మొగులు మీద మన్నుపోస్తే!


Mon,March 19, 2018 11:30 AM

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో గత నాలుగేండ్లలో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ మూడు నాలుగు దశాబ్దాల క్రితం మన నాయకులు చూపించి ఉంటే తెలంగాణ ఎంత బాగుండేది. ఇవ్వాళ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో అందరికీ తెలుసు. ప్రాజెక్టులు, కాలువలు పూర్తిచేసి ప్రజలకు నీరివ్వ డం లక్ష్యంగా పనిచేయ లేదు. తలా ఒక కాంట్రాక్టు తీసుకొని, కాలువలు తవ్వి, ప్రాజెక్టుల పని వదిలేశారు. ఇవ్వాళ వీరావేశాలు ప్రదర్శిస్తున్న నల్లగొండ కాంగ్రెస్ నాయకుడు పక్కా కాంట్రాక్టరుగానే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉదయ సముద్రం పూర్తయి ఒకటిన్నర దశాబ్దాలవుతున్నది. ఇప్పటికీ ఆ రిజర్వాయరు నుంచి డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదు. చాలా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వెళ్లడం లేదు. భూసేకరణ పూర్తిచేయలేదు.

మొగులు మీద మన్నుపోస్తే మొగం మీద పడ్తది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారా లు, చెబుతున్న అబద్ధాలు అరువయ్యేండ్ల వారి చరిత్రను దాచిపెట్టలేవు. వారి పాపాలు కడిగితే పోవు. కాలానికి కొట్టుకుపోవు. ఎందుకంటే అవి మరిచిపోయేవి కాదు. శాసనసభా సమావేశాల మొదటి రోజునుంచి వారుచేస్తు న్న అల్లరి వారి గయ్యాళితనాన్ని, అక్కసును, అజ్ఞానాన్ని బయటపెట్టిందే తప్ప, ఏ ఒక్క అం శాన్నీ చర్చకు పెట్టలేదు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఇంకా పూర్తికాకముందే కాంగ్రెస్ నాయకులు గలభాకు దిగారు. అది ఏ సమస్య మీదనో తెలియదు. ఎందుకు గలభా చేస్తున్నారో తెలియదు. సమస్య మీద వారికి ఎంత నిబద్ధత ఉందో ఆ క్షణంలో వారి ముఖాల్లో వికవికలు, మైకులతో వారి వికృతచేష్టలు చూస్తే అర్థమవుతుంది. చిన్నపిల్లల్లా, చిల్లర వేషాలు వేసేందుకు వెనుకాడలేదు. పైగా గవర్నర్ కోసం విసిరితే అది మండలి చైర్మనుకు తగిలిందని వివరణ ఇచ్చుకోవడం. ఇన్నేండ్ల రాజకీయ అనుభవం ఏ గంగలో కలిసిందో, ఇంతకాలం ఏమి నేర్చుకున్నారో ఆ క్షణాన వారిని చూసినప్పుడు చాలామందికి సందేహం కలిగింది.

కొంతమంది సీనియర్ కాం గ్రెస్ నాయకులు ఆ తర్వాత, మేము వేరు, అల్లరి చేసినవారు వేరు అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వాస్తవం వేరు. శాసనసభాపక్షం సమావేశంలో వారంతా కూడబలుక్కుని శాసనసభలో గలభా సృష్టించారు. ఒకవేళ అలా కాకపోయినా గలభా చేసేవారిని వారించాల్సిన నాయకత్వ బాధ్యతలో ఉండి, సభనుంచి తప్పించుకుపోయినా అదేమీ పెద్దరికం కాదు. తమపార్టీ సభ్యులు చేసిన దోషఫలం నుంచి నాయకుడూ తప్పించుకోలేడు. శాసనసభలో ఇలా గొడవ జరుగడం ఇదే మొదటిసారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హరీశ్‌రావు బల్లలు ఎక్కలేదా అని మాట్లాడుతున్నారు. ఆ రోజున్న పరిస్థితు లు ఎలాంటివి? నిన్నటి పరిస్థితులు ఎలాంటివి? అప్పట్లో సభలో గొడవ జరుగడానికి ముందు తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా వాతావరణం భావోద్వేగంతో నిండి ఉంది. తెలంగాణ ఇస్తమని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేస్తూవస్తున్నది. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గురించి ఎటువంటి హామీ లేదు. ఈ మోసపూరితమైన వైఖరిపై తెలంగాణ అంతా భగ్గుమంటున్నకాలం. అటువంటి పరిస్థితుల్లో హరీశ్‌రావు చాలా ఆవేశంగా ఆ రోజు గవర్నర్‌ను నిలువరించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు పోలిక ఉందా. కాంగ్రెస్ నాయకుల్లో ఏ సమస్యపైనైనా అంతటి సీరియస్‌నెస్ ఉందా. ఉంటే ఆ పకపకలు, వికవికలు, ఆ కామెడీ వేషాలు వేసేవారా?

నువ్వు మంచి పేరు సంపాదించుకోలేకపోతే ప్రత్యర్థికి చెడ్డపేరు ఆపాదించు. గౌరవం గా యుద్ధం గెలవలేకపోతే, ఎంత నీచానికైనా పాల్పడు. మన బురదను కడుక్కోలేకపోతే పక్కవాడికీ కొంతపూసి ఇద్దరూ సమానమేనని రుజువు చెయ్యి.. ఇవన్నీ కాంగ్రెస్ ఇంతకాలం అమలుచేస్తూ వచ్చిన రాజకీయ వికృత విన్యాసాలు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వారికి సమస్యలు దొరుకడం లేదు. కాంగ్రెస్ కలలో కూడా ఆలోచించని, చేయని పను లు చాలా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ప్రజాకేంద్రక విధానాలతో పనిచేసుకుంటూ పోతున్నది. తెలంగాణను ఆరు దశాబ్దాల పాటు అరిగోస కు గురిచేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలది. సరిపడా కరెంటు ఇవ్వలేదు. విత్తనాలు, ఎరువులు సకాలం లో పంపిణీ చేయలేదు. అన్నింటికోసం ధర్నాలు, రాస్తారోకోలే. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి కటకట. సాగునీరు తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఒక సమస్యే కాదు. రైతులకు సాగునీ రు, పల్లెలకు తాగునీరు హామీ ఇవ్వాలన్న ఆలోచనే వారికి ఏ రోజూ రాలేదు. అడిగినవారికి అడుగనివారికి అందరికీ పింఛన్లు ఇస్తున్నది.

అనేకానేక సామాజిక భద్రతా పథకాలను ప్రవేశపెట్టింది. రైతురుణా న్ని మాఫీచేయడమే కాకుండా, రైతుల్లో భరోసా నిం పేందుకు ఎకరాకు నాలుగువేల రూపాయల పెట్టుబడిని ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టి దేశం అంతా తెలంగాణవైపు చూసేట్టు చేసింది. మరో అడుగు ముందు కువేసి రైతులందరికీ ప్రమాద బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆలోచన చేయని విధంగా పేదల పిల్లలకు అత్యంత నాణ్యమైన గురుకుల విద్యను అందిస్తున్నది. ముస్లింలకు లౌకికవాదం గురించి కోతలుకోసే ఏ పార్టీ చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇవ్వాళ ముస్లింల పిల్లలకు ప్రధాన స్రవంతి విద్యావకాశాలను కల్పించేందుకు, మత విద్యనుంచి విముక్తి చేసి, బతుకుతెరువునిచ్చే విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ గురుకుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇటువంటి విప్లవాత్మకమైన ఆలోచన ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ, టీడీపీలు కానీ ఏనాడైనా చేశాయా? ఒక్క సామాజికవర్గం ఏమిటి సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునే అనేక ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. సంక్షేమ, సామాజిక భద్రత పథకాల విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా వెలుగొందుతూ ఉన్నది.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో గత నాలుగేండ్లలో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ మూడు నాలుగు దశాబ్దాల క్రితం మన నాయకులు చూపించి ఉంటే తెలంగాణ ఎంత బాగుండేది. ఇవ్వాళ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో అందరికీ తెలుసు. ప్రాజెక్టులు, కాలువలు పూర్తిచేసి ప్రజలకు నీరివ్వ డం లక్ష్యంగా పనిచేయ లేదు. తలా ఒక కాంట్రాక్టు తీసుకొని, కాలువలు తవ్వి, ప్రాజెక్టుల పని వదిలేశారు. ఇవ్వాళ వీరావేశాలు ప్రదర్శిస్తున్న నల్లగొండ కాంగ్రెస్ నాయకుడు పక్కా కాంట్రాక్టరుగానే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉదయ సముద్రం పూర్తయి ఒకటిన్నర దశాబ్దాలవుతున్నది. ఇప్పటికీ ఆ రిజర్వాయరు నుంచి డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదు. చాలా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వెళ్లడం లేదు. భూసేకరణ పూర్తిచేయలేదు. ఎక్కడికక్కడ వివాదాలు సృష్టించి జనాన్ని మాయలో ఉంచుతూ వచ్చారు.

కమ్యూనిస్టుల ప్రభావంలో ఉన్నాయన్న పేరుతో తిప్పర్తి మండలంలో ఏడు గ్రామాలను మంచినీటి పథకం నుంచి కూడా తొలిగించిన సంకుచిత నాయకత్వం వారిది. నిజమైన అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు కాంగ్రెస్ నాయకులు వేసిపోయిన ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకుసాగుతున్న ది తెలంగాణ ప్రభుత్వం. గరిష్ఠస్థాయిలో నదీజల వినియోగం, గరిష్ఠస్థాయిలో భూమి సాగు లక్ష్యంగా ఒక్కొక్క కాలువను పూర్తిచేస్తూ వస్తున్నది. ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ ప్రాజెక్టుల వద్ద కాపలాకాస్తూ, నిద్రలు చేస్తూ పనులు చేయించుకుంటున్నారు. తమ ఊళ్లకు నీళ్లను తెచ్చుకుంటున్నారు. ప్రజలతో కలిసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నీళ్లను చూసి కొన్ని పల్లెలు చిన్నపిల్ల ల్లా పండుగ చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ నాయకత్వానికి జీర్ణం కానిది ఇదే. వాళ్లు ఇంకా 80లలో, 90లలో మాదిరిగానే రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ వారిని దాటి చాలా దూరం వెళ్లిపోయారు. ఆయన ఆలోచనల కార్ఖానా కాంగ్రెస్ నాయకత్వానికి అంతుబట్టడం లేదు. కొత్త ఆలోచనలు కానీ, కొత్త ఎజెండాలు కానీ వారికి తట్ట డం లేదు. మూస గొడువలు, బురద చల్లడాలు, ఏదో ఒకటిచేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడాలు వం టి నేలబారు ఆలోచనలపైనే వారు ఆధారపడుతున్నారు. అందుకే శాసనసభలో అడ్డంగా, ఆలోచనారహితంగా అల్లరిచేసి అభాసుపాలయ్యారు. గట్టిగా అరిచి చెబితే అబద్ధం నిజం కాదు. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అభివృద్ధి నిరోధక ఆలోచనలకు కేంద్రం కాంగ్రెస్. హత్యారాజకీయాలను పెంచిపోషించింది కాంగ్రెస్. అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి దశాబ్దాలపాటు ప్రజల మూపులపై స్వారీ చేసింది కాంగ్రెస్. ఇవ్వాళ ఆ పార్టీ నాయకులు బట్టకాల్చి టీఆర్‌ఎస్ నాయకుల మీద వేయాలని చూస్తున్నారు. అధికారం కోల్పోయిన విభ్రమలో వారు అవన్నీ మరిచిపోవచ్చు. కానీ జనం మరచిపో రు. రాష్ట్రంలో, జిల్లాల్లో ఇంతకు ముందు ఎలా ఉం డేది, ఇప్పుడు ఎలా ఉన్నదీ అందరూ గమనిస్తున్నా రు. ఎన్ని విన్యాసాలు, డ్రామాలు వేసినా కాంగ్రెస్‌ను ఇప్పుడప్పుడే ప్రజలు క్షమించరు.

[email protected]
shekar-reddy

1455

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా