వీరా ఉద్ధారకులు?


Sun,March 5, 2017 01:02 AM

తెలంగాణ అంతటా స్వరాష్ట్ర నినాదంతో కుతకుత ఉడికిపోతుంటే, సబ్బండవర్ణా లు, ఉద్యోగులు సమ్మెలు హర్తాళ్‌తో
వీధుల్లోకి వస్తుంటే, వందలాదిమంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తుంటే సచివాలయంలోని ఏసీ గదుల్లోనో లేక
తమ భవంతుల్లోని విలాస మందిరాల్లోనో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేసుకుంటూపోయారు. అప్పుడు జనం
బాధలేవీ వీరికి పట్టలేదు. ఇప్పుడు వీరిబాధలను జనం ఎందుకు పట్టించుకుంటారు? వీరి ఆవేదన జనం
ఆవేదన ఎందుకు అవుతుంది?

kattashekharreddy
చంద్రబాబు తన మనసులో మాట మరోసారి చెప్పారు. ఆయన ఇప్పుడే కాదు 2009 డిసెంబరు 10 నుంచే చెబుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ అన్నపదాన్ని ఉచ్చరించడానికే వీలులేదని ప్రకటించిన మనిషి, తెలంగా ణ ఉద్యమశక్తికి తలొగ్గి, ఒక కమిటీ వేసి, అన్ని ప్రాంతాలతో విస్తృతంగా చర్చించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబ డి ఉంటామని 2009 ఎన్నికలకు ముందు బలవంతంగా, ఎన్నికల అవసరాల కోసం ఒప్పుకున్నాడు. కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే ప్లేటు ఫిరాయించాడు. పరువు పోయింది. రాష్ట్ర ప్రతిష్ఠ పోయింది. ఇక్కడ ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాని పరిస్థితి తలెత్తింది. ఎవరితో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని వాపోయా డు. అప్పటినుంచి నిన్న ఆంధ్ర అసెంబ్లీలో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చేదాకా ఆయన ఏనాడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేదు.

సందర్భం వచ్చినప్పుడల్లా పొగిలిపొగిలి ఏడుస్తూనే ఉన్నడు. ఆయనకు చాలా స్పష్టత ఉంది. తెలంగాణ తనది కాదు. తెలంగాణ తెలుగుజాతిలో భాగం కాదు. తెలుగుజాతి అంటే ఆంధ్రజాతి. తెలుగుజాతికి అవమానం అంటే ఆంధ్రకు అవమానం. తెలుగుజాతి దుఃఖం అంటే ఆంధ్ర దుఃఖం. ఆయన మాటల్లో తెలంగాణ లేదు. తెలంగాణ సంతోషం లేదు. తెలంగాణ విముక్తికి సంబంధించిన ఆనందం లేదు. తెలంగాణకు సంబురం అయింది, ఆయనకు దుఃఖం అయింది. తెలంగాణకు ఉత్సవం అయింది, ఆయనకు దుర్దినం అయింది. తెలంగాణ నవ్వితే ఆయన ఏడుస్తాడు. ఇదీ వరుస. విషాదం ఏమంటే అటువంటి నాయకునికి తెలంగాణ గడ్డపై ఇంకా కొందరు బానిసలు ఉం డటం. ఆయన జెండాను మోస్తూ తెలంగాణలో రాజకీయాలు చేయడం. ఆత్మాభిమానం, ప్రాంతాభిమానం ఇసుమంతైనా లేకుండా సిగ్గువిడిచి చంద్రబాబే తమ నాయకుడని, ఆయన కుమారుడు లోకేశ్ వచ్చి తెలంగాణలో నాయకత్వ బాధ్యత స్వీకరించాలని కోరుతూ ఉండ టం. ఆంధ్ర నాయకత్వాన్ని, వారి పల్లకీ మోసే బానిసత్వాన్ని, వారిని కీర్తించే భావదారిద్య్రా న్ని తెలంగాణ ఇంకా వదిలించుకోలేకపోవడం దారుణం.

తెలంగాణ తెలుగుదేశం నాయకత్వమే కాదు. కాంగ్రెస్ నాయకత్వానిదీ అదే వరుస. వారు గతంలో చేసిన ఘనతలన్నీ తమవే అంటారు. గతంలో జరిగిన పాపాలకు మాత్రం బాధ్యత తీసుకోరు. రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నప్పుడల్లా వారి మంత్రివర్గాల్లో దర్జాగా పదవులు అనుభవిస్తూ ఫైళ్లు క్లియర్ చేస్తూ అహోం అహోం అని ఊరేగిన నాయకులు ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేమే కట్టాం, ఈ ప్రాజెక్టు మేమే కట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకారులను పట్టుకుని నీతలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించినప్పుడు, తెలంగాణ నీ జాగీరా? ఏమనుకుంటున్నవ్ అని తెలంగాణ ఉద్యమకారులను బెదిరిస్తున్నప్పుడు, ఇదే ఉత్తమ్‌కుమార్, ఇదే జానా, ఇదే అరుణమ్మ రాజశేఖర్‌రెడ్డి సేవలో తరిస్తున్నారు.

తెలంగాణ గడ్డపై నిలబడి పరిపాలిస్తూ, ఎక్కడో పీలేరు నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు లు తరలించుకుపోయిన కిరణ్‌కుమార్‌రెడ్డి, ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకారులను గద్దించినప్పుడు ఇప్పటి కాంగ్రెస్ పులులు ఎం దుకు నోరువిప్పలేదో తెలంగాణ ప్రజలు మరిచిపోలే దు. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చడానికి, కూల్చడానికి, విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వీరంద రూ ఆ కుట్రల్లో భాగస్వాములుగా ఎందుకున్నారో ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేదు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌కు వీసా తీసుకోవాల్సి వస్తుంది అని రాజశేఖర్‌రెడ్డి దుర్మార్గమైన దాడి చేసినప్పుడు ఇప్పటి పీసీ సీ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలంగాణ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి, తెలంగాణ భూములను ఎండబెట్టి, ఏ అనుమతులు, ఏ చట్టాలు, ఏ సంప్రదింపులు లేకుండా ఆగమేఘాలమీద పోతిరెడ్డిపాడును మళ్లించుకపోతున్నప్పు డు పొన్నాల లక్ష్మయ్య, అరుణమ్మ ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే అర్థమవుతుంది.

2001లో ఉద్యమం మొదలయిన తర్వాత తెలంగాణకు ఏమైనా పనులు జరిగాయీ అంటే అది ఉద్య మ పుణ్యమే. ఉద్యమాన్ని చూసే చంద్రబాబునాయు డు హెలికాప్టర్‌లో మేస్త్రీలను తీసుకెళ్లి హడావిడిగా దేవాదుల ప్రాజెక్టుకు రాయివేసి వచ్చాడు. ఆ ప్రాజెక్టులను ఎంత అధ్వాన్నంగా డిజైన్ చేశారో, దానిని బాగుచేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంత గా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నాం. గోదావరిలో వరద ఉంటేనే అది ఎత్తిపోతల. లేదంటే ఉత్తపోతల. ఆ దుస్థితిని మార్చడానికే ఇప్పుడు తుపాకులగూడెం వద్ద బరాజు నిర్మించడానికి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మాధవరెడ్డి ప్రాజెక్టు పనులు వేగం అందుకుందీ ఉద్యమం భయానికి తలొగ్గే. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడును నాలుగు రోజులయినా ఆపింది కేసీఆర్ ఒత్తిడివల్ల తప్ప తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్ల కాదు.

కేసీఆర్ అప్పటి యూపీఏలో ఒత్తిడి తెస్తే పోతిరెడ్డిపాడుపై చర్చ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ మాత్రం కూడా చేయలేకపోయారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, తెలంగాణ ప్రజల కళ్లల్లో దుమ్ముకొట్టడానికే రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు శంకుస్థాపన రాళ్లు వేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అలా దుమ్ముకొట్టే ప్రాజెక్టే. ప్రాజెక్టు పనుల్లో కాలువలు తవ్వడంతో పాటు, నదుల నుంచి నీరు మళ్లించే చోట లేక ఎత్తిపోసే చోట చేపట్టాల్సిన హెడ్‌వ ర్క్స్ పనులు చాలా ముఖ్యం. కానీ ఒక్క చోటంటే ఒక్కచోట హెడ్‌వర్క్స్ పనులు చేపట్టలేదు. కేవలం రెం డేళ్ల వ్యవధిలో పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి 55000 క్యూసెక్కులకు పెంచగలిగిన రాజశేఖర్‌రెడ్డి, తెలుగుగంగ, గాలేరు నగ రి, కేసీ కెనాల్, కుడికాలువ, హంద్రీ-నీవా.. ఇలా ఆరు కాలువల ద్వారా నీరు తరలించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేసుకుపోయిన రాజశేఖర్‌రెడ్డి ఇక్కడ మాత్రం కాలువలు తవ్వి చేతులు దులుపుకొంటుంటే మన గౌరవనీయ మంత్రులు, నాయకులు ఏమి చేశా రు? మొత్తంగా అర్థం అయ్యేది ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను ప్రారంభించడానికీ కారకులు కాదు, వాటిని ఆగం పట్టిస్తుంటే అడిగిన మనుషులూ కాదు.

ఎంతోదూరం ఎందుకు? జూరాల ప్రాజెక్టు పూర్త యి చాలా ఏళ్లయినా కాంగ్రెస్ ఏలుబడిలో పూర్తిస్థాయి లో నీటిని నిలుపుకొనే అవకాశం లేకపోయింది. కర్ణాటకలో మునిగిపోయే గ్రామాలకు పునరావాసం, పరిహారం కింద ఇవ్వాల్సిన కేవలం 25 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి పంపాల్సిన దుస్థితి. కేసీఆర్ ప్రాజెక్టుల పాదయాత్ర తర్వాతనే కర్ణాటకకు పరిహారం చెల్లించారు. కేసీఆర్ పాదయాత్ర తర్వాతనే ఆర్డీస్ అనేది ఒకటుందని, అం దులో మన హక్కును మనం కాపాడుకోవాలన్న సోయి వచ్చింది. ఆర్డీఎస్ రైతాంగం ధైర్యంగా కొట్లాడే పరిస్థితి వచ్చింది.

నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితుల దాహార్తిని తీర్చే శ్రీశైలం ఎడమకాలువ సొరంగమార్గా న్ని తెలంగాణ ఉద్యమం కారణంగానే ప్రారంభించా రు. కానీ నిధులు ఇవ్వక ఎప్పుడో 2010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకుండాపోయింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మహానాయకులు ప్రభుత్వం లో ఉండీ కళ్లప్పగించి చూశారు తప్ప ఒక్కసందర్భంలోనూ మా సొరంగమార్గం సంగతేమిటి అని అడిగిన పాపానపోలేదు. అప్పుడెప్పుడూ ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి నోరుమెదుపలేదు. ఎక్కడి పనులు అక్కడే. ఎక్క డి కాలువలు అక్కడే. రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల ఉదయసముద్రం రిజర్వాయరును ఇప్పటికీ పూర్తిస్థాయిలో నింపలేని పరిస్థి తి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే మొత్తంగా నదీజలాల్లో మన వాటాకు సంబంధించిన చైతన్యం తెలంగాణ ప్రజల్లో వచ్చింది. టీఎంసీలు, క్యూసెక్కుల భాష ప్రజలకు అర్థమయింది ఉద్యమం సందర్భంగా నే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిసోయి పెరిగింది.

తెలంగాణ అస్తిత్వ విధ్వంసం మొదలుపెట్టింది చం ద్రబాబు కాగా దానిని పతాకస్థాయికి తీసుకుపోయింది రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు. వాళ్లున్నంతకాలం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కుక్కినపేనుల్లా గా పడిఉన్నారు తప్ప ఒక్క సందర్భంలో ఒక్క మాట మాట్లాడింది లేదు. ఇందుకు ఒక్క ఎలిమినేటి మాధవరెడ్డి మాత్రమే మినహాయింపు. శ్రీశైలం ఎడమకాలు వ ప్రాజెక్టు ఒక పనికిమాలిన ప్రాజెక్టు అని ఆంధ్రప్రాంతానికి చెందిన అప్పటి నీటిపారుదల మంత్రి వ్యాఖ్యానిస్తే, ఆయనను నీటిపారుదల శాఖనుంచి తప్పించేదాకా నిద్రపోలేదు మాధవరెడ్డి. ఆయన ఒత్తిడివల్లనే చంద్రబాబు ఎడమకాలువ పని మొదలుపెట్టాడు. అం దుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. మిగిలిన టీడీ పీ, కాంగ్రెస్ నాయకులంతా చెంచాగిరి చేశారు. ఒక టీడీపీ మంత్రి అయితే నదులు కిందికి ఉన్నాయి, తెలంగాణ గడ్డమీదికి ఉంది- నీళ్లెలా వస్తాయి అని ప్రశ్నించారు. ఒక కాంగ్రెస్ మంత్రి పోతిరెడ్డిపాడు నిర్మా ణం సబబేనని సర్టిఫికెట్ ఇచ్చాడు. కేంద్రంలో చాలా పెద్దమనిషిగా ఉన్న మంత్రికి అసలు ఈ తెలంగాణ సమస్యలు ఎప్పుడూ పట్టలేదు.

ఇప్పుడు వీరంతా తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిపోయిందని ఆవేదన యాత్రలు మొదలుపెడితే ఎవరు నమ్ముతారు. జనం ఆపదలో ఉన్నప్పుడు మాట్లాడితే వీరిని ఎవరయినా పట్టించుకునే వారు. తెలంగాణ అంతటా స్వరాష్ట్ర నినాదంతో కుతకుత ఉడికిపోతుంటే, సబ్బండవర్ణా లు, ఉద్యోగులు సమ్మెలు హర్తాళ్‌తో వీధుల్లోకి వస్తుం టే, వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తుంటే సచివాలయంలోని ఏసీ గదుల్లోనో లేక తమ భవంతుల్లోని విలాస మందిరాల్లోనో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేసుకుంటూపోయారు. అప్పుడు జనం బాధలేవీ వీరికి పట్టలేదు. ఇప్పుడు వీరిబాధలను జనం ఎందుకు పట్టించుకుంటారు? వీరి ఆవేదన జనం ఆవేదన ఎందుకు అవుతుంది?
[email protected]

2691

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా