తెలంగాణ ఓ ఫీనిక్స్


Mon,June 11, 2018 03:03 PM

కాంగ్రెస్ ఏనాడైనా ప్రజాకేంద్రకంగా ఆలోచనలు చేసిందా? ప్రజలు ప్రాధాన్యంగా ప్రణాళికలు చేసిందా? ప్రజల కష్టనష్టాలు తెలిసిన నేత, తెలంగాణ పడిన యాతనను ఊరూరా తిరిగిచూసిన నాయకు డు, తెలంగాణ అనుభవించిన క్షోభను ప్రత్యక్షంగా చూసి, దేశవ్యాప్తంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సమీకరించి, తెలంగాణలో సకల జనులను ఉద్యమపథం పట్టించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా ఖతం పట్టించాలని చూసినా పడిలేచిన కెరటంలా, ఒక ఫీనిక్స్‌లా తెలంగాణ ఉద్యమ కాంక్షను ఎగరేస్తూ వచ్చిన మహాసారథి కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా నాలుగేండ్ల పాలన పూర్తి చేసుకొని ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపింది. అన్నిరంగాల్లో ఒక ప్రత్యేక ముద్రతో ముందుకు సాగుతున్నది. బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకువేస్తున్నది. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించడం, వ్యవసా యం, పంటదిగుబడులు రికార్డులు సృష్టించ డం, రాష్ట్రంలోని సుమారు కోటి కుటుంబాల్లో ప్రతికుటుంబానికి ఏదో ఒక సాయం అంద డం ప్రజల కళ్లల్లో ఆనందాన్ని, భవిష్యత్తుపై భరోసాను పెంచింది. మా పల్లెకు ఒక్క రైతు బంధు పథకం ద్వారానే 78 లక్షల రూపాయలు వచ్చాయి. పల్లె పండుగ చేసుకుంటున్నది. అన్నిరకాల ఆసరా పింఛన్ల ద్వారా నెలనెలా ఏడు లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇంత ధనం మా ఊళ్లకు వచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు. నాయకులు, అధికారులు, దళారీల ప్రమేయం లేకుండా మా పల్లెకు ఈ నిధులు వస్తున్నాయి.

మా చెరువులో ఈ ఎండాకాలం కూడా నీళ్లున్నాయి. మాకు ఇంతకన్నా ఏం కావాలి? ఇది బంగారు తెలంగాణ సాలు కాదా? అని ప్రశ్నించాడు ఒక రైతు నాయకుడు. రెవెన్యూ రికార్డుల సవరణలో కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవం. పట్టా పుస్తకాల్లో తప్పులు దొర్లిన మాట నిజం. అవి సరిదిద్దుతూ వేగంగా చర్యలు తీసుకుంటున్నారన్నదీ వాస్తవం. అయినా మొత్తం 56 లక్షల చెక్కుల్లో ఇప్పటికే 46 లక్షల మందికిపైగా చెక్కులు అందాయి. మిగిలినవి కూడా త్వరితగతిన పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నది. అయితే ఇంత గొప్పగా జరిగిన ఈ కార్యక్రమానికి మసిబూయడానికి కొన్నిశక్తులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నాయి. భూస్వాములు, పెత్తందారులకు మాత్రమే రైతుబంధు ఉపయోగపడుతున్నదని చెప్పడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఇంతకాలం రైతును పట్టించుకున్న నాథుడు లేడు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు రుణమాఫీ అన్నా ఎగతాళి చేసిం ది. ఏ కాలంలోనూ రైతుకు ఒక్క పైసా ఆదాయం వచ్చే పనిచేయలేదు. రైతుకు గతంలో ఉన్న సబ్సిడీలన్నింటినీ ఆర్థిక సంస్కరణల పేరిట ఒక్కొక్కటీ పీకేస్తూ వచ్చిన పార్టీ అది. అటువంటి పార్టీ, ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక పథకాన్ని తెస్తే, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది.

చంద్రుడిని చూడమంటే అందులోని మచ్చలను మాత్రమే చూసేవారిని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. వారిది ఉద్దేశపూర్వక అంధత్వం. చూపు ఉండీ చూడ నిరాకరించే మూఢత్వం. తెలిసీతెలియనట్టు నటించే కుటిలత్వం. రైతుబంధుపై విపక్షాలు లేవదీస్తున్న వాదనలు వింటుంటే విస్మయం కలుగుతున్నది. ఒక్క రైతుబంధు ఏమిటి ఏ అంశంపైనైనా వారి వాదనలు వింటుంటే వీరికి ప్రజలపట్ల ఏమైనా సానుభూతి ఉందా అనిపిస్తుంది. భూస్వాములకు, పెత్తందారులకు మాత్రమే ఉపయోగపడుతున్నదన్న వాదన చేస్తున్నవారికి ఒకటే ప్రశ్న. మీరు అధికారంలోకి వస్తే రైతుబంధు అమలు చేస్తారా లేదా? అమలు చేస్తే రైతులందరికీ ఇస్తారా లేదా? అంతదూరం ఎందుకు? అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఊదరగొడుతున్నారు కదా-మరి పేద రైతులెంతమందికి రెండు లక్షల రుణం ఉంటుంది. అసలు వారికి రుణం దొరుకుతుందా? బ్యాంకులు రైతులకు ఎంతవరకు రుణా లు ఇస్తున్నాయి? మీరు పేద రైతుల వరకే రుణమాఫీ చేస్తారా? లేక మీ భాషలోనే భూస్వాములకూ, పెత్తందారులకూ రుణమాఫీ చేస్తారా? రైతుబంధు పథకం దేశంలోనే మొదటిది. ఏ నాయకుడూ చేయని ఆలోచన.

ఏ పార్టీ అమలుచేయని గొప్ప పథకం. అది మొదలు పెడుతూనే పరిమితులతో, ఆంక్షలతో మొదలుపెడితే రైతుల్లో నమ్మకాన్ని కలిగించలేమని ప్రభుత్వం భావించి ఉంటుంది. తరతరాల సంక్షోభాన్ని నెత్తినెత్తుకొని ఉన్న తెలంగాణ రైతాంగంలో ఒక తిరుగులేని నమ్మకాన్ని కలిగించాలంటే ఎటువంటి పరిమితులు లేకుండా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు భావించారని అధికారులు చెబుతున్నారు. నిజమే ధనిక రైతులను, స్వయంగా పెట్టుబడి పెట్టుకోగల రైతులను పథకం నుంచి మినహాయించి ఉంటే బాగుండేదని ఇప్పుడు చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. పథకం ప్రారంభ దశలో కూడా ఈ సలహా ఇచ్చారని, ఈ దశలో అటువంటి పరిమితులు వద్దని ముఖ్యమంత్రి భావించారని అధికారవర్గాలు తెలిపాయి. సూచనలు, సలహాలు ఇవ్వడం వేరు. మెదడు నిండా బురద నింపుకొని ఆ బురదను పథకంపైన, ప్రభుత్వంపైన కుమ్మరించడం వేరు. అనుభవాల నుంచి ప్రభుత్వం పథకంలో మార్పులు తేవచ్చు. ముందుముందు మరింత అర్థవంతంగా ఈ పథకాన్ని అమలుచేయవచ్చు. కానీ ఆ పథకానికే కీడు తలపెట్టే దుర్మార్గపు విమర్శలు చేయడం వంకర బుద్ధులకు మాత్రమే చెల్లుతుంది. అయ్యా...వారిలో కొందరు అక్కు పక్షులు. ఇంకొందరు అక్కసు పక్షులు. వారు మంచిని చూడలేరు. మంచిని సహించలేరు. వారి మానసిక ఆరోగ్యం బాగోలేదు. వదిలేయండి అని మా రామశాస్త్రి అంటుంటాడు.
Katta
కాంగ్రెస్ ఏనాడైనా ప్రజాకేంద్రకంగా ఆలోచనలు చేసిందా? ప్రజలు ప్రాధాన్యంగా ప్రణాళికలు చేసిం దా? ప్రజల కష్టనష్టాలు తెలిసిన నేత, తెలంగాణ పడిన యాతనను ఊరూరా తిరిగిచూసిన నాయకు డు, తెలంగాణ అనుభవించిన క్షోభను ప్రత్యక్షంగా చూసి, దేశవ్యాప్తంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సమీకరించి, తెలంగాణలో సకల జనులను ఉద్యమపథం పట్టించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా ఖతం పట్టించాలని చూసినా పడిలేచిన కెరటంలా, ఒక ఫీనిక్స్‌లా తెలంగాణ ఉద్యమ కాంక్షను ఎగరేస్తూ వచ్చిన మహాసారథి కేసీఆర్. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తెలంగాణ ప్రజలకు గరిష్ఠ మేలుచేసే దిశగా ఏదైనా చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు కాబట్టి, వందలాది కొత్తకొత్త ఆలోచనలను పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వీధిన పడ్డారు. మేమూ చేస్తామంటూ అడ్డగోలు నినాదాలు, హామీ లు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ ఏ పథకం ప్రకటించి నా అది దేశవ్యాప్తంగా అమలుచేయాలి. దానికి అధిష్ఠానం ఆమోదం తెలుపాలి. సొంతంగా అమలుచే సే దమ్మూ ధైర్యం జాతీయపార్టీ నాయకులుగా వారి కి ఉండవు. పైగా ఎప్పుడు ఏ నాయకుడు ఉంటాడో తెలియదు. కాంగ్రెస్ రుణమాఫీ అమలు చేస్తుందన్న నమ్మకం ఎప్పుడు కుదురుతుందీ అంటే అది రాహుల్‌గాంధీయో, సోనియాగాంధీయో ప్రకటించినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు ప్రకటించే నాయకుడు ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. ఒక వేళ ఈయనే ఉన్నా ఎన్నికల తర్వాత ఎవరు వస్తారో తెలియదు. హామీలు ఒకరు ఇస్తే అమలుచేసేవారు మరొకరుండరు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి పథకాన్ని, రుణమాఫీ విధానాన్ని ప్రకటించాలి. అప్పుడు మాత్రమే వారి మాటలకు విలువ. అప్పటిదాకా వారివి ఆపదమొ క్కులే. ఏరుదాటేందుకు ఉపయోగించే ఎత్తుగడలే.

కొందరు కాంగ్రెస్ నాయకులు కులాల ప్రస్తావన తెచ్చి నిర్లజ్జగా వేదికలపై మాట్లాడుతున్నారు. కులం ప్రస్తావన ఎవరుచేసినా అది నీచాతినీచం. సంస్కార హీనం. అధికారం కోసం రాజకీయ నాయకులు దేశభక్తులుగా అవతారమెత్తుతారని ఎక్కడో ఒకరాజనీ తి పాఠం చదివిన గుర్తు. అంటే వారికి నిజంగా దేశభక్తి ఏమీ ఉండదు. రాజకీయాధికారం కోసం ఏ అవతారమైనా ఎత్తుతారని చెప్పడం ఆ పాఠం సారాంశం. ఇప్పుడు కొందరు నాయకులు ప్రకటిస్తున్న కులాభిమానం కూడా ఆపదమొక్కులో భాగ మే. వేణుగోపాల్‌రెడ్డి, ఇషాన్‌రెడ్డి, యాదిరెడ్డి మృత్యుకీలలకు బలవుతున్నప్పుడు ఈ అరివీరకుల శేఖరులు ఎక్కడున్నారో ఒక్కసారి చరిత్ర పేజీలను వెనుకకు తిప్పిచూడండి. ఇవ్వాళ ఏవేవో కులాలను కలిపి కొత్త పేర్లు సృష్టించి మాట్లాడుతున్న నాయకు లు గతంలో అవే కులాలతో అంటకాగి తెలంగాణ ఉద్యమానికి తీరని ద్రోహంచేసిన విషయం అప్పుడే మరిచిపోతామా? రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు లో ఆమోదం పొందకుండా సకల కుట్రలు చేస్తున్నా చూస్తూచూస్తూ చంద్రబాబు సంకన కూర్చున్న నాయకులు ఇవ్వాళ ఎవరికి వీరులు? ఎవరిని ఉద్ధరిస్తారు? అప్పుడు కులాలు కమ్మగా అనిపించా యా? సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, సాధించుకున్న తెలంగాణ స్వయం పాలనను పురిటిలోనే కుప్పకూల్చడానికి చంద్రబాబు కుట్రలు చేస్తే ఆ కుట్రలో ప్రధాన సూత్రధారులైన వారు తెలంగాణ లోకుల ఉద్ధారకులా? కేసీఆర్‌తో కొట్లాడటానికి ఈ నాయకులంతా కులాన్ని ఆశ్రయించారంటేనే రాజకీయంగా వారు ఎంతగా బలహీనపడిపోయారో, ఎంతగా దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కొట్లాడలేని వారే ఇలా అడ్డదారులు తొక్కుతారు. కాంగ్రెస్ నాయకత్వం రోజురోజుకు దిగజారుతున్నది. తెలంగాణ నాయకత్వం అనుభవాల నుంచి ఎదుగుతున్నది. మరింత ఉన్నతంగా ఆలోచిస్తూ ముందుకు పయనిస్తున్నది. ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా తెలంగాణ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. కొత్త అడుగులు వేస్తూనే ఉంటుంది.
[email protected]

4900

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా