దోషుల శాపనార్థాలు


Sun,April 15, 2018 10:47 AM

ఇప్పటికీ కాంగ్రెస్, ఇతర పక్షాలకు రాజకీయ ఎజెండా తప్ప తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను చూపాలన్న సోయిలేదు. అసలు అటువంటి రాజకీయ జ్ఞానం ఉన్న నాయకుడే ఆ పార్టీలో కనిపించడం లేదు. కుదురులేని నాయకులు. ప్రతి ఒక్కరూ మరొకరికి పోటీయే. రాజకీయంగా ముతకవాదనలు. ముతక ఉపన్యాసాలు. నలుగురైదుగురు తప్ప ఎక్కువమంది మీడియోకర్స్. బై చాన్స్ రాజకీయాల్లోకి వచ్చినవారు. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వారి జ్ఞానం ఇసుమంతయినా పెరిగింది లేదు.

వర్ధమాన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లు చూస్తుంటే విస్మయం కలుగుతున్నది. బస్సు యాత్రలని, పాదయాత్రలని వారు చేస్తున్న రాజకీయ ఉత్సవాలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటున్న దో వాటిల్లో పాల్గొంటున్నవారి సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు కాంగ్రెస్ నాయకులను నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. రాష్ర్టాన్ని ఉద్ధరించడానికి బయ లుదేరిన ఒక నాయకుడు కారునిండా నోట్ల కట్టలతో నగ్నంగా దొరికిపోయినవాడు. రోజు కో కుంభకోణం గురించి మీడియాకు ఎక్కే నాయకుడు స్వయంగా కుంభకోణంలో చిక్కుకుని లైవ్‌లో దొరికిపోయినవాడు. నల్లగొండలో లేస్తే మనుషులము కాదు అని బెదిరిస్తూ, పార్టీ బయటా లోపలా ఎప్పుడూ ఎవరో ఒకరికి బత్తులు పెట్టే నాయకులు ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్ని మాటలు మార్చారో, వారి మానసిక స్థితి ఎంత స్థిమితంగా ఉందో అనేకసార్లు రుజువు చేసుకున్నారు. అటువంటి నాయకులు ఇవ్వాళ వీధుల్లో పడి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు.

అభివృద్ధిపథంలో నడిపిస్తున్న నాయకత్వంపై బురదజల్లి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తప్పులు చేసినవారే తీర్పులు చెబితే న్యాయం గుడ్డికన్నుతో చూస్తూ ఉంటుందా? దొంగల శాపాలకు తాళాలు పగులుతాయా? తరతరాల పాపాలను మూటగట్టుకున్నవాళ్లు, తమ స్వార్థం తప్ప జనస్వార్థం లేనివాళ్లు, కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాలలో మునిగితేలినవాళ్లు, ఆరు దశాబ్దాలుగా పల్లెలను, పేదలను, రైతులను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచినవాళ్లు, పాతచింతకాయ పచ్చడి తప్ప, సరికొత్త ఆలోచనలు చేయలేనివాళ్లు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడితే అవి ఎలా ఫలిస్తాయి? కాంగ్రెస్ నాయకులు ఎన్ని భారీ వాగ్దానాలు చేస్తున్నా ప్రజలనుంచి స్పందన లేకపోవడానికి వారి ఘన చరిత్రే కారణం.

వారెప్పుడూ ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించిన సందర్భం లేదు. వారెన్ని హామీలు ఇచ్చినా వారి చేతుల్లో ఏమీ ఉండద ని, తిరిగి ఢిల్లీలో అంతిమ నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని, అక్కడ లెక్కలు పత్రాలు అందుకు అంగీకరించవని, ఒక్క రాష్ట్రంలో చేస్తే దేశమంతా చేయాల్సి వస్తుందని... ఇలా ఎన్ని అడ్డాలు పెట్టాలో అన్ని అడ్డాలు పెడుతారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి కాంగ్రెస్ విధానమైతే ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్న హామీలను పక్కనే ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదు? ఆంధ్ర, తెలంగాణలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అధికారంలోకి వస్తే ఇస్తామని రాహుల్‌గాంధీ ఎందుకు విధాన ప్రకటన చేయ డం లేదు? కాంగ్రెస్ నాయకత్వానిదంతా డొల్ల విధానం. రాష్ర్టానికో నాటకం. ప్రాంతానికో వేషం. సమయానుకూల, అవకాశవాద నినాదాలు తప్ప నిజాయితీ లేని రాజకీ యం.

స్వరాష్ట్రం వస్తే తెలంగాణ ఘోరంగా విఫలమవుతుందని వాదించిన వర్గాలు ఇవ్వాళ విస్తుపోతున్నాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ సాధిస్తున్న పురోగతిని చూసి కేంద్రం నుంచి వచ్చిపోతున్న ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల మంత్రులు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తెలంగాణ అనుసరిస్తున్న పురోగామి అభివృద్ధి విధానాలు అన్ని సూచీల్లో తెలంగాణను ముందు వరుసలో నిలబెడుతున్నాయి. రాజకీయాల కోసం ఇక్కడి పార్టీలు ఏమైనా మాట్లాడవ చ్చుగాక, ఇంత అభివృద్ధి ఈ ఆరు దశాబ్దాల్లో ఎప్పు డూ చూడలేదని పల్లెల్లో పెద్దమనుషులు మాట్లాడుకుంటున్నారు. ఆరు దశాబ్దాల్లో అసలు పనులు జరుగలేదని కాదు. నాడు మండల కేంద్రాల వరకే రోడ్లు వచ్చాయి. ఇప్పుడు పల్లెపల్లెకు రోడ్లు, కరెంటు, నీళ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ సాధించిన ప్రగతి వయసు అరువై ఏండ్లు, తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన ప్రగతి వయసు నాలుగేండ్లు. పోల్చి చూడవలసింది అదే. అందుకు కారణం కేసీఆర్, ఈటల రాజేందర్, హరీశ్, కేటీఆర్, జగదీశ్, జూపల్లి, తుమ్మల, పోచారంలతోపాటు తెలంగాణ ప్రభుత్వంలో అత్యధిక మంది నాయకులు నూతన అభివృద్ధి దృక్పథం కలిగినవాళ్లు. తెలంగాణను గొప్పగా నిలబెట్టడంతోపా ట, తమను తాము రుజువుచేసుకోవాలన్న ఆరా టం కలిగినవాళ్లు.

ఈ నాలుగేండ్లు వారు ఆ ఆరాటంతోనే పనిచేస్తున్నారు. తెలంగాణ శాసనసభలో సగం మంది మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చినవాళ్లు. అందుకే అందరూ నిరంతరం ఇవ్వాళ ప్రజల మధ్య ఉండి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రాంత చరిత్రలో ముఖ్యమంత్రి, మం త్రులు, ఎమ్మెల్యేలు ఇన్నిరోజులు, ఇన్నిసార్లు పల్లెల ను సందర్శించిన సందర్భం ఎప్పుడూ లేదు. తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌లో ఉన్నది తక్కువ, నియోజకవర్గా ల్లో లేదా జిల్లాల పర్యటనల్లో ఉన్నది ఎక్కువ. ప్రభుత్వం ప్రజల ముందు ఇంతగా ఎప్పు డు కనిపిస్తూ పనిచేసిన దాఖలా లేదు. 2009-14 లో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, 2014- 18 లో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్లారన్న లెక్కలు తీస్తే చాలు కాంగ్రెస్ ఎంతగా పాతబడిపోయిందో, ఎంతగా కాలంచెల్లిపోయిందో అర్థమవుతుంది. వారు ఇప్పటికీ తమ విధానాలు మార్చుకోలేదు. అవతలివారి పై బురదచల్లి తాము పైకి వద్దామన్న యావ తప్ప ఆధునిక రాజకీయాలను అలవర్చుకోలేదు. ప్రజాక్షేత్రంలో పనిచేసి పైకి వద్దామని భావించడం లేదు.

అంతేకాదు గత ఆరు దశాబ్దాల్లో పల్లెలకు ఎన్ని నిధులు వచ్చాయి? ఈ నాలుగేండ్లలో ఎన్ని నిధులు వచ్చాయి? అప్పుడెన్ని పనులు జరిగాయి? ఇప్పుడెన్ని పనులు జరిగాయి? ప్రతి ఊరును ఒక నమూనాగా కేస్ స్టడీ చేయవచ్చు. అలాగే జిల్లాలు, నియోజకవర్గాలకు వచ్చిన నిధుల లెక్కలు తీయవచ్చు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను ఎంతగా దగా చేశా యో, ఇప్పుడు స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేస్తున్నదేమి టో అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే- కాంగ్రెస్ పదేండ్లలో తెలంగాణలో ఖర్చు పెట్టినదెంత? ఈ నాలుగేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టినదెంత? సాధించి న ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది? ఎంత సాగు భూమిని స్థిరీకరించా రు? ఎన్ని చెరువులు, కుంటలు ఇవ్వాళ కూడా జల కళతో కళకళలాడుతున్నాయి? రాజకీయపార్టీల మధ్య, నాయకుల మధ్య ఆలోచనల్లో, విధానాల్లో మౌలికమైన తేడాను గుర్తించకపోతే రాజకీయాలు భవిష్యత్తులో కూడా మళ్లీ పాతబాట పట్టే అవకాశం ఉంటుంది. నాయకుల్లో స్వప్రయోజనాలు ముందు పెట్టుకుని పనిచేసేవారుంటారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకుని పనిచేసే నాయకులు ఉంటారు. టీఆర్‌ఎస్ నాయకత్వం కచ్చితంగా రెండవకోవకు చెందినవా రు.

కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలనే ముందు పెట్టుకుని పనిచేశారు. వారు ప్రజాప్రయోజనమే ముందు పెట్టుకుని పనిచేసి ఉంటే తెలంగాణ 2006లో లేదంటే 2010లోనే వచ్చి ఉం డేది. 2006లోనే తెలంగాణ ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ నిర్ణయించుకున్నరోజు ఆమెకు తెలంగాణ నుంచి ఒక్క నాయకుడూ ధైర్యంగా మద్ద తు ఇవ్వలేదు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం పట్టిస్తుంటే ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకుడూ నోరు మెదపలేదు. పైగా అదేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా సమర్థిస్తూ వచ్చారు. 2009 డిసెంబ రు తొమ్మిదిన స్వరాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత ఆంధ్ర నాయకత్వం అంతా రాజీనామా డ్రామాలకు దిగి తెలంగాణను అడ్డుకోవాలని చూసినరోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పదవు లు పట్టుకుని వేలాడారు. పర్యవసానంగా ఉద్యమం మరో మూడేండ్లు కొనసాగాల్సి వచ్చింది. వందలాది మంది విద్యార్థి యువకులు ఆత్మాహుతులకు పాల్పడ్డారు. ఆ పాపమే కాంగ్రెస్‌ను వెంటాడింది. నిక్కచ్చిగా నిలబడి కొట్లాడినందువల్లనే టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టారు.

ఇప్పటికీ కాంగ్రెస్, ఇతర పక్షాలకు రాజకీయ ఎజెండా తప్ప తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను చూపాలన్న సోయిలేదు. అస లు అటువంటి రాజకీయ జ్ఞానం ఉన్న నాయకుడే ఆ పార్టీలో కనిపించడం లేదు. కుదురులేని నాయకులు. ప్రతి ఒక్కరూ మరొకరికి పోటీయే. రాజకీయంగా ముతకవాదనలు. ముతక ఉపన్యాసాలు. నలుగురైదుగురు తప్ప ఎక్కువమంది మీడియోకర్స్. బై చాన్స్ రాజకీయాల్లోకి వచ్చినవారు. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వారి జ్ఞానం ఇసుమంతయినా పెరిగింది లేదు. కరెం టు లెక్కలు తెలియవు. నీటి లెక్కలు తెలియవు. రైతులెంతమంది, వారి సమస్య ఎంత పెద్దది అన్న అవగాహనే లేదు. సమస్యల మూలాల్లోకి వెళ్లిచూసే చైతన్యమూ లేదు. అందుకే వారు తొక్కినబాటా మారలేదు. చెప్పే మాటలూ మారలేదు. జాతీయ స్థాయిలో కూడా ఇందుకు భిన్నంగా లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలన్నీ మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల కొనసాగింపే. పెద్దనోట్ల రద్దు ఒక్కటే మోదీ ప్రత్యేకం. మిగిలిన విధానాలన్నీ సేమ్ టు సేమ్. జీఎస్టీ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పగలదా? చెప్ప దు. జీఎస్టీపై చొరవను మొదలు పెట్టిం దే కాంగ్రెస్. మోదీ దానిని పూర్తిచేశాడు. ఇవ్వాళ ఎడాపెడా జనా న్ని దోచుకోవడమే ఆర్థిక విధానంగా మారింది. ఒకవైపు సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు బడా వ్యాపారులు బ్యాంకులను లూటీచే సి ఎంచక్కా విమానాలెక్కుతున్నారు. కాంగ్రెస్ వచ్చి నా పరిస్థితి ఇందుకు భిన్నంగా మారే పరిస్థితి లేదు. అందుకే ప్రజాకేంద్రక విధానాలతో ఒక ప్రత్యామ్నా యం ఎదుగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాదిస్తున్నారు. అందుకు మద్దతు కూడగడుతున్నారు. కేంద్రం విధానాలను ప్రభావితం చేయగలశక్తిగా ఈ ప్రత్యామ్నాయం ఎదుగాలి. అప్పుడే దేశంలో కూడా కొత్త రాజకీయాలు సాధ్యం.
shekar-reddy
[email protected]

1645

KATTA SHEKAR REDDY

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం