తెలంగాణ ద్రోహకూటమి


Mon,September 10, 2018 12:07 PM

Kattashekarreddy
తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు కుట్రలను సకాలంలో పసిగట్టి తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమేసింది. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తన కుట్రలు మానలేదు. సచివాలయంలో, చాలా హెడ్‌క్వార్టర్స్ భవంతుల్లో తమకు కేటాయించిన భవనాలను ఖాళీచేసి వెళ్లిపోయారు. కానీ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకురావడం లేదు. అటువంటి చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పిలిచి పీట వేయాలని కాంగ్రెస్ ప్రయత్నించడం ఆ పార్టీకే ఆత్మహత్యాసదృశం. ఇది తెలంగాణకు మరోసారి ద్రోహం చేయడం.

తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎం తగా ద్వేషిస్తున్నాడో, తెలంగాణ కాం గ్రెస్ అంతగా ద్వేషిస్తున్నది. చంద్రబాబునాయుడు మొదట రాష్ట్ర విభజనను, తర్వాత విభజనానంతర పంపకాలను ఎంతగా అడ్డుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ ఈ గడ్డపైనే తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా అడ్డుకున్నది. కాంగ్రెస్, ఆ పార్టీ మద్దతుదారులు ఎన్నివంద ల కేసులు వేశారో. చంద్రబాబునాయుడుపై అక్కడి ప్రతిపక్షాలు కూడా అన్ని కేసులు వేసి ఉండవు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో అడ్డగోలు జలయజ్ఞానికి డూడూ బసవన్నల మాదిరిగా తలలూపుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టుపైనా కేసులు వేస్తూ వచ్చారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకూ అభ్యంతరాలు పెడుతూ వచ్చారు. చివరకు హైదరాబాద్‌లో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపైనా కేసులు తెచ్చి పనులు అడ్డుకున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇంకా విభజన కాని హైకోర్టును ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతికేసులో ఇరికించడాని కి ప్రయత్నం చేసింది.

ఉద్యోగాలు ఇవ్వలేదని ఉద్యమాలు చేసేది వారే. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తే కేసులు, స్టేలు తెచ్చేది వారే. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నది వారే. తీరా ప్రభుత్వం నిర్ణయం చేస్తే కేసులు వేసింది వారే. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తే, దానిపైనా కేసులు వేసిందీ వారే. విషాదం ఏమంటే తెలంగాణ ప్రతిపక్షం చివరికి ఒక కోర్టు లిటిగెంటుగా మారడం. ప్రజాకేంద్రకంగా ఆలోచించకుండా, అక్కసుతో కూడిన రాజకీయ కజ్జాకోరుతనానికి దిగడం ఆ పార్టీ పతనానికి నిదర్శనం. టీఆర్‌ఎస్ గెలువడం, ప్రభుత్వం ఏర్పాటు చేయ డం, మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది. కాంగ్రెస్ విచక్షణతో వ్యవహరించి, టీఆర్‌ఎస్‌కంటే మరింత ఉన్నతమైన ఎజెండాను, రాజకీయాలను ఎలా అందించగలదో ప్రజలకు చెప్పడానికి బదులు, అడుగడుగునా పేచీ కోరు రాజకీయాలకు దిగింది. తన ప్రతిష్ఠను మరింత దిగజార్చుకున్నది. ఆ పతనావస్థకు పరాకాష్ఠ ఇప్పుడు టీడీపీతో పొత్తుకు సిద్ధపడటం. కాంగ్రెస్ ప్రతిబంధక రాజకీయాల నుంచి, లిటిగెంటు వ్యవహారాల నుంచి, అభివృద్ధి నిరోధక కుతంత్రాల నుంచి విముక్తిని కోరేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముం దస్తుగా ప్రజల తీర్పును కోరాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాల పంచాయితీలపై ప్రజలే సరైన తీర్పరులు. అందుకే కేసీఆర్ వారిని ఆశ్రయించారు. పాపం కాంగ్రెస్ అందుకు కూడా సిద్ధంగా లేదు. వారిని నిలబెట్టేందుకు పక్కరాష్ట్రం నుంచి జాకీ లు కావలసి వచ్చింది. నిజానికి చంద్రబాబే దిక్కుతోచనిస్థితిలో ఏ కొమ్మదొరికితే ఆ కొమ్మను పట్టుకొని వచ్చే ఎన్నికలను ఈదాలని ఆరాటపడుతున్నారు.

కాంగ్రెస్ తయారుచేస్తున్నది కేసీఆర్ వ్యతిరేక ఫ్రంట్ కాదు. తెలంగాణ వ్యతిరేక ఫ్రం ట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో కలిసే పార్టీ ఏదైనా, జట్టుకట్టే ఫ్రంటు ఏదైనా అది కచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే. కాంగ్రెస్‌కు ఇప్పటికీ అవకాశవాద ఆత్మ తప్ప, తెలంగాణ ఆత్మ ఒంటబట్టలేదనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. తెలంగాణలో ఇప్పటికీ కొందరు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొ ని ఉండటమే తెలంగాణకు పట్టిన దరిద్రం. ఆత్మగౌరవం ఇసుమంతైనా లేని బానిస నాయకత్వం. తెలంగాణకు వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు చేసిన ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నారంటేనే విస్మయం కలుగుతున్నది. అటువంటి పార్టీని కాపాడుకోవడానికి కొందరు, బతికించడానికి కొందరు కంకణం కట్టుకున్నారంటే ఏమనుకోవాలి? రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీలేవీ విభజన కోరిన రాష్ర్టాల్లో బతి కి బట్టకట్టలేదు. బీహార్ విభజనను వ్యతిరేకించిన ఆర్జేడీ, జేడీయూలు రెండూ జార్ఖండులో ఊసులోకి లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరాఖండ్‌లో జాడలేకుండాపోయింది. తెలంగాణలో కూడా టీడీపీని తిరస్కరించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రాం త వాసుల్లో అభద్రతను సృష్టించి పోయినసారి కొన్ని స్థానాలు గెల్చుకున్నారు తప్ప, తెలంగాణలో మెజార్టీ జిల్లాల్లో టీడీపీని తుక్కుతుక్కుగా ఓడించా రు.

ఈసారి హైదరాబాద్‌లో కూడా ఆ పార్టీకి పుట్టగతులుంటాయని ఎవరూ భావించడంలేదు. ఎందుకంటే తెలుగుదేశం తెలంగాణ వ్యతిరేక పార్టీగా అనేక పాపాలను మూటగట్టుకుంది. ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా జరిగే ప్రతి కుట్రలో చంద్రబాబునాయుడి పాత్ర ఉంటున్నది. హైకోర్టు విభజనకు కేం ద్రం, ఇక్కడి హైకోర్టు అందరూ ఒప్పుకున్నా చంద్రబాబు కావాలని అడ్డుపడుతున్నాడు. ఒక్క హైకోర్టు ఏమిటి హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపైనా ఇంకా పేచీలు పెడుతూనే ఉన్నాడు. కృష్ణా జలాల పంపిణీపై కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి ఇష్టారాజ్యంగా నీరు తరలిస్తూనే ఉన్నాడు. అక్కడ లెక్కాపత్రం తెలియకుండా ఉండటం కోసం టెలిమెట్రీ పనిచేయనివ్వడు. కృష్ణాకు తరలించే గోదావరి జలాలకు బదులుగా కృష్ణాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 40 టీఎంసీల వాటా సంగతి ఎప్పటికీ తేల్చడు. ఇలా ఒకటేమిటి? వంద అంశాలున్నాయి. అయినా ఇక్కడి తెలుగుదేశం నేతలకు చీమకుట్టినట్టయినా ఉండదు.

ఎప్పుడో సాధించుకోవలసిన తెలంగాణ రాష్ట్రం ఇం తకాలం ఎందుకు ఆలస్యమైందో తెలుగుదేశం, కాంగ్రెస్‌లలోని నాయకత్వాన్ని చూస్తే అర్థమవుతుం ది. వారికి రాజకీయాలు ముఖ్యం. టికెట్లు ఇచ్చేవారు, ఎన్నికల నిధులు ఇచ్చేవారు ముఖ్యం. తెలంగాణ ముఖ్యం కాదు. ఆత్మగౌరవం ముఖ్యం కాదు. అస్తిత్వ చైతన్యమూ లేదు. రెండు పార్టీలలోని నాయకులను తరతరాలుగా ఈ పద్ధతికి బానిసలను చేశా రు ఢిల్లీ, ఆంధ్రలలోని ఆధిపత్య రాజకీయ నేతలు. తెలంగాణపై నిర్ణయం జరిగిన సందర్భంలో కూడా-2009 డిసెంబర్ 9న-కాంగ్రెస్, టీడీపీలు ఇలాగే వ్యవహరించాయి. టీడీపీ ఆంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామాలు నడిపించింది. ఎన్‌టీఆర్ ట్రస్టుభవన్ నుంచే రాజీనామా నమూనా పత్రాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అడ్డుకోవడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డింది. ఆ సమయంలో మనమూ రాజీనామాలు చేయాలని తెలంగాణ కాం గ్రెస్ నాయకులతో టీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తే, వారు ముందుకురాలేదు. టీడీపీకి ఉన్న జిద్దు కాంగ్రెస్ నాయకులకు లేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రులమవుతామని ఆరాటపడుతున్న అరడజను మంది కాంగ్రెస్ నాయకులు ఆరోజు మంత్రివర్గం లో ఉండి ఎంచక్కా ఇంట్లో ఫైళ్లు క్లియర్ చేసుకుం టూ అధికారాన్ని అనుభవించారు. టీడీపీది అడ్డుకునే కుట్ర అయితే వీరిది దొంగనిద్ర నటించే కుట్ర. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నిర్వాకం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో నాలుగేండ్లు వెనుకకుపోయింది. వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేశారు.

తెలంగాణ ఎంతగానో క్షోభించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సెక్షన్-8ని అడ్డంపెట్టు కొని హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించాలని, ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయాలని టీడీపీ కుట్రలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చం ద్రబాబు కుట్రలను సకాలంలో పసిగట్టి తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమేసింది. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తన కుట్రలు మానలేదు. సచివాలయంలో, చాలా హెడ్‌క్వార్టర్స్ భవంతుల్లో తమకు కేటాయించిన భవనాలను ఖాళీచేసి వెళ్లిపోయారు. కానీ ఇంతవర కు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ముం దుకు రావడంలేదు. అటువంటి చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పిలిచి పీట వేయాలని కాంగ్రెస్ ప్రయత్నించడం ఆ పార్టీకే ఆత్మహత్యాసదృశం. ఇది తెలంగాణకు మరోసారి ద్రోహం చేయడం.ఈ రెండు పార్టీలలో ఉండే మరో ఉమ్మడి లక్షణం గులాంగిరీ చేయడం. కాంగ్రెస్ ఢిల్లీలో దేబిరిస్తే, టీడీ పీ నాయకులు అమరావతిలో అడుక్కోవాలి. కాంగ్రెస్‌లో ఎప్పుడూ తెగించి ఒక నిర్ణయం చేసే పరిస్థితి ఉండదు. ఢిల్లీ అనుమతి వచ్చేవరకు ఒక్క పాదయా త్ర కూడా చేయడానికి వీల్లేదు. అటువంటి పార్టీలు తెలంగాణలో ఇప్పుడు ప్రారంభించిన అభివృద్ధి మహాయజ్ఞాన్ని నడిపించడానికి ఎలా పనికివస్తా యి? చంద్రబాబుకో, ఆయన మనుషులకో, ఆయ న మద్దతుతో నడిచే పార్టీలకో పొరపాటున అధికా రం వస్తే తెలంగాణ అస్తిత్వ కాంక్షలను ఎక్కడ పాత ర వేస్తారో మనకు తెలుసు.
kattashekar@gmail.com

1194

KATTA SHEKAR REDDY

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా

Published: Mon,February 18, 2019 05:08 PM

నిరంతర శ్రామికుడు

గోదావరి, కృష్ణా నదీజలాలు తెలంగాణ నేలను పునీతం చేయాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. రిజర్వాయర్లు జలకళతో కళకళలాడాలి. ఆ నీటితో ప్రతి        


country oven

Featured Articles