దేశానికి ఒక కొత్త ఎజెండా


Sun,April 29, 2018 06:19 AM

ఏకపక్ష రాజకీయాధికారం చెలాయించే ఏ పార్టీనుంచి అటువంటి కేంద్రాన్ని ఊహించలేము. కేంద్రీకృత లక్ష్యాలు లేని ఒక సమాఖ్య కూటమి(ఫెడరల్ ఫ్రంట్) మాత్రమే ప్రజాస్వామ్యబద్ధమైన కేం ద్ర పాలనను అందించగలదు. సమాఖ్య కూటమి అన్నది అటువంటి స్ఫూర్తితోనే ముందుకువచ్చింది. అప్పుడు ఎన్టీఆర్‌కు సాధ్యమైంది ఇప్పుడు కేసీఆర్‌కూ సాధ్యమవుతుంది. కేసీఆర్ ప్రారంభించిన ప్రయత్నాలు ఆ దిశగా ఒక ముందడుగు. జై తెలంగాణ, జై భారత్ అన్న నినాదం ఆయన ఆలోచనకు సంకేతం.

దేశానికి కొత్త ఎజెండా కావాలి. కొత్త నాయకత్వం కావాలి. ప్రజాపక్షపాతంతో ఆలోచించే నాయకత్వం కావాలి. విశాల జన బాహుళ్యానికి మేలుచేయగల సంకల్పం కావాలి. సమాఖ్య స్వభావం కలిగిన కేంద్రం కావాలి. అన్ని ప్రాంతాల ఆకాంక్షల ను నెరవేర్చగలిగే విధాన పత్రం కావాలి. ఇవన్నీ కావాలంటే మూస ఆలోచనలు చేసే నాయకు లు, పార్టీలు పనికిరావు. ధైర్యంగా, వైవిధ్యంగా ఆలోచించగల నాయక త్వం పార్టీలు కావాలి. చారిత్రకానుభవాల దృష్ట్యా దేశంలో ఇది సాధ్య మే. ఎన్టీఆర్ ఒకప్పుడు పోషించిన పాత్రను ఇప్పుడు కేసీఆర్ అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ చేవచచ్చి, దివాలాతీసిన పరిస్థితుల్లో జాతీయ ఫ్రంటు (నేషనల్ ఫ్రంటు) ముందుకువచ్చిం ది. దేశంలోని ప్రాంతీయ శక్తులన్నీ ఏకమయ్యాయి. ఢిల్లీలో తరతరాలుగా పాతుకుపోయిన ఏక పార్టీ పాలనను, ఏక పార్టీ ఆధిపత్యాన్ని బద్ద లుకొట్టిన మలిసందర్భం అది. ఎన్టీఆర్ ఆ రోజు కూడా కేంద్రం అనుసరిస్తున్న పెడధోరణులకు వ్యతిరేకంగానే ప్రాంతీయపార్టీలను సమీకరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీల సదస్సులు నిర్వహించి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని రూపొందించడంలో సఫలీకృతులయ్యారు. దాని పర్యవసానంగానే కాంగ్రెస్ మరింత బలహీనపడింది.

కేంద్రమంత్రి విశ్వనాథ ప్రతాప్‌సింగ్ వంటి హేమాహేమీలు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి జనతాదళ్ పార్టీని ఏర్పా టుచేసి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపారు. తుదకు 1989 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడిపోయింది. విశ్వనాథ ప్రతాప్‌సింగ్ నాయకత్వంలోని జాతీయ సంఘటన విజయం సాధించి దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఏకపక్ష రాజకీయాలు అంతమయింది అప్పటి నుంచే. విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం జరిగింది అప్పుడే. వెనుకబడినవర్గాలు రాజకీయ ఆధిపత్యంలోకి వచ్చింది అప్పటినుంచే. ములాయంసింగ్, లాలూప్రసాద్ యాదవ్, కాన్షీరామ్ దేశ రాజకీయాల్లో బలమైన శక్తులుగా ఆవిర్భవించింది అప్పటి నుంచే.కాంగ్రెస్ ఆధిపత్యం అంతరించడం వల్ల సమాజంలోని అట్టడుగువర్గాలకు రాజకీయాధికారం దక్కింది. అయితే సంఘటనలోని రాజకీయపక్షాల మధ్య విధానపరమైన ఐక్యత, పరస్పర విశ్వాసం కొరవడిన కారణంగా ఆ ప్రభుత్వం ఎక్కువకాలం మనలేకపోయింది. 1989లో జాతీయ సంఘటన ప్రభుత్వానికి భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. బీజేపీ తన మతవాద ఎజెండాతో అద్వానీ నాయకత్వంలో మత యాత్ర మొదలుపెట్టింది.

ఆ అంశంపై సంఘటనలోని పక్షాలకూ, బీజేపీకి మధ్య సంఘర్షణ మొదలయింది. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంఘటన ప్రభుత్వం నిలదొక్కుకోలేకోయింది. ఏడాది పూర్తికాకుండానే వీపీ సింగ్ దిగిపోయారు. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ అధికారంలోకి వచ్చారు. కానీ మూన్నాళ్లకే ఆయన కాళ్లకింద కాంగ్రెస్ గోతులు తవ్వింది. తిరిగి 1996 ఎన్నికల్లో కూడా మళ్లీ మరో ప్రయత్నం జరిగింది. ఈసారి ఐక్య సంఘటన(యునైటెడ్ ఫ్రంట్) ఏర్పడింది. బీజేపీ 161 స్థానాలు సాధించి ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ అంటరాని పార్టీగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఏ రాజకీయపక్షమూ ముందుకురాలేదు. అయినా అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేశారు.13 రోజులపాటు నడిచి న ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయి పడిపోయింది.

ఆ తర్వాత కాంగ్రెస్ బయటి మద్దతుతో దేవెగౌడ ప్రధానిగా ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం కూడా ఎక్కువకాలం సాగలేదు. మళ్లీ లుకలుకలు. కొద్ది మాసాల వ్యవధిలోనే ప్రధాని మారారు. దేవెగౌడ స్థానంలో ఇందర్‌కుమార్ గుజ్రాల్ ప్రధాని అయ్యా రు. చివరకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఐక్య సంఘటన ప్రభుత్వం పడిపోయింది. 1998లో మరోసారి మధ్యంతర ఎన్నికలు నిర్వహించవలసి వచ్చింది. వాజపేయి ప్రధానిగా ఎన్‌డీ ఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 13 మాసాలకు అవిశ్వాస పరీక్షలో మళ్లీ ఎన్‌డీఏ ఓడిపోయి దిగిపోయింది. 1999లో ఎన్‌డీఏ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

అయినా కొత్తదనం లేదు. విధానాల్లో మార్పులేదు. కాంగ్రెస్ విధానాలకు కొనసాగింపుగానే ఉండసాగింది. 1998 తర్వాత ప్రాంతీ య పార్టీలు కొంత బలహీనపడ్డాయి. సంకీర్ణ రాజకీయాల వైఫల్యం ప్రాంతీయ పార్టీలను కొంత బలహీన పరిచింది. ప్రాంతీయ రాజకీయపక్షాలు కూడా పక్కా అవకాశవాదవైఖరితో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఎటంటే అటు మారడం మొదలుపెట్టా యి. అంటరాని పార్టీగా బీజేపీకి ఉన్న ముద్ర అంతరించిపోయింది. అయినా బీజేపీ ప్రజలలో దీర్ఘకాలి క ఆమోదాన్ని సంపాదించుకోవడంలో విఫలమైం ది. మళ్ళీ కాంగ్రెస్ వంతు వచ్చింది.

కాంగ్రెస్ పదేండ్ల పాలనలో కూడా రాష్ర్టాలపట్ల వివక్షాపూరిత రాజకీయాలే జరిగాయి. ప్రపంచ బ్యాంకు ఎజెండా, ఆర్థిక సంస్కరణల బాట తప్ప ప్రజలు కేంద్రంగా విధానాలను రచించే ప్రయత్నం జరుగలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం వంటి ఒకటి రెండు పథకాలు ప్రవేశపెట్టినా అవి కంటితుడుపు చర్యలు మాత్రమే. గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చే విప్లవాత్మక విధానాలేవీ ఆ పదేండ్లలో రాలేదు. పల్లెలను, వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేశారు. పర్యవసానంగా రాష్ర్టాల్లో వ్యవసాయ సంక్షో భం పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్‌తో రోసిపోయి 2014లో ఎన్డీయేఏకు ఓటేశారు. కోటి ఆశలను మోసుకువచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ కు కొనసాగింపుగా, మరింత కటువైన ఆర్థిక విధానాల బాటలో పయనించిందే తప్ప పేదవాడిని ఆదుకునే ఆలోచనేదీ చేయలేదు. కాంగ్రెస్, జీఎస్టీపై చర్చ ను మొదలుపెట్టి పోయింది. బీజేపీ దానిని చట్టంచే సింది.

కాంగ్రెస్, కార్పొరేట్ల ఆర్థిక క్రమ శిక్షణారాహిత్యాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది. ఇష్టమైనవారికి ఇష్టమైన రుణాలు, రీ షెడ్యూళ్లు, మాఫీలు చేస్తూ పోయింది. ఈ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని అరికడుతానని, దేశంలో నల్లధనాన్ని రూపుమాపుతానని, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చేస్తానని.. ఇం కా ఏవేవో ప్రతిజ్ఞలు చేసి పెద్దనోట్లను రద్దుచేసిన నరేంద్ర మోదీ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల మోసాలు పెరిగిపోయాయి. బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలు మూడు రెట్లు పెరిగాయి. బ్యాంకులను ముంచిన వాళ్లు యథేచ్ఛగా దేశాలు విడిచిపోతున్నారు. సరిహద్దు ఉగ్రవాదం అనేక రెట్లు పెరిగింది. తీవ్రవాద చర్యలూ తగ్గలేదు. రాజకీయ అవినీతి ఎలా పెరిగిపోయిందో ఈశాన్య రాష్ర్టా ల్లో, గోవాలో, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో జరిగిన జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. నరేంద్ర మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించినా కొత్తగా దేశానికి కలిసివచ్చిన మిత్రులు, వారివల్ల ఒనగూరే ప్రయోజనం ఏదీ ఇంతవరకు కనిపించలేదు.

నరేం ద్ర మోదీ అత్యంత బలమైన ప్రధానిగా ఉండి దేశం ఇన్ని వైఫల్యాలు చూస్తున్నది. జీఎస్టీ తర్వాత ఆర్థికంగా రాష్ర్టాల పీక నొక్కే కార్యక్రమం జరుగుతున్న ది. కేంద్ర, రాష్ర్టాలకు ఆదాయం పెరుగుతున్న మాట వాస్తవమే కానీ సామాన్యుడి జేబుకు పడుతున్న చిల్లు గురించి ఎవరు చెప్పాలి? డీజిల్, పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానం చేశామని, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నీళ్లు నములుతున్నది. అంతర్జాతీయ మార్కెట్టులో బ్యారె ల్ ధరలు తగ్గుతుంటే ఇక్కడ ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. కేంద్రం ఇంతగా నిధులు సమీకరించి ఏదైనా గొప్ప పనిచేస్తున్నదా అంటే అదీ లేదు. ప్రచా ర పటాటోపాలు తప్ప, ప్రజలకు ప్రయోజనం కలిగించే పని ఒక్కటీ జరుగలేదు. కేంద్రం ప్రాధాన్యా లన్నీ అనుత్పాదకమైనవే. దేశం మొత్తం రెవెన్యూ లో ఉత్పాదకరంగంపై పెడుతున్న ఖర్చు ఇరువైశా తం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు రాష్ర్టాలను ఉక్కిరిబిక్కిరి చేసే కేంద్రీకృ త విధానాలను కేంద్రం అమలుచేస్తున్నది. రాష్ట్రాల కు ఇచ్చిన హామీలు అమలుకావు. కేంద్రానికి ఇష్టమైతే జీఎస్టీ చట్టం చేస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేస్తుంది. ఎవరితోనూ చర్చించదు. కానీ రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో మాత్రం ఏవేవో నిబంధనలు చెబుతూ ఉంటుంది. రాష్ర్టాలు చేసి పంపిన ఏ బిల్లూ కేంద్రం ఆమోదం పొందదు. కేంద్రం ఇష్టారాజ్యం. రాష్ర్టాలు, ప్రజల ఆకాంక్షల గురించిన నినాదాలేవీ కేంద్రం చెవికెక్కవు. కేంద్రం నిధులేవో తమ సొంత డబ్బులాగా ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. రాష్ర్టాలకు ఇవ్వాల్సి వచ్చేసరికి తన ఇష్టాయిష్టాల ప్రాతిపదికగా నిర్ణయాలు చేస్తున్న ది. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాలకు ఒకరకం గా, ఇతరపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు మరోరకంగా నిధుల వితరణ జరుగుతున్నది. బలమైన కేంద్రం అంటే రాష్ర్టాల పీకనొక్కే కేంద్రం కాదు. రాష్ర్టా లు బలంగా లేకపోతే కేంద్రం బలంగా ఉండే ప్రసక్తిలేదు. రాష్ర్టాలు ఆర్థికంగా సుసంపన్నం గా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. బలమైన కేంద్రం అంటే రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉం డటం అన్న అర్థంలో తీసుకోరాదు. అన్ని రాష్ర్టాలను సమ్యక్‌దృష్టితో చూసే కేంద్రం. ఆర్థిక, సామాజిక రంగాలలో గుణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేవిధంగా రాష్ర్టాలకు నిర్ణయాధికారాలను దాఖ లు పరిచే కేంద్రం. వచ్చే ఎన్నికల గురించి కాకుం డా, వచ్చే తరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచన లు చేసే కేంద్రం.
katta-shekarreddy
సంపదను సృష్టించడమే కాదు, సంపద అట్టడుగు వర్గాలకు కూడా అందజేసే కార్యాచరణ కలిగిన కేంద్రం. విద్య, ఆరోగ్యం, వ్యవసా యం, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, సంక్షే మం రంగాలపై బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించే ఒక అభివృద్ధి ప్రణాళిక కలిగిన కేంద్రం కావాలి. ఏకపక్ష రాజకీయాధికారం చెలాయించే ఏ పార్టీనుంచి అటువంటి కేంద్రాన్ని ఊహించలేము. కేంద్రీకృత లక్ష్యాలు లేని ఒక సమాఖ్య కూటమి(ఫెడరల్ ఫ్రంట్) మాత్రమే ప్రజాస్వామ్యబద్ధమైన కేం ద్ర పాలనను అందించగలదు. సమాఖ్య కూటమి అన్నది అటువంటి స్ఫూర్తితోనే ముందుకువచ్చింది. అప్పుడు ఎన్టీఆర్‌కు సాధ్యమైంది ఇప్పుడు కేసీఆర్‌కూ సాధ్యమవుతుంది. కేసీఆర్ ప్రారంభించిన ప్రయత్నాలు ఆ దిశగా ఒక ముందడుగు. జై తెలంగాణ, జై భారత్ అన్న నినాదం ఆయన ఆలోచనకు సంకేతం.
[email protected]

2695

KATTA SHEKAR REDDY

Published: Sun,November 3, 2019 07:11 AM

మర మనుషులు

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గు

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్        


Featured Articles