ముంజేతి కంకణానికి అద్దమేల


Sun,January 14, 2018 07:26 AM

తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజువు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీతెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనంతో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నారు.

కండ్లముందు కనిపించే వాస్తవా న్ని చూడటానికి నిరాకరించేవారికి ఏమి చెప్పినా ఏమి ప్రయోజనం? చెవిటివారి ముందు శంఖమూదడం కంఠశోష. కరెంటు సమస్యను తెలంగాణ ప్రభు త్వం ఎలా పరిష్కరించిందో ప్రజలందరికీ అనుభవంలో ఉన్నది. కరెంటు బాధల నుంచి విము క్తి వల్ల కలిగిన ప్రయోజనాలేమిటో ఇవ్వాళ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పనవసరంలేదు. కరెంటు కోతలు లేవు. మోటార్లు కాలిపోవడం లేదు. లో ఓల్టేజీ సమస్య లేదు. ఇప్పుడు కరెంటుకోసం ఎదురుచూసుడు లేదు. ఫ్యాక్టరీలు, ఆఫీసులు, పెద్దపెద్ద దుకాణాలు, చిన్నచిన్న కిరా ణా కొట్లు, ఇళ్లల్లో అయితే జనరేటర్లు, ఇన్వర్టర్లు అన్నీ బందయిపోయాయి. ఎక్కడయినా ఉన్నా ఏదయినా ఆపత్కాల అవసరాల కోసమే వాడుకుంటున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు అమ్మే వ్యాపారులు వేరే వ్యాపారాలకు మళ్లవలసిన పరిస్థితి వచ్చింది. కరెంటుకోసం రాస్తారోకోలు, సబ్‌స్టేషన్లపై దాడులు, విద్యుత్ అధికారుల నిర్బంధాలు ఈ మూడున్నరేండ్లలో ఏనాడైనా చూశామా? ఇన్నీ తెలిసి కాంగ్రెస్ నాయకులు సవాళ్లు విసురుతున్నారు. కరెంటు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో ఎన్ని వైరుధ్యాలంటే అన్నీ మేమే చేశాం, అంతా మా ఘనకార్యమే అని ఒకసారి అంటారు. అడ్డగోలు ధరపెట్టి కొనుగోలు చేశారని, అవినీతి జరిగిందని మరోసారి అంటారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క యూనిట్ విద్యు త్తు ఉత్పత్తి చేయలేదని చెబుతారు. ఏమీ చేయకుండానే ఈ మూడేండ్లలో సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఎలా ఎదిగింది? 2500 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యానికి ఎలా చేరుకుంది? థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిందెప్పుడు? భూపాలపల్లి, జైపూరు, కొత్తగూడెంలో కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చిందెప్పుడు? కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ప్రాజెక్టుల వెంట వెళితేగదా తెలిసేది. బజార్లో కాళ్లు బార్లా చాపుకొని సవాళ్లు విసురుతున్నవాళ్లు ముందు రాష్ట్రంలో అవసరమైన విద్యుత్తు ఎంత? ఉత్పత్తి అవుతున్నదెంత? ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు ఉన్నా యో తెలుసుకొని మాట్లాడితే జనం సంతోషిస్తారు. మాట్లాడటానికి నోరూ, మైకూ ఉంటే చాలదు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ వనరుల నుంచి విద్యుత్ ఉత్పాదన పెరుగుతున్నది. మన దేశంలోనూ వివిధ రాష్ర్టాల్లో విద్యుదుత్పాదన బాగా పెరిగింది. తత్ఫలితంగా కొనుగోలు చార్జీలు తగ్గుతున్నాయి. మన ఎత్తిపోతల పథకాలన్నీ అందుబాటులోకి వచ్చేనాటికి విద్యుత్ బల్క్ కొనుగోలు చార్జీలు బాగా తగ్గుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలాకాలంగా చెబుతున్నారు. ఆ దృక్పథంతోనే పెద్ద ఎత్తున గోదావరిపై నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టులు చేపట్టారు. అత్యంత వేగంగా ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సమస్త యం త్రాంగం కృషి చేస్తున్నది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుతోపాటు ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల వెంటపడుతున్నారు. కరెంటు తర్వాత నీరే అత్యంత కీల కం. కరెంటు కంటే నీరు ఖరీదైనది. అందుకే నీటికోసం ఎంతయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం ఇవేవీ చూడదల్చుకోలేదు. బట్టకాల్చి మీదవేసి ఏదో పబ్బం గడుపుకోవాలన్న ఆరాటం తప్ప నిర్మాణాత్మక పాత్ర పోషించే దార్శనికతే వారిలో కనిపించడం లేదు. సుదీర్ఘకాలంపాటు ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన కారణంగా టీఆర్‌ఎస్ నాయకత్వానికి ప్రజాపక్షపాతంతో పనిచేసే దార్శనికత అబ్బింది. కాంగ్రెస్ నాయకత్వానికి ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజాకేంద్రక ఆలోచనా ధోరణి అలవడలేదు. పొలాలకు నీళ్లిస్తే రైతులు, కూలీలు మన మాట వినరు, రోడ్డేస్తే జనం మనకు అందుబాటులో ఉండరు అన్న భూస్వామ్య దృక్ప థం నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బయటపడలేదు. ఆధునిక దృక్పథం కానీ, క్రియాశీల ఆలోచనలు కానీ వారికి రావడం లేదు. ఎంతసేపు తిట్లపురాణాలు తప్ప, ప్రత్యామ్నాయ ఆలోచనాధారను వారు అలవర్చుకోవడంలేదు. ఒక కాంగ్రెస్ మిత్రుడన్నట్టు ఆ పార్టీలో నాయకులకు మేధావులంటే చిన్నచూపు. బాగా మాట్లాడేవారిని, మంచి వక్తలను చూస్తే అక్కడ అగ్రకులాల నుంచి వచ్చి పెద్దనాయకులుగా చలామణి అవుతున్నవారు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఆ మిత్రుడు బాధపడ్డారు. అందుకే ఆ పార్టీలో భావజాలపరంగా ఒక దివాళా పరిస్థితి తలెత్తింది.

కరెంటు, తాగునీరు-సాగునీరు, రైతుకు ఎకరాకు నాలుగువేల పెట్టుబడి, భూ రికార్డుల ప్రక్షాళన, పిం ఛన్లు, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, సంక్షే మ గురుకులాలు.. ఇవి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చరిత్రలో నిలిచిపోయేట్టు చేస్తాయి. ఇంతకంటే ఉన్నతంగా, ఇంతకంటే భిన్నంగా, ఇంతకంటే ప్రయోజనకరంగా ప్రతిపక్షాలు ఏదైనా ఎజెండాతో వస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అధికారం పోయిందన్న అక్కసు, ద్వేషాలతో, తాము ఇంతకాలం అనుభవించిన పదవులు ఎవరో అనుభవిస్తున్నారన్న దుగ్ధతో, ప్రాజెక్టులు-కాంట్రాక్టులు అంటే కమీషన్లు అని మాత్రమే అర్థం చేసుకుని అవి తమకు దక్కకుండా పోయాయన్న ఉక్రోషంతో బుసలు ముసలు కొడితే అధికారం రాదు. తెలంగాణ సాధించడంలో ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన కేసీఆర్‌కు వచ్చినంత గొప్పపేరు మరెవరికీ రాలేదు. రాదు. ఆయన అందరిలో ఒకడు కాదు, అరుదైన నాయకుడు. ఆయన నాయకత్వంలో లోపాలు ఉండవచ్చు. మహాత్ములయిన నాయకుల్లో కూడా చరిత్ర కొన్ని లోపాలను లెక్కపెట్టింది. ఇదీ అంతే. ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు. నాయకుడు రాత్రికిరాత్రి నోరేసుకుని బయలుదేరితే తయారుకాడు. దానికి సాధన కావాలి. ఓపిక కావా లి. సందర్భం కావాలి. లేదంటే సందర్భం సృష్టించుకోవాలి. కొత్త రాజకీయ నమూనాలను తయారు చేసుకోవాలి. అందుకోసం అనేకమంది మేధావులు, నాయకుల అనుభవాలను చదువాలి. తిట్టి, కొట్టి, పెట్టి నాయకులయ్యేవారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు. వారు అనేకమందిలో ఒకరు. వారు రాజకీయాలను కలుషితం చేయగలరు, తప్ప ఉన్నతీకరించలేరు. కల్లుకొట్టు ముందు నిలబడి మైకంలో మతితప్పి అమ్మనాబూతులు తిట్టేవాడికి పది మైకుల ముందు నిలబడి మాంచి ఖద్దరు బట్ట లు తొడిగి పట్టుకండువా మీదేసుకుని మాట్లాడేవారికి తేడా లేకపోతే ఇక జనానికి ఏమి చెబుతారు? జనానికి ఎలా నాయకత్వం వహిస్తారు?
shekar-reddy
తెలంగాణ ఉద్యమం నాయకత్వ సంస్కృతిలో కూడ ఒక గొప్ప మార్పు తెచ్చింది. గత మూడున్నరేండ్లలో మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పల్లెలు, పట్టణాలు, ప్రాజెక్టులు పట్టుకుని తిరిగినట్టు గా చరిత్రలో ఏనాడైనా ఏ నాయకుడైనా తిరిగినా డా? ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పట్నంలో ఉన్నది తక్కువ. హుజూరాబాద్, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్నది ఎక్కువ. ఆయనకు ఎప్పుడు ఏరోజు ఫోన్ చేసినా హైదరాబాద్ నుంచి ఊరికెళుతూనో, ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తూనో మాట్లాడుతారు. తన్నీరు హరీశ్‌రావు అయితే కాలికి బలపం కట్టుకున్నారు. కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి... దాదాపు మంత్రులంతా నిమ్మళంగా నాలుగు రోజులు పట్నంల గడిపింది లేదు. తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజు వు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీ తెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనం తో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నా రు. ఇంకొందరేమో తెలుగుదేశం, సీపీఎం పార్టీలలో తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్ర నాయకత్వాలతో అంటకాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్ర నాయకత్వం వదిలివెళ్లిన భావజాలంతోనే తెలంగా ణ నాయకత్వంపై దాడి చేస్తున్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై వివాదాలు రేపడం, ప్రతిపనికీ అవరోధాలు కల్పించడం ఇవన్నీ వారి వారసత్వ లక్షణాలే. అప్పటికీ ఇప్పటికీ వీరికి ఒరిజినాలిటీ ఏదీ లేదు. అన్నీ తెచ్చిపెట్టుకున్న వాదాలు, వాదనలు. బీజేపీ కేం ద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఈ మూడున్నరేండ్లలో ఎన్ని కష్టాలను పరిచయం చేసిందో అం దరికీ అనుభవంలోకి వచ్చింది. తెలంగాణకు అనుకూలంగా ఒక్క మంచిపనీ చేయలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణకు మద్దతు ఇచ్చిన మంచిని కూడా ఆ పార్టీ కాపాడుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత ఏదైనా దక్కుతుందంటే అది టీఆర్‌ఎస్ నాయకత్వానికి, అనివార్యతకు తలొగ్గి, ప్రజావాంఛను గౌరవించి, పార్లమెంటుతో ఒప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా అప్పుడూ ప్రేక్షకులే.
[email protected]

2859

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా