పాపాలు వెంటాడుతాయి


Sat,May 26, 2018 11:05 PM

చంద్రబాబుకు మతిపోతున్నది. సమయం, సందర్భం, ఉచితానుచితం ఏదీ పట్టడం లేదు. ఏది పడితే అది మాట్లాడే స్థితికి జారిపోతున్నాడు. పాపం నిన్నగాక మొన్న అష్టకష్టాలు పడి చదువుకొని సివిల్స్ టాపర్‌గా వచ్చిన అనుదీప్ ఘనతనూ చంద్రబాబు తన ఖాతాలోనే రాసుకోవాలనుకున్నాడంటే ఆయన పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థ మవుతున్నది. ఆయనను ఎన్టీఆర్ ఆత్మ వేధిస్తున్నది. అందుకే ఆ పార్టీ తెలంగాణలో అంతరించింది. ఆంధ్రలో కూడా విశ్వసనీయతను కోల్పోయి, చుక్కాని లేని నావలా పయనిస్తున్నది. మాటలకు, విధానాలకు, చేతలకు పొంతన లేకుండా ఆ రాష్ర్టానికి భారంగా పరిణమిస్తున్నది.

శ్రీ కృష్ణుడు బోధించిన భగవద్గీత నాకు అర్థమైనంతవరకు మన కర్మఫలం మనలను వెంటాడుతుంది అని. అదీ ఈ జన్మలోనే. మనం చేసే మంచి చెడులు మనకో మన పిల్లలకో పాపమో పుణ్యమో కలిగిస్తాయని అనిపిస్తుంది. అనేక పాపాలు చేసినవాళ్లూ దర్జాగా బతుకుతున్నారే అని ఎవరయి నా అనవచ్చు. ఈ తరం కాకపోతే మరో తరానికి ఆ పాపమో పుణ్యమో బదిలీకావచ్చు. రాజకీయ సందర్భాలకు కూడా ఇది వర్తిస్తుం ది. రాజకీయ నాయకత్వానికి కూడా ఇదే విలువలు వర్తిస్తున్నాయని అనేక పార్టీలు, అనేక మంది నాయకుల పతనోన్నతాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. నిలబడాల్సిన సమయంలో నిలబడకపోవడం, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం, చేయగూడని పనులు చేయడం ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. ఆ పార్టీ ఇప్పుడు ఏది నీతి అని వాదిస్తున్నదో ఆ నీతులన్నింటినీ ఎప్పుడో తుంగలో తొక్కేసింది.

అందుకే వారి అరుపులకు, నినాదాలకు విలువ లేకుండాపోయింది. రేపు బీజేపీ పరిస్థితి అయినా అంతే. నరేంద్ర మోదీ పరిస్థితి అయినా అంతే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పటికే రుజువవుతున్నది. తెలంగాణలో ఆయన పార్టీ అంతరించిపోయింది. ఆంధ్రలో కూడా అవసానదశకు చేరువైంది. ఆయన మాట, చేత గతితప్పుతున్నాయని ఇటీవల పదేపదే రుజువవుతున్నది. ఆయన గతంలో సాధించిన విజయాలు కూడా ఆయనవి కాదు. ఆయన మూడు మార్లూ బై డీఫాల్టు ముఖ్యమంత్రి అయ్యారు. సొంత బలమో, సొంత రాజకీయ సత్తానో ఆయనను గెలిపించలేదు. ఎన్టీఆర్ నుంచి ఆయన పార్టీని లాగేసుకున్నారు. శిఖరం వంటి ఎన్టీఆర్‌ను ఆరు మాసాల్లో అతలంకుతలం చేసి గుండె పగిలి చనిపోయేట్టు చేశారు. ఎన్టీఆర్‌ను బలి తీసుకున్న పాపాన్ని కడిగేసుకోవడానికి, తనను తాను నిలబెట్టుకోవడానికి బాబు చాలా ప్రయత్నమే చేశారు. కానీ ఏనాడూ సొంత బలంతో నిలబడలేదు. ఒకసారి బీజేపీతో, ఒకసారి థర్డ్‌ఫ్రంట్‌తో నెట్టుకొచ్చారు. గాలివాటం చూసి మిత్రులను మార్చడంలో చంద్రబాబుది చాలా వేగం.

మంచీ చెడూ తప్పూ ఒప్పూ విలువ వలువ అన్నీ ట్రాష్ ఆయన దృష్టిలో. అధికారంలో కొనసాగడానికి, అధికారం సాధించడానికి ఏంచేసినా ఫర్వాలేదన్నది ఆయన విధానం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అన్నవి ఆయనకు పాచికలు మాత్రమే. ఆయన కొట్లాట ఎప్పుడూ సెంటిమెంట్ చుట్టూనే తప్ప, ప్రజల సమస్యల పరిష్కారం చుట్టూ ఉండదు. ప్రజలు కేంద్రంగా ఆలోచనలు, విధానాలు రూపొందించే సత్తా కానీ, అవగాహనకానీ, వాటిని అమలుచేసే సాహసం కానీ చంద్రబాబుకు లేవు. చంద్రబాబు ఎప్పుడూ షార్ట్‌కట్‌లో పాస్‌కావడం ఎలా అన్నదే ఆలోచిస్తారు. అందుకే ఆయనకు ఎటువంటి ప్రతిష్ఠ మిగులలేదు. ఆయన గురించి ఆయన చెప్పుకోవడం, ఆయన చందాలతో నడిచే మీడియా ఆయనకు డబ్బాకొట్టడం తప్ప, చంద్రబాబు మహానుభావుడు అని చెప్పే ఒక విశాల సమూహం ఏదీ లేదు. చంద్రబాబును నమ్మి అంతదూరం ప్రయాణించినవారే లేరు. చంద్రబాబును ఒక మేధావిగా గుర్తించినవారూ లేరు. చంద్రబాబు ఒక డొల్ల. చం ద్రబాబు ఒక మానిపులేటర్. చంద్రబాబును ఎన్టీఆర్‌కు చేసిన పాపం వెంటాడుతూ ఉం ది.

చంద్రబాబు ఏం చేసినా ఆయనకు ఆ విద్రోహ ముద్ర పోదు. ఎన్టీఆర్ స్వర్ణ విగ్రహం చేయించి పెట్టి నా ఎన్టీఆర్ ఆత్మ ఆయనను క్షమించదు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందురోజు ఏం జరిగింది- ఆరో జు సాయంత్రం అంటే 1996 జనవరి 17న చంద్రబాబు టీడీపీ అకౌంట్‌ను సీజ్ చేయించాడని, తాను ఇచ్చిన చెక్కు పాస్ కాలేదని ఎన్టీఆర్‌కు వచ్చి చెప్పా రు. అప్పటికే అనేక దెబ్బలు తిని ఉన్న ఎన్టీఆర్ ఆ రోజు హతాశుడయ్యారు. ప్రభుత్వాన్ని కొట్టేశారు. పార్టీని కొట్టేశారు. డిసెంబరు 22, 1995న ఎన్నికల గుర్తును కొట్టేశారు. చివరికి పార్టీ అకౌంట్‌ను కూడా దక్కనివ్వలేదా? ఎన్టీఆర్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారని, గుండెలవిసేలా రోదించారని, ఆ బాధతోనే తన గదిలోకి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తెల్లవారేసరికి ఆయన విగతజీవి అయ్యా రు. ముప్పైయ్యేళ్లుగా జర్నలిజంలో ఉన్న మా అందరికీ అది వెంటాడే విషాద జ్ఞాపకం.

ఇదంతా ఎందుకంటే చంద్రబాబు మొన్న హైదరాబాద్‌కు వచ్చి చాలాచాలా మాట్లాడిపోయారు. నిజానికి ఆయన పిచ్చి ఆయనది అని వదిలేయవ చ్చు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ జెండాలు పట్టుకొని కొంతమంది తెలంగాణలో తిరుగుతుంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెబుతూ ఉంటే డోకు వస్తున్నది. రాజకీయాల్లో ఇంత అంధత్వం ఉంటుం దా అనిపిస్తున్నది. తెలంగాణకు జరిగిన అన్యాయా ల్లో పెద్ద వాటా చంద్రబాబుదే. హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ కంపెనీలను అడ్డికిపావుసేరు చొప్పున అమ్మేసి వేలాదిమంది ఉద్యోగులను వీధులపాలు చేసినవాడు, హైదారాబాద్ చుట్టూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసినవాడు, హైదరాబాద్‌ను ఆంధ్ర కాలనీగా మార్చినవాడు, తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులను అడ్డంగా మళ్లించినవాడు చంద్రబాబే. అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించవద్దని చెప్పిన నాయకు డూ చంద్రబాబే. తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించడానికి ఆయన, ఆయన తాబేదారు మీడి యా చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని ఎన్నివిధాలుగా బద్నాం చేయాలో అన్నివిధాలుగా బద్నాం చేసేందుకు దిగజారారు.

ఇదే మోత్కుపల్లి నర్సింహులును, మరికొంత మం ది అమాయక తెలంగాణ నాయకులను ఎగదోసి రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోయించారు. తెలంగాణ ఉద్యమం పతాక సన్నివేశానికి చేరిన తర్వాత కూడా తెలంగాణ టీడీపీ నాయకులనే కేసీఆర్‌కు ఎదురు నిలబెట్టి నోటికొచ్చిందల్లా వాగించారు. ఎన్నికల కోసం 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామ ని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ కేసీఆర్ మీద, టీఆర్‌ఎస్ మీద దాడి మొదలు. 2009 డిసెంబరు 9న కేసీఆర్ దీక్ష పర్యవసానంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇక అక్కడి నుంచి చూడాలి చంద్రబాబు కుట్రలు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచే ఆంధ్ర నాయకుల రాజీనామా డ్రామాలు. కృత్రిమ ఉద్యమాలు. కేంద్రంపై ఒత్తిడి. అయినా టీఆర్‌ఎస్, కేసీఆర్ పట్టినపట్టు విడువకుం డా ఒకే లక్ష్యంతో ముందుకుసాగుతూ వచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ గడపదాటకుండా చూస్తామని ప్రగల్భాలు పలికి నానా రభస చేసి, చివరికి బిల్లు పాస్ కాకుండా చూడాలని కుట్రచేసిన నాయకుడు చంద్రబాబు.

అప్పుడెప్పుడూ ఆంధ్రకు ప్రత్యేక హోదా గురిం చి కానీ, ఆంధ్ర అవసరాల గురించి కానీ చంద్రబా బు, ఆంధ్ర నాయకులు మాట్లాడలేదు. రాష్ట్రం ఏర్పాటుకాకుండా చూడటమే ఏకైక లక్ష్యంగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాగేసుకున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని పేరుతో సెక్షన్ 8 అమలుచేసి ఇబ్బందిపెట్టాలని చూశారు. అంతటి తెలంగాణ వ్యతిరేకి, కుట్రదారుతో ఇప్పటికీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, ఎల్.రమణ, అరవింద్‌కుమార్‌గౌడ్ వంటివారు అంటకాగుతున్నారూ అంటే తెలంగాణ ప్రజ లు ఏమనుకోవాలి. వీళ్లకు ఆత్మగౌరవం, ప్రాంతీయాభిమానం ఉన్నాయా? చంద్రబాబు ఇప్పుడు జై తెలంగాణ అన్నా తెలంగాణ నాదే అన్నా ఎవరు పట్టించుకుంటారు. తెలంగాణలో టీడీపీకి పనిలేదు. తెలంగాణకు టీడీపీ అవసరం లేదు. టీడీపీ తెలంగా ణ పార్టీ కాదు. అది ఆంధ్రా ఆధిపత్యానికి ప్రతీక. తెలంగాణ వ్యతిరేకతకు పతాక. అందువల్ల చంద్రబాబుతో కలిసి రాజకీయ వేదిక, సారూప్యత పంచుకునే వారెవరూ తెలంగాణకు మిత్రులు కాదు. ఎన్టీఆ ర్ ట్రస్టు భవన్‌ను ఇప్పటికే సగానికిపైగా అద్దెకు ఇచ్చారు. చంద్రబాబుకు అర్థం అవుతున్నది. తనకు ఇక్కడ పనిలేదని.
katta-shekar-reddy
అర్థం కానిదల్లా తెలంగాణ తమ్ముళ్లకే. ఇక చంద్రబాబు హైదరాబాద్‌ను అరువై ఏండ్లు గా అంగుళం అంగుళం కష్టపడి నిర్మించాడట. మన గురించి ఎవరూ చెప్పేవారు లేకపోతే ఇదే బాధ. సొంత డబ్బా కొట్టుకోవడానికి కూడా కొంచెం జ్ఞానం ఉండాలి. సోయి ఉండాలి. ఈయన ఒక్క సైబర్ టవర్స్ నిర్మించి మొత్తం హైదరాబాద్ నేనే నిర్మించా అంటే అనేక భవంతులు, అద్భుతమైన ప్రాసాదాలు నిర్మించిన ఆఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమనుకోవాలి? చంద్రబాబుకు మతిపోతున్న ది. సమయం, సందర్భం, ఉచితానుచితం ఏదీ పట్ట డం లేదు. ఏది పడితే అది మాట్లాడే స్థితికి జారిపోతున్నాడు. పాపం నిన్నగాక మొన్న అష్టకష్టాలు పడి చదువుకొని సివిల్స్ టాపర్‌గా వచ్చిన అనుదీప్ ఘనతనూ చంద్రబాబు తన ఖాతాలోనే రాసుకోవాలనుకున్నాడంటే ఆయన పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థ మవుతున్నది. ఆయనను ఎన్టీఆర్ ఆత్మ వేధిస్తున్నది. అందుకే ఆ పార్టీ తెలంగాణలో అంతరించింది. ఆం ధ్రలో కూడా విశ్వసనీయతను కోల్పోయి, చుక్కాని లేని నావలా పయనిస్తున్నది. మాటలకు, విధానాల కు, చేతలకు పొంతన లేకుండా ఆ రాష్ర్టానికి భారం గా పరిణమిస్తున్నది. తెలంగాణ సంగతి దేవుడెరుగు. ఆయన ఆంధ్రలోనే మళ్లీ గెలువడం అసాధ్యమని అప్పుడే విశ్లేషణలు జరుగుతున్నాయి.
[email protected]

1295

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన