ఆయా బాబు గయా బాబు


Mon,November 5, 2018 12:35 PM

katta-shekar-reddy

చంద్రబాబుతో దోస్తానా మాకు కూడా ఇష్టంలేదు. కానీ జాతీయ అవసరాల కోసం చంద్రబాబు కావాలని మా నాయకత్వం మాపై రుద్దింది. ఒప్పుకోక చస్తామా అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాపోయాడు. తెలంగాణతనం ఒంటబట్టని కాంగ్రెస్ నాయకులు తమ టిక్కెట్ల కోసం కూడా చంద్రబాబు ద్వారా పైరవీ చేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్లను ఇప్పించగలిగిన బాబుకు, ఒకవేళ వీళ్లు తెలంగాణలో ప్రభుత్వానికి వస్తే ప్రభావితం చేయడం కష్టమా?

వెనుకటికి ఆయారామ్ గయారామ్ అని ఒక నాయకుడు పేరు మోశాడు. ఆయన పొద్దున ఒక పార్టీ, రాత్రికి మరో పార్టీ, తెల్లారితే ఇంకో పార్టీ ఇలా మారుతూ పోయారు. దేశ రాజకీయాలకు ఆయారా మ్ గయారామ్ అన్న ఒక కీర్తిని సంపాదించి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబును చూస్తే మళ్లీ ఆయా బాబు గయా బాబు వయా బాబు అన్న పదబంధం గుర్తుకువస్తున్నది. నాలుకను ఆయన మడత పెట్టినట్టుగా ఎవరూ చేయలేరు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం మొదలు ఫ్రంటులు మార్చడం, బీజేపీ తో పొత్తు, మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుదాకా ఏమాత్రం సూత్రబద్ధత లేని రాజకీయ అవతా రం చంద్రబాబు. అమీబా లాగా ఎప్పుడు ఎటువైపంటే అటువైపు నడువగల రాజకీయ జీవి. పొత్తు భాగస్వాములను ఆయన మార్చినన్నిసా ర్లు ఎవరూమార్చలేదు. రుతువులను బట్టి మారే మనిషి. ఊసరవెల్లిని మించిన ప్రాణి ఏదైనా ఉంటే అది చంద్రబా బే. చిత్రం ఏమంటే ఆయన ఏం చేసినా దేశం కోసమే అని మురిసిపోయే, మెరిసిపోయే మీడియా, రాజకీయ సంతతి కూడా మన రాష్ట్రంలో వటవృక్షంలా పెరిగిపోయింది. నాలుగేండ్ల పాటు నరేంద్ర మోదీతో ఉన్నాడు. ఒక దశలో నరేంద్ర మోదీ మీద ఈగ వాలనివ్వలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలన్నాడు. కాంగ్రెస్‌పై కోపమెందుకంటే తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటుపై చంద్రబాబు ఏనాడూ తన అక్కసును, కక్కసును మనసులో దాచుకోలేదు. ఆయన చెప్పడం, ఆయన మిత్రమీడియా ఆ ముత్యాలను ఏరుకొని పతాక శీర్షికల్లో అచ్చేయడం అన్నీ ప్రజలకు గుర్తే.

ఇప్పుడు అవన్నీ గుర్తుచేస్తున్నారు తెలంగాణవాదులు. కానీ చంద్రబాబు దేనికీ సమాధానం చెప్పడు. తప్పులు ఒప్పుకోడు. మునుపు జరిగిన దానికి జనాన్ని క్షమించమని కోరడు. సింపుల్‌గా గతం గతః అట. వెనుకటికి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దానికి కూడా చంద్రబాబు ఇంతవరకు పశ్చాత్తాప పడిన సందర్భం లేదు. ఎన్టీఆర్ గుండెపగిలి చావడానికి కారకుడై కూడా ఏ నాడూ కన్నీరు పెట్టని కఠిన రాజకీయ హృదయం చంద్రబాబుది. ప్రభుత్వాన్ని, పార్టీని, ఎన్నికల గుర్తును అన్నీ లాగేసుకున్న చంద్రబాబు ఆఖరు దెబ్బ పార్టీ నిధిపై కొట్టాడు. ఎన్టీఆర్ 1996 ఫిబ్రవరి రెండవ తేదీన విజయవాడలో సింహగర్జన సభ నిర్వహించనున్నట్టు జనవరి 17 మధ్యాహ్నం రెండు గంటలకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అంతకుముందే సింహగర్జన నిర్వహణ కోసం దేవినేని రాజశేఖర్‌కు 70 లక్షల చెక్కు ఇచ్చి ఖైరతాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పార్టీ నిధి డబ్బు డ్రా చేసుకురమ్మని పంపారు. సాయంత్రం నాలుగున్నరకు రాజశేఖర్, పార్టీ తరపు న్యాయవాది వచ్చి పార్టీ నిధిపై చంద్రబాబు స్టే ఆర్డర్ తెచ్చాడు, ఇప్పుడు తీసుకోలేమని చెప్పారు. అంతే ఎన్టీఆర్ హతాశుడయ్యారు. ఏముంది.. నా నుం చి నా పిల్లలను లాక్కున్నారు. నేను బీ ఫాం ఇచ్చి నిలబెట్టిన ఎమ్మెల్యేలనూ బలవంతంగా తీసుకుపోయారు. నా పార్టీ నాది కాదంటున్నారు. నేను స్వహస్తాలతో రూపొందించిన జెండా నాది కాదంటున్నారు. నేను సంపాదించిందంతా నా పిల్లలకు ఇచ్చేశాను. ఇది ప్రజలు నా మీద విశ్వాసంతో, నమ్మకంతో ఇచ్చిన పార్టీ నిధి. దాన్ని ప్రజాహితం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖర్చు పెడుదామనుకున్నాను అని గుండెలు బాదుకున్నారు.

తన సన్నిహితులతో చెప్పి బోరున ఏడ్చినట్టు ఇటీవల ఒక ప్రత్యక్ష సాక్షి పత్రికలకు చెప్పారు. దేశ రాజకీయాల్లో శిఖర సమానుడిగా పేరొందిన ఒక మహానాయకుడు అసహాయుడుగా, ఆత్మైస్థెర్యం కోల్పోయి గుండెలవిసేలా రోదించిన రోజది. అదేరోజు రాత్రి ఎన్టీఆర్ గుండె పగిలి కన్నుమూశారు. చంద్రబాబు పాపి. మెత్తని కత్తి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని మనిషి. తనకు పనికి రాకపోతే తన పర భేదం కూడా ఉండ దు. తీసి నేలకేసి కొడుతాడు. చంద్రబాబు పాపంలో పాలు పంచుకొని, ఆయన పాపాన్ని పుణ్యంగా చిత్రీకరించిన మీడియా సంస్థలు కూడా ఇప్పటికీ ఆ పాప భారాన్ని మోస్తున్నాయి. ఆ పాపం వారందరినీ తప్పక వెంటాడుతుంది అని అప్పటి పరిణామాలు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తరచూ చెబుతుంటారు. అప్పటికీ ఇప్పటికీ ఆ చంద్రబాబు మారలేదు. ఆ మీడియా మారలేదు. ఇప్పు డు చంద్రబాబు దేశం కోసం కాంగ్రెస్‌తో కలిశాడట. ఆయన చెబుతున్నారు, వీరు కీర్తిస్తున్నారు. ఆ మీడియా అలా భావించడం లో, కీర్తించడంలో ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలకు ఏం పుట్టింది? చంద్రబాబుపై ఆధారపడవలసిన దుస్థితి నుంచి తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటాల తర్వాత విముక్తి పొందారు. ఆంధ్ర నాయకత్వం నుంచి స్వతంత్రత పొందారు. ఎవరి నుంచో బీ ఫాం తీసుకోవలసిన అవసరం లేని స్వేచ్ఛను పొందారు. ఆ సోయి కానీ, అస్తిత్వ స్పృహగానీ లేని తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం మరోసారి చంద్రబాబు దాస్యాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. రాహుల్, చంద్రబాబులను దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన నాయకులని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడొకరు ఏకంగా భజనకీర్తన మొదలుపెట్టారు. చంద్రబాబు ఏ రాష్ట్రం కోసం త్యాగం చేశాడో ఆ అర్భక నాయకత్వానికే తెలియాలి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు.

ఆంధ్ర రాష్ర్టాన్ని నగుబాటు పాలు చేసి, నడిబజార్లో నిలబెట్టాడు. అటువంటి నాయకుడిని పట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల గట్టు దాటాలని చూస్తున్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? తెలంగాణ ఆత్మాభిమానం ఉన్నవారెవరైనా చంద్రబాబుతో చేతులు కలుపుతారా? నిజమే టీఆర్‌ఎస్ కూడా 2009లో టీడీపీతో పొత్తుపెట్టుకుంది కదా అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. ఏ మాత్రం సందర్భ జ్ఞానం లేని వాదన అది. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి, తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తామని మ్యానిఫెస్టోలో చేర్చితే టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నది. 2009 డిసెంబరు 9కి ముందు చంద్రబాబు వేరు, తర్వాత చంద్రబాబు వేరు. 2009 డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పిన రోజునుంచి చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఏమే మి పాతకాలకు పాల్పడ్డాడో కాంగ్రెస్ నాయకులు మరిచిపోవచ్చు. కానీ, తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. చంద్రబాబు, ఆంధ్ర కాం గ్రెస్ నాయకత్వం సృష్టించిన అవరోధాల వల్లే తెలంగాణ ఆలస్యమైంది. వారి కుట్రల వల్లే తెలంగాణ యువకులు వందలాది మం ది ఆత్మబలిదానాలు చేసుకోవలసి వచ్చింది. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు చేయకపోయి ఉంటే 2010లోనే తెలంగాణ ఏర్పాటు జరిగి ఉండేది. ఇంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకునేవారు కాదు. మరి అటువంటి కుట్రల బాబు ఇవ్వా ళ వీళ్లకు బెల్లం లాగా కనిపిస్తున్నాడంటే అది కాంగ్రెస్ చేతగానితనం, రాజకీయ నిబద్ధత లేని దివాళాకోరుతనం కాక ఏమవుతుంది? ఏం చేస్తాం. చంద్రబాబుతో దోస్తానా మాకు కూడా ఇష్టం లేదు. కానీ జాతీయ అవసరాల కోసం చంద్రబాబు కావాలని మా నాయకత్వం మాపై రుద్దింది. ఒప్పుకోక చస్తామా అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాపోయాడు. తెలంగాణ తనం ఒంటబట్టని కాంగ్రెస్ నాయకులు తమ టిక్కెట్ల కోసం కూడా చంద్రబా బు ద్వారా పైరవీ చేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్లను ఇప్పించగలిగిన బాబుకు, ఒకవేళ వీళ్లు తెలంగాణలో ప్రభుత్వానికి వస్తే ప్రభావితం చేయడం కష్ట మా? కోదండరాం సారు కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమిలో చేరుతున్నారట. కోదండరాం సారు తెలంగాణ ఉద్యమానికి కొనసాగింపుగా రాజకీయా లు కొనసాగిస్తారని, తెలంగాణ ఉద్యమం వదిలేసిన లక్ష్యాల సాధనకు పాటుపడతారని ఆశించిన వారంతా ఇప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ, కోదండ రాం ప్రజాస్వామ్య పరిరక్షణ ఒకటే కావడం ఈ కాలపు వింత, విడ్డూరం. తెలంగాణ సొంతంగా రాజకీయ సుస్థిరతతో నిలదొక్కుకోవడం వీరెవరికీ ఇష్టం ఉన్నట్టు లేదు. తెలంగాణలో కేసీఆర్ సాగించిన రాజకీయ పునరేకీకరణ యజ్ఞం అప్రజాస్వామికం అయి తే ఆంధ్రలో చంద్రబాబు చేసింది ప్రజాస్వామ్యమా? ఆయన ప్రజాస్వామ్య పరిరక్షకుడా? బీజేపీతో కుమ్మక్కయి తెలంగాణ ఏడు మండలాలను, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబు కాదా? రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందు కు ఓటుకు నోటు కుట్రకు పాల్పడింది చంద్రబాబు కాదా? రాష్ట్ర విభజన ప్రక్రియను అప్పటినుంచి ఇప్పటిదాకా అడ్డుకుంటున్నది చంద్రబాబు కాదా? చివరికి హైకోర్టు విభజనకు ఎన్ని అవరోధాలు కల్పిస్తున్నాడో కాంగ్రెస్, జనసమితి నాయకులకు కనిపించడం లేదా? అటువంటి చంద్రబాబు ఇప్పుడు మీకు ప్రజాస్వామ్య పరిరక్షకుడా? నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్, జన సమితి నాయకుల తీరు.

3603

KATTA SHEKAR REDDY

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా

Published: Mon,February 18, 2019 05:08 PM

నిరంతర శ్రామికుడు

గోదావరి, కృష్ణా నదీజలాలు తెలంగాణ నేలను పునీతం చేయాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. రిజర్వాయర్లు జలకళతో కళకళలాడాలి. ఆ నీటితో ప్రతి