ముసుగువీరుల అసలు లక్ష్యం


Thu,July 19, 2018 01:15 PM

సైంధవులను, శిఖండులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తేనే సమస్య. ముసుగు యుద్ధాలతోనే ప్రమాదం. కర్ణాటక, మహారాష్ట్రలో ఏదో ఒక సేన ఏర్పాటు చేసుకొని ప్రగతిశీల శక్తులపై మారణకాండ సాగించిన ముసుగు శక్తుల తరహాలో ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం తలెత్తగల అవకాశాలపై తెలంగాణ మెలకువతో ఉండాలి. ఆధ్యాత్మికం ముసుగులో, మీడియా ముసుగులో, ఇంకా సినిమా ముసుగులో ఇక్కడ విరజిమ్ముతున్న కాలుష్య కారకాలు తెలంగాణ సమాజానికి నష్టదాయకం. తెలంగాణ సమాజం ఈ శక్తుల పట్ల ఇప్పటికీ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆదమరిచి ఉంటే తెలంగాణను ఆగం పట్టించడానికి, అస్థిరపర్చడానికి ఈ శక్తులు కూడగట్టుకొని విరుచుకుపడతాయి.

KattaShekarReddyకొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. కనిపె ట్టి కాపాడుకోకపోతే ఈన గాచి నక్కలపాలు చేసినట్టవుతుంది. స్వ రాష్ట్రంలో కూడా ఈ కుట్రలేంది? ఓ చానెలో డు ఆయనెవరినో లైవ్‌లో పెట్టి రాముడిని తిట్టిస్తాడు. మరో చానెలోడు ఇంకో రాజకీయ స్వామీజీని సీనులోకి తీసుకొచ్చి హాట్ రాముడిని తిడుతారా. నేను యాత్ర చేస్తా అని బయ లుదేరుతాడు. భావోద్వేగాలు రెచ్చగొడుతారు. అసలు వీళ్లెవరు? ఒకాయనది చిత్తూరు. ఇంకొకాయనది కాకినాడ. వీళ్లకో రాష్ట్రం ఉన్నది. అక్కడా దేవుళ్లున్నారు. పంచాయితీలున్నాయి. కానీ ఇక్కడే పీఠం వేసుకొని ఎందుకు రభస చేస్తున్నారు? వీళ్లు పాత్రధారులు సరే. వీరి వెనుక సూత్రధారులెవరు? వీరి లక్ష్యం ఏమి టి? అది గుర్తించి, ఈ శక్తుల తెరవెనుక భాగోతాలను బట్టబయలు చేయకపోతే అభివృ ద్ధి పట్టాలపై నల్లేరుపై నడకలా సాగిపోతున్న తెలంగాణ మళ్లీ సంక్షోభాల్లో పడుతుంది-తెలంగాణ నుంచి ఇద్దరు అరాచకవాదుల బహిష్కరణ నేపథ్యంలో ఓ పెద్దాయన వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఇదిప్పుడు చాలామంది వేస్తున్న ప్రశ్న. అసలు ఈ స్వామీజీ బాసర నుంచి భద్రాచలం పాదయాత్ర ఎందుకు చేయతలపెట్టినట్టు. బెజవాడ నుంచి సింహాచలమో, శ్రీకూర్మమో చేపట్టవచ్చు కదా? ద్రాక్షారామం నుంచి కాణిపాకం దాకా చేపట్టవ చ్చు కదా? కనకదుర్గమ్మ నుంచి వేంకటేశ్వరస్వామి వరకు చేయవచ్చు కదా? ఆలయా ల్లో అన్యమత ప్రచారాలు, క్షుద్రపూజలు.. ఇంకా ఏవేవో వివాదాలు అక్కడే నడుస్తున్నా యి కదా? సామాజిక మాధ్యమాల్లో బుద్ధిజీవులు వేస్తున్న ప్రశ్నలివి. విచిత్రమేమంటే హైదరాబాద్‌లో తిట్టుకున్న పాత్రధారులిద్దరూ ఆంధ్రాలో ఒక్కటైపోయారు. ఈయన ఆయనను ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నిస్తే ఆయన ఈయనను వాల్మీకి అని వర్ణిస్తారు. దీనివెనుక ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదు. భావ కాలుష్యాన్ని వ్యాప్తిచేసి తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేయాలని, భావోద్వేగాల వైపు నడిపించాలని యోచిస్తున్న ఒకనాటి తెలంగాణ వ్యతిరేక మీడియా, సంస్థలు, నాయకులు కలిసి ఆడుతున్న కుట్రల నాటకం ఇది అని ఆ ఓ రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.

సమస్య ఇంతలోతుగా ఉందా? అంటే తరచి చూస్తే తెలుస్తుంది. నిజానికి తెలంగాణ లో ఆధ్యాత్మిక శూన్యత ఉందా? ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందరినీ మించిన ఆధ్యాత్మిక వాది. ఆయన స్వధర్మాన్ని ఎంత అంకితభావంతో పాటిస్తారో, పరధర్మాన్ని అంతే చిత్తశుద్ధితో ఆదరిస్తారు. ఆయనను చూసి నేర్చుకోండి అని ఒక ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడే బీజేపీ నేతలకు చెప్పినట్టు ఆ పార్టీ ఆంతరంగికుడు ఒకరు మన ఎంపీతో చెప్పారు. అసాధారణ రీతిలో యజ్ఞయాగాదుల నిర్వహణ, ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక పోషణ విషయంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. ఇక్కడే కాదు ఎక్కడా ఏ ముఖ్యమంత్రి తన స్వధర్మాన్ని ఇంత ధైర్యంగా పాటించిన, ప్రదర్శించిన సందర్భం లేదు. బీజే పీ, అనేకమంది స్వామీజీలు కొన్ని దశాబ్దాలుగా రాముడి ఆలయ నిర్మాణం పేరు చెప్పి ఓట్లు కోట్లు ఇటుకలు సేకరించారు. రామాలయ నిర్మాణాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే దానిని సజీవంగా ఉంచుతూ వచ్చారు. కేసీఆర్ ముందుగా ఏమీ చెప్పకుండానే, యాదాద్రి ఆలయాన్ని ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. వేద పాఠశాలలను పునరుద్ధరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నది. అంతేకాదు ఇక్కడ స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు చాలామంది ఉన్నారు. చినజీయర్ స్వామీజీ దేశంలోనే అతిపెద్ద రామానుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ ప్రాంగణంలో శ్రీమహావిష్ణువు అన్ని రూపాలను ఒకేచోట ఆవిష్కరించడానికి అహరహం కృషి చేస్తున్నారు. వీధిపోరాటాలకు దిగి న స్వామీజీ ఆయన కన్న గొప్ప ఆధ్యాత్మిక బోధకు డా? హైదరాబాద్, మొత్తంగా తెలంగాణ గంగా-యుమునా సమ్మిళిత సంస్కృతికి చిరునామా. ఇక్క డ ఇస్లాం, క్రైస్తవ, జైన, బౌద్ధ, సిక్కు, యూదు మతానుయాయులతోపాటు ప్రపంచంలోని అన్ని మతా లు, శాఖలకు అనుచరులు, శిష్యులు ఉన్నారు. ఆలయాలు ఉన్నాయి. మందిరాలు ఉన్నాయి. ఎవరి నమ్మకాలు వారివి. అందరూ అందరినీ గౌరవిస్తూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. సమస్యలు వచ్చేద ల్లా రాజకీయ లక్ష్యాలతో మతాన్ని వాడుకోవాలని చూసినప్పుడే. రాముడి రక్షణ పేరుతో తెలంగాణలో తిరిగిన స్వామీజీ రాజకీయ లక్ష్యాలతోనే మత ప్రచారానికి దిగారని ఆయన మాటలు, చేష్టలు చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ ఏర్పడుతుందనీ, అది ఒక సమర్థవం తమైన, ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతుందనీ, ఒడిదుడు కులు లేని ప్రయాణం సాగిస్తుందని ఊహించని తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర ఆధిపత్య మీడియా, వారి ని అనుసరించే నాయకులు, పార్టీలు అసూయాద్వేషాలతో రగిలిపోతున్నాయి. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని, అభివృద్ధిని కూడా పోరాటంలాగా ముందు కు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నాలుగేండ్లలో సాధించిన ప్రాజెక్టుల ప్రగతి అందు కు సాక్ష్యం. నీటిపారుదల ఇంజినీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా? సుమారుగా 30 వేల మంది కార్మికులను యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులపై మోహరించి పనిచేయించిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఎమ్మెల్యేలు, మంత్రు లు నియోజకవర్గాల్లో, ప్రాజెక్టుల వద్ద ఇంతగా కాపలాకాసిన సందర్భం ఒక్కటి చూపించగలరా? గ్రామసీమలకు వేల కోట్ల రూపాయల సంపద పంపిణీ కావ డం ఎప్పుడైనా జరిగిందా? రాష్ట్రం వరుసగా ఇన్ని అవార్డులు, రివార్డులు అందుకున్న చరిత్ర ఉందా? తెలంగాణ ఏర్పడితే ఆదాయం తగ్గిపోతుందని, అడుక్కుతినాల్సి వస్తుందని, అంధకారం అవుతుందని గేలి చేసిన మీడియా మేధావులు, రాజకీయ నాయకులు, పార్టీలు ఇప్పుడు ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎంత తేడా అంటే- 2013-14లో 23 జిల్లాలకు సమైక్య రాష్ట్రం 1.61 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, 2018-19లో తెలంగాణ రాష్ట్రమే 1.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుంది. ఒక్క 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే నీటి పారుదల ప్రాజెక్టుల పై 25,291 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక సంవత్సరకాలంలో గరిష్ఠంగా ఖర్చుచేసింది 11,000 కోట్లు మాత్రమే. ఆగమవుతుందని భావించిన తెలంగాణ, తిరిగి తమ కాళ్లవద్దకు వస్తుందని భావించిన తెలంగాణ తమకు అందనంత ఎత్తుకు ఎదుగడాన్ని పైన పేర్కొన్న వ్యవస్థలేవీ సహించలేకపోతున్నాయి. అందుకే ఎక్కడ వీలైతే అక్కడలేని మచ్చ లు వెతుకడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి. తంపులు పెట్టాలి. వివాదాలు చెలరేగాలి.

తెలంగాణ సమాజం ఎంత మంచిదంటే, ఇక్కడ ఇప్పటికీ అన్ని భావజాలాలు వర్ధిల్లుతాయి. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుదికంటా వ్యతిరేకించిన పార్టీ, తెలంగాణకు వ్యతిరేకంగా ఇప్పటికీ కుట్రలు చేస్తున్న పార్టీ ఇంకా ఇక్కడ బతికే ఉంటాయి. ఇంకా ఆ జెండాలు, ఎజెండాలు మోసే నాయకులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఆంధ్రా మీడియా వారికి ఉచితాసనాలు వేసి ఇప్పటికీ టీవీల్లో కూర్చోపెట్టి తెలంగాణకు సుద్దులు చెప్పిస్తూ ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన మూన్నాళ్లకే కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ఏడు మండలాలను లాగి ఆంధ్ర ప్రాంతాని కి అప్పగించిన పార్టీ, విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక్కరోజూ సహకరించని పార్టీ, మతం తప్ప జనం పట్టని పార్టీ ఇక్కడ నోరేసుకొని ఊళ్లమీద పడుతుంది. రాజకీయ జెండా లు, ఎజెండాలు బాహాటంగా ఉంటే ఎవరు ఎవరితోనైనా పోరాటం చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో అది సహజమే. సైంధవులను, శిఖండులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తేనే సమస్య. ముసుగు యుద్ధాలతోనే ప్రమాదం. కర్ణాటక, మహారాష్ట్రలో ఏదో ఒక సేన ఏర్పాటు చేసుకొని ప్రగతిశీల శక్తులపై మారణకాండ సాగించిన ముసుగు శక్తుల తరహాలో ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం తలెత్తగల అవకాశాలపై తెలంగాణ మెలకువతో ఉండాలి. ఆధ్యాత్మికం ముసుగులో, మీడియా ముసుగులో, ఇంకా సినిమా ముసుగులో ఇక్కడ విరజిమ్ముతున్న కాలు ష్య కారకాలు తెలంగాణ సమాజానికి నష్టదాయ కం. తెలంగాణ సమాజం ఈ శక్తుల పట్ల ఇప్పటికీ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్న ది. ఆదమరిచి ఉంటే తెలంగాణను ఆగం పట్టించడానికి, అస్థిరపర్చడానికి ఈ శక్తులు కూడగట్టుకొని విరుచుకుపడతాయి. తెలంగాణను ప్రగతి పట్టాల నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాయి.
[email protected]

1099

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా