మోదీ రాజకీయ జూదం


Tue,February 5, 2019 11:07 AM

katta-shekar-reddy
ప్రధాని నరేంద్ర మోదీ బాగా అప్రమత్తమయ్యారని ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చెప్పకనే చెప్పింది. ఆయ న ఇటువంటి కానుకలు ఇంకా మరికొన్ని ప్రకటిస్తారని కేంద్రంలోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సందర్భంగానో, ఇంకా ముందుగానో ఈ నిర్ణయాలు వెలువడవచ్చు. మోదీ ఇలా ఉన్నట్టుండి ప్రజాకేంద్రక విధానాల వైపు మళ్లడానికి వేరే కారణం ఏమీ లేదు. ఆయన ఓటు బ్యాంకు పునాదు లు కదిలిపోతున్నాయని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఎన్నికలు రుజువుచేశాయి. ఆయనకు అండగా ఉంటూ వచ్చిన వ్యాపారవర్గాలు, అగ్రవర్ణా లు దూరమయ్యాయని ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమైంది. అంతకుముందు వివిధ రాష్ర్టాల్లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ వరుస పరాజయాలను చవిచూస్తూ వచ్చింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న మధ్య భారత పెత్తనం సైతం చేజారిపోయింది. ఇప్పుడా పార్టీ పాలించే పెద్ద రాష్ర్టాలు యూపీ గుజరాత్, మహారాష్ట్ర, అసోం, హర్యానా, బీహార్‌లు మాత్రమే. మిగిలినవన్నీ రాష్ర్టాలుగా మారిన కేంద్రపాలిత ప్రాంతాలు.

ఉన్నత న్యాయస్థానాల నియామకాలపై రచ్చ అందరికీ తెలిసిన విషయమే. తమకు ఇష్టం లేని వారి నియామకాన్ని మాసాల తరబడి ఆపడం, వేధించడం చూశాం. బ్యాంకులు, ఆర్బీఐ ఆగమాగం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని అనేకమంది ఉన్నతాధికారులు, సలహాదారులు రాజీనామాలు చేస్తున్నారు. యూజీసీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఆకాశవాణి బాగుపడింది కానీ, వారం వారం మోదీ ఉపన్యాస పటిమకు వేదికగా మారింది. ప్రధాని అయిన తొలిసారే దాదాపు రెండువేల కోట్లకుపైగా ఖర్చుచేసి 85 దేశాలు తిరిగిన నాయకుడు దేశ చరిత్రలో మొదటివారు మోదీయే కావచ్చు. వాటివల్ల కలిగిన ప్రయోజనం ఎంతన్నది ప్రశ్నార్థకం.


సంఖ్యకు చాలా రాష్ర్టాల పేర్లు చెప్పవచ్చు కానీ అక్కడ మొత్తంగా ఉన్నది 25 లోక్‌సభ స్థానాలలోపే. అందువల్ల మనుగడ ముప్పులో పడిందని నరేంద్ర మోదీకి అర్థమవుతున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరలు.. వంటి సీతయ్య నిర్ణయాలు మధ్య తరగతిని బాగా నొప్పించాయని గత రెండేండ్ల అనుభవాలు చెబుతున్నాయి. ఎవరినీ సంప్రదించకుండా, పర్యవసానాలు యోచించకుండా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగింది. ఆయన చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ రాలేదు. నల్లధనం అరికట్టడం అన్నది ఆచరణలో జరుగలేదు. ధన రాజకీయా లు ఆగలే దు. కశ్మీర్‌లో ఉగ్రవాదం సద్దుమణగలేదు. ఇవిగాక నరేంద్ర మోదీ కేంద్రంలోని అన్ని వ్యవస్థలను కాషాయీకరణ చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
సీబీఐ మునుపెన్నడూ లేనంత భ్రష్టుపట్టిపోయింది. సీబీఐ ఎప్పుడూ రాజకీయ పనిముట్టుగా పనిచేసేదే. కాంగ్రెస్ కూడా దానిని అందుకే ఉపయోగించిందన్నది వాస్తవం. ఇప్పుడు దానిని మరింత నగ్నంగా నడి బజారుకీడ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉన్నత న్యాయస్థానాల నియామకాలపై రచ్చ అందరికీ తెలిసిన విషయమే. తమకు ఇష్టం లేని వారి నియామకాన్ని మాసాల తరబడి ఆపడం, వేధించడం చూశాం. బ్యాంకులు, ఆర్బీఐ ఆగమాగం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని అనేకమంది ఉన్నతాధికారులు, సలహాదారులు రాజీనామాలు చేస్తున్నారు. యూజీసీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఆకాశవాణి బాగుపడింది కానీ, వారం వారం మోదీ ఉపన్యాస పటిమకు వేదికగా మారింది. ప్రధా ని అయిన తొలిసారే దాదాపు రెండువేల కోట్లకుపైగా ఖర్చుచేసి 85 దేశాలు తిరిగిన నాయకుడు దేశ చరిత్రలో మొదటివారు మోదీయే కావచ్చు. వాటివల్ల కలిగిన ప్రయోజనం ఎంతన్నది ప్రశ్నార్థకం. అవినీతి గురించి ఆయనను ఎవరూ విమర్శించలేరన్న భావనను రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం మట్టిలో కలిపింది. మోదీ విధానాలు పై వర్గాలకు తప్ప ఎవరికీ ఉపయోగపడలేదన్న భావన బలపడుతూ వచ్చింది. అందుకే మోదీ పట్ల తిరస్కారం మొదలైం ది. మూడు రాష్ర్టాల ఫలితాలు ఒక హెచ్చరిక. అంతకుముందు సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఆయన ఎదురు గాలిని ఎదుర్కొన్నారు. అందుకే ఆయనకు మూలాలు గుర్తొచ్చాయి. జనానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నా యి. రైతుబంధు, రుణమాఫీ వంటి నిర్ణయాలు చేస్తారని ఊహాగానాలు జరిగాయి. కానీ ఆయన ఆ విషయం పక్కనపెట్టి ఆగమేఘాలపై అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్లు కలిపిస్తూ 124వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ఎవరూ ఆలోచించుకొని ప్రతిఘటించే సమయం ఇవ్వకుండా ఆయన ఈ చట్టాన్ని తెచ్చారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో గుజ్జర్లు, పాటిదార్లు, జాట్‌లు తమకు రిజర్వేషన్లు కల్పించాని డిమాండు చేస్తూ ఉద్యమాలు జరిపారు.

బహుశా అందుకు స్పందనగా మోదీ ఈ ఎత్తుగడ ముందుకు తెచ్చి ఉంటారు. ఇది ఎంతవరకు మోదీకి మేలు చేస్తుందన్నది చూడాలి. ఎందుకంటే అగ్రవర్ణ జనాభా దేశంలో ఎక్కడా పదిహే ను నుంచి ఇరువై శాతానికి మించి లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో అగ్రవర్ణాల జనాభా పదిహేడు శాతం మాత్రమే. అగ్రవర్ణాలు బీజేపీని వరించినా బీసీల మద్దతు లేకుండా ఉత్తరభారతాన్ని, మధ్యభారతాన్ని చేజిక్కించుకోవడం అంత సులువు కాదు. మోదీ రిజర్వేషన్లపై బీసీల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. రెండేండ్ల క్రితం బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడా విమర్శలు వెనుకకుపోయినప్పటికీ మొత్తం రిజర్వేషన్లకు విరుగుడు మంత్రంగా ఈ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు తెచ్చిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. బీసీలకు జనాభా దామాషాకు తగినట్టుగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పటికే బీసీ సామాజిక వర్గాలు, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు డిమాండ్లు పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపింది. ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. పలు రాష్ర్టాలలో ఇవే డిమాం డ్లు ఉన్నాయి. అసలు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ర్టాలకు వదిలేయాలని, పరిమితిని నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ర్టాలకు ఇవ్వాలని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్లన్నింటికీ ప్రతిఘటనగా కేంద్రం ఈ అగ్రవర్ణ రిజర్వేషన్ల చట్టాన్ని తెచ్చి ఉంటుందని కొందరు మేధావులు వాదిస్తున్నారు. రాష్ర్టాలకు ఇప్పుడు ఈ కొత్త రిజర్వేషన్లపై ఏదో ఒక వైఖరి తీసుకోవలసిన పరిస్థితి. పార్లమెంట్‌లో ఈ రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణకు మద్దతు తెలుపుతూనే అనేక పార్టీలు తమ డిమాండ్లను గుర్తుచేశాయి. కొత్త చట్టానికి అనేక సవరణలు ప్రతిపాదించాయి.

అయినా అవేవీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మోదీకి ఇది రాజకీయంగా ఎంత ఉపయోగపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. తమ రిజర్వేషన్లకు పోటీ పెడుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు భావిస్తే అది ఆయనకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ప్రతిపక్షాలు ఒకేవేదికపైకి వచ్చి మోదీని ఇదే అంశంపై ప్రశ్నిస్తున్నాయి. అక్కడ పార్టీలన్నీ వివిధ సామాజిక వర్గాల సంఘటిత రూపాలే. ఈ రెండు రాష్ర్టాల్లో 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 93 లోక్‌సభ స్థానాలు గెల్చుకున్నది. ఆ ఎన్నికల్లో ఎస్‌పీ, బీఎస్‌పీ విడివిడిగా పోటీ చేశా యి. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో ఆ రెండు పార్టీలకు విడివిడిగా వచ్చిన మొత్తం ఓట్ల శాతం 42.12. బీజేపీ ఓట్ల శాతం 42.6. ఇప్పుడు సమీకరణలు మారిపోయాయి. రెండు పార్టీలు సంఘటితంగా పోటీచేసిన అన్ని లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాయి. బీహార్‌లోనూ పరిస్థితి పూర్తి సవ్యంగా ఏమీ లేదు. అక్కడ రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్నది. ఉపేంద్ర కుశ్వాహా నాయకత్వంలోని లోక్‌సమతా పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది. బీహార్‌లో ఇప్పటికీ జేడీయూ-బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, పోయి న ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు తగ్గిపోయా యి. బీహార్‌లో గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలకు 30కి పైగా లోక్‌సభ స్థానాలు దక్కాయి. అలాగే 91 లోక్‌సభ స్థానాలు కలిగి న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో గత ఎన్నికల్లో బీజేపీ 88 స్థానాలు గెల్చుకున్నది. అంటే మొత్తం పై ఆరు పెద్ద రాష్ర్టాల్లో పోయినసారి బీజేపీ గెలిచిన స్థానాలు 181. దేశ వ్యాప్తం గా పార్టీకి వచ్చిన స్థానాలు 282.

ఈ సారి భూమీ ఆకాశం ఏకం చేసినా ఆ ఆరు రాష్ర్టాల్లో ఇటువంటి ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశాల్లేవు. స్థానిక ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత వల్ల బీజేపీ ఓడిపోయిందని, నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు అనుకూలంగా ఉన్నారని ఒక సూత్రీకరణ చేస్తున్నారు. కానీ లోక్‌సభ ఉప ఎన్నికలన్నీ మోదీపై తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చాయి. మోదీ ప్రతిష్ఠ ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కంటే రాహుల్‌గాంధీ ప్రతిష్ఠ జనంలో పెరిగిన అసంతృప్తికి తగినట్టుగా మెరుగుపడలేదని చెబితే వాస్తవికంగా ఉంటుంది.

3046

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా