త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు


Sun,November 12, 2017 12:05 PM

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీ య మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు.

తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను ప్రపంచానికి చాటడానికి తెలుగు మహాసభలు ఒక గొప్ప సందర్భం. మన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని దశదిశలా చెప్పుకోవడానికి ఇదొక మంచి అవకాశం. తెలంగాణ ది విస్మృత చరిత్ర. తెలంగాణ, ఆంధ్ర పదాల మధ్య తెలంగాణ అన్న పదం అసలు వినిపించ ని, వినిపించకూడదని శాసించిన దశ ఒకటి తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ తన మూలాలను తాను మరిచిపోయే విధంగా చరి త్ర నిర్మాణం, రచన, ప్రచారం, విధ్వంసం ఒక ప్రణాళికాబద్ధంగా జరిగాయి. తెలంగాణ చరిత్ర మధ్యలో చాలా ఖాళీలున్నాయి. తెలంగాణ ప్రాంతం సుదీర్ఘకాలం పాటు అంటే క్రీస్తు శకం 1500 నుంచి 1948 దాకా సుల్తానులు-కుతుబ్‌షాహీలు, మొఘలాయిలు-అసఫ్‌జాహీల పాలనలో ఉండటం వల్ల అనేక చారిత్రక ఆధారాలు లభించకుండాపోయాయి. ఆలయాలు, శాసనాలు, కోటలు ఎన్నో ధ్వంసమయ్యాయి. సాహిత్యాన్ని, సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడంతోపాటు కొన్నింటిని గుర్రాలు, ఏనుగుల అంబారీలపై ఢిల్లీకి తరలించుకుపోయినట్టు చరిత్రకారు లు రాశారు. దొరికిన శాసనాలను కూడా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సంద ర్భం లేదు. బీఎన్‌శాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి వంటి కొద్దిమంది స్వయం శోధకులు పూనుకొని చాలా కృషి చేశారు. అయినా తెలంగాణ చరిత్రను పూసగుచ్చినట్టు వర్ణించే ఆధారాలు, అవకాశాలు లభించలేదు. ఒక్క కాకతీయుల చరిత్రే మనకు కొంత క్రమపద్ధతిలో లభిస్తుంది. అందులో కూడా అనేక అపరిష్కృత సందర్భాలున్నాయి. ప్రతాపరుద్రుడంతటి రాజు బందీ అయి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత 74 మంది కాకతీయ నాయంకరులు ఏకమై 1328లో తిరిగి ఓరుగల్లును ముస్లింల పాలన నుంచి విముక్తి చేశారు. అక్కడి నుంచి మరో సుమారు 150 ఏండ్ల పాటు తెలంగాణను తెలుగు రాజులు ఏలారు.

ఓరుగల్లును కాపయ నాయకుడు, రాచకొండను సింగభూపాలుడు, కరీంనగర్ ప్రాం తాన్ని ముసునూరి, రేచర్ల నాయకులు, కొండవీడును రెడ్డిరాజులు ఇలా ఒక్కో ప్రాంతా న్ని ఒక్కోరాజు పరిపాలించాడు. వారి చరిత్ర వరుసక్రమంలో లభించలేదు. బహమనీల పదఘట్టనల కింద నలిగిపోక ముందు తెలంగాణలో ఏం జరిగింది? అన్నది శోధించాల్సి ఉంది. తెలంగాణను ఏలిన రాజులు ఏమయ్యారు? పద్మనాయకులు ఇక్కడ ఓడిపోయిన తర్వాత విజయనగర రాజులకు సామంతులుగా కొందరు వెలుగోడుకు, ఇంకొందరు గుంటూరుకు అటు నుంచి వెంకటగిరికి, కాళహస్తికి వెళ్లారనీ అక్కడ చిన్నచిన్న రాజ్యాలు స్థాపించారని వెలుగోటివారి వంశావళి, వెంకటగిరి రాజుల కుటుంబ చరిత్ర వెల్లడిస్తున్నాయి. నల్లగొండ జిల్లా పానగల్లు నుంచి వెళ్లినవారే కాళహస్తి వద్ద పానగల్ సంస్థానం ఏర్పాటుచేశారని, వారే ఆ తర్వాత మద్రాసు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు, పిల్లలమర్రి రాజులు తమ పూర్వీకులను వెంకటగిరి రాజులు తమ చరిత్రలో పేర్కొన్నారు. చెన్నపట్నానికి భూమిని ఇచ్చిన వెంకటగిరి రాజులు తమ పూర్వీకుడైన చెన్నమనీడు పేరున ఆ ప్రాంతానికి చెన్నపురి అని పేరు పెట్టాలని కోరారని అందుకు అప్పటి బ్రిటిష్ పాలకులు అంగీకరించారని చెబుతారు. అలా ఎక్కడెక్కడికో తెలంగాణ చరిత్ర మూలాలు విస్తరించా యి. అవేవీ రికార్డు కాలేదు. కాకతీయులకు సామంతులుగా ఉన్న 74 మంది నాయంకరుల జాబితా కూడా ఇప్పటి వరకు లభించలేదు. అన్నీ చిద్రుపలై న చరిత్ర ముక్కలే మనం చదువుకున్నాం.

తెలుగు పదావిర్భావానికి మూలమే త్రిలింగ, తెలింగ, తెలుంగు, తెలింగాన, తెలంగాణ అని అనేక చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఆంధ్ర ఆధిప త్య చరిత్రకారులు తెలంగాణకు, తెలుగుకు సంబం ధం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రాంతం పేరు నుంచి భాష పేరు, భాష పేరు నుంచి ప్రాంతం పేరు ఆవిర్భవించడం అన్నది చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. త్రిలింగ ప్రస్తావనలనే మన చరిత్రకారులు ఎందుకో సీరియస్‌గా తీసుకోలే దు. క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటి టాలెమీ యాత్రారచనలో త్రిలింగ ప్రస్తావన ఉంది. వాయుపురాణంలో త్రిలింగదేశ ప్రస్తావన ఉంది. కల్హణుడి రాజతరంగిణిలో త్రిలింగ ప్రస్తావన ఉంది. బ్రాహ్మణుల వర్గీకరణలో తెలంగాణ్య బ్రాహ్మణుల ప్రస్తావ నే ఉంది. ఆంధ్ర బ్రాహ్మణ అన్న ప్రస్తావన లేదు. కర్ణాట, మర్హాట, తెలంగాణ్య, ద్రవిడ అన్న ప్రస్తావనలు మాత్రమే ఉన్నాయి. అయినా ఎందుకో తెలంగాణ చరిత్ర రచనకు ఇవేవీ ఆధారాలుగా తీసుకోలేదు. ఎంతసేపూ ఆంధ్ర వైపు నుంచే చరిత్రను చూసే ప్రయత్నం జరిగింది. కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కూడా త్రిలింగదేశాధీశ్వరుడని పిలిపించుకున్నాడు. రాజే దైవంగా వెలసిన ఆలయమని చెబుతారు. ఈయన శాతవాహనుల కంటే ముందు త్రిలింగ దేశాన్ని పరిపాలించాడని ప్రతీతి. కాకతీయులకు కూడా ఆ బిరుదమున్నది. కృష్ణదేవరాయలను కీర్తించిన కవులు కూడా ఆయన పది తెలంగాణ్య దుర్గములను జయించెను అని రాశారు తప్ప, తెలుగు రాజ్యాలను జయించారని రాయలేదు.

శాతవాహనులకు ముందు నుంచే తెలంగాణకు చరిత్ర ఉంది. ఇతిహాస కాలం నాటి పదహారు మహాజనపదాల్లో అస్మక రాజ్యం మన గడ్డమీదే ఉండేది. గోదావరి, మంజీరా నదుల మధ్య ఆ జనపదం ఉం డేదని, నేటి బోధను, నాటి పోదన దానికి రాజధానిగా ఉందని చారిత్రక ఆధారాలు లభించాయి. చారిత్రక జైన బాహుబలి ఈ గడ్డ మీదే జన్మించాడని కూడా చెబుతారు. కానీ ఆంధ్ర చరిత్రకారులు ఆ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. దానిని తెలుగు ప్రజల చరిత్రలో భాగంగా చూడలేదు. విచిత్రంగా రాజకీయ కోణం నుంచి చరిత్రను చూడటం నన్న య కాలం నుంచే మొదలైంది. సంస్కృత భారతం లో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్టు ప్రస్తావన ఉంది. దుష్టుల పక్షాన పోరాడిన చరిత్ర మనకెందుకని నన్నయ తెలుగు భారతంలో ఆ ప్రస్తావన తొలిగించారు. అదే ఆంధ్ర సాహితీ చరిత్రకారులు నన్నయను ఆదికవిగా ప్రకటించి తెలుగు భాషా చరి త్ర ప్రాశస్త్యాన్ని, ప్రాచీనతను కుదించివేశారు. అం దుకే కావచ్చు తెలుగుకు ప్రాచీన భాష హోదా గురిం చి ఆంధ్ర ప్రభుత్వం కొట్లాడటం మానేసింది. తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి ఆధారాలు సమర్పించిన తర్వాత కానీ తెలుగుకు ప్రాచీనభాష హోదా రాలే దు. చరిత్ర మొత్తం ఆంధ్ర ప్రాంత దృక్పథం నుంచే చూశారు. శాతవాహనుల చరిత్రనే తీసుకోండి. దాని ని ఆంధ్ర చరిత్రకారులు రివర్సులో వివరించే ప్రయ త్నం చేశారు. శాతవాహనుల చరిత్ర మొదలైంది పైఠాన్‌లో. రాజ్యం చేసింది కోటి లింగాలలో.

వారి కార్యస్థలం అంతా దక్కను పీఠభూమి. నాసిక్ నుం చి కృష్ణానది దాకా వారు చాలాకాలం రాజ్యం చేశా రు. అంత్యకాల రాజధాని అమరావతి. కానీ ముం దు చరిత్రనంతా వదిలేసి తదుపరి చరిత్రను మాత్ర మే రాసేందుకు, కీర్తించేందుకు ప్రయత్నించారు. బౌద్ధం, జైనం తెలంగాణలో క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి ఉన్నట్టు ఫణిగిరి, కొండాపురం, ధూళికట్ట, కొలనుపాక ఆధారాలు చూపెడుతున్నా యి. ఫణిగిరిలో అశోకుని శాసనం లభించినట్టు చరి త్ర పరిశోధకులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా కృష్ణానది ఒడ్డున ఉన్న ఏలేశ్వరం ఒకప్పుడు నాగార్జునుడి విద్యాపీఠంగా వర్ధిల్లిందని అస్పష్టమైన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. కృష్ణానది ఒడ్డున బయల్పడిన చారిత్రక అవశేషాలకు సంబంధించి సరైన రికార్డు లేదు. నందికొండ, ఏలేశ్వరంతోపాటు అత్యధిక గ్రామాలు మునిగిపోయింది తెలంగాణవైపు. కానీ చారిత్రక ఆధారాలన్నీ పోగేసింది నాగార్జున కొండపైన. ఇక్షాకు రాజు వీర పురుషదత్తుని శాస నం ఫణిగిరిలో దొరికింది. అంటే ఆయన నదికి ఈవ ల ప్రాంతాన్ని పాలించి ఉండాలి. ఆయన రాజ్యం, రాజధాని నదికి ఈవలి వైపు ఉండి ఉండాలి. చారిత్రక విజయపురి ఎక్కడ ఉండేదన్న విషయం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు.
katta-shekar-reddy

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవ రూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీ య మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు. స్థానిక జాతుల నుంచి ఘర్షణ తలెత్తిన తర్వాత వారు తమను మోన్ తెగగా చెప్పుకుంటున్నారు. మన దేశంలోనే ఎక్కడో గురుగ్రామంలో స్థిరపడిన సుధీర్ తైలంగ్ అనే ప్రముఖ కార్టూనిస్టు నేను తెలంగాణవాడిని కాబట్టే నా పేరులో తైలంగ్ అని పెట్టుకున్నానని చెప్పారు. తెలంగాణ మూలాలను వెతికిపట్టుకునే ప్రయత్నం జరుగాలి. తెలంగా ణ చరిత్రను ఇతిహాసకాలం నుంచి ఇప్పటివరకు తెలంగాణ చరిత్రను ఒక వరుసక్రమంలో రాసే ప్రయత్నం పెద్దఎత్తున జరుగాలి. కలకత్తా, చెన్నయ్, తంజావూరు, ఢిల్లీ ప్రాచ్య గ్రంథాలయాల్లో ఉన్న సమస్త సమాచారాన్ని క్రోడీకరించి చరిత్ర ఖాళీలను పూరించాలి. తెలుగు మహాసభలు అటువంటి పూని క తీసుకోవడానికి ఒకమంచి సందర్భం. ఇంటర్ విద్య వరకు తెలుగు భాషను తప్పని సరిచేయడం, తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించబూనుకోవడం తెలుగు భాషకు, తెలంగాణ వైభవ పునరుద్ధరణకు ఒక గొప్ప ప్రయత్నం. ఇదే స్ఫూర్తితో చరి త్ర నిర్మాణానికి కూడా పూనుకోవాలి.
[email protected]

3702

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా