కృషితో నాస్తి దుర్భిక్షం


Sat,April 15, 2017 11:42 PM

ప్రభుత్వం ప్రాజెక్టుల వెంట, ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. ఇలాగే ముందుకుపోతే ప్రతిపక్షాలకు నూకలుండవు. వారేదైనా మంచిపేరు తెచ్చుకోవాలంటే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కొట్లాడాలే తప్ప, అర్థరహితమైన ఆరోపణలతో కాలయాపన చేస్తే తమకు జరిగే నష్టానికి ప్రజలు ప్రతిపక్షాలనే దోషులుగా నిలబెడుతారు.

kattashekharreddy
‘నిజమేనా. ఇది అయిత దా. ముఖ్యమంత్రి ప్రసంగం మీరు విన్నా రా? రైతులందరికీ ఎరువుల కోసం ఎకరాకు నాలుగు వేలు ఇస్తానన్నా రు. నేను నమ్మలేకపోతున్నా. అదేగనుక జరిగి తే జీవితంలో ఆయనను మరచిపోము. రైతు ల గురించి ఇంతగొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారొక్కరే అని రైతు గా స్థిరపడిన చిన్ననాటి మిత్రుడు ఒకరు ఫోను చేసి సం బురపడిపోయారు. ఆ రైతు గొంతులో ఉద్వే గం, సంభ్రమాశ్చర్యాలు అర్థం అవుతున్నాయి. ఇది ఆయన ఒక్కడి స్పందన కాదు. ఫోన్ సంభాషణల్లో, సామాజిక మాధ్యమాల్లో, విందు వినోదాల్లో ఎక్కడ చూసినా అదే చర్చ. ఆ రోజు మా పెద్దాయన కళ్లలో కళచూడాలి. ఎంత గొప్ప పని చేశారు? ఇక రైతు బతికిపోతాడు. వ్యవసాయ రంగంలో విప్లవం వస్తుంది. కరెంటు, నీళ్లు, ఎరువులు ఇస్తే అంతకంటే రైతుకు ఏమి కావాలి. రైతుగా తన మూలాలను మరచిపోలేదు కేసీఆర్ అని సంబురపడ్డారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. జనహితలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసినప్పుడు కూడా అవే ఉద్వేగాలు. అవే సంభ్రమాశ్చర్యాలు. అవే నినాదాలు. ఎవరూ ఊహించలేదు. ఎవరూ డిమాండు చేయలేదు. ముందుగా చర్చలేదు. రుణమాఫీ పూర్తయిన సందర్భంగా ధన్యవాదాలు చెప్పడానికి రైతులు వచ్చారు. ఎవరూ ఊహించ ని విధంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. రైతుల వ్యథలపై ఏదో ఒక అంతర్మథనం, ఏదో ఒక మానసిక సంఘర్షణ జరుగకుండా ఆయన అకస్మాత్తుగా ఈ ప్రకటన చేసి ఉం డరు.

ఆయన ఎప్పటినుంచో ఈ అంశంపై మనసుపెట్టి ఉండాలి. కేసీఆర్ మది ఆలోచనల కార్ఖానా. నిరంతరం కొత్తగా ఆలోచించడం ఆయన అలవాటు. తన సహచరులతో కూడా ఆయన అదే చెబుతారు. థింక్ ఔట్ ఆఫ్ ది బాక్స్. పరిష్కారం కానిదంటూ ఏదీ ఉండదు అని చెబుతుంటారు. అటువంటి ఆలోచనాధార నుంచే సంచలనాత్మకమైన ఈ ప్రతిపాదన వచ్చి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇటువంటి విధానాలు ప్రకటించడానికి దమ్ము ధైర్యం కావాలి. రాష్ట్ర ఆర్థిక స్వస్థతపై స్పష్టత ఉండాలి. అమలు చేయగల సంకల్పం ఉండాలి. కేసీఆర్ అంతదూరం ఆలోచించకుండా ఈ నిర్ణ యం ప్రకటించి ఉండరు.

ఈ మూడేళ్లలో కేసీఆర్ చేసిన అత్యుత్తమ నిర్ణయం ఇది. గ్రామీణ తెలంగాణ స్వభావ స్వరూపాలను మార్చే నిర్ణయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపన చేసే ప్రకటన ఇది. కులాలు, వర్గాలతో నిమిత్తం లేకుండా సమాజంలోని అన్నివర్గాలకు ఉపయోగపడే నిర్ణ యం. భూమి ఉన్న రైతులందరికీ ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయానికి పెట్టుబడికోసం అప్పులు చేయకుండా రైతులను కాపాడే ఒక గొప్ప యజ్ఞమిది. రైతులు అప్పుల ఊబిలో చిక్కడం పెట్టుబడుల వద్దే మొదలవుతుంది. పెట్టుబడి పెట్టి, పంటలు రాక, అప్పులు తిప్పలు పెట్టినప్పుడే రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. రైతులను ఈ సం క్షోభం అంచు నుంచి కాపాడటానికి ఇంతకంటే మంచి ఆలోచన మరొకటి ఉండదు అని సీనియర్ పాత్రికేయుడు ఒకరు వ్యాఖ్యానించారు. మీరు అదృష్టవంతులు. ప్రజాపక్షపాతం కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారు. రైతులకు ఆయన ఇవ్వనున్న భరోసా దేశ వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చనున్నది. ఏటా బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు, కంపెనీలు పెట్టి మాయమయ్యేవాళ్లకు మాఫీ చేసే వేల కోట్ల రూపాయలతో పోల్చితే ఇది చాలా స్వల్పం. దేశమంతా తెలంగాణ మార్గాన్ని అనుసరించాలి. రైతుల ఆత్మహత్యలను నిలువరించడానికి ఈ నిర్ణయం బాగా దోహదం చేస్తుంది.

farmers
ఆంధ్రలో కూడా ఈ విధానా న్ని అమలుచేయాలని డిమాండు వచ్చే అవకాశం ఉంది అని విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. స్వతహాగా వ్యవసాయాన్ని ఇష్టపడే ఒక ఉన్నతోద్యోగి, ఇదేగనుక నిజమైతే నేను ఈ ఉద్యోగం మానేసి ఓ పదెకరాలు కొనుక్కుని సాగుచేసుకుంటా. జీవితంతోపాటు మనసూ ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రాంతం, ఆ ప్రాం తం అని లేకుండా బుద్ధిజీవులు స్పందిస్తున్న తీరు కూడా కేసీఆర్ నిర్ణయం ఔన్నత్యాన్ని ఆకాశానికెత్తుతున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రైతును గురించి ఇటువంటి ఒక ఉదాత్త ఆలోచన చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కొన్ని రాయితీలివ్వ డం, రుణమాఫీలు చేయడం ఇంతకుముందు ఉన్నా యి. ఆర్థిక సంస్కరణల పేరిట వాటిని కూడా క్రమంగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న కాలం ఇది. కాలాన్ని ప్రతిఘటించి ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన ఈ నిర్ణయం ప్రకటించారు. పదహా రు వేల కోట్ల రుణాన్ని మాఫీచేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్ వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

ఎందుకంటే రాష్ట్రంలో 55 లక్షల భూ కమతాలు న్నాయి. అరవై శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది. నికరసాగులో ఉన్న భూమి ఒక కోటి 22 లక్షల ఎకరాలు. ఏడాది మొత్తంలో రెండు పంటల్లో సాగయ్యే భూమి కోటి 55 లక్షల ఎకరాలు. చిన్న, సన్నకారు రైతులు 47 లక్షల 67 వేల మంది. వీరు సాగుచేసుకునే భూమి ఐదెకరాల లోపు. ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతులు ఏడు లక్షల 86 వేల మంది. ఏ కులమూ, ఏ సామాజిక వర్గమూ ఇంత పెద్ద జనాభాకు ప్రాతినిధ్యం వహించదు. వీరిని ఆదుకోవడం అంటే గ్రామీణ తెలంగాణను ఆదుకోవడం. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్య స్థాపనకు ఇది నాంది అవుతుంది. శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉం డటం ఎంత ముఖ్యమో రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉం డటం అంతే ముఖ్యం. పట్టణాలలో సంపద పోగుపడుతున్నది. పట్టణాలలోనే ఎక్కువగా సంపద సృష్టి జరుగుతుందని ఆర్థికవేత్తలు లెక్కలు చెబుతా రు. సహజంగా ఎక్కడ సంపద సృష్టి జరిగితే అక్కడే పోగుబడిపోతుంది. ఎక్కడ సంపద ఎక్కువగా ఉం టే అక్కడికి జనం చేరిపోతారు. అందుకే పల్లెలు ఖాళీ అయి పట్టణాలు నిండిపోతున్నాయి. గ్రామా లు నివాసయోగ్యం, వ్యవసాయం లాభసాటి అయి తే, అక్కడ కూడా సంపద సృష్టి పెరిగితే గ్రామాలు గొప్పగా వర్ధిల్లుతాయి.

ఈ మూడేళ్లలోనే తెలంగాణ పల్లెల్లో చాలా మార్పు వచ్చింది. నిరంతరాయంగా కరెంటు ఇవ్వడం, ప్రాజెక్టుల నుంచి గరిష్ఠ స్థాయిలో నీటిని వినియోగించుకోవడం, పోయినేడాది కాలం బాగా అయి చెరువులు కుంటలు నిండటం తెలంగాణను ధాన్యాగారంగా మార్చివేసింది. ప్రభుత్వం పిలుపు మేరకు రైతులు పత్తి తగ్గించి మిర్చి పంట వేశారు. అసాధారణ రీతిలో మిర్చి పంట చేతికొచ్చిం ది. ఒక్క రోజే వరంగల్ మార్కెట్‌కు లక్షన్నర బస్తా లు, ఖమ్మం మార్కెట్‌కు లక్షన్నర బస్తాలు, సూర్యాపేట మార్కెట్‌కు లక్ష బస్తాలు మిర్చి వచ్చింది. పంట దిగుబడి పెరిగింది. ధర కూడా గతేడాదితో పోల్చితే పెరిగింది. కందులు కూడా అలాగే పండాయి.

ఇతర తృణధాన్యాల దిగుబడి కూడా బాగా పెరిగింది. వరి ధాన్యం కూడా చాలా పెద్ద మొత్తంలో మార్కెట్‌కు వస్తుందని, అందుకు పూర్తిస్థాయి కొనుగోలు ఏర్పా ట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇప్పుడు రైతు కృషికి ఉచిత ఎరువులు కూడా తోడయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రైతు అప్పు చేయకుండా వ్యవసాయం చేయగలిగితే పల్లెలు పట్టణాలవుతాయి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలను మంచి స్కూళ్లలో చదివించుకుంటారు. నాణ్యమైన జీవితం గడుపగలుగుతా రు. మొత్తంగా జీవన ప్రమాణాలు పెరుగుతాయి.

ఇప్పటికీ మన రాష్ట్రంలో చాలామంది ప్రతిపక్ష నాయకులకు నీటి విలువ తెలియడం లేదు. ఎక్కడైనా కొట్లాడుదాం. ప్రాజెక్టుల విషయంలో మాత్రం కాదు అని కర్ణాటక, మహారాష్ట్ర రాజకీయ పక్షాలు చూపిస్తున్న పాటి సోయి కూడా మనవాళ్లకు లేదు. చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో కుళ్లుమోతు తనం తప్ప మరొకటి కనిపించడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ నివేదిక వచ్చి నాలుగు దశాబ్దాలు గడచిపోయింది. బచావత్ తీర్పు ముగిసి పదహారేళ్లు గడిచిపోయింది. అయినా కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా జలాలు తెలంగాణకు రాలేదు. వాడుకోలేదు. గోదావరి నీరు ఇప్పటికీ సముద్రం పాలవుతూనే ఉంది. ఈ నాలుగు దశాబ్దా ల నిర్వాకాలకు కారకులైనవాళ్లు ఇప్పుడు ఇంకా పాతబుద్ధిని వదలడం లేదు. ఎప్పటిలాగే ప్రాజెక్టులంటే కమిషన్లు, వాటాలు అనుకుంటున్నారు తప్ప పల్లెలకు, పొలాలకు నీళ్లొస్తాయి అనుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లను, ఇంజినీర్లను, మంత్రులను ప్రాజెక్టుల వెంట ఎలా పరుగులు పెట్టిస్తున్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. అంతగా హడావుడి చేస్తేనే ఈసారి మహబూబ్‌నగర్‌లో సుమారు ఐదు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.

ఈ పని కాంగ్రెస్ హయాంలోనే చేస్తే ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్త యి, రోజంతా కరెంటు, చెరువుల్లో, బావుల్లో, బోరుబావుల్లో తగినన్ని నీళ్లు, వ్యవసాయానికి పెట్టుబడి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రభుత్వం ప్రాజెక్టుల వెంట, ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. ఇలాగే ముందుకుపోతే ప్రతిపక్షాలకు నూకలుండవు. వారేదైనా మంచిపేరు తెచ్చుకోవాలంటే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కొట్లాడాలే తప్ప, అర్థరహితమైన ఆరోపణలతో కాలయాపన చేస్తే తమకు జరిగే నష్టానికి ప్రజలు ప్రతిపక్షాలనే దోషులుగా నిలబెడుతారు.
[email protected]

1944

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా