ప్రత్యేక ప్రతిపక్షం


Sun,November 5, 2017 08:35 AM

ప్రాజెక్టులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతసేపూ గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమీషన్లు. కానీ ప్రాజెక్టులంటే నీళ్లొస్తాయని, రైతుల పొలాలు పారుతాయని, కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పువస్తుందని ఎన్నడూ ఆలోచించలేదు. ప్రాజె క్టు మొదలుపెడితే అది పూర్తిచేయాలని, పెట్టిన పెట్టుబడి రావాలంటే వీలైనంత త్వరగా పొలాలకు నీరివ్వాలని ఏనాడూ తాపత్రయ పడలేదు. ఇప్పటికీ అదే మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు. అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డంపడాలని చూస్తున్నారు. కేసులు వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నవారు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏమని అర్థం చేసుకుంటారు? పట్టిసీమపై అంతగా గోలచేసిన ఆంధ్ర ప్రతిపక్షాలు ఒక్కకేసయినా వేశాయా? కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులపై వందలాది బ్రిడ్జి కమ్ బరాజ్‌లు నిర్మించారు. ప్రాజెక్టులు నిర్మించారు. ఎప్పుడైనా కేసులవల్ల ఆగిపోయిన సందర్భం చూశామా? మన ప్రతిపక్షాలు ప్రత్యేకం.

ఎన్నికల నగారా మోగడానికి ఇక పదిహేను మాసాలు మాత్రమే మిగిలి ఉంది. రాజకీయ పునరేకీకరణలు, వడగాడ్పులు ఇప్పటికే మొదలయ్యా యి. ఇక నుంచి నెలలు గడిచే కొద్దీ ఇవి మరింత పెరుగుతాయి. అధికారంలో ఉన్నవారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికీ ఇది పరీక్షా సమయం. ఇం తకాలం ఎలా ఉన్నా ఇకముందు ఎలా ఉంటామన్నదే చివరలో ఓటర్ల నిర్ణయాలను ప్రభావి తం చేస్తుంది. అధికార టీఆర్‌ఎస్ ఏవైనా తప్పు లు చేస్తే తప్ప రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ప్రతిప క్షం కోలుకునే అవకాశాల్లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత దక్కవలసిన ఫలాలను ప్రజలకు అం దించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం సఫలమైంది. అభివృద్ధికి సం బంధించి, సంక్షేమ ఫలాలను అందజేయడం గురించి ప్రజల్లో ఎక్కడా ఫిర్యాదులు లేవు. మన రాష్ట్రం మన ప్రభుత్వం మన పాలన ఉంటే కలిగే ప్రయోజనాలేమిటో ప్రజలు చవిచూస్తున్నారు. నిరంతర విద్యుత్తు, గరిష్ఠస్థాయిలో సాగునీటి వినియోగం, అందరికీ తాగునీరు, అందరికీ సంక్షేమ పథకాలు.. ప్రభుత్వం చెప్పుకోవడానికి ఇలా చాలా పెద్ద విజయాల జాబితా ఉంది. అందుకే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు దాదాపు అన్ని సర్వేల్లో 70 శాతం మంది బాగుందనే సమాధానం చెబుతున్నారు. తేడా వస్తున్నదల్లా అక్కడక్కడా ప్రజాప్రతినిధుల పనితీరు, వ్యవహారదక్షతపైనే. ప్రభుత్వం సాధిస్తున్న సానుకూల ఫలితాలకు, ప్రజాప్రతినిధులు పొందుతున్న ప్రజామోదానికి మధ్య అంత రం ఉంది. దానిని భర్తీ చేయగలిగితే టీఆర్‌ఎస్‌కు ఇప్పుడప్పుడే సవాలు ఎదురయ్యే ప్రసక్తి లేదు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండవలసిన గులాబీ కేడర్ ఒక సంఘటిత శక్తిగా ఇంకా అవతరించలేదు. వివిధ రాజకీయ స్రవంతుల నుంచి వచ్చి చేరిన కేడర్ ఎవరి దుకాణం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారిని ఏకం చేసేందుకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రయత్నపూర్వకంగా సభలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది అన్నిచోట్లా జరుగాల్సి ఉంది. ఏ రాజకీయ నిబద్ధత లేకుండా కేవలం అవసరాల కోసమే వచ్చినవారు ఎక్కువకాలం నిలబడలేరు. వారికి ఒక రాజకీయ దార్శనికతను అందించి, సంఘటిత పర్చాల్సి ఉంది. అంతేగాక ఈ ప్రభుత్వం మనది, ఈ పార్టీ మనది, ఇవి కలకాలం ఉంటేనే మనం బాగుపడుతాం అన్న నమ్మకం కేడర్‌కు కలుగాలి. ఒకప్పుడంతా టీడీపీ అలా చేసింది కాబట్టే ఇంత అవసాన దశలో కూడా ఇంకా ఆ పార్టీ జెండా మోసేవారు మిగిలి ఉన్నారు.

తెలంగాణలో ఇప్పుడప్పుడే ప్రతిపక్షం లేచి నిలబడే అవకాశం లేదు. కేసీఆర్‌తో సరితూగే నాయకులు ఆ పార్టీలలో లేరు. రాజకీయ అనుభవం, వయస్సు గురించి కాదు. అనుభవంలో, వయస్సులో చాలామంది పెద్దవాళ్లు ఉన్నారు. కానీ వారెవరూ కేసీఆర్‌తో సాటిరాగల తెలంగాణ జ్ఞానాన్ని ఆర్జించలేదు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయం ఇలా ఏ రంగం గరించి అయినా గంటలుగంటలు మాట్లాడగల, చెప్పగల నాయకుడు ఒక్కరు కూడా ఇవ్వాళ ప్రతిపక్షంలో లేరు. ఇవన్నిటినీ మించి కేసీఆర్‌లాగా తెలంగాణ ఆత్మగలిగిన నాయకుడు లేడు. కేసీఆర్ తాను ప్రజాపక్షపాతిని అని ఈ మూడున్నరేండ్లలో రుజువు చేసుకున్నారు. ఎన్నో ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎవరూ అటువంటి పేరు సంపాదించలేదు. ప్రతిపక్షంలో ఏ నాయకుడూ నియోజకవర్గాన్ని దాటి ఆలోచించిన సందర్భం లేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో కూడా అణచివేత, ఆత్మహత్యలు చూసి చలించిపోయిన నాయకుడు ఒక్కరు కూడా లేరు. అప్పుడంతా వారు అధికార చేలాంచలాల్లో ఓలలాడుతూ ఉన్నారు. ఇంకొందరు సమైక్యాంధ్ర పార్టీల జెండాల కింద నీడకాచుకుంటూ కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడిచేయడానికి సమైక్య నాయకులకు కూలీలుగా పనిచేసిన నాయకులూ ఉన్నారు. అందుకే తెలంగాణలో టీడీపీ అంతర్థానం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. చాలామంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. మరికొందరు సీనియర్ నాయకులు ఎన్నికల సమయానికి టీఆర్‌ఎస్ వైపో, బీజేపీ వైపో అడుగులు వేస్తారు. తెలంగాణలో టీడీపీది ఇక ఒడిసిన కథే. ఎందుకంటే సమైక్యాంధ్ర పార్టీగా ఆ పార్టీ సంపాదించుకున్న పేరు ఎన్ని రంగులు వేసినా పోదు. టీడీపీ విధానంలోనే ప్రయోజన వైరుధ్యం ఉంది. నాయకులు సమైక్యాంధ్రకు ప్రతినిధులు. ఇప్పుడు ఆంధ్రకు ప్రతినిధులు. వారు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడటం సహజం. ఆంధ్ర ప్రయోజనాలతో తెలంగాణ ప్రయోజనాలకు సంఘర్షణ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా పునాది అదే. అందుకే చంద్రబాబునాయుడు పక్కన నిలబడి మాట్లాడేవారిని తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేదు. చాలాకాలంగా రాష్ర్టాన్ని ఏలిన పార్టీ, ఎంతో శ్రద్ధగా కార్యకర్తలను పోషించిన పార్టీ కావడం వల్ల ఇంకా ఆ మాత్రమైనా మిగిలి ఉన్నారు. నాయకత్వానికి అర్థమయింది కాబట్టే ఇటూ అటూ దూకుతున్నారు.

పార్టీ మారినంత మాత్రాన ఒక్కసారే ఇమేజెస్ మారిపోవు. ఆ ఇమేజెస్ చాలాకాలంగా సంపాదించుకున్నవి. పద్నాలుగేండ్లు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఎవరి కొమ్ముకాస్తూ ఉన్నారో జనం గుర్తుపెట్టుకుంటారు. అంత సులువుగా మర్చిపోరు. ఇప్పుడు ఒక నాయకుడు కాంగ్రెస్‌లో చేరి చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ తక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందా? కాంగ్రెస్ తన పాపాలను తిట్ల తో, శాపనార్థాలతో, ఆరోపణలతో దాచిపెట్టగలదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన మా పార్టీకి ఏమిటి ఈ దుస్థితి? అని ఇటీవల చాలా పెద్దాయన బాధ వ్యక్తంచేశారు. సింపుల్. మీరు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడలేదు. కొట్లాడాల్సిన సమయంలో కొట్లాడలేదు. నిలబడాల్సిన సమయంలో నిలబడలేదు. తెలంగాణ అంతా ఒకపక్క పోతుంటే మీరుమాత్రం ప్రభుత్వాన్ని పట్టుకొని వేలాడారు. జనానికి మండదా? అని ఒక సీనియర్ సిటిజన్ సమాధానం ఇచ్చాడు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ అనుకూల నిర్ణయం చేసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో మీడియాను పిలిచి పిచ్చికూతలన్నీ కూస్తుంటే, ఆ మాటలు విని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు ఆయనను ఎదిరించారా? సచివాలయంలో మరోసారిలా మాట్లాడితే మర్యాదగుండదు. విభజన నిర్ణయం జరిగిపోయింది. ఇక నువ్వు మా నాయకుడివే కాదు. అని ఒక్క నాయకుడయినా అనగలిగాడా? ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని సంతకాలు చేస్తూ కూర్చున్నారు. అప్పుడు తెలంగాణ సమాజం అనుభవిస్తున్న క్షోభను ఒక్క టీఆర్‌ఎస్, తెలంగాణ ఉద్యమసంస్థలు మాత్రమే పట్టించుకున్నాయి. అందుకే 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కాదని టీఆర్‌ఎస్‌కు వరమాల వేశారు అని మరో రిటైర్డు ఉద్యోగి చెప్పారు. ఈ సంభాషణ ఎందుకంటే, జనం అన్నీ గుర్తుపెట్టుకున్నారు. పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కరోజు కూడా పట్టించుకోని వాళ్లు ఇప్పుడు గుం డీలు తీసి గుండెలు చూపిస్తే ఒరిగేదేమీ లేదు. వారు చేసిన పాపాలు అంత తొందరగా తెలంగాణ ప్రజలు మరిచిపోరు.
katta-shekar-reddy
తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చిన ఇన్నేండ్ల తర్వాత కేసీఆర్‌లాగా దట్టీ లు కట్టడం, కండువాలు మెడలో వేసుకోవడం, విరుపులు పొడుపులతో మాట్లాడటం మొదలుపెడి తే కాపీ కొట్టడం అవుతుంది. అసందర్భం అవుతుం ది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రతీకలను, అస్తిత్వ చిహ్నాలను స్థాపిస్తూ సాగిన కాలం వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కేసీఆర్‌ను సవాలు చేయాలంటే కేసీఆర్‌లాగా తెలంగాణను ఔపోసన పట్టాలి. తెలంగాణకు కేసీఆర్ చేస్తున్నదేమిటో గుర్తించి, అంతకం టే గొప్పగా ఏమిచేయగలరో చెప్పాలి. ఉత్తమాటలు, పొల్లు ఆరోపణలను జనం పట్టించుకోరు. ఒక సమగ్రమైన, అర్థవంతమైన ప్రత్యామ్నాయ ఎజెండాను చూపగలుగాలి. ప్రాజెక్టులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతసేపూ గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమీషన్లు. కానీ ప్రాజెక్టులంటే నీళ్లొస్తాయని, రైతుల పొలాలు పారుతాయని, కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పువస్తుందని ఎన్నడూ ఆలోచించలేదు. ప్రాజె క్టు మొదలుపెడితే అది పూర్తిచేయాలని, పెట్టిన పెట్టుబడి రావాలంటే వీలైనంత త్వరగా పొలాలకు నీరివ్వాలని ఏనాడూ తాపత్రయ పడలేదు. ఇప్పటికీ అదే మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు. అడుగడుగు నా ప్రాజెక్టులకు అడ్డంపడాలని చూస్తున్నారు. కేసు లు వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నవారు కాంగ్రెస్ నాయకత్వా న్ని ఏమని అర్థం చేసుకుంటారు? పట్టిసీమపై అం తగా గోలచేసిన ఆంధ్ర ప్రతిపక్షాలు ఒక్క కేసయినా వేశాయా? కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులపై వందలాది బ్రిడ్జి కమ్ బరాజ్ లు నిర్మించారు. ప్రాజెక్టులు నిర్మించారు. ఎప్పుడైనా కేసులవల్ల ఆగిపోయిన సందర్భం చూశామా? మన ప్రతిపక్షాలు ప్రత్యేకం. నీళ్ల విలువ తెలియని నాయకత్వం. ఎజెండాలను తలకిందులుగా చూసే నాయకత్వం. ఇటువంటి ధోరణితో అధికారంలోకి రావ డం కాదుకదా, సరిహద్దుల్లోకి కూడా రాలేరు.
[email protected]

1166

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా