ఏమిటీ బీజేపీ గొప్ప


Sat,May 27, 2017 11:32 PM

పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఏడు మండలాలను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలను మూడేండ్లయినా విభజించకపోవడం, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తిచేయకపోవడం, ఆంధ్రకు ప్రకటించిన సగం ప్రాజెక్టులు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించకపోవడం.. బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాలా తయారుచేయవచ్చు. బీజేపీ దళిత పక్షపాతం ఒక నటన.

ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల పాలన పూర్తవుతున్న దశలో ఆయన నమ్మిన బంటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాదియాత్ర మొదలుపెట్టాడు. ఇది దండయాత్రలాగా సాగింది. దక్షిణాదికి తెలంగాణ గేట్‌వే అని ఆయనే చెప్పారు. పూర్వం దక్షిణాదిపై దం డయాత్రకు వచ్చినవారంతా దక్కను ద్వారానే ప్రవేశించారు. అప్పుడు కూడా ముందుగా దేవగిరి(మహారాష్ట్ర)ని నాశనం చేసి, ఆ తర్వా త తెలంగాణలో ప్రవేశించారు. మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో కలిసి అధికారంలో ఉన్నది. ఇక మిగిలింది తెలంగాణే అని వారు భావిస్తున్నట్టున్నారు. మోదీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ర్టాలే అని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నది. మైత్రి ద్వారా కాకుండా ఘర్షణ ద్వారా మాత్రమే బీజేపీని విస్తరించగలమని మోదీ, అమిత్‌షాల ప్రగాఢ నమ్మకం. పొత్తులు, మిత్రుత్వాలు తాత్కాలికం, ఒంటరిగా ఎదుగడమే దీర్ఘకాలికం అని ప్రగాఢంగా నమ్మిన నాయకులు వారు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిచోటా ఘర్షణకే దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ అన్నిచోట్లా ఒంటరిగానే ఎదుగడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ కూడా ఇది సంధికాలమే. విడిపోయిన దేశాలతో అఖండ భారతం సాధించడం సాధ్యం కాకపోవచ్చు కానీ, ఇప్పు డు ఉన్న దేశాన్ని ఏకఛత్రం కిందికి తీసుకురావడం సాధ్యమే అని వారు నమ్ముతున్నారు.

అది సాధించగలిగితే అఖండభారతం సాధించినట్టే అని భావిస్తున్నారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌలిక నినాదం. భారత ఏకాత్మతావాదం పేరుతో బీజేపీ అగ్రనేతలు దేశమంతా యాత్రలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ ఏకాత్మతావాద యాత్ర జరుగుతున్నది. ఈ యాత్ర నిరాటంకంగా ముందుకు సాగడానికి అవసరమైన అన్ని ఎత్తుగడలూ నరేంద్ర మోదీ ప్రయోగిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి మొదలు పెడితే ప్రత్యర్థులపై కేసులు, దాడులు, దర్యాప్తులు అన్నీ అందులో భాగమే. సరెండర్ ఆర్ ఫినిష్ అన్నది అప్రకటిత నినాదం.

నోట్ల రద్దు దేశంలోని ప్రత్యర్థి రాజకీయపక్షాలను ఆర్థికంగా నిరాయుధులను చేసే ఒక పెద్ద మంత్రం. అందుకే ఒక మేధావి దీనిని రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ద్వారా ఏమేమి జరుగుతాయని చెప్పారో అవేవీ జరుగలేదు. కశ్మీరులో శ్రీనగర్‌లో ఇప్పుడు సైన్యం కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. జీపులకు మనుషులను కట్టి ముందుకు అడుగులు వేయవలసిన అమానుష దుస్థితి ఇవ్వాళ సైన్యానిది. ఉగ్రవాదుల రాక ఆగలేదు. సరిహద్దులో కాల్పులు ఆగలేదు. జనం చావులూ ఆగలేదు. ఏదో ఒకరోజు యుద్ధం కూడా వస్తుందేమోనన్న ఆందోళన ఇవ్వాళ దేశంలోని మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. ఎన్నికలకు ముందు ఒక యుద్ధం వచ్చినా రావచ్చు. దండకారణ్యంలో మరణఘోష ఆగలేదు. ఇటు పోలీసులు, అటు నక్సలైట్లు, మధ్యలో మామూలు మనుషులు సమిధలు అవుతూనే ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణ వచ్చి సచ్చిందీ లేదు. బ్యాంకుల ఎన్‌పీఏలు ఏయేటికాయేడు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బ్యాంకుల సేవలు మెరుగు పడింది లేదు. యాభైశాతానికి పైగా ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. బ్యాంకుల్లో అకౌంటు ఉంటే డబ్బుండాలి. లేకుంటే వడ్డీలాగా పెనాల్టీలు పడతా యి. డబ్బులేకపోతే అక్కౌంటు మూసేసుకోవాలి. నోట్లరద్దుకు ముందు కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లు ఎన్ని చలామణిలో ఉన్నాయని చెప్పిం దో అన్ని నోట్లు బ్యాంకులకు వచ్చినట్టు లెక్కలు చెప్పింది.

మరి నల్లడబ్బు ఏమైంది? నోట్ల రద్దు కారణంగా అదనంగా సంపాదించిన ఆదాయపు పన్ను అయినా గణనీయంగా ఉందా అంటే అదీ లేదు. నోట్లరద్దు సందర్భంగా దొరికిన దొంగనోట్ల శాతం అసలు లెక్కలోకి తీసుకోదగింది కాదని ఆర్బీఐ లెక్క లు చెబుతున్నాయి. ఇవన్నీ కాగాపోగా నోట్ల రద్దు తర్వాతనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ధారాళంగా డబ్బు ఖర్చు చేశాయి. బీజేపీ అందరికంటే ఎక్కువగా ఖర్చు చేసిందని అక్కడ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన వారు చెబుతున్నారు. పోనీ రాజకీ య, అధికార యంత్రాంగాల్లో అవినీతి తగ్గిందా? మళ్లీ రేపు నల్లడబ్బు పోగుపడదని గ్యారంటీ ఉం దా? ఇవేవీ జరుగలేదు. జరుగవు. అయినా ఎందు కు చేశారూ అంటే తమ పార్టీ, తానూ, తనను ఆర్థికంగా బలపరుస్తున్నవారూ బలపడటానికి ఈ ఐదేళ్ల అధికారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోదల్చుకున్నారు. ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు ఆయనకు ఎదురుదెబ్బలు తగల్లేదు. దేశానికి మంచి జరిగినా జరుగకపోయినా ఆయన మాత్రం బలపడుతూనే ఉన్నారు.

ఎకానమీలో రెండు విడ్డూరాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఒకవైపు షేర్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతున్నది. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ది. మరోవైపు వేలాది మంది ఐటీ, ఆటోమొబైల్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్ లు జరుగుతున్నాయి. కొత్తగా ట్రేడ్ యూనియన్‌లు పెట్టుకోవాలన్న ఆలోచన ఐటీ ఉద్యోగులకు కూడా వచ్చింది. టాటా మోటార్స్, షెవర్లే కంపెనీలు వందలాదిమందిని రిట్రెంచ్ చేస్తున్నాయి. ఉద్యోగాల కల్ప న దారుణంగా దెబ్బతింటున్నది. అసంఘటిత రం గంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఒకనాటి బలుపూ ఊపూ వాపూ అన్నీ తగ్గిపోయాయి. నోట్ల రద్దుకు ముందు ఉన్న వెసులుబాటు ఇప్పుడు ఏ రంగంలోనూ లేదు. పది మందికి ఉపాధి కల్పిం చే అవకాశం ఉన్నా నలుగురితో సరిపెట్టుకోవలసిన పరిస్థితి. ఎగుమతులు తగ్గిపోయాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా మేకపోతు గాంభీర్యం దేశాన్ని నడిపిస్తున్నది. మాటలు, నినాదాలు అమ్మి అంతా సవ్యంగా ఉందని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మొన్న తెలంగాణకు వచ్చి అమిత్‌షా చేసిందీ ఆ ప్రయత్నమే. ఆయన తెలంగాణకు తమ సొమ్మేదో దోచుకొచ్చి పెట్టినట్టు మాట్లాడారు. లక్ష కోట్లు ఆయన జేబులోంచి ఇచ్చినట్టు చెప్పుకున్నారు. భారత దేశం రాష్ర్టాల సమాఖ్య. కేంద్రం ఒక మిథ్య. రాష్ర్టాల నుంచి వచ్చే ఆదాయమే కేంద్రం ఆదాయం. కేంద్రం గాలిలోంచి పుట్టించేది, సరిహద్దుల్లో, విదేశాల్లో సంపాదించేది ఏమీ ఉండదు. రాష్ర్టాల్లో జరిగే ఉత్పత్తులు, అందించే సేవలు, జరిగే అమ్మకాలు, చేసే ఎగుమతులు వాటిపై వచ్చే పన్ను ల ఆదాయమే కేంద్రం ఆదాయం. అంటే పునాది రాష్ర్టాలే. కేంద్రం నుంచి నికరంగా ప్రజలకు అందేది ఏమీ ఉండదు. కేంద్రం వద్ద ఎంత సొమ్ము ఉన్నా అందులో ప్రజలకు అందేది పదీ పరకా మాత్రమే. రాష్ర్టాల నిధులే ప్రజలకు పెన్నిధి. రాష్ర్టాలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తాయి. ప్రజలకు సంపదను పంపిణీ చేస్తాయి. కేంద్రం నిధులు అధిక మొత్తాల్లో పెద్దలకు గద్దలకు మాత్రమే దక్కుతాయి అని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ముమ్మాటికీ వాస్తవం.
బీజేపీ తెలంగాణకు ఏనాడూ చుట్టం కాదు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఆ పార్టీ పునాది వర్గాలు చేసింది ఇసుమంతైనా లేదు. 1969 ఉద్యమంలో కూడా వారు గొప్ప పాత్ర ఏమీ నిర్వర్తించలేదు.

గత రెండు దశాబ్దాల్లో బీజేపీ నిర్వర్తించిన పాత్ర కూడా అవమానకరమైనది, దాగుడుమూతలతో కూడుకున్నది. 1998 ఎన్నికల్లో ఒక ఓటు రెం డు రాష్ర్టాలు నినాదంతో గణనీయంగా ఓట్లు సాధించిన పార్టీ ఆ తర్వాత ప్లేటు పిరాయించి తెలుగుదేశంతో ఊరేగింది. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండిపోయింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సొం తబలాన్నే నమ్ముకున్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల సొంత బలమై కొట్లాడి, అనేక ఎత్తుపల్లాలు దాటుకుని తెలంగాణ సాధించింది. తెలంగాణ పేరు చెప్పక పోతే ఎవరికీ మెతుకు పుట్టని పరిస్థితిని ఆనా డు ఉద్యమ యోధుడు కె.చంద్రశేఖర్‌రావు సృష్టించారు. అందుకే కాంగ్రెస్ ఇవ్వక తప్పని పరిస్థితికి వచ్చింది. బీజేపీ మద్దతు ఇవ్వక తప్పని స్థితికి చేరిం ది. అయినా తెలంగాణ ఇచ్చే క్రమంలో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడిన నాటకాలన్నీ గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్పా రు. బీజేపీ తన ఆంధ్ర పక్షపాతాన్ని ఏనాడూ దాచుకోలేదు.
Katta-ShekarReddy
బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పునర్విభజన చట్టానికి మద్దతు ఇస్తూనే ఆంధ్రకు చేయవలసినదంతా చేశారు. పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఏడు మండలాల ను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలను మూడేండ్లయినా విభజించకపోవడం, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి చేయకపోవడం, ఆంధ్రకు ప్రకటించిన సగం ప్రాజెక్టులు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించకపోవడం.. బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాలా తయారు చేయవచ్చు. బీజేపీ దళిత పక్షపాతం ఒక నటన. దళితులపట్ల ఆ పార్టీ ఆధిపత్యవర్గాలు ఎలా వ్యవహరిస్తున్నాయో గుజరా త్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో గో రక్షణ పేరిట జరుగుతున్న ఘాతుకాలు ఏమిటో అందరికీ తెలుసు. అందువల్ల బీజేపీ తెలంగాణ ప్రజలను మాయ చేయలేదు. మోదీ, అమిత్ షా ఘర్షణ రాజకీయాలు ఎక్కడయినా పనిచేయవచ్చు, ఇక్కడ కష్టం.
[email protected]

4512

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు



        


Featured Articles