మోదీ, బాబు.. ఎదురీత‌


Mon,July 2, 2018 05:54 PM

కేసీఆర్ ఒక్కరే వీరిద్దరికీ భిన్నం. ఆయన ఈ నాలుగేండ్లూ ప్రజలకు గరిష్టంగా, గుణాత్మకంగా, నేరుగా మేలుచేసే అంశాలపైనే దృష్టిపెట్టారు. గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పల్లెల్లో ఖర్చు చేసి న నిధులు లెక్కతీస్తే దేశ చరిత్రలో అదొక రికార్డవుతుంది. విద్యుత్, సాగు, తాగు నీరు సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి దిశ గా ఒక గొప్ప ముందడుగు వేసే దిశగా మిషన్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ను యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారు. ఎంత సంకల్పం లేకపోతే గోదావరి నదిపై ఒక బరాజును కేవలం 15 మాసాల వ్యవధిలో పూర్తి చేయిస్తారు?

image


దేశ రాజకీయాల్లో ఎన్నికల పరుగు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ కోసం రూపొందించిన డిఫెం డ్, డెస్ట్రాయ్ అండ్ డిఫీట్ అన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడం, ప్రత్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, అంతిమంగా ఎన్నికల్లో ఓడించడం లక్ష్యంగా ఆయన బృందం ముందుకు కదులుతున్నది. అది విజయవంతం అవుతుందా లేదా అన్నది దేశ ప్రజలు మోదీని ఎంతవరకు నమ్ముతారన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఆయన తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడంలో ఇప్పటికే విఫలమయ్యారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి నల్లధనం గురించి గానీ, పెద్దనోట్ల రద్దు గురించి గానీ, జీఎస్టీ గురించి గానీ మాట్లాడలేదు. వాటిని తన విజయాలుగా చెప్పుకునే స్థితిలో ఆయన లేరు. అందుకే ఆయన, ఆయన బృందం ప్రత్యర్థులపై దాడి చేయడాన్నే ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రభుత్వానికి సారథ్యం వహించిన నాయకుడు ప్రజలకు నేరుగా చేయగలిగిన మేలు, వారిలో కలిగించగలిగిన నమ్మకం ప్రజల్లో ఆ నాయకుడికి సుస్థిర స్థానం సంపాదించి పెడుతుంది. అటువంటి తిరుగులేని అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది.

బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని నడుపుకొనే అవకాశం దేశ చరిత్రలో మొదటిసారి వచ్చింది. అప్పట్లో అటల్ బిహారీ వాజపేయి చాలామందిపై ఆధారపడవలసి వచ్చింది. నరేంద్ర మోదీకి అటువంటి పరిస్థితి లేదు. మోదీ తనకు వచ్చిన తిరుగులేని అధికారాన్ని ఏకపక్ష నిర్ణయాలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఏ రకం గా మేలుచేయని, ప్రజలు తమ డబ్బు కోసం తాము ఇక్కట్లు పడవలసిన దుస్థితిలోకి నెట్టే నిర్ణయాలు చేశారు. ప్రజలకు నేరుగా మేలు కలిగే మౌలికమైన నిర్ణయాలు ఏవీ చేయలేదు. సబ్సిడీ గ్యాస్ ను కోటిమందికి పైగా ప్రజలు వదులుకుంటే ఆ ధనంతో ఇతర ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మోదీ పాలనాకాలమంతా ప్రజల త్యాగమే తప్ప ప్రభుత్వ త్యాగం ఎక్కడా కనిపించలేదు.

కేంద్ర పథకాలు వందలాదిగా ఉన్నాయి. అవి అమూర్తమైనవి. ప్రజలకు నేరుగా కనిపించవు. వాటిద్వారా ఇచ్చే నిధులు కూడా రాష్ర్టాలకు ఏ మూలకు చాలవు. మళ్లీ రాష్ర్టాలు తమ వంతు భారీగా ఖర్చుచేసి ఆ పథకాలను జన శ్రేయకంగా మార్చుకోవలసిందే. కేం ద్ర బడ్జెట్ ప్రపంచ భారీ బడ్జెట్‌లలో ఒకటి. అటువంటి బడ్జెట్ ప్రజలకు నేరుగా, గుణాత్మకంగా, ప్రత్యక్ష ఫలితం కలిగించే పని ఒక్కటీ చేయకపోతే జనం అశాంతికి లోనుకాక ఏమవుతారు? ప్రభుత్వం తమకు మేలు చేయకపోగా తమకు నగదు కష్టాలు, పన్ను కష్టాలు మీద మోపిందని భావిస్తున్నారు. రూపాయి విలువ అంతకంతకూ పడిపోతున్నది. జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. ఆదాయాలు అదే మోతాదులో పెరుగడం లేదు. నాలుగేండ్లుగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు మరిన్ని పన్ను రాయితీలు, ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు వంటివి ఆశించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పోనీ మోదీ నిజాయితీ పరుడు, దేశం ఆదాయాన్ని పెంచడానికి పాటుపడుతున్నాడు అని చెప్పుకోవడానికీ ఏమీ మిగల్లేదు. అవినీతి తగ్గలేదు. కుంభకోణాలు తగ్గలేదు. ఎన్నికల్లో రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు తగ్గలేదు. నల్లధనం చెలామణి తగ్గలేదు, కశ్మీర్‌లో రాళ్లు వేయడం తగ్గలేదు. వెయ్యి నోటుతో కొన్న ఓటు రెండు వేల నోటు పెట్టి కొనవలసి వస్తున్నది.

ఇదేమి ఖర్మ అని బీజేపీతో సహా అన్ని పార్టీల నేతలు ఆంతరంగికంగా వలపోసుకుంటున్నరు. బ్యాంకుల మునక ఆగలేదు. మోసగాళ్లు విదేశాలకు పారిపోవడమూ కట్టడి కాలేదు. మరి మోదీ నిజాయితీ వల్ల దేశానికి ఏమి ఒరిగిన ట్టు. రాజకీయాల్లో ఏమైనా వైవిధ్యం ఉందా అంటే అదీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేండ్లు చేసిన సకల పాపాలను బీజేపీ ఈ నాలుగేండ్లలో చేసేసింది. ప్రజ ల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం, రాష్ర్టాల్లో తలదూర్చడం అన్నీ షరా మామూలే. తాను గొప్ప అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ప్రత్యర్థులను దునుమాడటంతోపాటు కశ్మీర్, అయోధ్యల చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల గండం గట్టెక్కే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎంతచేసినా ఆయనకు మునుపటి వైభవం కష్టమే. ఆయన పోయిన ఎన్నికల్లో పదకొండు రాష్ర్టాల్లో తొంభై శాతం స్థానాలను గెలుపొందారు. ఆ రాష్ర్టాలలో ఆయన గెలిచిన స్థానాలు 197. మరో ఐదు రాష్ర్టాల్లో సగానికిపైగా స్థానాలను, అంటే 72 స్థానాలను గెలిచారు. ఆ పార్టీ కి వచ్చిన మొత్తం 282 స్థానాల్లో ఈ పదహారు రాష్ర్టాల్లో గెలిచిన స్థానాలే 269. ఆ రాష్ర్టాలన్నీ ఇప్పు డు ప్రతికూల పవనాలతో ఉడుకుతున్నాయి. కొన్ని రాష్ర్టాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ర్టాల్లో పాక్షిక వ్యతిరేకత ఉన్నది. ఆయన ఇప్పుడు ఏకైక పెద్దపార్టీగా అవతరించడమే గగనం. అది సాధిస్తే బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉండవచ్చు. అప్పుడు మద్దతునిచ్చే పార్టీ లు, ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు మోదీని నాయకుడిగా అంగీకరిస్తాయా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం.

చంద్రబాబు నాయుడు కూడా సేమ్ టు సేమ్. ఎప్పుడూ వ్యతిరేక నినాదాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆంధ్రకు ఏమి కావాలో అడుగకుండా, విభజనకు వ్యతిరేకంగా నీచాతినీచమైన ఎత్తుగడల కు దిగారు. రాష్ట్ర విభజన జరుగకుండా చూడాలని దేశమంతా తిరిగి అందరి కాళ్లూ వేళ్లూ పట్టుకున్నా రు. అప్పటికి చేయిదాటిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు అనుకూలంగా ఉండటం వల్ల విభజన ఆగలే దు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలువడం కోసం బీజేపీ, పవన్ కల్యాణ్‌లతో జట్టుకట్టి నాలుగేండ్లు విహారయాత్రలు చేసి ఇప్పుడు కేంద్రం మోసం చేసిందం టూ వీధికెక్కాడు. ప్రత్యేక హోదా కావాలని ఎవరయినా అంటే అరెస్టులు చేయించేదాకా వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు తనను మించిన హోదావాది లేడని మాట్లాడుతున్నాడు. మోసం అన్నది ఏండ్ల తరబడి జరుగదు. నాలుగేండ్ల పాటు మోసపోయావు అంటే అది చంద్రబాబు అసమర్థత. చేతగాని తనం. చంద్రబాబు పరాన్న రాజకీయవేత్త. సొంతబలం ఎప్పు డూ లేదు. మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టి పోషించి మహావృక్షంలా నిర్మించిపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికే ఇప్పటికీ చంద్రబాబుకు ఆలంబన. ఆయన కేవలం మేనేజర్. మ్యానిపులేటర్. కానీ అవి ఎల్లకాలం పనిచేయవు. చంద్రబాబు ఎంత దాచిపెట్టాలనుకున్నా ఆయన రాజకీయ అవకాశవాదం దాగదు. యునైటెడ్ ఫ్రంట్‌కు నేనే కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న చంద్రబాబు కార్గిల్ యుద్ధంతో ఎన్డీయేకు ప్రతిష్ఠ పెరుగగానే ఫ్రంట్‌ను యమునా నదిలోకి విసిరేసి, ఎన్డీయేలో చేరారు. మళ్లీ నాలుగేండ్లకే నరేంద్ర మోదీ హంతక రాజకీయాలను వ్యతిరేకిస్తూ 2004లో ఎన్డీయే నుంచి బయటికి వస్తున్నానంటూ ప్రకటించిన చంద్రబాబు, పదేండ్లు తిరిగేసరికి అదే నరేంద్ర మోదీతో జట్టుకట్టారు. కొన్ని పక్షులు వానను పసిగట్టినట్టు, చంద్రబాబు ట్రెండును పసిగడతాడు. దానికి అనుగుణంగా పార్టీ లు మార్చుతాడు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ వు. ఈసారి దెబ్బతిన్నాడు. నరేంద్ర మోదీతో కలసి ఉంటేనే అంతో ఇంతో ఫలితం ఉండేది. అశాంతి, అభద్రత ఉండేవి కాదు.

కేసీఆర్ ఒక్కరే వీరిద్దరికీ భిన్నం. ఆయన ఈ నాలుగేండ్లూ ప్రజలకు గరిష్ఠంగా, గుణాత్మకంగా, నేరుగా మేలుచేసే అంశాలపైనే దృష్టిపెట్టారు. గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పల్లెల్లో ఖర్చు చేసి న నిధులు లెక్కతీస్తే దేశ చరిత్రలో అదొక రికార్డవుతుంది.

విద్యుత్, సాగు, తాగు నీరు సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి దిశ గా ఒక గొప్ప ముందడుగు వేసే దిశగా మిషన్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ను యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారు. ఎంత సం కల్పం లేకపోతే గోదావరి నదిపై ఒక బరాజును కేవ లం 15 మాసాల వ్యవధిలో పూర్తి చేయిస్తారు? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను ఆగమేఘాలమీద పూర్తిచేసి పాలమూరుకు పచ్చలతోరణం కట్టారు. పింఛన్ల రూపేణా, రైతుబంధు, రైతు బీమా, విద్యుత్ సబ్సిడీల రూపేణా, సంక్షేమ పథకా ల ద్వారా లక్ష కోట్లకు పైగా నిధులు పల్లెల్లో ఖర్చు చేశారు. వేలాది గ్రామాల్లో గత అరువై ఏండ్లలో జరుగని ప్రగతి ఈ నాలుగేండ్లలో జరిగింది. సమాజంలో ఒక భరోసాను, నమ్మకాన్ని కలిగించింది. ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. చదువులు బాగుపడినాయి. ప్రభుత్వ దవాఖానలు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. మన రాష్ట్రం సృష్టించిన సంపద మన ప్రజలకు దక్కుతున్నది. తెలంగాణ వస్తే ఏమవుతుందని ప్రశ్నించినవాళ్లకు పల్లెలు, పట్టణాలు సమాధానం చెబుతున్నాయి. కేసీఆర్ ఒక్కరే- చేసిన పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు చూపించి జనం తీర్పు కోరుతున్నారు. నరేం ద్ర మోదీ, చంద్రబాబు నాయుడు అందరిపై దుమ్మెత్తిపోసి రాజకీయంగా కాలం నెట్టుకొస్తున్నా రు. కేసీఆర్ అనుకూల పవనాలతో ముందుకెళుతున్నారు. మోదీ, చంద్రబాబు ప్రతికూల పవనాలను ఎదుర్కొంటున్నారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్పా ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.
[email protected]

2263

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా        


Featured Articles