ప్రతిపక్షానిది ఇప్పటికీ పరాయితనమే


Sun,July 9, 2017 01:47 AM

హైదరాబాద్‌లో రెవెన్యూ రికార్డులను మాయంచేసి, ఫోర్జరీ చేసి, కార్యాలయాలను తగులబెట్టి, మనుషులను మాయం చేసి, ఎన్ని దారుణాలకు పాల్పడాలో అన్ని దారుణాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలది. ఆ పాపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. ప్రతిపక్ష నాయకులు కళ్లు తెరువకముందే ముఖ్యమంత్రి రిజిస్ట్రేషన్ల శాఖను ఆసాంతం ప్రక్షాళన చేశారు. కేసీఆర్ ప్రజాపక్షపాతమే తత్త్వంగా పనిచేస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని పక్షాలు తెలంగాణ ప్రతిష్ఠను, హైదరాబాద్ ప్రతిష్ఠను పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదు. గోరంతను కొండంతలు చేయడానికి, కొండంత అభివృద్ధిని గోరంతగా చూపడానికి ప్రయత్నిస్తున్నాయి. చెడు వినవద్ద ని, చెడు కనవద్దని ఎవరూ చెప్పరు. ప్రతిపక్షాల హక్కునూ, ఇతర సామాజికశక్తుల వాదోపవాదాలనూ ఎవరూ కాదనరు. కానీ మంచి గురిం చి అసలే మాట్లాడవద్దని కంకణం కట్టుకోవడ మే అన్యాయం. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తెలంగాణ ఉద్యమకాలంలో ఎలాగైతే థర్డ్ పార్టీ పాత్ర పోషించాయో, ఇవ్వాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పాత్రను పోషిస్తున్నాయి. తెలంగాణను అప్పుడూ మాదీ అనుకోలేదు. ఇప్పుడూ మాదీ అనుకోవడం లేదు. ఉద్యమకాలంలో నాయకుడు కేసీఆర్, ఉద్యోగులు, మేధావులు వందల విషయా లు మాట్లాడుతుంటే, ఈ పార్టీలన్నీ మూతులు కట్టుకుని నన్నంటుకోమాకు నామాల కాకి అన్నచందంగా వ్యవహరించాయి. కేసీఆర్ తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతుంటే, ఈ పార్టీలన్నీ ఎవరి కలుగుల్లో వారు కూర్చుని తమ తమ పార్టీలకు, అధిష్ఠానాలకు ఇబ్బందులు కలుగకుండా వ్యవహరించాయి. అంటే పూర్తిగా పరాయి పాత్రనే పోషించాయి.

ఇప్పుడు తెలంగాణ వచ్చిన మూడేళ్ల తర్వాత కూడా వారిని ఆ పరాయితనమే వెంటాడుతున్నది. తెలంగాణకు చెందనివారుగానే వారు వ్యవహరిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆ పార్టీలు సాగిస్తున్న విద్రోహకర పాత్రే ఆ పార్టీల పరాయితనాన్ని చూపెడుతున్నది. ఒక ప్రాజెక్టు వస్తే వందల వేల గ్రామాలకు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు సాగునీరు అందుతుంది. లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఎండిబీటలు వారిపోయిన భూములు పచ్చని పంటపొలాలతో అలరారుతా యి. కానీ భూనిర్వాసితులను అడ్డం పెట్టుకుని ఈ పార్టీలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆం ధ్ర నాయకత్వానికంటే ఎక్కువగా కేసులు, కుట్రలు చేస్తున్నయి. ఎక్కడయినా పార్టీలు ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ప్రజలకు నీళ్లివ్వాలని కోరుతాయి. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారే. వారు ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారయినా ఎస్‌ఎల్‌బీసీ టన్నెలు గురించి మాట్లాడిన సందర్భం లేదు. అదెంతవరకు వచ్చిందో చూద్దామన్న ధ్యాసలేదు. మహబూబ్‌నగర్‌లో అయితే కొందరు ఫ్లోరైడు పీడిత ప్రాంతాలకు నీరందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు అడ్డం పడటానికి కూడా తెగబడ్డారు. విషాదమేమంటే ఈ ప్రతిపక్షనాయకులు ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నిస్తారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసే వారికి నిధులు సమకూర్చుతారు. ఒక ప్రాజెక్టుపై ఒక కేసు ఓడిపోతే మరో కేసు వేయిస్తారు. మరో కోర్టులో వేయిస్తారు. ఇటువంటి వారిని పరాయివారుగా కాక తెలంగాణవాళ్లుగా ఎందుకు చూడాలి?

లోపమంతా అసలు ఈ పార్టీల ఆలోచనా విధానంలోనే ఉంది. వీరికి నాడూ నేడూ ఎప్పుడూ ఇక్కడి ప్రజాపక్షపాతం లేదు. సమస్యల సోయి లేదు. నీళ్లసోయి లేదు. ప్రజలకు నీరివ్వాలన్న తాపత్రయం లేదు. నదీ గమనాలు తెలియవు. నదుల్లో నీరు ఎంత ఉందో తెలియదు. ఏవో ప్రాజెక్టుల ఫైళ్లు తమ వద్దకు వచ్చాయా, సంతకాలు చేశామా, కాంట్రాక్టర్లతో చుట్టరికం చేశామా అంతటితోనే వారి పని అయిపోయేది. ప్రాజెక్టులు ఇచ్చాము. పూర్తయ్యాయా? నీళ్లొచ్చాయా? అన్న జిద్దు ఎప్పుడూ కనబర్చలేదు. అసలది తమకు సం బంధించిన విషయమే కాదన్నట్టు వ్యవహరించారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణ అంతా సం ఘటితంగా పోరాడుతుంటే అప్పుడు నీటిపారుదల మంత్రిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆ ప్రాజెక్టువల్ల నష్టమే లేదు పొమ్మన్నాడు. రాయలసీమకు రావలసిన న్యాయమైన నీటివాటాను తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు సామర్థ్యాన్ని అంతకుముందు ఉన్నదానికంటే పెంచాల్సిన అవసరమే లేదు. కానీ ఏకంగా ఐదు రెట్లకు పెంచుతుంటే మంత్రివర్గంలో ఉన్నవారు ఆమోదం తెలిపారు. ఒక్క నిరసనలేదు. ఒక్క అసమ్మతి లేదు.

తెలంగాణ విద్యుత్ కోతలతో అల్లల్లాడుతుంటే ఒక్కనాడూ ఈ మంత్రులు నోరు మెదిపింది లేదు. రైతులు ఆందోళన చేస్తే కేసులు పెట్టి లోపల వేయించిన ఘనాపాఠీ లు వీళ్లు. చిత్తశుద్ధి ఉంటే రైతులకు విద్యుత్తు ఇవ్వొ చ్చు అని అప్పుడు ఆంధ్ర నాయకత్వాలతో కొట్లాడింది లేదు. ప్రజలకు ఏదన్నా చేసి, ప్రజలను గెలిపించి మనం గెలుద్దాం అని కాకుండా, అధికారం లో ఉండగానే ఎంతో కొంత వెనుకేసుకుని ఎన్నికల సమయంలో ఏదో ఒకటిచేసి గెలుద్దాం అనుకోవడ మే వారి తత్త్వం అయిపోయింది. అందుకే వారు తెలంగాణ ఆత్మతో ఏనాడూ మమేకం కాలేదు. కలి సి నడువలేదు. ఎంతో దూరం ఎందుకు? ఆంధ్ర ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వాళ్ల తాత జాగీరు ఏదో తెచ్చి ఇక్కడ పంచిపెడుతున్నట్టు అసెంబ్లీలో అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్నప్పుడు కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ బిడ్డలకు రోషం రాలేదు. తెలంగాణ మూన్నాళ్లకు రాబోతుందని ఖాయమైన తర్వాత కూడా మీకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంటే ఒక్కరంటే ఒక్కరు ఇది తప్పని చెప్పలేదు. మంత్రిపదవులకు రాజీనామాలు చేసినట్టు ప్రకటించి, ఇండ్లకు ఫైళ్లు తెచ్చుకుని సంతకాలు పెట్టిన ఘనులు వీరు. వీరు తెలంగాణను మాదీ, మనదీ అని ప్రకటించుకునే ప్రయత్నమే చేయలేదు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకా ఏం కావాలి? ఇప్పటికీ అదే పరాయితనం.

మా ఊరును కాంగ్రెస్ నలభై ఏళ్లు పాలించింది. సీపీఎం ఇరవైఏళ్లు పాలించింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరుగలేదు. మా ఊరికి మొదటిసారి మంచి నీరు పథకం వచ్చినప్పుడు కూడా సీపీఎం సర్పంచిని గెలిపించారు కాబట్టి నీరు ఇవ్వకుండా అడ్డుకున్నాడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. వీధిపోరాటా లు చేసి ఉదయసముద్రం నీళ్లు తెచ్చుకోవలసి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు మళ్లీ తవ్వారు. వరద కాలువల పనులు వేగం అందుకున్నాయి. బురదకొట్టుకుపో యే వీధులు ఇప్పుడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. ఊర్లో సుమారు 600 మందికి పించన్లు వస్తున్నాయి. అన్ని పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి. మా ఊరికి ఇన్ని నిధులు రావడం ఇంతవరకు చూడ లేదు అని నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామ యువకుడు వివరించుకుం టూ పోయాడు. ఇది ఒక గ్రామం కథే. కాదు ప్రతి గ్రామం, మండలం, జిల్లాల కథ. మొత్తం తెలంగాణ పరిస్థితి ఇది. వికేంద్రీకృత అభివృద్ధిని వేగవంతం చేయడం అంటే ఏమిటో తెలంగాణ చవి చూస్తున్న ది. అందుకు ప్రధాన కారణం తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం. తెలంగాణ గోస తెలిసిన నాయకుడు విధానాలు, పథకాల రచన చేయడం.

పరిపాలించేవారికి స్థూల దృష్టి, సూక్ష్మదృష్టి రెండూ ఉండాలి. ఈ రెండూ కలిసిన సమగ్రదృష్టితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విధానా ల రూపకల్పన, కార్యాచరణ చేపడుతున్నారు. అం దుకే సత్ఫలితాలు వస్తున్నాయి. పొద్దున్నే లేచి పత్రికలు ముందేసుకుని వానల పరిస్థితి ఏమిటి? చెరువులు నిండాయా? రిజర్వాయర్ల కు నీరొస్తుందా? రైతులు పంటలు వేసుకుంటున్నా రా? కరెంటు ఇబ్బందులేమీ లేవు కదా? అని ఒక రైతు లాగా ఆలోచించి, వాకబు చేసే ముఖ్యమంత్రు లు ఎంతమంది ఉంటారు? ఎప్పటికప్పుడు కొత్త భావాలను పోగు చేయడం, వాటిని ఆచరణలో పెట్టడానికిగల అవకాశాలపై మేథోమథనం చేయడం, ఏం చేస్తే ప్రజలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారో ఆలోచించడం కేసీఆర్‌కు ఒక వ్యసనం. ఆయనే కాదు తన చుట్టూ ఉన్నవారిని కూడా అలాగే ఆలోచింపజేయ డం ఆయనకు మొదటినుంచీ అలవా టు. కొట్లాడితెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా చూసుకోవాలన్నది ఆయన తాపత్రయం. ప్రపంచం ముందు గొప్ప నమూనాగా రాష్ట్రం వృద్ధి చెందాలన్నది ఆయ న ఆరాటం. ప్రతిపక్ష నాయకులకు, కేసీఆర్‌కు ఉండే తేడా అది.

టీఆర్‌ఎస్ నాయకులు ఏవో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, భూ కుంభకోణాలనీ, కల్తీలు జరుగుతున్నాయని, నకిలీలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ బయటపడ్డాయని.. ఇలా ప్రతిపక్షాలు విసురుతున్న ఆరోపణల బాణాలన్నీ వారికే తగులుతాయి. ఇవ న్నీ కాంగ్రెస్, టీడీపీల ఏలుబడిలో పెరిగి పెద్దవయిన విషవృక్షాలే. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది ఆ వృక్షాల మూలాలను పెకిలించే ప్రయత్నమే. ఈ వ్యవస్థలన్నింటినీ దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న ది. కల్తీలు, నకిలీలపై ఇంత తీవ్రంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? నకిలీ విత్తన వ్యాపారులపై మొదటిసారిగా పీడీ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వమే. హైదరాబాద్ నగరంలో కల్తీలు, నకిలీలు, హోటళ్ల నిర్వాకాలపై ఉక్కుపాదం మోపుతున్నదీ ఈ ప్రభుత్వమే. అన్ని రకాల కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించే లక్ష్యంతో కొత్తగా చట్టం తీసుకురావాలని నిర్ణయించిందీ ఈ ప్రభుత్వమే. యువత జవసత్వాలను ఆసాంతం పీల్చివేసే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందీ ఈ ప్రభుత్వమే. దౌర్జన్యానికి దిగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న టీఆర్‌ఎస్ కార్పొరేటరు తండ్రిని అరెస్టు చేసి లోపలేసింది కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. భూ కుంభకోణాలకు అడ్డుకట్ట వేయడానికి పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు ప్రారంభించిందీ ఈ ప్రభుత్వమే. హైదరాబాద్‌లో రెవెన్యూ రికార్డులను మాయం చేసి, ఫోర్జరీ చేసి, కార్యాలయాలను తగులబెట్టి, మనుషులను మాయం చేసి, ఎన్ని దారుణాలకు పాల్పడాలో అన్ని దారుణాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలది. ఆ పాపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. ప్రతిపక్ష నాయకులు కళ్లు తెరువకముందే ముఖ్యమంత్రి రిజిస్ట్రేషన్ల శాఖను ఆసాంతం ప్రక్షాళన చేశారు. కేసీఆర్ ప్రజాపక్షపాతమే తత్త్వంగా పనిచేస్తున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నాయి. అందువల్ల వీళ్లు పెట్టే శాపాలేవీ తెలంగాణ ప్రభుత్వానికి తగులవు. తెలంగాణతనం లేని వీరి చేష్టలు ఏవీ ఏనాటికీ ఇక్కడి ప్రజల మనసులను గెల్చుకునే అవకాశం లేదు.
[email protected]
Katta-sekhar

1161

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా