కేసీఆర్ కావాలె, కేసీఆర్ రావాలె


Sun,November 11, 2018 10:22 AM

టీడీపీ ఓటు బ్యాంకు లెక్కలు నమ్మి పొత్తులకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం లేదు. వందలాది గ్రామాల్లో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కొంతమంది కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. మరికొంత మంది బీజేపీలో చేరిపోయా రు. అందువల్ల కాంగ్రెస్‌కు అదనంగా ఒనగూడే ప్రయోజనం కంటే ద్రోహులతో చేతులు కలిపార న్న అపప్రథే ఎక్కువగా వస్తుంది. ఆ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబే ఫైనల్ చేస్తున్నాడన్న వార్తలు నిజమే అయితే,కాంగ్రెస్‌కు అంతకంటే దౌర్భాగ్యం లేదు.

నిలబడ్డోడు ఎటువంటోడయితే మనకేందిరా. కేసీఆర్ కావాలె. కేసీఆర్ రావాలె. మనం ఆయనకు ఓటేస్తు న్నం. కేసీఆర్ రాబట్టే మనూరు మండలం అయిం ది. మనూళ్లెకు రోడ్లొచ్చినయి. కాలువ నీళ్లొచ్చినయి. నాలాంటోళ్లకు వందల మందికి పింఛన్లు వస్తున్నయి. అంతా నిమ్మళంగున్నం. కాంగ్రెసొస్తే చాటల తవుడువోసి కుక్కలకు కొట్లాటబెట్టినట్టే ఉంటది. వద్దురా బాబూ. ఎవరి ముఖమూ చూడొద్దు. ఒక్క కేసీఆర్ సారునే గుర్తుపెట్టుకోవాలె అని ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ పెద్దమనిషి స్పందించిన తీరిది. స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి తమ ఊరికి రాలేదని, తమను పలుకరించలేదని కొంతమంది యువకులు ఫిర్యాదు చేస్తుంటే ఆ పెద్దమనిషి చెప్పిన సమాధానమిది. ఆ ఒక్క పల్లెలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్న సాధారణ అభిప్రాయం ఇది. అది ఎవరో నేర్పితే కలిగే అభిప్రాయం కాదు. స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న భావ న. ఒక మీడియా సంస్థ ఇటీవల ఏకకాలంలో 110 నియోజకవర్గాల్లో 60 వేల మంది ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరించింది. వారిలో 42 వేల మంది మళ్లీ కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో మీడి యా సంస్థ 13 నియోజకవర్గాల పరిధిలో 13 వేల మం ది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిది. ఈ సర్వేలో కూడా జనాభిప్రాయం ముందు సర్వేలో వ్యక్తమయినట్టుగా వచ్చింది. ఇవిగాక జాతీయ, స్థానిక పత్రికలు అనేకం సర్వేలు చేశాయి. అన్నింటిలోనూ వ్యక్తమైన సాధారణ భావన ఒక్కటే మళ్లీ కేసీఆర్ వస్తారు, రావాలి అని. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సర్వత్రా సానుకూల వాతావరణం ఉందని ఈ సర్వే లు, అభిప్రాయ సేకరణలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇందు లో హైర్ పర్చేజ్ సర్వేలు లేవు. ఇప్పుడొస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ కూటమి గెలువబోతుందని ఇక నుంచి వండివార్చే సర్వేలు మొదలవుతాయి. వీటికి ప్రాతిపదిక జనాభిప్రాయం కాదు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు తీసి, టీఆర్‌ఎస్‌కు 34.3 శాతం ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ... గట్రగట్రాలకు 40 శాతం ఓట్లు వచ్చాయి, అప్పుడు వేర్వే రు చేశాయి కాబట్టి టీఆర్‌ఎస్ గెలిచింది, ఇప్పుడు కలిసిపోటీ చేస్తున్నాయి కాబట్టి టీఆర్‌ఎస్‌కు కష్టకాలం వచ్చింది అని సూత్రీకరణ లు చేస్తున్నాయి.

ఎన్నికల రాజకీయాల గురించి జ్ఞానం ఉన్నవారెవరూ ఇంత తెలివితక్కువ వాదనలకు దిగరు. 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు స్వపరిపాలన రుచి అనుభవించారు. మన నిధు లు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన సంక్షేమ పథకాలనూ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు ఆర్థిక ఫలాలు అందించే పథకాలను తీసుకొచ్చింది. ఇవన్నీగాక గత ఎన్నికల తర్వాత మెదక్, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలూ జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏం జరిగింది? మెదక్ లో 58.03 శాతం, వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో 59.5 శాతం ఓట్ల తో ఘనవిజయం సాధించింది. వరంగల్‌లో కాంగ్రెస్‌కు అన్ని పార్టీ లు మద్దతు ప్రకటించినా వచ్చింది కేవలం 16 శాతం ఓట్లు. టీడీపీకి పెట్టనికోట, పచ్చని కోట అని ఆంధ్రా మీడియా వర్ణించే హైదరాబాద్‌లో ఆ పార్టీ స్థానమేమిటో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తేలిపోయింది. తెలంగాణ వచ్చిన వెంటనే జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో ఉండే వివిధ ప్రాంతాల ప్రజల్లో కొంత అభద్రత, అనుమానాలున్నాయి. అవి చంద్రబాబు, ఆంధ్రా మీడియా కల్పించినవే. ఆ భయంతోనే హైదరాబాద్ మహానగరం పరిధిలో ఉండే పది నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీని గెలిపించారు. వాళ్ల అభద్ర త, అనుమానాలు ఉత్తవేనని ఆ తర్వాత ఇక్కడ నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థమైంది. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43.85 శాతం ఓట్లతో 99 కార్పొరేటర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నగర చరిత్రలో ఇన్ని సీట్ల ఏకపక్ష ఆధిపత్యం సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. కాంగ్రెస్-టీడీపీలకు ఇద్దరికి కలిపి కూడా వచ్చింది 23.5 శాతం ఓట్లే. అయినా చంద్రబాబు కాంగ్రెస్‌తో కలువగానే ఇక్కడేదో భూకంపం వస్తోందన్న భ్రమలు సృష్టించేందుకు ఆంధ్రా మీడియా పాతలెక్క లు ముందుకు తెస్తున్నది. కొత్త సర్వేలు వండివార్చుతున్నది. తెలంగాణకు సంబంధించినంత వరకు చంద్రబాబు అవాంఛిత శక్తి. అవరోధక వ్యక్తి. టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన తెలంగాణలో ఎంత కనిపిస్తే టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ స్వపరిపాలన కోరుకునే శక్తులకు అంత మంచిది. తెలంగాణవాదులు చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని చంద్రబాబు గుర్తుచేస్తారు. తెలంగాణ నుంచి తరిమేయాల్సిన భూతాలు ఇంకా ఇక్కడున్నాయన్న వాస్తవాన్ని తెలియజెబుతారు. చంద్రబాబును తెచ్చి నెత్తిన పెట్టుకున్నవారు బాధపడాలి.

బహుశా అయన ధనబలం ఆయనకు మళ్లీ తెలంగాణకు వచ్చే శక్తిని ఇచ్చి ఉంటుంది. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కూడా ఆ ఒక్క కారణంతోనే ఆయనను భుజానికెత్తుకుని ఉంటారు. కానీ అందుకు వారు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఏదో పెద్ద ప్రయోజనం ఉంటుందని తెలిసో తెలియకో రాహుల్‌గాంధీ అనుకుంటూ ఉండవచ్చు. చంద్రబాబు శాలువాలు, బొకేలు, తలపాగాలు తీసుకొని వెళ్లి కలిసి వస్తు న్న వివిధ పార్టీల నాయకులంతా ఇప్పటికే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పటికే కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. దేవెగౌడ-కుమారస్వామిలను ఈయన మోటివేట్ చేసేదేమీ లేదు. చంద్రబాబు ఎంత అవకాశవాదో దేవెగౌడకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తమిళనాట స్టాలిన్ కాంగ్రెస్‌కు మిత్రుడే. శరద్‌పవార్ బీజేపీకి ఎప్పటినుం చో వైరి పక్షమే. మాయావతి, ములాయంసింగ్, ఫరూక్, మమతా బెనర్జీలు చంద్రబాబు కంటే ముందునుంచి మోదీతో తలపడతున్నవారు. చంద్రబాబు నరేంద్రమోదీతో అంటకాగుతున్నప్పుడు వారంతా కేంద్రంతో వీధిపోరాటాలు చేస్తున్నవారు. ఈయన వారి ని ప్రేరేపించేదేమీ లేదు. నన్నుకూడా మీతో కలుపుకోండని మాత్ర మే చెప్పగలడు. అందుకు అవసరమైతే లోక్‌సభ ఎన్నికలకు నిధులిస్తానని ఆశ చూపగలడు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో అవకాశవాదానికి ఒక గొప్ప పాఠం వంటివాడు. ఆయన గురించి అందరికీ సుపరిచితమే. తెలంగాణలోని తెలుగుదేశం అవశేషులు, చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో పెరిగిపెద్దలైన పచ్చమీడియా ఆయనకు కీర్తికిరీటాలు తగిలించి ఊరేగించవచ్చుగాక. కానీ ఎవరూ ఆయన ను నమ్మి చేరదీయరు. నమ్మిన వారినెవరినీ ఆయన ముంచకుండా ఉండలేదు. అందుకే టీడీపీ-కాంగ్రెస్‌లు బ్రహ్మాండం బద్దలు చేసే అవకాశమే లేదు. అది తాత్కాలిక, అవకాశవాద బంధం. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ఇక సోదిలో ఉంటే ఒట్టు. జార్ఖండ్‌లో లాలూప్రసాద్, నితీష్‌కుమార్‌లు ఎలా దుకాణాలు బందు చేసుకున్నారో తెలంగాణలో కూడా చంద్రబాబు దుకాణం బందవుతుంది.

ఇది అనివార్యంగా, సహజంగా జరిగే పరిణామం. ఆంధ్ర ఆధిపత్యంకోసం, ఆంధ్ర ప్రయోజనాల కోసం పాటుపడే ఆ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలతో సహజ వైరుధ్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాస్తాడు. రాయకపోతే ఆంధ్ర ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు. తెలంగాణలోనే ఇంకా కొద్ది మం ది నాయకులు బుద్ధి మాంద్యం కారణంగానో, చంద్రబాబు ఇచ్చే రాజకీయ వేతనాలకు తలొగ్గో ఇంకా టీడీపీని పట్టుకొని వేలాడుతున్నారు. వారు కూడా ఈ ఎన్నికల తర్వాత కనిపించరు. చంద్రబాబుతో జట్టు కట్టడం వల్ల జరిగిన నష్టమేమిటో కాంగ్రెస్‌కు ఎన్నికల తర్వాత తెలిసొస్తుంది. టీడీపీ ఓటు బ్యాంకు లెక్కలు నమ్మి పొత్తులకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం లేదు. వందలాది గ్రామాల్లో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కొంతమంది కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. మరికొంత మంది బీజేపీలో చేరిపోయారు. అందువల్ల కాంగ్రెస్‌కు అదనంగా ఒనగూడే ప్రయోజనం కంటే ద్రోహులతో చేతులు కలిపారన్న అపప్రథే ఎక్కువగా వస్తుం ది. ఆ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబే ఫైనల్ చేస్తున్నాడన్న వార్తలు నిజమే అయితే, కాంగ్రెస్‌కు అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇక కోదండరాం సారు, సీపీఐ కామ్రేడ్స్ పరిస్థితి మరీ దీనం. వారిని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సారు పాత్రను ఎవరూ విస్మరించలేరు. కానీ ఆయన చిల్లర రాజకీయాలతో ఆ ప్రతిష్ఠనంతా స్వయంగా కడిగేసుకున్నారు. అందునా ఇప్పుడు టీడీపీతో చేతులు కలుపడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలు బోధించిన కోదండరాంసారుకు టీడీపీతో చేతులు కలుపగూడదన్న విషయం ఎందుకు అర్థం కాలేదో తెలియదు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుందని, తెలంగాణవాదానికి ఉన్న శక్తిని బలహీనపరుస్తుందని, ఉద్యమ హేతుబద్ధతను ప్రశ్నార్థకం చేస్తుందని వారు ఆలోచించాల్సింది. సీపీఐది మరీ విషాదం. ఆంధ్రలో చంద్రబాబు కు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్‌తో జట్టుకట్టి ఎన్నికలకు వెళదామనుకుంది.
తీరా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు, నారాయణ ఒకే పంథాలోకి వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న కొత్త చొక్కా కుట్టించుకొని ఒక్కటయ్యారు. మరి ఆంధ్రాలో ఏమి చేస్తారో తెలియదు. వ్రతం చెడ్డా సుఖం దక్కలేదు. అడిగిన సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిన సీట్లలో ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కమ్యూనిస్టు నాయకులు ఎన్నికల వేళ ఉన్నంత క్రియాశీలంగా మిగిలిన కాలమంత ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి. ఇలా సీట్ల కోసం బతిమాలుతూ వీళ్ల వెంట వాళ్ల వెంట తిరుగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇదిగో ఇట్లా ఉన్న పార్టీలన్నీ కలిసి టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని చెబితే జనం ఎలా నమ్ముతారు? వీళ్ల జెండా, ఎజెండా, మ్యానిఫెస్టోలకు బాధ్యులెవరు?

3786

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా