తెలుగు మూలాల అన్వేషణ


Sun,November 19, 2017 01:47 AM

ఆంధ్రలో సీపీ బ్రౌన్ చేసిన కృషిలో కొంతయినా తెలింగ వ్యాకరణంపై విలియం కేరీ చేశారు. శ్రీరాంపూర్ ఫోర్టు విలియం కళాశాలలో సంస్కృ తం, బెంగాలీ, మరాఠా ప్రొఫెసర్‌గా పనిచేసిన విలియమ్ కేరీ 1814లోనే తెలింగ వ్యాకరణం రాశారు. అయితే అది కూడాఈ గత ఒకటిన్నర శతాబ్దాల్లో అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. తెలుగు త్రిలింగ నుంచి జనించింది అన్న వాదనను ఒప్పుకుంటే ఆంధ్ర అన్న ప్రాంతం ఎక్కడ అన్న ప్రశ్న ఉదయిస్తుందని ఆంధ్ర చరిత్రకారులు భావించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మరుగున పడిపోయిన చరిత్ర పుటలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. త్రిలింగ, ఆంధ్రల మధ్యచిక్కుకుపోయిన చారిత్రక చిక్కుముడులను విప్పి చెప్పాల్సిన తరుణం వచ్చింది.
TELUGU-MAHASABALU
తెలుగు అన్న పదం త్రిలింగ ఆవిర్భా వం అని అప్పకవి మొదటిసారి సూత్రీకరించారు. వాస్తవానికి త్రిలింగ అన్నది ఒక ప్రాంతం. కాళేశ్వరం, భీమేశ్వరం, శ్రీశైలంల మధ్య చారిత్రకంగా రూపుదిద్దుకున్న రాజకీయ విభాగం. గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతం. బోధను మొదలుకొని బందరు దాకా త్రిలింగ దేశమే. ఈ ప్రాంత ప్రజ లు మాట్లాడిన భాషే తెలుగుగా భాసిల్లింది. గోదావరికి ఆవల ఉన్న ప్రాంతం కళింగగా, కృష్ణకు ఆవల ఉన్న ప్రాంతం ఆంధ్రగా శతాబ్దా ల తరబడి ప్రత్యేక ప్రాంతాలుగా, రాజకీయ విభాగాలుగా వర్ధిల్లాయి. శాతవాహనులు, కాకతీయులు, రాయలు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో, అదీ కొం తకాలం మాత్రమే ఈ ప్రాంతాలు ఒకే ఏలుబడిలో ఉన్నాయి. అవి స్వల్ప విరామ కాలా లు మాత్రమే. శాతవాహనుల అంత్యకాల రాజధాని అమరావతి. అప్పకవి సూత్రీకరణ ను ప్రధాన స్రవంతి తెలుగు పండితులు అంగీకరించలేదు. తేనె అంటే మధురమైనదని, తెలుగు మధురమైన భాష అని సాధారణీకరించే ప్రయత్నం చేశారు. త్రిలింగ చారిత్రక అస్తిత్వాన్ని తిరస్కరించే ప్రయత్నంలోనే ఇది జరిగి ఉంటుందన్నది తెలంగాణవాదుల భావన. మార్కండేయ పురాణంలో త్రిలింగ కుజ్జరి దరి కాచ్ఛ వాసాజ్జ యే జనా/ తామ్రపర్ణి తథా కుశిర్ ఇతి కూర్మాస్య దక్షిణహ అని కూర్మ విభాగ ప్రకరణంలో రాశారు. వాయుపురాణంలో కూడా అర్ధ్థపజ్జ తిలింగాచ్ఛ మగధాచ్ఛ వృకైసాచ్ఛ/ మధ్యదేశ జనపదా ప్రయాజో అమి ప్రకృతాహ్ అని రాశారు. మార్కండేయ పురాణం క్రీస్తుశకం 250 నాటిదని చరిత్రకారులు అంచనా వేశారు. వాయు పురాణాన్ని క్రీస్తుశకం 300-500 మధ్యకాలంలో రాసి ఉంటారని వారి అంచనా. రెండు పురాణాల్లోనూ ప్రాంత, భాషా సూచికలుగానే త్రిలింగ ప్రస్తావన జరిగింది. రాజశేఖరుడు రాసిన నాటకం విద్ధసాల భం జికలో కాలచూరి రాజులు తమను త్రిలింగాధిపతులుగా పేర్కొన్నారు. నర్మద నుంచి తామ్రపర్ణి దాకా విస్తరించిన రాజ్యంగా అందులో పేర్కొన్నారు.

ఐత్తరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర ప్రస్తావన ఉన్నమాట నిజం. మహాభారతంలో ఆం ధ్రులు పాల్గొన్నదీ నిజం. ఆంధ్ర ప్రత్యేక జాతిగా కొనసాగినదీ వాస్తవం. అయితే తెలంగాణ, ఆంధ్రల మధ్య రాజకీయ విభజన అనాది నుంచీ ఉందన్న వాస్తవాన్ని మరుగున పడేయడమే చారిత్రకంగా తెలంగాణకు జరిగిన నష్టం. తెలంగాణ మూలాలను కనుగొని ఒక్కొక్కటిగా పేర్చకపోగా, వాటిని అప్రస్తుతం చేసి, వాటికి ఎటువంటి విలువ లేదన్నట్టుగా చరిత్రకారులు వ్యవహరించారు. ఆంధ్రులు ఇతిహాసకాలం నుంచి ఉన్నప్పుడు ఆంధ్ర భాషగానే పేరు స్థిరపడి ఉండాలి. తెలుగు ఎందుకు ఆవిర్భవించింది? తెలంగాణ మాట్లాడిన భాష తెలుగు అయినట్టుగానే ఆంధ్రులు మాట్లాడిన భాష ఆంధ్రం అయి ఉండవచ్చు. హిందీ భాషకు రాజస్థానీ, హర్యాన్హవీ, బీహారీ వ్యత్యాసాలు ఉన్నట్టే, ఆంధ్రానికి, తెలుగుకు మధ్య సాపత్యమూ, అంతరమూ రెండూ అవతరించి ఉంటాయి. ఆ అంతరాన్ని గుర్తించడానికి గానీ, ఒక హేతుబద్ధమైన భాషా బం ధాన్ని నిర్మించడానికి గానీ చరిత్రకారులు, భాషా పండితులు ప్రయత్నించలేదు. త్రిలింగ, తెలుంగు, తెలుగు, తెలంగాణల అస్తిత్వ నిరాకరణలో భాగంగానే తెలుగు ప్రాదుర్భావానికి ఇతరేతర కారణాల ను చూపడానికి వెతకడానికి ప్రయత్నించారు.

ఆంధ్రులు ఆదికవిగా ప్రతిష్ఠించిన నన్నయ భట్టారకుడు క్రీస్తుశకం 1020 నుంచి 1060 వరకు రాజరాజనరేంద్రుడి ఆస్థానకవిగా ఉంటూ మహాభారత ఆది సభా పర్వాలను సంస్కృతం నుంచి తెలుగులో కి అనువదించారు. ఆయన సాహితీ సర్వస్వంలో ఎక్కడా త్రిలింగ ప్రస్తావన చేయలేదు. తెనుగు అని మాత్రమే ప్రస్తావించారు. అప్పటికి ఇక్కడ ఓరుగల్లును పాలిస్తున్న రాష్ట్రకూటుల సామంతులు త్రిలింగ దేశాధీశులుగా పిలిపించుకుంటున్నారు. ఆ తర్వా తి శతాబ్దాల్లో కూడా త్రిలింగ లేక తెలుగు భాష వ్యాకరణాన్ని చాలామంది రచయితలు రాశారు. పదమూడవ శతాబ్దారంభంలో అథర్వణాచార్య రాసిన త్రిలింగశబ్దానుశాసన గ్రంథంలో కణ్వ, బృహస్పతి, హేమచంద్ర, పుష్పదంత, గౌతమ, ధర్మరాజ వంటి రచయితలు రాసిన తెలుగు వ్యాకరణం గురించి ప్రస్తావించారు. అయితే ఆ వ్యాకరణ గ్రంథాలేవీ ఈ తరానికి అందుబాటులోకి రాలేదని పండితులు చెబుతున్నారు. కాకతీయుల ఆస్థాన కవి విద్యానాథుడు కూడా తన రచనల్లో త్రిలింగ ప్రస్తావన చేశారు. రాజశేఖరుడు రాసిన విధసాల భంజికలో కూడా త్రిలింగ ప్రస్తావన ఉంది. తమిళ అతి ప్రాచీన వ్యాకరణ రచనల్లో ఒకటైన అగత్తియంలో కొంగనం, కన్నడం, కొల్లం, తెలుంగమ్ అన్న ప్రస్తావన ఉంది. అగత్తియం మొదటి సంగమ కాలం క్రీస్తుపూర్వం 3, క్రీస్తుశకం 3 శతాబ్దాల కాలానికి చెందినది.
నన్నయ ఉపయోగించిన తెనుగు పదమే మొదటిదని చెప్పడం అసంబద్ధమని అనేక చారిత్రక, ఐతిహాసిక ఆధారాలు చెబుతున్నాయి. తెనుగు కంటే తెలుగు పాతదని, తెలుగుకు మూలం త్రిలింగం అని రూఢి అవుతున్నది. తెన్ అంటే దక్షిణాపథమని, దాక్షిణాత్యులు మాట్లాడే భాష తెలుగు అని, తైలంగులు అనే తెగ ఆక్రమించుకున్న ప్రాంతం, వారు మాట్లాడిన భాష తెలుగు అయిందని ఇలా రకరకాల వాదనలు ముందుకువచ్చాయి.

తెలుగు భాష ఆవిర్భావానికి ముందు ఈ గడ్డమీద అనేక రాజవంశాలు కదనుతొక్కి కాలగర్భంలో కలసిపోయాయి. తెలుగునేలను పాలించిన చాలామంది రాజులు ఇక్కడివారు కాదు. తొలుత మౌర్యులకు, గుప్తులకు సామంతులుగా, ఆ తర్వాత చాళుక్యులు, రాష్ట్రకూటులకు సామంతులుగా, కొన్ని ప్రాంతాలలో చోళుల సామంతులుగా వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. ఛేది రాజులు, హైహయులు కూడా అలా వచ్చినవారే. పల్నాడును పాలించి, పల్నాటి యుద్ధానికి కారకులైన రాజులు హైహయులే. బాదా మి చాళుక్యుల తర్వాతనే భాషాభివృద్ధి బాగా జరిగింది. చాళుక్యులు కన్నడిగులు. అందుకే కన్నడ, తెలుగు కవల భాషలుగా ఎదిగాయి. ఈ రెండు భాషలు పరస్పర సంపర్కంలో గొప్పగా పరిఢవిల్లాయి. అందుకే రెండు భాషల లిపి, ఉచ్చారణ, పద నిర్మాణం, భావ ప్రకటనలో సారూప్యత ఎక్కువ. కవిత్వం, పురాణం, ఇతిహాస రచనలో కన్నడ, తెలుగు కలిసి ప్రయాణం చేశాయి. చాలామంది కవులు ద్విభాషా ప్రవీణులు గా వర్ధిల్లారు. పంపన, పాల్కురికి సోమన ద్విభాషా పండితులు. రెండు భాషల్లోనూ తమ వాజ్ఞయాన్ని వెలువరించారు. విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు రెండు భాషలనూ ప్రోత్సహించా రు. దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన రాజు ఆయన.
shekar-reddy
తెలంగాణ గడ్డపై ముస్లిం రాజుల పదఘట్టనలు ప్రవేశించేదాకా తెలంగాణలో కళా, సాహితీ, సాం స్కృతిక వైభవాలు వర్ధిల్లాయి. ఆనాటి దేశకాల పరిస్థితులను వర్ణిస్తూ అనేక రచనలు చేసిన కవులు, రచయితలు మెండుగా ఉన్నారు. ఇస్లామిక్ పాలన వచ్చి న తర్వాత తెలుగు మసకబారింది. చాలా కొద్ది మం ది ఇస్లామిక్ రాజులు మాత్రమే సహిష్ణుత పాటించి తెలుగును ప్రోత్సహించారు. శతాబ్దాల తరబడి తెలు గు భాషా అభ్యసనం, అధ్యయనం మరుగున పడిపోయాయి. తెలుగు, తెలంగాణ రెండూ మరుగున పడ్డాయి. ఆంధ్రలో సీపీ బ్రౌన్ చేసిన కృషిలో కొంతయినా తెలింగ వ్యాకరణంపై విలియం కేరీ చేశారు. శ్రీరాంపూర్ ఫోర్టు విలియం కళాశాలలో సంస్కృ తం, బెంగాలీ, మరాఠా ప్రొఫెసర్‌గా పనిచేసిన విలియమ్ కేరీ 1814లోనే తెలింగ వ్యాకరణం రాశారు. అయితే అది కూడా ఈ గత ఒకటిన్నర శతాబ్దాల్లో అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. తెలుగు త్రిలిం గ నుంచి జనించింది అన్న వాదనను ఒప్పుకుంటే ఆంధ్ర అన్న ప్రాంతం ఎక్కడ అన్న ప్రశ్న ఉదయిస్తుందని ఆంధ్ర చరిత్రకారులు భావించారు. ప్రపం చ తెలుగు మహాసభల సందర్భంగా మరుగున పడిపోయిన చరిత్ర పుటలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. త్రిలింగ, ఆంధ్రల మధ్య చిక్కుకుపోయిన చారిత్రక చిక్కుముడులను విప్పి చెప్పాల్సిన తరుణం వచ్చింది.
[email protected]

4108

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా