ఫెడరల్ మార్గం మేలు


Sun,December 23, 2018 08:51 AM

katta-shekar-reddy
మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రంలో,రాజకీయాల్లో బతుకలేరు.

జాతీయపార్టీల కేంద్రీకృత అధికారం దేశానికి చేటు. గతంలో ఇందిరాగాంధీ, తాజాగా ప్రధాని నరేం ద్ర మోదీ నాయకత్వం ఆ విషయం బాగా రుజు వు చేసింది. ఆయన నిర్ణయాలు చేస్తున్న తీరు, వాటి తప్పొప్పులను సమీక్షించడానికి నిరాకరించే మొండితనం దేశానికి చాలా నష్టం చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ, పెట్రో ధరలకు స్వేచ్ఛ, నల్లధనం విషయంలో చేతులెత్తేయ డం, బ్యాంకు డిఫాల్టర్లను కట్టడి చేయకపోవడం, రాష్ర్టాల హక్కులను గౌరవించకపోవడం ఆయన లెక్కచేయనితనానికి తార్కాణా లు. ఇవన్నీ పదుగురితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కాదు. ఆయన, మరికొద్ది మంది దేశంపై రుద్దిన నిర్ణయాలు. బ్యాంకులు, కోర్టు లు, ఉన్నత విద్యావ్యవస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘాసంస్థలు.. అన్నీ అనర్హులతో నిండిపోతున్నాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాలే తప్ప బలాదూర్‌గా వ్యవహరించే ప్రభుత్వం కాదు. ఒక్క బీజేపీ సమస్య కాదు, జాతీ యపార్టీల అన్నింటి సమస్య. వారి ఆలోచనలన్నీ ఢిల్లీ కేం ద్రంగా, ఉత్తరాది కేంద్రం గా ఉంటాయి. వారు ఏ నిర్ణ యం చేయాలన్నా, ఏ విధా నం రూపొందించాల న్నా ఒక రాష్ర్టానికి మరో రాష్ర్టానికి పోటీపెట్టి ఆలోచిస్తారు. చివరికి ఏ నిర్ణయ మూ చేయని దుస్థితిలో ఉండిపోతారు.

ఏకపక్ష అధికారం ఉన్నప్పుడల్లా ఢిల్లీలో జరిగింది ఇదే. ఇందిరాగాంధీ ఏకపక్షంగా అధికారం చెలాయించింది కాబట్టే 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయగలిగింది. 10 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా తెలంగాణ వాదాన్ని గౌరవించలేదు. ప్రశ్నించలేని అధికారం చెలాయించింది కాబట్టే ఎదురుదెబ్బలు తగిలేసరికి 1975లో ఎమర్జెన్సీ విధించింది. 1977లో జనతా ప్రభుత్వం, 1989 తర్వాత ఫ్రంట్ రాజకీయాలు మొదలైన తర్వాతనే కేంద్రం లో ఏ పార్టీ ఉన్నా ఒళ్లు దగ్గర పెట్టుకోవడం కొంత అలవాటైంది. విశ్వనాథ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు ఫ్రంట్ రాజకీయాలపై ఆధారపడినా శక్తివంతమైన పాలన ను అందించాయి. దేశంలో మొదటిసారి రైతు రుణ మాఫీ చేసింది 1989లో జాతీయ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలోనే. వెనుకబడిన తరగతులకు మండల్ రిజర్వేషన్లు అమలు చేసిందీ వీపీ సింగ్ ప్రభుత్వమే. ప్రపంచానికి మరోసారి మన అణు పాటవాన్ని చాటిం ది వాజపేయి పాలనలోనే. కార్గిల్ యుద్ధం గెలిచిందీ ఆయన పాలనలోనే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు మొదలైందీ వాజపేయి పాలనలోనే. వీపీసింగ్, వాజపే యి దేశమంతటా ఏదో ఒక రూపంలో కనిపించారు. పల్లెలకు రోడ్లన్నీ వాజపేయి పేరుతోనే వచ్చాయి. వెనుకబడిన తరగతులకు విద్య ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు వీపీ సింగ్ కారణంగానే వచ్చాయి.

మోదీ కూడా ప్రజలకు చాలా రూపాల్లో కనిపించారు. ఆయన కనిపించిన సందర్భాలన్నీ ప్రజలకు ప్రతికూలమైనవే. నోట్ల రద్దు పేదల ఆర్థికస్వేచ్ఛను దెబ్బతీసింది. పెద్దల ఆర్థికస్వేచ్ఛను మాత్రం ఇసుమంత కూడా తాకలేదు. బ్యాంకులకు రుణాల ఎగవేత ఆగలే దు. నల్లధనం చెలామణి ఆగలేదు. అవినీతి ఆగలేదు. ఎన్నికల ఖర్చు తగ్గలేదు. ధరల పెరుగుదల ఆగలేదు. పెద్ద వాళ్ల నోట్ల చెలామణి ఎప్పటిలాగే ఉంది. చిన్నవాళ్ల వద్ద నోట్లు మిగులలేదు. అందుకే కేంద్రం లో జాతీయ పార్టీలకు తిరుగులేని అధికారం దేశానికి ఎప్పుడూ మంచిది కాదు. సమాఖ్య రాజకీయాలే దేశానికి అవసరం. సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించే నాయకత్వమే దేశానికి కావాలి. ఇందుకు సమాఖ్య రాజకీయ నమూనానే కావాలి. మళ్లీ జాతీయ ఫ్రంట్ తర హా ఫెడరల్ ఫ్రంట్ రావాలి. జాతీయపార్టీలకు ఫ్రంట్‌లు అండగా ఉండటం కాదు. ఫ్రంట్‌కే జాతీయ పార్టీలు మద్దతుగా వచ్చే పరిస్థితి రావాలి. వీపీ సింగ్, ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. కాంగ్రెస్ అవినీతిపైన, బీజేపీ మతోన్మాదంపైన నేషనల్ ఫ్రంట్ పోరాడింది. ఈ నేపథ్యంలో జరిగిన 1989 ఎన్నికల్లో జనతాదళ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ 146 స్థానాలు గెలువగా కాంగ్రెస్ 197 స్థానాలను గెలిచింది. బీజేపీ 86 స్థానాలు, వామపక్షాలు 52 స్థానాలు గెలిచాయి.

రాజీవ్‌గాంధీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ప్రకటించారు. ఆ వెంటనే వామపక్షాలు, బీజేపీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అలా మరోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ర్టాల ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం అప్పుడు మొదలైంది. జాతీయ రహదారులు, కొత్త రైల్వే మార్గాలు, జాతీయ విద్యాసంస్థలు అనేక ప్రాజెక్టులు ఆయా ప్రాంతీ య పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తమ రాష్ర్టాలకు తీసుకొచ్చారు. నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది కొద్దికాలమే అయినా మంచి ఫలితాలనే అందించింది. దీర్ఘకాలిక దృష్టిలేని స్వార్థ రాజకీయశక్తుల కారణంగా నేషనల్ ఫ్రంట్ ఎక్కువ కాలం మనలేకపోయింది. మరోసారి 199 6 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలన్నీ యునైటె డ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి 300 స్థానాలు గెలిస్తే, ప్రాంతీయ పార్టీలు 243 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ బయ టి మద్దతుతో దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ వంటి వారు దేశాని కి ప్రధానులు అయ్యే అవకాశం వచ్చింది. దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ. అయితే ప్రయోజన వైరుధ్యాల వల్ల యునైటెడ్ ఫ్రంట్ కూడా ఎక్కువ కాలం నిలువలేదు. 1998, 99లలో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయపార్టీలు గెలుచుకున్న స్థానాల సంఖ్య తగ్గినా ఢిల్లీ లో రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించాయి. వాజపేయి వంటి నాయకుడు ప్రధాని కావడానికి ప్రాంతీయ పార్టీలే మద్దతు తెలిపాయి. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకు కూడా ప్రాంతీయపార్టీలే ప్రాణవాయువు.

ఇందిరాగాంధీ తర్వాత తిరిగి ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చింది నరేం ద్ర మోదీకే. అందుకే ఆయన ఎవరి మాటా వినని సీతయ్యలాగా నిర్ణయాలు చేస్తూ పోయారు. నోట్ల రద్దు విషయం కనీసం మంత్రివర్గానికి తెలియదు. ఆర్థికమంత్రికి కూడా తెలియదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మంచిగా ఉంటే ఒకరకంగా ప్రత్యర్థిగా ఉంటే మరోరకంగా తటస్థంగా ఉంటే ఇంకోరకంగా కేంద్రం సాయాన్ని రాజకీయ జూదం స్థాయికి మార్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోపభూయిష్టమని అదనీ ఇదనీ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ప్రభుత్వం వాటిని సరిచేసేందుకు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. హైకోర్టు విభజనను కోర్టు వ్యాజ్యాలకు వదిలేసింది. కేంద్ర సంస్థల మంజూరీని ఇంకా సాగదీస్తూనే ఉన్నది. రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో నూ దాటవేత వైఖరినే ప్రదర్శిస్తున్నది. రాజకీయ సుస్థిరతను కోరి శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ను పెంచాలని పునర్విభజన చట్టంలో ప్రతిపాదిస్తే దానిపై లేనిపోని పేచీలు లేవదీసి ఇప్పుడు చేయలేమని వాదిస్తున్నది. పార్లమెంట్ ఆమోదించిన చట్టంలోని ప్రతిపాదనకే ఇటువంటి పరిస్థితి ఉంటే కేంద్రం ఇంక దేనిని గౌరవిస్తుంది? ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే కూడా పార్లమెంట్‌లో అంతటి మెజార్టీ బీజేపీకి ఉన్న ది. జీఎస్టీ వంటి సంక్లిష్టమైన బిల్లును ఆమోదింపజేసుకున్నది. అన్ని పార్టీలు ఒప్పుకున్న పునర్విభజన ప్రతిపాదనలపై నిర్ణయం చేయడానికి ఎందుకు తాత్సారం? అన్నింటినీ సొంత రాజకీయ ప్రయోజన దృష్టితో చూసే మోదీ సంకుచిత దృక్పథమే ఈ జాప్యానికి కారణం. కేంద్రం తలుచుకుంటే రాష్ర్టాలకు సంబంధించిన సమస్యలన్నీ ఒక్కరోజులో పరిష్కారమవుతాయి. మోదీ అలా ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు అన్న లెక్కలు వేసుకుని మరీ సహకరించడమో, సతాయించడమో చేస్తున్నారు.

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవ చ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వా న్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రం లో, రాజకీయాల్లో బతుకలేరు. అందుకే ఆయన ముందే తన రాజకీయావసరాలను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. కేసీఆర్ బీజేపీ, కాం గ్రెస్‌లకు దూరంగా ఒక ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని, ఉప ప్రధాని, మంత్రివర్గాన్ని నిర్ణయించడంలో రాష్ర్టాలకు ప్రమేయం ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని ఉత్తరాది నుంచి ఉంటే దక్షిణాది నుంచి ఉప ప్రధాని ఎందుకు ఉం డకూడదు? కీలకమైన శాఖలు దక్షిణాది రాష్ర్టాలకు ఎందుకు దక్కకూడదు? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడి షా వంటి రాష్ర్టాలు తమ రాష్ర్టాల ప్రగతికి సాధించుకున్న ప్రాజెక్టు లు తెలంగాణకు కూడా ఒక నమూనా కావాలి.

katta-shekar-reddy
తమిళనాడులో ఉన్నన్ని జాతీయ రహదారులు, రైలుమార్గాలు దేశంలో ఎక్కడా లేవు. బీహార్‌లో రైలు మార్గాలు అసాధారణ రీతిలో విస్తరించాయి. ఆ రాష్ర్టాల నాయకత్వం స్వతంత్రంగా ఉండి కొట్లాడి రైల్వేలు, ఉపరితల రవాణా వంటి శాఖలు తీసుకొని తమ రాష్ర్టాలకు మేలు చేయగలిగారు. తెలంగాణకు చేయాల్సింది చాలా ఉన్నది. రైల్వేలు, జాతీయ రహదారుల విషయంలో మనం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాం. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి నమూనా దేశానికి కూడా అవసరం. గత ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యం చేసి అమలుచేసిన రుణమాఫీ దేశమంతటా ఒక నినాదమై కూర్చుంది. ఏనాడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు దేశమంతటా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నది. కేసీఆర్ కేవలం రుణమాఫీ మాత్ర మే కాదు, దేశమంతటా రైతుబంధు అమలుచేయాలని పిలుపునిస్తున్నారు. భారీ ఎత్తున దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని సూచిస్తున్నారు. దేశంలో 65 శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఎజెండా అంతా అమలు కావాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించాలి. కాంగ్రెస్, బీజేపీ ఛత్రాలకింద తలదాచుకోవడం మాని ప్రాంతీయ ఆకాంక్షల కేంద్రబిందువుగా ఒక బలమైన ఫ్రంట్ రూపొందాలి. ఆ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విజయవం తం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

kattashekar@gmail.com

2802

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా        


country oven

Featured Articles