కేంద్రానికి ఒక కేసీఆర్ కావాలి


Mon,April 9, 2018 10:48 AM

తెలంగాణ నమూనానే కేంద్రంలో అమలు చేయాలి. అలా జరుగాలంటే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ రాజకీయ వేదికపై ప్రధాన భూమిక పోషించాలి. భారతదేశం పేదది కాదు. వనరులు, నిధులు లేక కాదు. పొంగిపారెడు నదులు, తరగని జలసిరులు దేశమంతటా ఉన్నాయి. కానీ వాటిని అట్టడుగు ప్రజానీకానికి అందించే సంకల్పం ఉన్న నాయకుడే కరువయ్యాడు.

జాతీయ రాజకీయాల్లో విధానపరమైన దివాళాకోరుతనం మరోసారి స్పష్టంగా బట్టబయలయింది. నాడు యూపీఏ, నేడు ఎన్‌డీఏ రెండూ ఒకే మూస ఆర్థిక విధానాలను అమ లు చేస్తూ వస్తున్నాయి. తేడా చాలా స్వల్పం. జీఎస్‌టీ యూపీఏనే ముందుకు తెచ్చింది. దానిని ఎన్‌డీఏ అమలు చేసింది. పెట్రో ధరల ను కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం కూడా యూపీఏ హయాంలో మొదలై ఎన్‌డీ ఏ పాలనలో పతాకానికి చేరుకుంది. బ్యాంకు ల దివాళా, మొండి బకాయీలు పేరుకుపోవ డం, కంపెనీలకు సేవ చేయడం అప్పుడూ ఇప్పుడూ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నది. ఎన్‌డీఏ పాలనలో బ్యాంకుల్లో అవినీతి మరీ పెరిగి పెరిగి పెద్దదై పుట్టపగులుతున్నది. ఎన్‌డీఏ మార్కు ప్రత్యేక విధాన నిర్ణయాల్లో ప్రధానమైనది పెద్ద నోట్ల రద్దు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక క్రమశిక్షణ పునరుద్ధరణలో భాగమని, నల్లడబ్బును నిర్మూలిస్తుందని, తీవ్రవాద కార్యకలాపాలు, సరిహద్దు ఉగ్రవా దం కట్టుబాటు అవుతుందని నరేంద్రమోదీ చెప్పారు. ఇది అర్ధ క్రాంతి అని, ఆర్థిక రంగంలో విప్లవం తీసుకువస్తుందని ఆయనకు భజనచేసే మేధోలోకం కొన్నాళ్లపాటు ఊదరగొట్టింది. కానీ పరిస్థితులు ఏమీ మారలేదు. నల్లడబ్బు అంతం కాలేదు. రాజకీ య అవినీతి అంతం కాలేదు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆగలేదు. కాగా బీజేపీ కొత్తగా ప్రభుత్వాలనే కొనే సంప్రదాయం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ చేసిన రాజకీయ దివాళాకోరు చేష్టలకంటే మరో ఆడుగు ముందుకు వేసి అన్నిరకాల రాజకీయ అక్రమాలకు పాల్పడు తూ వచ్చింది. సరిహద్దు ఉగ్రవాదం తగ్గలేదు సరికదా మోదీ వచ్చిన తర్వాత కాల్పు లు, చావులు పెరిగాయి. శ్రీనగర్ నిరంతరం ఉద్రిక్తతలో అట్టుడుకుతూనే ఉంది. వామపక్ష తీవ్రవాదం కూడా అంతం కాలేదు. ఆర్థిక క్రమశిక్షణ గురించి ఇక చెప్పనవసరం లేదు. రోజుకొకటిగా బయటపడుతున్న బ్యాంకు కుంభకోణాలే ఆర్థిక క్రమశిక్షణ ఏస్థాయిలో పతనమయిందో తెలియజేస్తున్నాయి. విడ్డూరం ఏమంటే లలిత్‌మోదీ, నీరవ్ మోదీ, విజయ్‌మాల్యా ఎంచక్కా విదేశాలకు వెళ్లి జల్సాగా జీవిస్తున్నారు. నిన్నగాక మొన్న రాజీవ్ కొచ్చర్ కూడా విదేశాలకు పారిపోదామనే విమానాశ్రయానికి వచ్చి దొరికిపోయారు. ఈ నాలుగేళ్ల పాలనలో అర్థం అయింది ఏమంటే నరేంద్ర మోదీవి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. పైన పటారం లోన లొటారం. ఆర్థికవ్యవస్థ మేడిపండు. పైన ప్రచారం, లోన విచారం.

సమాజంలో మాత్రం అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. పెద్దవాళ్లు పెద్దగా అవుతున్నా రు. పేదలు జీవన పోరాటం చేయాల్సి వస్తున్నది. సంపద సృష్టి ఎంతగా జరుగుతున్నా, అది పునఃపంపిణీ జరుగడం లేదు. కేంద్రం చేతిలో ఆర్థిక అధికారాలు ఎక్కువగా కేంద్రీకృతం కావడం, అక్కడ ప్రజాకేంద్రక విధానాలు అమలు చేయకపోవడం, కంపెనీ అనుకూల విధానాలు అమలు చేయడం కొద్దిమంది చేతిలో సంపద పోగుపడడానికి కారణమవుతున్నది. నరేంద్రమోదీ హయాంలో కొత్తగా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య కూడా ఒక స్పర్ధ వాతావరణం తలెత్తింది. మోదీ ప్రభుత్వంలో దక్షిణ భారతానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, నిధులు, ప్రాజెక్టుల విషయంలో దక్షిణాది రాష్ర్టాలు నిర్లక్ష్యానికి గురికావడం ఇందుకు కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఎంతగా కేంద్రానికి మద్ద తు ఇచ్చినా నరేంద్రమోదీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శించలేదు. ఆంధ్ర ప్రత్యేక హోదా విషయంలో అందరి కంటే గట్టిగా మాట్లాడి న బీజేపీ నాయకులు ఆ తర్వాత నాలుక తిప్పేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటీ నెరవేర్చలేదు. విభజన పూర్తి చేయలేదు. హైకోర్టు విభజ న, ఎయిమ్స్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీలు ప్లాంటు, గూడ్సు వర్కుషాపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా ఇవేవీ నరేంద్ర మోదీ చెవికెక్కలేదు. రాష్ర్టాలతో మాట్లాడడానికే ఆయన ఇష్టపడలేదు. చాలాసార్లు ఢిల్లీ దొరతనాన్ని ప్రదర్శించారు. విభజన చట్టంలో అనేక లొసుగులున్నాయని, తలుపులు మూసి చట్టం చేశారని చెప్పిన మోదీ ఆ లొసుగులను సరిదిద్దడానికి ఎంతమాత్రం కృషి చేయలేదు. పైగా రెండు రాష్ర్టాలు ఘర్షణపడటం తనకు అవసరం అన్నట్టుగా పూర్తిగా వదిలేశారు. రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే తమాషా చూస్తూ కూర్చున్నారు.

బీజేపీకి ఒంటరిగా మెజారిటీ రావడం నరేంద్రమోదీ అతిఆత్మవిశ్వాసానికి, అహంకార ప్రదర్శనకు కార ణం. కేంద్రంలో ఏదో ఒక జాతీయ పక్షం ఏకపక్షం గా అధికారంలోకి వస్తే ఎప్పుడైనా ఇదే జరుగుతుందని నరేంద్ర మోదీ రుజువు చేశారు. వెనుకటి ఇందిరాగాంధీ కాలంలో కూడా ఇదే ధోరణి నడిచింది. రాష్ర్టాల నాయకులను చులకనగా చూడటం, అపాయింటుమెంట్లు ఇవ్వకపోవడం, రోజుల తరబడి వేచి చూసేట్టుచేయడం, అవమానించడం అప్పట్లో నిత్యకృత్యాలు. అప్పుడు ఇందిర, ఇప్పుడు మోదీ ఉదంతాలు నేర్పుతున్నది ఒక్కటే-కేంద్రంలో ఏకపక్ష రాజకీయాలు నడిచినప్పుడల్లా రాష్ర్టాలు బలహీనపడుతూ వచ్చాయి. నిధులకోసం, ప్రాజెక్టులకోసం కేంద్రాన్ని దేబిరించాల్సిన స్థితిలోకి నెట్టబడుతున్నా యి. కేంద్రం బలంగా ఉండటం అంటే ఒకే పక్షం పెత్తనం చేయడం కాదు. దేశాన్ని ఒకే రాజకీయ యూనిట్‌గా తనతో నడిపించగలిగిన ప్రభుత్వం ఉండడం. మోదీకిగానీ, కాంగ్రెస్‌కు గానీ ఆ శక్తి లేద ని రుజువవుతున్నది. వారి విధానాలు కూడా ప్రజల పక్షాన కాకుండా కార్పొరేట్ వర్గాల పక్షాన ఉన్నాయ ని వేరే చెప్పనవసరం లేదు. విధానాల పరమైన దివాళాకోరుతనం ఆ పార్టీలను వేధిస్తున్నది. ప్రజాపక్షపాతం అన్నది ఆ పార్టీలకు లేదు. ప్రజలు ఏమై నా ఫర్వాలేదు డబ్బంతా బ్యాంకులకు చేరాలి. వీలైనంత జీఎస్టీ రావాలి. తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నం.

తెలంగాణ ప్రభుత్వం సంపదను ప్రజలకు పంపిణీ చేయడంలో కొత్త చరిత్రను సృష్టించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను సోషలిస్టునని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఏ సోషలిస్టూ చేయనన్ని పథకాలు ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం. మా ఊరికి ఈ నాలుగేళ్లలో 35 కోట్ల నిధులు వచ్చాయి. రుణాల మాఫీ, అన్ని రకాల పింఛన్లు, కల్యాణ లక్ష్మి, సీసీ రోడ్లు, చెరువు పూడికతీత, ట్రాక్టర్ల మంజూరు, లిఫ్టు ద్వారా నీళ్ల మళ్లింపు, గొర్రెల పంపిణీ, విదేశాల కు వెళ్లే విద్యార్థులకు రుణాలు, దళితులకు భూమి... ఇంకా అనేక పథకాల కింద మా ఊరి ప్రజలకు అందిన మొత్తం అది. మునుపెన్నడూ మా గ్రామం ఇన్ని పనులు, ఇన్ని నిధులు చూడలేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుందో మాకు అర్థం అవుతున్నది అని సూర్యాపేట జిల్లా సర్పంచి ఒకరు ఇటీవల సంబు రంగా చెప్పారు. ఇన్ని నిధులు గతంలో ఏమయ్యాయబ్బా. ఏనాడూ మా ఊరు ఒక రోడ్డును చూడలేదు. అసలు పట్టించుకున్న నాథుడే లేడు. ఈ నాలుగేళ్లలో మా గ్రామంలో 11 వీధుల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. కొత్త పాఠశాల భవనం, అంగన్‌వాడీ భవనం కట్టుకున్నాం. ఇంకా నాలుగు ట్రాక్టర్లు వచ్చాయి. పట్నంలో ఉండే మా ఊరి పిల్లలకు రెండు కార్లు సబ్సిడీ కింద ఇచ్చారు. కరెంటు సమస్యలేదు. విత్తనాలు, ఎరువుల సమస్య లేదు. పంట ను అమ్ముకోవడంలో కూడా గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిసందర్భం లో జోక్యం చేసుకుని మాకు అండగా నిలుస్తున్నది. ప్రతిపక్షాలు ఇంకా ఏమని విమర్శిస్తాయి? అని నల్లగొండ జిల్లా రైతు నాయకుడొకరు అన్నారు. పంట పెట్టుబడికింద ఎకరాకు నాలుగువేల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా, ఏ నాయకుడైనా, ఏ రాష్ట్రంలోనైనా చేశారా? కేసీఆర్ చేశారు. ప్రజాపక్షపాత విధానాలకు ఇంతకంటే నిదర్శనం ఏమున్నది. మున్సిపాలిటీలలో పనిచేసే స్వీపర్లు మొదలుకుని కాంట్రాక్టు లెక్చరర్ల వరకు, హోం గార్డులు మొదలుకుని అంగన్‌వాడీ టీచర్ల వరకు అందరినీ పట్టించున్న ప్రభుత్వం మునుపు ఏదైనా ఉందా?
Katta-Shekar-Reddy
తెలంగాణ నమూనానే కేంద్రంలో అమలు చేయా లి. అలా జరుగాలంటే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ రాజకీయ వేదికపై ప్రధాన భూమిక పోషించాలి. భారత దేశం పేదది కాదు. వనరులు, నిధులు లేక కాదు. పొంగిపారెడు నదులు, తరగని జలసిరు లు దేశమంతటా ఉన్నాయి. కానీ వాటిని అట్టడుగు ప్రజానీకానికి అందించే సంకల్పం ఉన్న నాయకుడే కరువయ్యాడు. యూపీఏ, ఎన్‌డీఏ విధానాలన్నీ పరిశ్రమ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. రైతు, కార్మికుడు కేంద్రంగా విధానాలు రూపొందించడం లేదు. రైతులకు ఇచ్చే సబ్సిడీలు కోతపెట్టాలని ప్రపంచబ్యాంకో, మరో అంతర్జాతీయ వేదికో డిమాండు చేస్తుంది. దానికి ఆర్థిక సంస్కరణ అని పేరు. మన ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయి. కానీ దేశంలో అత్యధిక జనాభా నేటికీ భూమిని నమ్ముకునే బతుకుతున్నారని ఎందుకు ఆలోచించరు. నాయకత్వానికి మనసు లేకనే దేశంలో ఇప్పటికీ రైతులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. తెలంగాణలో ఇంకా ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నమాట వాస్తవం. కానీ ఎంత తగ్గాయి? ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? తెలంగాణ ప్రభు త్వం ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే గ్రామీ ణ ఆర్థిక స్థితిగతులు అసాధారణంగా మార్పు చెందనున్నాయి. రైతుపై పెట్టుబడి భారం తగ్గించగలిగిన రోజు ఆత్మహత్యలను పూర్తిగా నివారించడానికి మార్గం సుగమం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన పంటపెట్టుబడి దేశంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. పెట్రోలియం కంపెనీలకు ధరలు రోజువారీ పెంచుకునే అవకాశం ఉంది. వాటికి కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి ధరలను గుప్పిట పెట్టుకోగలుగుతున్నాయి. దేశానికి అన్నంపెట్టే రైతుకు కూడా అటువంటి కార్పొరేషను ఏర్పా టు చేసి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయవచ్చు కదా అని మొన్న ఒక మిత్రుడు ప్రశ్నించాడు. సాధ్యాసాధ్యాల సంగతి తర్వాత, కానీ ఆ ఆలోచన మాత్రం నాకు గొప్పగా అనిపించింది. కేసీఆర్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు కార్పొరేషన్ అందు కు శ్రీకారం చుట్టగలిగితే ప్రతిగ్రామమూ ఒక పట్టణమే అవుతుంది. ఇటువంటి ఆలోచనాధార కలిగిన నేత కేంద్రంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అన్నది ఆ మిత్రుడి అభిప్రాయం. తెలంగాణలో వస్తున్న మార్పును, జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నవారెవరైనా కేసీఆర్ కేంద్రంలో కూడా క్రియాశీల పాత్ర పోషించాలని కోరుకుంటారు. ప్రాంతీయ నాయకులు జాతీయస్థాయిలో నిర్ణాయక పాత్ర పోషించవచ్చునని, ఉత్తరాది ఆధిపత్యాన్ని సవాలు చేయవచ్చునని 1990ల జాతీయ రాజకీయాలు రుజువు చేశాయి.
[email protected]

3794

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా