జీవనదిగా గోదావరి


Sun,February 12, 2017 01:18 AM

సీమాంధ్ర నాయకులకు తమ ఆత్మలను, తనువులను, రాజకీయాలను అమ్ముకున్న కొందరు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర నాయకులకంటే హీనంగా మాట్లాడుతున్నారు. సీమాంధ్ర నాయకులు వదిలేసిపోయిన నీచమైన పనులన్నీ వీరు కొనసాగిస్తున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండకపోతే, వీరి కుట్రలను తిప్పికొట్టకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావు. తెలంగాణ బీళ్లు ఎప్పటికీ జలధారలతో నిండవు.

'గోదావరి నదిపై సదర్‌మాట్, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వ రం, తుపాకులగూడెం ప్రాజెక్టులు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యంతో పూర్తయితే నదిలో 200 కిలోమీటర్ల పొడవునా నీళ్లు నిలబడి ఉం టాయి. ధర్మపురి నుంచి భద్రాచలం దాకా గోదావరి నిరంతరం జలకళతో ఓలలాడుతుంది. సంవత్సరం పొడవునా నదిలో నీరు అందుబాటులో ఉంటే దాని చుట్టూ ఉండే జీవితం ఎలా మారిపోతుందో కృష్ణా, గోదావరి డెల్టాల్లో జీవితం చూస్తే అర్థమవుతుంది. వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, అటవీ రక్షణ, పర్యాటకం.. అన్నీ వర్ధిల్లుతాయి. అన్ని రిజర్వాయర్లలో ఏడాది పొడవునా సుమారు 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కొత్తగా సుమారు 200 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకోవడానికి వీలవుతుంది. నదీ రిజర్వాయర్ల నుంచి ఉపనదులపై, కాలువలపై నిర్మించిన వందలాది రిజర్వాయర్లు, పెద్ద చిన్న చెరువులను నీటితో నింపడానికి వీలవుతుంది. ఉత్తర తెలంగాణ, ఖమ్మం, యాదాద్రి జిల్లాలకు, సూర్యాపేట సగం జిల్లాకు గోదావరి జలాలు ప్రాణాధారం అవుతాయి.
 Godavari
తాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. యాభై లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. నీటివనరులు సృష్టించే సంపద అపారం. తెలంగాణ ఇన్ని దశాబ్దాలు నష్టపోయింది నీరు లేకనే. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యమైన ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నది అని నీటిపారుదల రంగ నిపుణుడు మొన్న ఇష్టాగోష్ఠి సమావేశంలో వివరించారు. నీటి సమస్యను ఇంత విస్తృత పరిధిలో అర్థం చేసుకుంటే తప్ప ప్రాజెక్టుల వల్ల జరిగే మంచిని గుర్తించలేము. ఇంత భారీమొత్తంలో నీటిని మళ్లించడం, దానివల్ల కలిగే ప్రయోజనం, దాని విలువను అర్థం చేసుకోలేకపోతే చిన్నచిన్న కారణాలతో ప్రభుత్వంతో కయ్యానికి దిగాలనిపిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రలలో వందలాది ప్రాజెక్టులు, బరాజులు నిర్మించారు. వారెప్పుడూ ప్రాజెక్టులపై వీధి పోరాటాలకు దిగిన దాఖలాలు లేవు. గోదావరి నదిపై మహారాష్ట్రలో 200కు పైగా బరాజులు నిర్మించారని గత ప్రభుత్వాలకు సూచన మాత్రంగానైనా తెలియదు. అంటే అంత గుట్టుగా వారు పనిచేసుకుపోయారు. చివరకు తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టి మళ్లించడం కోసం బాబ్లీ వద్ద డ్రామా కు దిగారు కొందరు.

మన ప్రతిపక్షాలు మాత్రం ఏకసూత్ర కార్యక్రమంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ఏది చేస్తే దానిని వ్యతిరేకించాలనే దుగ్ధపూరితమైన వైఖరితో రోజూ ఏదో యాగీ చేస్తున్నాయి. భూ సేకరణను అడ్డంపెట్టి కేసులమీద కేసులు వేసి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా చేయాలని చూస్తున్నాయి. ఒకప్పుడు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వాలని ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తున్నారు. నాడు ప్రాజెక్టులం టే కాంట్రాక్టులు, కమీషన్లు మాత్రమేనని, తక్షణం నీరివ్వడం కాదని కళ్లు మూసుకుని జపం చేసిన తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు చరిత్ర అంతా మరిచిపోయి కాంట్రాక్టులు కొత్తగా తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. విషాదమేమంటే తెలంగాణకు ఏం కావాలో ఇప్పటికీ వీరికి అర్థం కాకపోవడం. ఏ అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియకపోవడం. ప్రాజెక్టులపై ఇన్నేళ్ల జాప్యం కారణంగానే నదీ జలాల్లో మనం హక్కులు కోల్పోయాం. ఆరు దశాబ్దాల తర్వాత కూడా కృష్ణా జలాల్లో మనవాటా మనం ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం.

ఇప్పుడు కూడా కొట్లాడుతూ కూర్చుంటే మరికొన్ని దశాబ్దాలపాటు తెలంగాణ ఎప్పటిలాగే నీటికోసం తన్లాడాల్సి వస్తుంది. ఎగువ, దిగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నదీ జలాలపై హక్కును ప్రకటించుకుంటా యి. కేంద్రం కూడా పూర్తయిన ప్రాజెక్టులనే పరిగణనలోకి తీసుకుని నీటి లెక్కలు, హక్కులు నిర్ణయిస్తుంది. భూసేకరణ చేయకుండా ఎక్కడా ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదు. మా ఊర్లో భూమి ఎకరం రెండు లక్షలు కూడా చేసేది కాదు. తెలంగాణ ప్రభు త్వం ఎనిమిది లక్షలు ఇవ్వడానికి ముందుకువచ్చింది. మీరు ఇప్పుడే ఇవ్వద్దు. ఇంకా ఎక్కువ వచ్చేట్టు చేస్తాం అని మా ఊరి రైతులను రెచ్చగొట్టి కేసులు వేయిస్తున్నారు. కొందరైతే 20 లక్షలు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. మాకే అన్యాయంగా అనిపిస్తున్నది అని అన్నారం ప్రాజెక్టు ముంపు గ్రామానికి చెందిన ఒక యువకుడు వాపోయాడు.

ఇప్పుడు ఇస్తున్నది తీసుకోనివ్వరు. ప్రాజెక్టు పనులు మొదలు పెట్టనివ్వరు. వారిప్పిస్తామంటున్నది ఎన్నేండ్లకు తేలుతుందో అర్థం కాదు. నష్టం మాత్రం మొత్తం ప్రాంతానికి జరుగుతుంది అని ఆ విద్యావంతుడు అన్నాడు. చాలా ప్రాజెక్టుల వద్ద ఇదే కథ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు అధికారం లో ఉండి చేయలేదు. ఇప్పు డు చేద్దామంటే అడుగడుగునా రాద్ధాంతం. సీమాంధ్ర నాయకులకు తమ ఆత్మలను, తనువులను, రాజకీయాలను అమ్ముకున్న కొంద రు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర నాయకులకంటే హీనంగా మాట్లాడుతున్నారు. సీమాం ధ్ర నాయకులు వదిలేసిపోయిన నీచమైన పనులన్నీ వీరు కొనసాగిస్తున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండకపోతే, వీరి కుట్రలను తిప్పికొట్టకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావు. తెలంగాణ బీళ్లు ఎప్పటికీ జలధారలతో నిండవు.

తెలంగాణ నిఘంటువు..
తెలంగాణ నిఘంటువు ఏమిటండి? ఉంటే తెలుగు నిఘంటువు ఉండాలి కానీ అని ఓ పండిత మిత్రుడు ప్రశ్నించాడు. తెలంగాణ పదాన్ని జీర్ణించుకోలేని తత్త్వ మే ఆ గొంతులో వినిపించిందనిపించింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఉండగా లేనిది తెలంగాణ నిఘంటువు ఉంటే తప్పేమిటి? అని ప్రశ్నిస్తే, తెలుగు, ఆంధ్రమూ పర్యాయపదాలే కదా అని ఆ పండితుడు సమాధానం ఇచ్చారు. తెలుగు, ఆంధ్రమూ ఒకటేనని ఆధిపత్య భాషావాదులు తీర్మానించిన మాట నిజమే కానీ త్రిలింగ, తెలింగ, తెలంగాణ, తెలుంగు, తెలుగు ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషకు రూపాంతరాలని ఎందుకు దాచిపెట్టారో ఇప్పటికీ అర్థం కాదు. ఆంధ్రం అనే పదాన్ని తీసుకువచ్చి తెలంగాణపైన తెలుగుపైన ఎందుకు రుద్దారో ఎట్లా రుద్దారో ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది. త్రిలింగ దేశం లేక తెలంగాణ, ఆంధ్ర దేశం ఎట్ల యిందో పరిశోధన జరుగాల్సి ఉంది. కృష్ణానది ఒడ్డున వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయం, కృష్ణుడనే రాజు ప్రతిరూపంగా వెలసిందని, తాను త్రిలింగదేశాధీశుడనని ఆయన ప్రకటించుకున్నారని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఆం ధ్ర ప్రస్తావనకు ఎంత ఇతిహాసం, ఎంత చరిత్ర ఉందో త్రిలింగ దేశానికి, తెలింగ దేశానికి అంత కథ ఉంది. రిషిక, అస్సక, అస్మ క రాజ్యాలు, శాతవాహనుల కార్యభూమి తెలంగాణనే. అవేవీ చరిత్రలో తగిన స్థానం సం పాదించలేదు.

తెలంగాణ గడ్డపై వర్ధిల్లిన బౌద్ధ, జైన క్షేత్రాల చరిత్ర సరిగా రికార్డు కానేలేదు. ఎక్కడో రాజస్థాన్‌లో స్థిరపడిన సుధీర్ తైలంగ్ నా జన్మభూమి తెలంగాణే అని చెప్పారట ఒక ఇంటర్వ్యూలో. బర్మా, థాయ్‌లాండ్‌లలో స్థిరపడిన కొన్ని జాతులు తాము తైలంగులమే అని చరిత్రలో రాసుకున్నారు. గోదావరి నదీ లోయలో పడవల ద్వారా శత్రువులను తప్పించుకుని సముద్ర మార్గాన తాము ఇక్కడికి చేరామని తైలంగులు చెప్పుకున్నారు. వాయు పురాణంలోనూ త్రిలింగ ప్రస్తావన ఉంది. విదేశీ యాత్రికుడు టోలెమీ యాత్రా కథనంలో కూడా త్రిలింగ ప్రస్తావన ఉంది. కాకతీయులకు త్రిలింగ దేశాధీశులుగానే పేరుంది. కాకతీయులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి, ఢిల్లీ సుల్తానులకు లొంగిపోయి, మతం మార్చుకున్న ఒక కాకతీ య మంత్రి ఆ తర్వాత సుల్తానుల వద్ద ప్రధాని అయ్యారు. ఆయన తన పేరు చివర తిలంగానీ పెట్టుకున్నారు.

ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. ఇది 1375ల నాటి సమాధి. 1812లో విలియం క్యారీ తెలింగ భాషా వ్యాకరణాల పై ఒక పుస్తకమే రాశారు. అవేవీ గత ఆరు దశాబ్దాల్లో ప్రస్తావనకు, ప్రాచుర్యానికి, చరిత్ర రచనకు నోచుకోలే దు. తెలంగాణ భాష అవమానాలపాలయింది. సం స్కారహీనులు, ప్రతినాయకులు మాట్లాడే భాషగా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. తెలంగాణ పదజాలం మరుగునపడిపోయింది. రెండు మూడక్షరాలతో గొప్ప అర్థాన్ని చెప్పే విశేషణాలు, క్రియలు, నామవాచకాలు ఉన్నాయి. అవి మరుగునపడిపోతున్నా యి. వాటిని నమోదు చేసి భావితరాలకు అందించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలోనే చరిత్ర, భాషా, సాంస్కృతిక పరిశోధనలపై పనిని ప్రారంభించింది. అందుకే తెలంగాణ నిఘంటువు. తెలంగాణ నిఘంటువు తెలుగు భాషకు విస్తృతి.
[email protected]
Katta-sekharreddy

3249

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా