మునుపటి గుణమేల మాను..


Sun,July 29, 2018 08:39 AM

Kattashekarreddy

మార్పును ఆహ్వానించలేనివారు మచ్చల కోసం భూతద్దం పెట్టి వెదుకుతుంటారు. జీవితకాలమంతా సాగించే ఆ మచ్చల అన్వేషణే ఒక మహా విప్లవకార్యంగా భావిస్తుంటారు. ఆ మచ్చల అన్వేషణలో పాల్గొనలేదని ఇతరులపై దుమ్మెత్తిపోస్తుంటారు. వీరు మేధావుల పేరిట చెలామణి అవుతుంటారు. పత్రికల ముసుగు లో చెలరేగుతుంటారు. ప్రాంతాన్ని బట్టి, అధికారంలో ఉన్న పార్టీని బట్టి వీళ్ల చూపు మారిపోతుంది. నిజానికి యథాతథవాదులకూ వీళ్ల కు పెద్దగా తేడా ఉండదు. వెనుకటికి భూస్వాములు ఊళ్లోకి బడిని రానిచ్చేవారు కాదు. కరెంటు వచ్చినా తమ ఇళ్లకే పరిమితం.

చెరువు నీళ్లు కూడా తమకే సొంతం. ఇవేవీ బక్క రైతులకు, పేదలకు దక్కేవి కాదు. దక్కకుండా ఉంటేనే వారంతా తమవద్ద సేవకులుగా పడి ఉంటారని వారి నమ్మకం. ప్రాజెక్టులు, కాల్వల విషయంలోనూ ఇదే భూస్వామ్య మనస్తత్వం కొనసాగింది. కాలువ నీళ్లొస్తే ఇంకేమన్నా ఉందా, జనం మన మాట విం టారా. ఛట్ ఆపండి అని మోకాలు అడ్డం వేసిన నాయకులు తెలంగాణలో ఎప్పటి నుం చో ఉన్నారు. వారి వారసులు ఇప్పటికీ వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. వారే వందలకొద్దీ కేసులు వేస్తారు. వారే రైతులకు పరిహారం ఇవ్వడం లేదని గోల చేస్తారు. వారే ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసేస్తుందని వాదిస్తారు. కొందరు నాయకులు ఎంత దుర్మార్గులో ఒక చిన్న సంఘటన వింటే అర్థమవుతుంది. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వెనుక నుంచి ఒక వరద కాలువ తవ్వారు. ఆ కాలువ పొడవు 84 కిలోమీటర్లు. అందులో మధ్యలో ఒక వందమీటర్ల పొడవున భూమిపై కొందరు రైతులు కేసు వేశారు.

ఆ కేసులో 2009లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికి తొమ్మిదేండ్లు. కేసును ఎత్తివేయమని అడుగడానికి ఎవరికీ తీరుబడి లభించలేదు. ఇటీవల ఒక్కొక్క రైతును బతిమాలి కేసుల నుంచి తప్పించే ప్రయత్నం మాడుగులపల్లి మండల యువకు లు చేశారు. కొందరు కేసు ఉపసంహరించుకున్నారు. మరో రైతు అదే క్రమంలో కేసు ఉపసంహరించుకోవడానికి ముందుకువచ్చాడు. ఈ విషయం తెలిసిన నల్లగొండ కాంగ్రె స్ ప్రతినిధి, నాకు తెలియకుండా కేసు ఉపసంహరించుకోవద్దు అని ఆ రైతును ఎగదోశాడు. మళ్లీ పని ఆగింది. పర్యవసానం ఏమంటే, మాడ్గులపల్లికి ఇవతల ఉన్న పదిహేను గ్రామాలు, పది చెరువులకు నీరు అందకుండా పోయింది. ఈ గ్రామాల్లో కాలువ తవ్వకానికి పెట్టిన ఖర్చు సుమారు 150 కోట్లకు పైగా ఉంటుంది. అంటే ప్రభుత్వం 150 కోట్లు ఖర్చుచేసి కూడా పదేండ్లుగా ఆ గ్రామాలకు నీరివ్వలేకపోయింది. పదివేల ఎకరాలకు నీరందించలేకపోయింది. కాంగ్రెస్ నాయకుల మనస్తత్వం అలా ఉంటుంది. పానగల్లు చెరువు ఇప్పటికీ పూర్తిగా నింపలేదు.

చాలా కాలువలకు దిగువకు నీరివ్వలేని పరిస్థితి. రైతులు కరువుతో అలమటిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదు. పానగల్లు రిజర్వాయ ర్‌లో మునిగే భూములకు, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పనుల్లో కదలిక వచ్చింది. ఏ ప్రాజెక్టు వద్దయినా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. కొంతమంది మేధావులు, కొన్ని పత్రికల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాలమూరు రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టు.. అన్నింటిపైనా ఏదో ఒక పేచీ లేవనెత్తడం పనులు ఆపడం వీరికి అలవాటుగా మారింది. ఒక పత్రికయితే ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా, ఫలితం ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని రాగాలు తీసింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు నీళ్లివ్వాలని కొట్లాడటానికి బదులు ఎంతసేపు వివాదాలు లేపడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


నిన్నటిదాకా రైతులు అప్పులు చేసి, బోరువెనుక బోరు వేసి, అష్టకష్టాలపాలై, పంటలు చేతికి రాక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ఈ నీటి బాధల నుంచి విముక్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే అప్పు చేస్తున్నది. ఇంతకాలం కరెంటు కోసం, బోరు బావుల కోసం రైతులు చేసిన, చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ అప్పులు మొత్తం లెక్కతీయండి. రాష్ట్ర ప్రజలంతా చేసే అప్పుతో పోల్చితే ప్రభుత్వం చేసే అప్పు చాలా స్వల్పం. ఈ అప్పు కూడా ప్రపంచ బ్యాంకు వద్ద తేవడం లేదు. ఏ షరతులకూ తలొగ్గని రుణ సేకరణ ఇది. కానీ రంధ్రాన్వేషకులకు ఇందులో కూడా ఘోరాలు నేరాలు కనిపిస్తున్నాయి. వీళ్లకు మంచి ఆలోచనలు రావు. ఎవరికైనా వస్తే సహించలేరు. ఓర్వలేరు.


ఒక స్టే ఖరీదు ఎంతో ఇటీవల ఒక రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేం ద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ప్రాజెక్టు పనులు చూసి కేంద్ర ప్రభుత్వం మొదలు అన్నివర్గా ల ప్రజలు కొనియాడుతున్నారు. ఎటొచ్చీ మనవాళ్లే సమస్యలు సృష్టిస్తున్నారు. ఒక రిజర్వాయర్ నిర్మించాలంటే వందలాది మంది కార్మికులు పనిలో ఉం టారు. వందలాది జేసీబీలు, ట్రక్కులు పనిలో ఉం టాయి. ఎంతోమంది ఇంజినీర్లు, అధికారులు పను ల్లో నిమగ్నమవుతారు. ఉదాహరణకు ఆ రిజర్వాయర్‌ను వెయ్యి కోట్లతో నిర్మిస్తున్నామంటే, దానికొక తుదిగడువు పెట్టుకొని ఆ గడువులోగా పూర్తిచేసి నీళ్లు తీసుకోవాలని ప్రణాళిక పెట్టుకుంటారు. సకాలంలో పూర్తిచేసి, ఫలితాలు తీసుకుంటే ఆ వెయ్యికోట్లకు సార్థకత లభిస్తుంది. వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రైతుల జీవన ప్రమాణాల్లో అసాధారణమైన మార్పు వస్తుంది. రైతుకు విద్యుత్, నీరు, పెట్టుబడి ఇవ్వడమంటే వారిని ఆర్థికంగా శక్తిమంతులను(ఎంపవర్) చేయడం.

ఇదంతా అభివృ ద్ధి సోపానంలో భాగం. కానీ ఎవరో ఒకరు ఒక స్టే తీసుకొస్తే ఈ ప్రణాళిక అంతా తారుమారవుతుంది. అప్పటికే పెట్టిన పెట్టుబడిపై వడ్డీలు పెరుగుతాయి. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఫలితాలు తీసుకోవడంలో ఆలస్యమవుతుంది. విచిత్రమేమంటే కాం గ్రెస్ నాయకులు స్టేలతో ఎంత వికృతంగా ప్రవర్తిస్తా రో కరీంనగర్ నాయకుడొకరు చెప్పారు. గోదావరి ఒడ్డు కాంగ్రెస్ నాయకుడొకాయన ఫొటోగ్రాఫర్లను పెట్టి ఏ రోజుకారోజు ఫొటోలు తీయించి, కోర్టుకు పంపి, ఇగో చూశారా మీరు స్టే ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పనులు జరిపిస్తోంది అని కోర్టు ధిక్కరణ కేసులు నడిపిస్తున్నారు. ఇది పైశాచికానందం కాక ఏమిటి? ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. దేశానికి మెతుకు పెట్టే మహా నిర్మాణాలు. రైతులకు పరిహారాలు, పునరావాసాల గురించి కొట్లాడటానికి ఈ కేసులకు సంబంధం లేదు. ఇది రాజకీయ నాయక త్వం విపరీత బుద్ధితో చేస్తున్న వికృత విన్యాసం. ఆంధ్ర ఆధిపత్య మీడియా ఇందుకు భిన్నంగా లేదు. వారికి ఇక్కడి చేపలపై కండ్ల మంట.

ఇక్కడి ఆలయాలపై ఏడుపు. ఇక్కడ జరుగుతున్న మంచి ఏదీ వారి కి కనిపించదు. ఎన్నో ఏండ్లు చేపల వ్యాపారం చేసింది ఆంధ్ర ప్రాంత వ్యాపారులే. ఫార్మాలిన్ వాడింది కూడా వారే కావచ్చు. అసోంతో సహా ఈశాన్య రాష్ర్టాల్లో ఆ కారణంగానే చేపలు నిషేధించి ఉండవచ్చు. కానీ ఆ వార్తను తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రచురించి, ఆంధ్రలో మినహాయించడం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటో అందరికీ అర్థం అవుతూనే ఉంది. ఆ పత్రికకు ఆంధ్రలో అంతా సస్యశ్యామలంగా, వైభవోపేతంగా, ఉజ్వలంగా ఎం దుకు కనిపిస్తున్నదో, తెలంగాణలోనే అస్తవ్యస్థంగా ఎందుకు కనిపిస్తున్నదో తెలుసుకోవడానికి కంటి డాక్టర్ అవసరం లేదు. అది కడుపు మంటతో వచ్చి న దృష్టిలోపం. ఈ పత్రికలకు ప్రభుత్వాలను పాదాక్రాంతం చేసుకొని, చెవులు పట్టి ఆడించడం చాలాకాలంగా అలవాటుగా మారింది. తెలంగాణలో ఇప్పుడు ఆ ఆటలు సాగడం లేదు. వీరికి జీ హుజూర్‌లు చెప్పే వ్యవస్థ లేదు. అందుకే జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నది. ఆ అజీర్తి నుంచే రోజూ ఏదో ఒకటి వండి వార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే యథాతథవాద నాయకత్వం, మీడియా తెలంగాణ ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేస్తున్నదని విమర్శలు చేస్తున్నది. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి దిగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్నమాట నిజ మే. వాస్తవానికి అప్పులు ఎవరికి పడితే వారికి ఇవ్వ రు. దివాళా కంపెనీలకు, ప్రభుత్వాలకు అప్పులు పుట్టవు. పరపతిలేని వారికి అప్పు పుట్టదు. ఆరోగ్యవంతమైన ప్రభు త్వం, ఆర్థిక వ్యవస్థ ఉన్నవారికే అప్పు పుడుతుంది. జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు పోటీపడి తెలంగాణ ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నాయంటే, మన ఆర్థిక నిర్వహణ మీద నమ్మకంతో. మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో చూసి వారు ముందుకు వస్తున్నారు. షోకులు చేయడానికి మనం అప్పులు చేయడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పులన్నీ తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం నేరుగా తెచ్చినవే. ఏవీ ప్రభు త్వ ఖజానాకు తెచ్చిన అప్పులు కావు.

ప్రభుత్వం హామీ మేరకు మిషన్ భగీరథకు, కాళేశ్వరం ప్రాజెక్టు కు, ఇంకా ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బడా పెట్టుబడిదారులకు రుణాలు ఇచ్చి, వారు సకాలంతో తిరిగి చెల్లించక, మొండి బాకీలు పేరుకుపోయి అతలాకుతలమైన బ్యాంకులు ఉత్తమ ఆర్థిక నిర్వహణ కలిగిన రాష్ర్టాల కు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణా మం. మరో విషయం, నిన్నటిదాకా రైతులు అప్పులు చేసి, బోరువెనుక బోరు వేసి, అష్టకష్టాలపాలై, పంట లు చేతికి రాక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ఈ నీటి బాధల నుంచి విముక్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే అప్పు చేస్తున్నది. ఇంతకాలం కరెంటు కోసం, బోరు బావుల కోసం రైతులు చేసిన, చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ అప్పులు మొత్తం లెక్కతీయండి. రాష్ట్ర ప్రజలంతా చేసే అప్పుతో పోల్చితే ప్రభుత్వం చేసే అప్పు చాలా స్వల్పం. ఈ అప్పు కూడా ప్రపంచ బ్యాంకు వద్ద తేవడం లేదు. ఏ షరతులకూ తలొగ్గని రుణ సేకరణ ఇది.

కానీ రంధ్రాన్వేషకులకు ఇందులో కూడా ఘోరాలు నేరాలు కనిపిస్తున్నాయి. వీళ్లకు మంచి ఆలోచనలు రావు. ఎవరికైనా వస్తే సహించలేరు. ఓర్వలేరు. యాభైయేండ్లుగా నష్టపోయిన రంగాల్లో వేగంగా ఫలితాలు తీసుకోవాలంటే యుద్ధంలా పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం యుద్ధమే చేస్తున్నది. సుమారు 1000 టీఎంసీల గోదావరి నీళ్లు, 400 టీఎంసీల కృష్ణా నీళ్లు తెలంగా ణ హక్కు. ఇందులో ఇప్పుడు ఉపయోగించుకుంటున్న నీరు సుమారు 300 టీఎంసీలకు మించదు. నీటి హక్కును సాధించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తిచేసే దిశగా అహోరాత్రాలు శ్రమిస్తున్నది. ఇన్ని నీళ్లు తెలంగాణ బీళ్లకు మళ్లిన రోజు ఈ శకున పక్షులేవీ మనకు కనిపించవు. కోటి ఎకరాలకు నీరు లభి స్తే పండే పంట ఎంత? దానినుంచి వచ్చే ఆదాయం ఎంత? సమాజం ఎంత గతిశీలంగా మారుతుంది? ఇది అర్థమైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని అర్థమవుతుంది. ఇటువంటివారికి అది అర్థం కాకపోయినా తెలంగాణ ప్రజలకు వచ్చే నష్టం లేదు.

[email protected]

1237

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా