ఊసరవెల్లి చంద్రబాబు


Sun,June 4, 2017 01:14 AM

చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఈ పాటికి రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. ఎన్ని అంతస్తుల భవనమైనా మూడేండ్లకు మించి పట్టదు. ఆయన చేసిన వృథా ఖర్చులతోనే అసెంబ్లీకి, సచివాలయానికి సరిపోను నిర్మాణాలు పూర్తిచేసి ఉండవచ్చు. కానీ చం ద్రబాబు లక్ష్యం అది కాదు. రాజధానిని తన సొంత ఎస్టేట్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఇంతవరకు అసలు నిర్మాణాలు చేపట్టలేదు. ఇవ్వాళ భవంతులు కట్టడానికి సింగపూర్, హాంకాంగ్, టోక్యో నిపుణులు అవసరం లేదు. నిర్మాణరంగంలో భారత దేశాన్ని మించిన దేశం ఏమీ లేదు. దుబాయ్‌లోని బుర్జు ఖలీఫా నిర్మాణంలో కూడా మన ఇంజినీర్లదే ప్రధాన పాత్ర.

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో! రాష్ర్టావతర ణ దినోత్సవం రోజున చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగం ఆయన అజీర్తిని, అక్కసును, ఉక్రోశాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ ఆరు దశాబ్దాల్లో ఆంధ్ర ఆధిపత్యశక్తుల వల్ల తెలంగాణ ఎంతగా నష్టపోయిందో, తెలంగాణను కొల్లగొట్టే అవకాశం చేజారిపోయినందు కు ఇప్పుడు ఎంతగా ఆక్రోశిస్తున్నాయో చంద్రబాబు మాటలు వింటే అర్థమవుతుంది. చంద్రబాబు మారడు, మారినట్టు నటిస్తుంటాడు. బుద్ధి మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉం టుంది. చంద్రబాబునాయుడు 2009 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తాం అని తమ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఆయనను ఎవరూ నమ్మలేదు. చంద్రబాబు మోసగాడు అని తెలుసు. ఆయన మోసం 2009 సాధారణ ఎన్నికల్లోనే బట్టబయలైంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్టే పెట్టుకుని, 30 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీ అభ్యర్థులుగా దింపాడు.

ఆ దెబ్బతో తెలంగాణవాదాన్ని, టీఆర్‌ఎస్‌ను నాశనం చేయవచ్చని కుట్ర పన్నాడు. అయి తే ఒక్క మేలు జరిగింది. ఒక ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ అధికారికంగా తీర్మానం చేయ డం ఆరోజుకు ఒక ఘన విజయం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రె డ్డి ఒక్కడే తెలంగాణకు అడ్డమూ నిలువూ అయి కూర్చున్నాడు. నిజానికి 2006లోనే తెలంగాణ ఏర్పడి ఉండాలి. అప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. తెలంగాణ ఉద్యమాని కి వ్యతిరేకంగా ఎన్నికుట్రలు చేయాలో అన్ని కుట్రలు రాజశేఖర్‌రెడ్డి చేశాడు. 2009 ఎన్నికలలో కూడా మొదటి దశ ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని రెండోసారి గెలిచాడు. ఎటొచ్చీ చివరిదాకా తెలంగాణకు అడ్డంగా నిలబడింది రాజశేఖర్‌రెడ్డి.

చంద్రబాబునాయుడిది ఎప్పుడూ అవకాశవాద వైఖరే. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీలు లేదని చెప్పిన పెద్దమనిషి, 2009 ఎన్నికలు వచ్చేసరికి ఓట్లకోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ నిర్ణయం చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వా త మళ్లా ఆ ఊసే లేదు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాణాలకు తెగించి దీక్ష పూనారు. రాష్ట్రమంతా ఉద్యమం తీవ్రతరమైంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టండి సమర్థి స్తామని చంద్రబాబు చెప్పాడు. అసెంబ్లీలో ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ అభిప్రాయాలు చెప్పాయి. ముఖ్యమంత్రి రోశయ్య అదే నివేదిక కేంద్రానికి పంపారు. కేంద్రంలో బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉంది. అప్పటికి కేసీఆర్ దీక్ష 11వ రోజుకు చేరింది. పార్లమెంటులో కూడా అన్నిపక్షాలు కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళ న వ్యక్తంచేశాయి. దీంతో 2009 డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు పేద్ద పిల్లిమొగ్గ వేశాడు. ఆంధ్ర ఆధిపత్యశక్తులను రెచ్చగొట్టి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి ఉత్తుత్త నమూనా రాజీనామా పత్రాలు ఆం ధ్రా ఎమ్మెల్యేలందరికీ పంపించి సంతకాలు చేయిం చి, రాజీనామాల నాటకం ఆడించాడు. చంద్రబా బు, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఠా కుట్రల కారణంగా తెలంగాణ మూడేండ్లు వెనుకకుపోయింది. స్వరా ష్ట్రం ఇక రాదేమోనన్న నిరాశానిస్పృహల్లో వందలా ది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకోవల సి వచ్చింది. సమ్మెలు, బంద్‌లు, ర్యాలీలు, పోలీసు ల నిర్బంధాలు.. తెలంగాణ అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. అయినా తెలంగాణ పట్టినపట్టు పట్టువిడువకుండా నిలిచిగెలిచింది. మూడేం డ్లు గడిచాయి. చంద్రబాబు అప్పటినుంచి ఇప్పటిదాకా అదే పాట పాడుతున్నడు.

విస్మయం కలిగించే అంశమేమంటే ఇంకా టీడీ పీ దిమ్మలు, జెండాలు, ఏజెంట్లు ఈ రాష్ట్రంలో మిగి లి ఉండటం. చంద్రబాబు ఎజెండాను మోస్తూ తెలంగాణవాదులపై, తెలంగాణ ప్రభుత్వంపై దాడు లు చేయడం. వీళ్లకు ఆత్మాభిమానం, చీమూ నెత్తు రూ ఉన్నాయా? ఇంకా ఆ ఆంధ్ర పార్టీలో ఎలా ఉం టున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ ఏద న్నా ఉంటే ఆంధ్రాలో బతుకనిస్తారా? తెలంగాణ సహనం ఎంత గొప్పది అని పదవీవిరమణ చేసిన ఓ చరిత్ర అధ్యాపకుడు ఆవేశంగా అన్నారు. ఒక కఠిన వాస్తవం ఏమంటే తెలంగాణపై చంద్రబాబుకు ఇంకేమాత్రం ఆశలు లేవు. తెలంగాణలో ఆశలు పెట్టుకున్నవారెవరూ రాష్ట్ర విభజనపై ఇంత దుర్మార్గంగా మాట్లాడరు. వచ్చే ఎన్నికల్లో మొన్న వచ్చిన సీట్లు, ఓట్లు కూడా రావని ఆయనకు బాగా తెలుసు. అయినా తెలంగాణవాళ్లు తెలివితక్కువ వాళ్లని ఆయ న నమ్మకం. మరికొంతకాలం భ్రమలు సాగుచేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. అసలు విషయం మాత్రం ఓటుకు నోటు కేసు కోసం మాత్రమే తెలంగాణ టీడీపీ శాఖను మోస్తున్నారు. ఒక ప్రత్యేక అవసరం కోసం మాత్రమే ఇంకా ఇక్కడ జెండా పీకేయకుండా కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఇంకా డబ్బు ఖర్చుపెట్టడం అవసరమా అని చంద్రబాబు సన్నిహితులు వరంగల్ ఎన్నికల సమయంలోనే ప్రశ్నించారట. ఇక్కడి నాయకులేమో ఇంకా చంద్రబాబు వలలకు చిక్కుతూనే ఉన్నారు.

తెలంగాణ విముక్తి పొందినా వారు మాత్రం ఇంకా ఆయన సేవలో తరిస్తూనే ఉన్నారు. చంద్రబాబుది ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు ప్రత్యేక హోదా విషయంలోనూ అవకాశవాదమే. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదించింది అప్పటి ప్రతిపక్ష నాయకుడు వెంకయ్యనాయుడు. ఐదేండ్లు కాదు పదేం డ్లు కావాలని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు అందరూ ఒక్కటే పాట పాడారు. ఆంధ్రకు అన్యాయం జరిగిందనే పేరుతో పోలవరం ప్రాజెక్టుకోసమని తెలంగాణ నుంచి ఏడు మండలాలను లాగేసుకోవడంలో కూడా వీరిద్దరిదే ప్రధాన పాత్ర. ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా లేదు పొమ్మంటే, అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం, ప్రత్యేక హోదా ఎం దుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని మాటలు మార్చిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఆంధ్ర ప్రజల సంరక్షకులుగా పోజులు పెడితే జనం నమ్మాలి. చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రయోజనాల రక్షకునిగా పాత ఏడుపే ఏడిస్తే జనం కరిగిపోవాలి? జనం ఒక్కసారి మోసపోతారు. పదేపదే మోసం చేయడం సాధ్యం కాదు. ఏ మాత్రం నిజాయితీ లేని నాయకులు వీళ్లు.

చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఈ పాటికి రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. ఎన్ని అంతస్తుల భవనమైనా మూడేండ్లకు మించి పట్టదు. ఆయన చేసిన వృథా ఖర్చులతోనే అసెంబ్లీకి, సచివాలయానికి సరిపోను నిర్మాణాలు పూర్తిచేసి ఉండవచ్చు. కానీ చం ద్రబాబు లక్ష్యం అది కాదు. రాజధానిని తన సొంత ఎస్టేట్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఇంతవరకు అసలు నిర్మాణాలు చేపట్టలేదు. ఇవ్వాళ భవంతులు కట్టడానికి సింగపూర్, హాంకాంగ్, టోక్యో నిపుణు లు అవసరం లేదు. నిర్మాణరంగంలో భారత దేశా న్ని మించిన దేశం ఏమీ లేదు. దుబాయ్‌లోని బుర్జు ఖలీఫా నిర్మాణంలో కూడా మన ఇంజినీర్లదే ప్రధా న పాత్ర. పెద్దపెద్ద విమానాశ్రయాలన్నీ మనవాళ్లు నిర్మించినవే. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లతోపా టు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం లో మనవాళ్లదే ప్రధాన పాత్ర. జీఎంఆర్, జీవీకేలు ఎంత ఖ్యాతి గడించాయో తెలుసు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నిర్మాణ కాంట్రాక్టర్లలో ఎక్కువమంది మనవా ళ్లే. కానీ చంద్రబాబు సామాన్యమైన నాయకుడు కాదు కదా. తెరవెనుక, తెరముందు ఎన్నో ఉంటా యి. అన్నీ సెటిల్ అయిన తర్వాత గానీ ఆయన ఏదీ చేపట్టరు. రాజధానిలో మరొక పక్షానికి చోటు లేకుం డా చేయడం, తనవాళ్లు మాత్రమే చుట్టూ ఉండేట్టు చూసుకోవడం, ఇంకా ఎన్నో పనులు చేయాలి. అం దుకే అసలు నిర్మాణాలు పక్కనపెట్టి కొసరు నిర్మాణాలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండ టం కోసం హైదరాబాద్ నుంచి వచ్చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆగమేఘాలపై ఎం దుకు పోవలసి వచ్చిందో ఓటుకు నోటు కేసులో ఉపయోగించిన ఫోన్ సంభాషణలు చెబుతాయి. ఆయ న నోరు తెరిస్తే నాది తెరిచిన పుస్తకం అని చెబుతా రు. నిజమే ఆయనది తెరిచిన పుస్తకమే. పేజీల నిం డా రక్తపు మరకలు, నల్ల మరకలే.
[email protected]
Shekharreddy

1395

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన