయోజనం ఏమిటో తెలంగాణకు చూపించాలి.

Published: Sat,January 31, 2015 11:22 PM

ప్రతిపక్షమా? పరాయిపక్షమా?

శ్రీరాంసాగర్ వరద కాలువ వల్ల కరీంనగర్‌కు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏ ప్రాజెక్టు నుంచయినా మొదటవచ్చే ప్రాంతాలకు నీరివ్వకుండా ఇతర

Published: Sun,January 25, 2015 12:19 AM

దిగ్విజయుని అకాలజ్ఞత

మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగొట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెల

Published: Sun,January 18, 2015 01:33 AM

తెలంగాణ తేజమే నిజం

తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ క

Published: Sun,January 11, 2015 02:15 AM

మతాలు మనిషిని మించినవా?

భారతీయ తత్వంలో ఉన్న గొప్పతనం మరే తత్వంలోనూ లేదు. సహిష్ణుత, వైవిధ్యం, సహజీవనం భారతీయ తత్వానికే సాధ్యమైంది-చాలాకాలం క్రితం ఒక ఆచార్య

Published: Sun,January 4, 2015 02:11 AM

నిజామూ నిజాలూ

కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు. తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగా

Published: Sun,December 28, 2014 02:22 AM

విభజనంటే ఇదేనా?

నిజమే. విభజన చట్టాన్ని సవరించాలి. సవరించాల్సింది ఆంధ్రకు ఎనిమిది సీట్లు పెంచడం కోసమో, నాలుగు వందల ఎకరాలు కలుపడంకోసమో కాదు. రెండు ర

Published: Sun,December 21, 2014 01:54 AM

తెలంగాణ ఏం సాధించింది?

ఆంధ్రా మీడియా రాతలు పైకి ఒక రకంగా కనిపిస్తాయి. అసలు లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్లు మనుషులు, పత్రికలే ఇక్కడ... వాళ్ల ఆలోచనలు, ప్రయోజ

Published: Sun,November 30, 2014 02:00 AM

జయహో శాసనసభ

ఇప్పుడు ఎజెండాలో ఉన్న సమస్యలేవీ తెలంగాణ ప్రభుత్వంతో వచ్చినవి కాదు. చాలా సమస్యలు దీర్ఘకాలికంగా సంక్రమించినవి. ఆ సమస్యల నుంచి బయటపడ

Published: Sun,November 23, 2014 03:11 AM

మా పీవీ పేరు మీరు పెట్టుకుంటారా?

తెలంగాణ సమాజం అంతా చెన్నారెడ్డిని ద్రోహి అనుకునేలా చరిత్ర రచన జరిగింది. మన నాయకులను చిన్నవాళ్లుగా చూపించి, తమ నాయకులను పెద్దవాళ్ల

Published: Sun,November 16, 2014 12:12 AM

చెల్లనికాసుల చిల్లర పంచాయితీ

ఇప్పుడు మనదంటూ ఒక ప్రత్యేక సభలో ఉన్నాం.బయటివాడు ఎవడో ఆడిస్తే ఆడే పరిస్థితి ఇప్పుడు కూడా మన సభకు ఉండకూడదు. మన శాసనసభ ఉన్నత సంప్రదాయ

Published: Sun,November 9, 2014 03:55 AM

బాబు ఎత్తులు జిత్తులకు చిక్కొద్దు

చంద్రబాబునాయుడు ఎంత రైతు పక్షపాతో అందరికీ తెలుసు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎంత మంది రైతులు బలయ్యారో తెలుసు. తెలంగాణలో ఆకల

Published: Sun,November 2, 2014 04:32 AM

తెలంగాణకు తాగునీరు అక్కరలేదా?

మొగుణ్ణికొట్టి మొగసాలకెక్కడం ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి మొదటి నుంచీ అలవాటు. తాను తప్పులు చేయడం ఎదుటివారిని బద్నాం చేయడం చంద్రబాబునా

Published: Sun,October 26, 2014 04:38 AM

శ్రీశైలం ఆక్రమణ కథ

తెలంగాణలో ఇవ్వాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యుత్ కొరత కారణంగానే పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని చెబుతున్న టీడీప

Published: Sat,October 18, 2014 11:35 PM

ఇదేనా మోదీ భారతం?

అభివృద్ధికి మోదీ చూపెడుతున్న ప్రమాణాలేవీ ప్రజలను కలుపుకునేవిగా లేవు. ప్రజలు ఏమైనా కానీ ఉత్పత్తి పెరగాలి, లాభాలు రావాలి, ఆర్థిక

Published: Sun,October 12, 2014 01:53 AM

అకాల యాత్రలు

రాజకీయాల్లో సమయాసమయాలు, ఉచితానుచితాలు చూసి వ్యవహరించడం తప్పనిసరి. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్‌లు చేస్తున్న యాత్రలు, యాగీలు, వి

Published: Sun,September 28, 2014 02:21 AM

నీటి సోయిలేకనే ఎండిపోయాం

నీటి సోయి ప్రభుత్వానికి, నాయకత్వానికి ఉంటే చాలదు. అది మొత్తం అధికార యంత్రాంగానికి రావాలి. పనులు జరిపించడంలో లక్ష్యశుద్ధి ఉండాలి. ప

Published: Sun,September 21, 2014 09:08 AM

తెలంగాణ మంచి చెడుల కొలబద్ద

సీమాంధ్ర ఆధిపత్యానికి అవశేషంగా మిగిలే తెలుగుదేశంను మాత్రం తెలంగాణ ఇంకెప్పుడూ జీర్ణించుకునే వకాశాలు లేవు. హైదరాబాద్‌లో వలస ఓట్లతో ఎ

Published: Sun,September 14, 2014 12:47 AM

రాజకీయస్వేచ్ఛ అక్కరలేదా?

వాళ్లు విషం కక్కనివ్వండి.... మనం మాత్రం అమృతం పంచుదాం... వాళ్లు విద్వేషాన్ని చిమ్మనివ్వండి.... మనం మాత్రం ప్రేమను పంచుదాం... వ

Published: Sun,September 7, 2014 04:30 AM

తెలంగాణ జెండా x విద్రోహ ఎజెండా

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. రాష్ర్టాన్ని ఐదున్నర దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు, ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న పార్టీలకు చెందిన

Published: Sun,August 24, 2014 09:16 AM

మన ప్రభుత్వం మన అధికారులు

తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో అత్యధికులు క్లీన్ ఇమేజి ఉన్నవారు. దీక్షాదక్షతల్లో ఎవరికీ తీసిపోనివారు. తెలంగాణకు ఏదో ఒకటి చేయాలన్

Published: Sun,August 17, 2014 02:12 AM

ఇది ప్రజాస్వామిక విప్లవం

తెలంగాణ ఒక గుణాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏ సమాజంలోనైనా విప్లవాత్మకమైన మార్పులు తేగలిగినవి తాగునీరు, సాగునీరు, కరెంటు,

Published: Sun,August 10, 2014 12:13 AM

ఇది సీమాంధ్ర కేంద్ర ప్రభుత్వమా?

తెలంగాణ ఉద్యమం ఒకటిన్నర దశాబ్దాలకు పైగా ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారే తప్ప ఎవరినీ బలితీసుకోలేదు.

Published: Wed,August 6, 2014 02:31 AM

ఆ గొంగడి తగలేద్దాం

కట్టా శేఖర్ రెడ్డిసంకల్పం ఉంటే సప్త సముద్రాలను అలవోకగా దాటవచ్చు. నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు. ఎటువంటి లక

Published: Tue,July 29, 2014 05:08 PM

చందమామను చూడమంటే..

మూడు రోజుల క్రితం ఒక అధికారి కలిసి చానెళ్ల పంచాయతీని పరిష్కరిస్తే మంచిదేమో అన్నారు. నిజమే...ఇంకా సాగదీయడం అనవసరం అనిపించింది. ప్

Published: Sun,July 13, 2014 01:55 AM

తెలంగాణపై కక్షగట్టారా?

గతంలో రెండు మూడుసార్లు గోదావరి నదికి గట్టిగా వరదలు వస్తేనే భద్రాచలం రామాలయంలోకి నీళ్లొచ్చాయి. ఇప్పుడు ఏకంగా భద్రాచలం గ్రామం తప్ప ఆ

Published: Tue,July 1, 2014 07:01 PM

కేసీఆర్- చారిత్రక అనివార్యత

ప్రజలు ప్రకృతి వేర్వేరు కాదేమో. సహజ న్యాయం, సామాజిక న్యా యం పక్కపక్కనే ఉంటాయేమో. ప్రకృతిని, ప్రపంచాన్ని శాసించగలం అని విర్ర వీగినప

Published: Sat,May 10, 2014 01:16 AM

యథాగతం తథా వర్తమానం

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్త

Published: Sat,May 3, 2014 01:25 AM

గులాబీ సంకేతాలు

గత మూడు రోజులుగా ఒకటే లెక్క... ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికె న్ని సీట్లు వస్తాయి? ఎడతెగని చర్చ లు...విశ్లేషణలు...బెట్టింగ్‌లు, చాలె

Published: Sat,April 26, 2014 12:07 AM

మార్పుకోసం మన ఓటు

స్వరాష్ర్టాన్నిసాధించుకున్న తర్వా త తెలంగాణ ప్రజలు తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఇవి అన్ని ఎన్నికల వంటివి కాదు. తెలంగాణ స్వీయ ర

Published: Sat,April 19, 2014 01:52 AM

మార్పు సంకేతాలు

ఆయన మంచోడే కానీ అది మనపార్టీ కాదు..,ఈయన గట్టోడే కానీ గెలిచెటోడు కాదు..చెడగొట్టేందుకొచ్చిండు..., పాతాయన మాత్రం ఓడి పోవాలె..., ఈసారి

Published: Sat,April 5, 2014 01:53 AM

ఇంటిపార్టీ సొంత టీమ్

ఎన్నికల ముఖ చిత్రం స్పష్టపడిం ది. ఇక ఏ పార్టీతోనూ పొత్తులు, చిత్తు లు ఉండవని తేలిపోయింది. ఇక జరగాల్సింది సమరమే. టీఆరెస్ అధ్యక్షు డ

Published: Sat,March 29, 2014 12:38 AM

ఇజం కాదు, హజం

ఏ విలువకూ కట్టుబడనివాడు అనేక విలువల గురించి మాట్లాడాడు. ఈయన ఇచ్చిన మాటకు నిలబడ్డాడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థి స్తూ 2009 ఎన

Published: Sat,March 22, 2014 12:22 AM

గెలవాల్సింది చాలా ఉంది

చంద్రబాబు, బిజెపిలు కలిసినా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్ల. అయినా తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలి. మీలో మీరు ఎంతయినా

Published: Sat,March 8, 2014 12:59 AM

పొత్తు చేటు, పోరు లాభం

తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని మునుపెన్నడూ లేనంత జాగతం చేసింది. ప్రజలకు మాట్లాడే ైస్థెర్యాన్ని, పోట్లాడే ధైర్యాన్ని, ప్రశ్నించే

Published: Sat,March 1, 2014 12:25 AM

విలీనమా? స్వాధీనమా?

తెలంగాణ సమస్య రాష్ట్రం ఏర్పాటుతో పూర్తి కాదు. చేయవలసిందంతా రాష్ట్రం వచ్చిన తర్వాతనే. మన అస్తిత్వాన్ని మనం ప్రకటించుకోవాలి. మన చరిత

Published: Sat,February 22, 2014 01:19 AM

సత్యమేవ జయతే

మన పత్రిక లేకపోతే మేమేమై పోయేవాళ్లమో అని ఒక పెద్దమనిషి చెప్పిన మాట నమస్తే తెలంగాణ జన్మను సార్థకం చేసింది. సీమాంధ్ర మీడియా నిరాశ ని

Published: Wed,February 19, 2014 12:13 AM

తెలంగాణ స్వేచ్ఛాగీతం

ఎండి బీటలు వారిపోయిన కోట్లాది హృదయాల్లో ఆత్మీయ జలాలు కుండపోతగా వర్షించినట్టు.. దుఃఖంతో తడారిపోయిన కళ్లల్లో ఆనంద బాష్పాలు జలజలా

Published: Sat,February 15, 2014 01:05 AM

రాజకీయ కార్పొరేట్ ఉగ్రవా దులు

సీమాంధ్ర నాయకత్వం పార్లమెంటు సాక్షిగా తమ బరితెగింపును ప్రదర్శించి ఇంతకాలంగా తెలంగాణ ఎలా అన్యాయానికి గురవుతూ వచ్చిందో దేశానికంతా తె

Published: Sat,February 1, 2014 12:08 AM

ఏది నైతికబలం? ఏది మందబలం?

తెలంగాణ గెలిచింది. గెలుస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, మెజారిటీ అ ప్రజాస్వామిక దాష్టీకాలను జయిం చి రాష్ట్ర విభజన బిల్లు ఢిల్లీకి వెళ

Published: Sat,January 25, 2014 12:51 AM

మహా అజ్ఞాన ప్రదర్శన

వెనుకబడిన జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూరు, విజయనగరం మాత్రమే

Published: Sat,January 18, 2014 12:58 AM

తెలంగాణవాదంపై హక్కు పోరాటం

ముఖం బాగలేకపోతే అద్దం పగులగొట్టవద్దు. పార్టీలకు, ప్రజలకు, మీడియాకు మధ్యన ఉన్న ఈ సన్నని పొరను అర్థం చేసుకోకుండా వీరంగం వేయడం వల్ల ప

Published: Sat,January 11, 2014 02:33 AM

కేజ్రీవాల్ ఒక రోల్ మోడల్

రాజకీయాల్లో పరస్పర సంఘర్షణ అనివార్యమే. కానీ ఆ సంఘర్షణ విధానాలపై జరగాలి. వ్యక్తులు కేంద్రంగా కాదు. మార్పును, కొత్తను ఆహ్వానించని పా

Published: Thu,January 9, 2014 02:18 PM

నియంతల కోసమే 3వ అధికరణం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మా నం చేసినా, అనుకూలంగా తీర్మానం చేసినా, అసలు ఏ తీర్మానం చేయకపోయ

Published: Thu,January 9, 2014 01:51 PM

ఒక విలీనం-వంద ప్రశ్నలు

నిన్నటిదాకా ఎవరు కలిసినా తెలంగాణ వస్తుందా రాదా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు ఎవరిని కదిపినా టీఆరెస్ విలీనం అవుతుందా, విడిగా పోరాడుతు

Published: Sat,December 14, 2013 02:23 AM

చర్చిల్ నుంచి చంద్ర బాబు దాకా..

అబద్ధానికి గొంతుపెద్దది. ఆధిపత్యవాదికి బుకాయింపుపూక్కువ. అన్యాయానికి నిలు న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. అడ్డదారికి అసలైన నిర్వచ

Published: Sat,November 23, 2013 12:21 AM

ఆఖరిమెట్లు

పరమపద సోపానంలో ఆఖరి మెట్లు అతివూపమాదకరమైనవి. అక్కడ భారీ సర్పాలే తప్ప నిచ్చెనలు ఉండ వు. ఆ సర్పాలకు చిక్కకుండా గమ్యం చేరకపోతే అథఃప

Published: Sat,November 2, 2013 12:40 AM

ఎవరి హైదరాబాద్? ఎవరి ఆదాయం?:కట్టా మీఠా:కట్టా శేఖర్‌రెడ్డి

విభజన సమస్య చివరకు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ చుట్టూ పరివూభమిస్తోంది. సమన్యాయం అని చంద్రబాబు మాట్లాడుతున్నదీ, సమైక్యాంధ్ర అని కిరణ్

Published: Sat,October 26, 2013 01:23 AM

ఒంటికంటి రాక్షసత్వం

ఇంత అప్రజాస్వామిక ఆధిపత్య సమూహంతో కలిసి జీవించడం ఎలా సాధ్యం? అవతలివాడు ఏమైనా పర్వాలేదు కలిసి ఉండాల్సిందే అన్న ఉన్మాద స్థితి ఎవరి

Published: Fri,October 11, 2013 11:53 PM

భస్మాసుర రాజకీయం

ప్రజావూపతినిధులను తిరస్కరించే అవకాశం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజా గా సీమాంధ్ర ప్రాంత

Published: Sat,October 5, 2013 12:09 AM

అజ్జకారితనం అంతమయ్యే దాకా

కేంద్ర వూపభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించడం ఒక చరివూతాత్మక మలుపు. ఈ నిర్ణయం చేసిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. ము

Published: Sat,September 28, 2013 06:06 PM

హైదరాబాద్‌పై మోహం, ఆంధ్రకు ద్రోహం

అ వకాశవాదం, అధికారం మీద భక్తి తప్ప, దేశభక్తి ప్రాంతీయ భక్తి సీమాంధ్ర రాజకీయ నాయకుల్లో చూడలేము. ప్రాంతం మీద భక్తి ఉన్నవాళ్లు సీమాంవ

Published: Sat,September 21, 2013 01:34 AM

కట్టమంచి నుంచి కేసీఆర్ దాకా

తెలంగాణ నిర్ణయం వెలువడిన వెంటనే హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్రకటన వచ్చిన రోజు ‘విభజనకు సహకరిస్తా

Published: Sat,September 14, 2013 12:11 AM

హైదరాబాద్‌ను కాదు, ఆత్మగౌరవాన్ని అడగడం

విశాలాంద్ర వాదం బూటకం. సమైక్యవాదం ఇంకా బూటకం. విభజ న నిజం. విభజన తథ్యం. గొడవంతా హైదరాబాద్ కోసమేనని ఏపీఎన్జీవోల సభ రుజువు చేసింది.

Published: Fri,September 6, 2013 11:29 PM

అదే చరిత్ర, అవే కుట్రలు

అప్పుడూ వివాదం రాజధానికోసమే. ఇప్పుడూ అల్లరి చేస్తున్నది రాజధాని కోసమే. అప్పుడు వారు చేసిన రాద్ధాంతానికి పొట్టి శ్రీరాములు బలయ్యారు

Published: Sat,August 31, 2013 12:21 AM

సాగు నీరే సంపదల సృష్టికర్త

వాన జోరు, ప్రవాహ ఝరి, అలల హోరు గొప్ప అనుభూతినిస్తాయి. గలగలా పారేటి కాలువ నా స్వప్నం. ఆ స్వప్నం నిజమైతే... నీళ్లు చూడగానే నేన

Published: Sat,August 24, 2013 12:26 AM

టీడీపీ, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్

బీ జేపీ ఆశాజ్యోతి నరేంవూదమోడీ హైదరాబాద్ వచ్చి వెళ్లిన నాటి నుంచి అనుకుంటున్నదే నిన్న పార్లమెంటులో బట్టబయలయింది. 2009 డిసెంబరు 9న

Published: Sat,August 17, 2013 02:06 AM

‘సమైక్య’ రాజకీయ వైఫల్యం

తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయసమ్మతమైందో, ఎంత సంయమనంతో సాగిందో ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తే అర్థమవుతున్నది. తెలంగాణతో,

Published: Sat,August 10, 2013 03:30 PM

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు!

మమ్మల్ని దూరం చేసినందుకు... మిమ్మల్ని మీరు బయటపెట్టుకున్నందుకు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి ధన్యవాదాలు! అన్ని విధాలా స్పష

Published: Fri,August 2, 2013 11:36 PM

కపటనాటక సూత్రధారులు

రాష్ట్రాల విభజన ఉద్యమాల చరిత్ర అంతా విడిపోవాలని కోరుకున్నవారి చరిత్రే. కలసి ఉండాలని ఉద్యమాలు చేసినవారు అరుదు. పంజాబ్, హర్యానా, హిమ

Published: Wed,July 31, 2013 01:36 AM

ఆ ఒక్కడు...

మొదట వారు ఆయన ఉనికిని నిరాకరించారు. ఆ తర్వాత ఆయనను ఎగతాళి చేశారు. ఆయన వేషభాషలను గేలి చేశారు. వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆరోపణల

Published: Sat,July 27, 2013 12:52 AM

తెరలు తొలగిపోయే వేళ..

ద్వంద్వాలు ధ్వంసమయ్యేవేళ ఆసన్నమైంది. బహుముఖ వేషాల ముసుగులు తొలగిపోయే తరుణం వచ్చేసింది. మేకవన్నె పులుల స్వరూపం బట్టబయలయ్యే సందర్భం

Published: Fri,July 19, 2013 11:45 PM

ముందు నుయ్యి- వెనుక తెలంగాణ

తెలంగాణ విఘటన (డిమెర్జర్) ప్రక్రియ అంతిమఘట్టానికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్టు ఇప్పటికి

Published: Sat,July 6, 2013 12:42 AM

వస్తే సంబరం, రాకుంటే సమరం

దిగ్విజయ్‌సింగ్ ప్రాథమిక లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందేమోనన్న ఆశను రేకెత్తించడంలోఆయన సఫలీకృతులయ్యారు. కానీ తెలంగా

Published: Sat,June 29, 2013 12:09 AM

కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశం

కేంద్రంలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేస్తామంటున్నది. రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌

Published: Sat,June 22, 2013 01:18 AM

పబ్లిష్ అండ్ ఫినిష్

టీఆరెస్ నేత కేటీఆర్‌పై రెండురోజులుగా జరుగుతున్న ప్రచార దాడిని చూసి చాలా మంది మిత్రులు ఫోను చేశారు. కొందరు ఆవేశంగా. కొందరు అనుమాన

Published: Sat,June 15, 2013 12:49 AM

ఆక్రమిత నగరంలో ఓ అనుభవం...

ఎప్పుడెప్పుడు ఇందిరాపార్కుకు చేరుకోవాలన్న ఆలోచనల ఆరా టం. ఆలోచనల కన్నా కాళ్లు వేగంగా పరుగెత్తాలన్న తపన. వృత్తి ధర్మంలో భాగంగా అక

Published: Sat,June 8, 2013 12:01 AM

ప్యాకేజీ ఆటలు ఇక సాగవు

ఒకసారి అందరినీ మోసం చేయవచ్చు. కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చు. అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అసాధ్యం. సీమాంధ్ర పార్టీలు ఒకసారి

Published: Fri,May 31, 2013 09:59 PM

కాంగ్రెస్ పతనమే తెలంగాణకు సోపానం

తెలంగాణ ప్రజలు మనవావ్లూవరో, కానివావ్లూవరో గుర్తించాల్సిన సమ యం వచ్చింది. మాటిమాటికి మాటలు మార్చిందెవరో,నిక్కచ్చిగా నిలబడి కొట్లా

Published: Sat,May 25, 2013 01:09 AM

ఇక అన్ని ఎన్నికల్లో ఉప ఎన్నికల మార్గమే

పొద్దున్నే ఒక అధ్యాపక మిత్రుడు ఫోను చేశారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. టీఆస్‌పై చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి చేసిన విమర్శలు ఆయ

Published: Sat,May 11, 2013 01:28 AM

మన కురుక్షేవూతంలో హీరోలెవరు? విలన్‌లు ఎవరు?

వైశంపాయనుడు మహాభారత కథను చెప్పడం ముగించిన తర్వాత జనమేజయునికి ఒక సందేహం వస్తుంది. ‘ఈ కథలో విలన్ ఎవరు? హీరో ఎవరు? నాకు అయోమయంగా ఉంది

Published: Fri,May 3, 2013 01:11 PM

ఎవరు దొరలు? ఎవరు వారసులు? ఎవరు దొంగలు?

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్‌పై అన్నివైపుల నుంచి దాడిచేయడానికి సీమాంధ్ర పార్టీలు,సీమాంధ్ర మీడియా చావుతెలివిని ప్

Published: Sat,April 20, 2013 12:55 AM

అంతిమ ఉద్యమరూపంగా ఎన్నికలు

సూర్యాపేట, మార్చి 29; ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పాల్గొన్న సభ. నేతలంతా ప్రసంగిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే దామోదర్‌డ్డి ప్రసంగి

Published: Sat,April 13, 2013 01:48 AM

రాజకీయ అనివార్యత సృష్టిస్తేనే..

‘తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుంది. తెలంగాణ వస్తుంది’ అని మా టీవీ లో రామలింగేశ్వర సిద్ధాంతి చెప్పాడట. ఒక మిత్రుడు ఫోను చేసి చాలా ఆనందంగా

Published: Fri,March 29, 2013 11:54 PM

మనసులేని మహానగరం

దేశంలో జరుగుతున్న పరిణామాలకు న్యూఢిల్లీ కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందే మో! తాను చేయదల్చుకున్నది చేస్తుంది.అందరినీ అడిగి చేస్తున్నట్ట

Published: Sat,March 16, 2013 12:59 AM

కత్తుల కోలాటం

అక్కడ కొన్నేళ్లుగా కత్తుల కోలాటం జరుగుతోంది. గుంపులు గుంపులుగా అందరూ కత్తులు తిప్పుతూనే ఉంటారు. భీకరంగా యుద్ధం చేస్తున్నట్టు అందరి

Published: Fri,March 1, 2013 11:23 PM

మేలుకుంటారా...కూలిపోతారా...

గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే, వర్తమానాన్నీ జయించలేము. ఉద్యమాన్ని క్రమంగా గొంతు నులుమడం ఎలాగో సూచిస్తూ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చి

Published: Thu,February 28, 2013 11:56 AM

అభద్రతా నగరం, అసమర్థ యంత్రాంగం

నగరంలో జీవితాలు గాలిలో దీపాలు. ఇక్కడ బతకడం మన చేతిలో ఉండదు. చావడం మన చేతిలో ఉండదు’-బాంబు పేలుడు ఘటన దృశ్యాలు చూసి చలించిన ఒక సీనియ

Published: Sat,February 9, 2013 07:48 PM

మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి!

మనం గెలుస్తాం! మనం గెలుస్తున్నాం! మనమే గెలిచి తీరతాం! మనం ఓడిపోవడం లేదు! సాధన సరిహద్దుల్లో నిలబడ్డాం! మనమంతా విజయాన్ని ముద్దాడా

Published: Sat,February 2, 2013 12:24 AM

ఆధిపత్య నీతి శతకం

వెయ్యిమంది బలిదానాలకు దుఃఖించనివాడు సోనియమ్మకోసం గుండెలవిసేలా వలపోస్తుంటాడు పిల్లల శవాలపై చలికాచుకుంటున్నవాడు సంయమనం పాటించాలన

Published: Sat,January 26, 2013 12:48 AM

ఆ పని మనం చేయలేమా?

సీమాంధ్ర రాజకీయశక్తులు, ‘మేతా’వులు మనపై చేస్తున్న యుద్ధాన్ని ఇప్పుడు తిప్పికొట్టలేకపోతే ఇంకెప్పుడూ చేయలేం. ఆధిపత్యం చెలాయిస్తున్నవ

Published: Sat,January 19, 2013 05:31 PM

ఆంధ్రా నేతల అధర్మవాదం

చ రిత్ర పునరావృత్తమవుతున్నది. అవే వాదనలు, అవే పేచీలు, అవే సంఘర్షణలు. కాకపోతే నేతలు మారారు. ప్రాంతాలు మారా యి. మద్రాసు రాష్ట్రం నుం

Published: Sun,December 9, 2012 12:34 AM

కాంగ్రెస్‌ను అర్థం చేసుకుందాం!

కాంగ్రెస్ ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తుందో ఇప్పటికయినా అర్థం చేసుకోవాలి. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఈ తొమ్మిదేళ్లుగా కాంగ్రెసే పరిపా

Published: Fri,November 30, 2012 10:56 PM

మాకొద్దీ సీమాంధ్ర దొరతనం

పాము పాత చర్మానికి కాలం చెల్లిపోయినప్పుడు కొత్తది ధరించి కుబుసం విడుస్తుంది. కుబుసం విడిచిన పాము కొత్త శక్తితో చురుకుగా పనిచేస్త

Published: Fri,November 9, 2012 11:27 PM

కలిసి నడవాలి, నిలిచి గెలవాలి

మబ్బులు చెదరిపోతున్నాయి. తెలంగాణవాదులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టత క్రమంగా సమీపిస్తున్నది. కర్తవ్యం బోధపడుతున్నది. టీఆస్ కర

Published: Sat,October 20, 2012 12:53 AM

జరిగింది చాలు, జరగాల్సింది చూద్దాం

ఎనభై నాలుగేళ్ల పెద్దాయన ఒకరు సోమవారం అకస్మాత్తుగా ఆఫీసుకు వచ్చారు. చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగ విరమణ చేశారు. చరివూతపై అనేక పుస్తకాల

Published: Fri,September 21, 2012 11:35 PM

ఆ 80 మందే టీఆర్‌ఎస్‌కు ఉంటే...?

తెలంగాణ బాధ తెలంగాణదే. మన యుద్ధం మనమే చేయాలి. మన ప్రయత్నం మనమే చేయాలి. మనకోసం మరొకరు యుద్ధం చేయర ని ఈ దశాబ్దపు అనుభవాలు తేల్చి చెప

Published: Tue,September 18, 2012 05:45 PM

తెలంగాణ క్లైమాక్స్

కోట్లాది మెదళ్లు. అవే ప్రశ్నలు. తెలంగాణ వస్తుందా? కేంద్రం ఇస్తుం దా? కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? కేంద్రం చర్చలు చేస్తూ ఉంట

Published: Fri,August 10, 2012 11:53 PM

తెలంగాణ నిరీక్షణ

నిరాశ దూసుకొచ్చినప్పుడల్ల్లా ఏదో ఒక ఆశల పరిమళం దానిని కమ్ముతూనే ఉంది... మౌనం బద్దలవుతుందని నిష్క్రియ అంతమవుతుందని సందిగ్ధాన్

Published: Sat,July 21, 2012 12:02 AM

విజయమ్మను ఎలా స్వాగతించాలి?

నేతలకు ప్రజల మతిమరుపు మీద ప్రగాఢ విశ్వాసం. మొన్న జరిగిందే దీ ఇప్పుడు గుర్తుండదులే అన్న నమ్మకం కావచ్చు. ఏమూలైనా గుర్తున్నా కొత్త ని

Published: Sat,July 14, 2012 12:15 AM

వృద్ధ సింహం-బంగారు కంకణం

వెనుకట అడవిలో ఒక సింహం ఉండేది. వయసు, శక్తి, దూకుడు ఉన్నకాలంలో ఆ సింహం అడవిలో స్వైరవిహారం చేసింది. తన పర భేదం లేకుండా అవసరాన్ని బట్

Published: Sat,June 30, 2012 05:32 PM

తెలంగాణకు ఇదే తరుణం

రాష్ట్రంలో ఒక సందిగ్ధావస్థ, ఒక అనిశ్చితి తలెత్తి ఇప్పటికి మూడేళ్లు. నిజానికి పదేళ్లు. తెలంగాణ ఉద్యమం అవతరించిన రోజు నుంచి ఎంతోకొంత

Published: Sat,June 16, 2012 12:45 AM

ఉప ఎన్నికల ఉపదేశం

పద్దెనిమిది శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఊహించినదానికి భిన్నంగా ఏమీ రాలేదు. అయితే ఇందులో ఎన్నో సందేశాలు, సంభ్రమాలు, ఆశ్చర్యాలు

Published: Fri,June 1, 2012 11:36 PM

పరకాల-అనేక తీర్పులకు సందర్భం

పరకాల ఉప ఎన్నికకు సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒకే ఒక్క నియోజకవర్గం. పైగా ముందు తెలంగాణవాదులు గెల్చిన సీటు

Published: Sat,May 26, 2012 12:06 AM

గోల్...సెల్ఫ్‌గోల్

అవినీతికి కొత్త నిర్వచనాలు పరిచయం చేసినవాడు అమాయకత్వం ప్రదర్శిస్తుంటాడు. అధికారమే ఏకైక లక్ష్యంగా రాజకీయాలు మొదలుపెట్టినవాడు విలువల

Published: Sat,May 12, 2012 06:21 PM

నైతిక విధ్వంసకాండ

రాష్ట్రంలో నీతి ఒక పగిలిన అద్దం. విచలిత దృశ్యం. ఒక విభ్రమ. నైతి క విధ్వంసం పరిపూర్ణమైన చోట నీతులు వేయినాల్కలు చాస్తా యి. ఏది నీతి?

Published: Fri,August 31, 2012 05:05 PM

నీతి లేకపోతే నీడలేదు

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు అంటారు రాజకీయ పండితులు. ఒకరిని ఒకరు ఫినిష్ చేయడం అంటూ ఉండదు. అలా ఫినిష్ చేయాలని చూసినవారే ఫ

Published: Sat,April 28, 2012 01:52 AM

తెలంగాణ చోదకశక్తి

తెలంగాణ రాష్ట్ర సమితి పదకొండేళ్లు పూర్తిచేసుకోవడం ఒక చారివూతక విశేషం. ఈ పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాల్లో తెచ

Published: Sat,April 7, 2012 12:35 AM

కేసీఆర్ ఏం చేశారు?

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు. టిజి వెంక సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌

Published: Fri,March 30, 2012 11:02 PM

గెలుస్తున్నదెవరు? ఓడుతున్నదెవరు?(కట్టా మీఠా)

వసంతం మళ్లీ వస్తుంది!ఆకు రాలిపోయిందని చెట్టు కూలిపోతుందా కొత్త చిగురు రాకుండా వసంతమెళ్లి పోతుందా? ఆశలు వమ్మయ్యాయని మనిషి నేలకొరగాల

Published: Sat,March 24, 2012 03:20 PM

ఇప్పటికయినా చెంపలేసుకుంటారా?

బుకాయించి భూములేలవచ్చన్నది పాతమాట. నమ్మకం కలిగించి, విశ్వాసాన్ని చూరగొని మాత్రమే ప్రజల హృదయాలను గెల్చుకోవచ్చునని మరోసారి రుజువయింద

Published: Sat,March 10, 2012 11:28 PM

అఖిలేశు, లోకేశు,చంద్రబాబు...

మేము మాయావతి విగ్రహాలను కూల్చం’, ‘గూండాగిరికి పాల్పడితే సొంత పార్టీవారినయినా సహించబోము’, ‘రాజకీయాలే అటువంటివి. గత ఎన్నికల్లో మేము

Published: Tue,August 28, 2012 07:40 PM

ఒకటే లక్ష్యం, ఒకటే నిర్ణయం

తెలంగాణ సాధనకోసం ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు చాలు. అన్ని పార్టీలతో తెలంగాణవాదానికి జైకొట్టించడంకోసం, క్రమంగా శక్తిని కూడగట్టుకోవడం

Published: Fri,February 24, 2012 10:51 PM

‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’

మనకు ద్రోహము చేసి/మనను దాసుల జేసి ఆటలాడెడి /అథమనేతలను గుర్తించి కాళోజీ మాటల్లో ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’.ఇప్పుడు అటువంటి అవకా

Published: Sat,February 11, 2012 05:06 PM

ఒక అబద్ధం, వందమంది గోబెల్స్

చాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాల గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ

Published: Sat,January 28, 2012 02:42 AM

అపనమ్మకం ఇంటిపేరు, కుట్ర అసలు పేరు

నన్ను ఒకరు బాలుడన్నారు. వారు నన్ను ఒకవైపే చూశారు. రెండోరూపం వారికి తెలియదు....అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదు. సీఎం కుర్చీనే వా

Published: Sat,January 21, 2012 01:02 AM

ఎన్‌టిఆర్ వధ, టీడీపీ చెర

ఎన్‌టిఆర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ అంతటి మహనీయుడు. ఆయన విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించాలి. -టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

Published: Sat,December 3, 2011 01:05 AM

ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే

దేశంలో ప్రజలంతా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అయితే అత్యంత అవినీతి రాజకీయ వ్యవస్థలోనే ఉంది. ఎక్కువమంది యువకులు రాజకీయాల్లోకి వ

Published: Sat,November 5, 2011 03:01 PM

చావదిదేమి చిత్రమో...!?

ముంచితి వార్ధులందు, గదల మొత్తితి, శైల తటంబులందు ద్రొబ్బించితి, శస్త్ర రాజి పొడిపించితి, మీద నిభేంవూదపంక్తి రొప్పించితి, ధిక్కర

Published: Fri,October 28, 2011 10:47 PM

బాబ్బాబ్బాబ్బాబోయ్ !

రాజకీయ కుట్రకు జన్మించినవాడు వెన్నుపోటుకు పెట్టిన పేరు, నమ్మకవూదోహానికి అసలైన నిర్వచనం అబద్ధానికి ఆత్మబంధువు అవినీతికి నిలు

Published: Fri,October 21, 2011 11:58 PM

చెప్పుకోండి చూద్దాం!

ఆయన మహామాటకారి కానీ ఆ మాటలన్నీ చంద్రబాబువి! ఆయన కత్తిలాంటివాడు కానీ ఆయన ఎప్పుడూ చంద్రబాబు చేతిలో ఉంటాడు! వంచనకొక వంచనకొక వం

Published: Fri,October 14, 2011 11:06 PM

ప్రార్థన

తల్లీ! ఈ నేల రక్తమోడుతున్నది రకరకాల రాజకీయ విభ్రమల మధ్య దిక్కులు చూస్తున్న నేతల నిశ్చేష్టల మధ్య మా పిల్లల తలలు తెగిపడుతున్నాయి

Published: Fri,September 30, 2011 10:44 PM

నయా జమీందార్ల నంగనాచితనం

తెలంగాణ ప్రజల్ని గతంలో రజాకార్లు, పటేల్ పట్వారీలు, భూస్వాములు, దొరలు రాచి రంపాన పెట్టి నంజుకుతిన్నారు. ప్రజలు ఎలాగోలా వారి కబంధ

Published: Tue,October 18, 2011 10:22 PM

విద్వేష వితండవాదం

సమ్మెలు చేస్తే రాష్ట్రాలను పంచుతారా? సమ్మె ప్రభావం ఉందనడం ఒక భ్రమ. -ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకాచౌదరి సభలు జరిపితే రాదు /ఊర

Published: Sat,September 3, 2011 01:42 AM

లోపలి మనుషులు!

1969లాగానే ఇప్పుడు కూడా నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ కాంపెయిన్‌కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉపయోగపడుతుందని పోలీసులు నమ్ముతున్నారు. మాజీ

Published: Sat,August 27, 2011 07:55 PM

అవినీతి చంద్రుడు

నాపై నిరాధార ఆరోపణలు ఎన్నెన్నో చేస్తున్నారు. రెండెకరాల ఆసామి రెండు వేలకోట్లు సంపాదించారంటున్నారు... ఎవరైనా సరే వెయ్యి కోట్లివ్వండి

Published: Fri,August 19, 2011 11:27 PM

పలికినవాడు ప్రధాని

-కట్టా శేఖర్‌రెడ్డి లోక్‌పాల్ బిల్లును సాధ్యమైనంత త్వరగా అమోదించాలని సభలో అందర మూ అంగీకారానికి వచ్చాము. అసలు సమస్య ఏమంటే, చట్టాన

Published: Sat,August 13, 2011 12:24 PM

గోబెల్స్‌కు పెద్దన్నలు

అధికారం శాశ్వతం చేసుకోవాలంటే ఆధిపత్యాన్ని సుస్థిర పరచుకోవాలంటే సత్యాన్ని సమాధి చేయాలి అధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే డ

Published: Sun,July 31, 2011 04:46 PM

గిరీశం పరిష్కారాలు

‘వడ్డించేవాడు మనవాడయితే కడపంక్తిని కూర్చున్నా అన్నీ సమకూరుతాయ’న్నట్టుగా అకారాది క్రమంలో రాష్ట్రం పేరు ఆఖరుస్థానంలో ఉన్నంత మాత్రాన

Published: Sat,July 23, 2011 05:45 PM

కారంచేడు అధికార ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత దళితుల తొలి సజీవ దహనం జరిగింది రాజగోపాల్ నియోజకవర్గంలోనే. ఇదంతా పౌరహక్కుల నివేదికలో భద్రంగా పొందుపరచ

Published: Sun,July 17, 2011 03:33 AM

కనిపించని శత్రువు(మాటకుమాట)

ఉగ్రవాద దాడులన్నింటినీ ఆపడం కష్టం. దేశంలో 99 శాతం దాడులను నిఘా, సమాచార సేకరణ చర్య ల ద్వారా నిరోధించగలిగాం. కానీ ప్రతి ఒక్క దాడ

Published: Sun,July 17, 2011 05:32 AM

ఆజాదూ జాదా హోగయా!(మాటకుమాట)

విద్రోహ శిఖరం ఒకడు ఆడి తప్పినవాడు మరొకడు మాట మార్చినవాడు ఇంకొకడు తిన్నింటివాసాలు లెక్కపెట్టినవాడు ఒకడు రెండు కళ్ల వాడు మరొకడు

Published: Sun,October 23, 2011 01:54 PM

కరుణామయుడు

జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం భారంగా అనిపిస్తున్నది. సంక్షోభాల్లో, ఆపత్కాలాల్లో ధైర్యం చెప్పి దిక్కును చూపిన పెద్దద

Featured Articles