తెలంగాణ ఏం తెచ్చింది-ఏం ఇచ్చింది?


Sun,December 4, 2016 01:08 AM

మనుషుల్లో మానవత్వాన్ని, మంచితనాన్ని ఇసుమంతయినా చూడలేకపోవడం, మనుషులకు, మనిషితత్వానికి దూరంగా సిద్ధాంతమనే ఒక కంచెలో నిలబడి, అందులోనే గిరికీలు కొడుతూ దేశానికంతా సర్టిఫికెట్లు ఇచ్చి ఆనందపడటం సొంతానికి తృప్తినివ్వవచ్చు, కానీ సమాజానికి ఏమాత్రం మేలు చేయదు. మంచితనాన్ని, మనిషితనాన్ని కాపాడదు.

katta
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు. ఈ సం దర్భంగా రెండు సభలు జరిగాయి. ఒకటి తెలంగాణ వచ్చి ఏమిచ్చింది? అని ప్రశ్నిస్తున్నవాళ్ల సభ. రెండోది తెలంగాణ వచ్చి ఏమి తెచ్చిందో ప్రతిబింబించిన సభ. మొదటి సభలో కొందరు ఏకంగా యుద్ధాలే ప్రకటించారు. ఇది అంతంకాదు ఆరంభం అన్నారు. ఏదో ఆవేశం పూనినట్టు, ఏదో అక్కసు తన్నుకువచ్చినట్టు చాలామంది ప్రసంగించారు. రెండో సభ ఉత్సవంలాగా జరిగింది. చెరువు నిండి మత్తడి దూకినట్టు, తరతరాలుగా గూడుకట్టుకు న్న దైన్యం ఒక్కసారిగా కిలకిలా నవ్వినట్టు, తెలంగాణ తనను తాను గుర్తుపట్టి ఆనందంతో కేరింతలు కొట్టినట్టు ఆ సభ జరిగింది. రెండు సభల మధ్య ఎంతో అంతరం ఉంది. అంతరా లు లేకుండా సమాజం ఉండదు. భిన్నాభిప్రాయం లేకుండా రాజకీయాలు ఉండవు. అధికారంలో తావు లభించనివారు అవతలి పక్షంలో ఉండి కొట్లాడటం సహజం. ఎటొచ్చీ విభేదించేవారిలో ఏడుపు, ఆక్రోశం, అక్కసు ఎందుకు ఉంటుందన్నదే అంతుపట్టని విషయం. మం చిని మంచిగా చెడును చెడుగా ఎందుకు చూడటం లేదన్నది ప్రశ్నార్థకం. తెలంగాణ రావడం లో జరిగిన మేలును ఎందుకు గుర్తించడం లేదన్నదే సంశయం. కొందరయితే తెలంగాణ తెచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించేదాకా వెళ్లారు. ఇంకొందరు తెలంగాణ ఇప్పుడు రాకపోతే బాగుండేది అనేదాకా మాట్లాడుతున్నారు.

ఇంకొందరయితే రెండో సభ కు సంబంధించి బూజుపట్టి మురిగిపోయిన వాదన ఒకటి ప్రచారంలో పెట్టారు. విప్లవం గురించి మాట్లాడేవారు అవార్డులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అవార్డు తీసుకుంటే ప్రభుత్వాన్ని సమర్థించినట్టే కదా అని తర్కం తీసుకొచ్చారు. వీళ్ల్లు రోజురోజుకు కుమిలి కృషించిపోతున్నా రా లేక కొంచెమైనా తెలివి తెచ్చుకుంటున్నారా అర్థం కాదు. మచ్చలు మాత్రమే చూడటం అలవాటు పడినవారికి చందమామ అందం కనిపించదు. ముళ్లను మాత్రమే చూసేవాడు పూల అందం గుర్తించలేడు. మురుగులాగా పేరుకుపోయినవాడు వరదలాగా గతిశీలంగా ఉండలేడు. తెలంగాణ ఎందుకొచ్చిందో ఏమి తెచ్చిందో జనానికి అర్థమవుతూనే ఉన్నది. కరెంటు కష్టాలు లేవు. సబ్‌స్టేషన్లపై దాడులు లేవు. విత్తనాల కోసం పడిగాపులు లేవు. కల్తీ విత్తనాలు సరఫరా చేసినవారు కటకటాలు లెక్కపెడుతున్నా రు. తెలంగాణకు ఇప్పుడు ఒక్క నీరటి కాదు ప్రతీ నాయకుడు ఒక నీరటిలాగా పనిచేస్తున్నా డు.

నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి జలసాధన ఉద్యమాలను ఏకకాలంలో చేపట్టిన రాష్ట్రం, నాయకత్వం మనదే. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ పెద్ద నీరటి ఉద్యోగుల్లా నీళ్ల కాపలా, నీళ్ల గమనాన్ని వెంటపడి చూస్తున్నారు. ఈటల, నిరంజన్‌రె డ్డి, జూపల్లి, జగదీశ్‌రెడ్డి, పోచారం కాలువల వెంటపడి తిరుగుతున్నారు. ఆఖరి చెరువులు నిండాయా లేదా అని సరిచూసుకుంటున్నారు. చివరి భూములకు నీళ్లివ్వాలని నిలబడి పని చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్దే నిద్రిస్తున్నారు. కాంట్రాక్టర్ల వెంటపడి డెడ్‌లైన్లు పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. మన సమస్య తెలిసిన మన నాయకులు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నారు.
మొన్న ఊరు నుంచి ఒక మిత్రుడు ఫోను చేశాడు. మా చెరువు పూర్తిగా నిండలేదు. కాలువలో నీరు ఆగిపోయింది. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం వెంటపడి కాలువను తన నియోజకవర్గంలోని ఊర్లకు మళ్లించారని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పుడేమో మొత్తం నీరే రావడం బందయింది అని వాపోయాడు. ఇది ఆ ఎమ్మెల్యేకు సర్టిఫికెట్టే. పదకొండేళ్ల క్రితం మాట. తిప్పర్తి మండలంలోని ఏడు గ్రామాలను మినహాయించి మొత్తం మండలానికి తాగునీరు అందించాలని ఇంజినీ ర్లు పనులు మొదలుపెట్టారు.

కొన్ని ఊర్లకు ఉదయసముద్రం నుంచి నీరు కూడా మొదలయింది. కానీ ఆ ఏడూళ్లు మాత్రం నీళ్లకోసం కటకటపడుతున్నాయి. ఊరి కి ఎక్కడో దూరంగా ఉన్న పెద్ద బావులకు వెళ్లి నీరు తెచ్చుకోవలసిన పరిస్థితి. అయినా ఆ ఏడూళ్లను ఎందుకు మినహాయించారని తెలుసుకుంటే, అప్పుడు రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న నాయకుడు ఆ ఊళ్లలో కమ్యూనిస్టులు సర్పంచులుగా గెలిచారు ఇప్పుడవసరం లేదని ఇంజినీర్లకు చెప్పారని తెలిసింది. ఆ ఏడూళ్ల జనం అప్పు డు ఉద్యమం చేయవలసి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి మిర్యాలగూడెం వెళుతుంటే జనం అడ్డగించి నీళ్ల సమస్య చెప్పుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి అప్పటికప్పుడు ఇంజినీర్ల ను ఆదేశించి తాగునీరు మంజూరు చేయించారు. అప్ప టి తెలంగాణ నాయకులకు ఉన్న సోయి అది. ప్రజలకు ఏదైనా వస్తుందంటే కొట్లాడి తీసుకురావాల్సిన నాయకు లు వీళ్లకు నీళ్లిస్తే కొమ్ములొస్తాయి. రోడ్లేస్తే రెక్కలొస్తాయి. మన మాట వినరు అని ఆలోచించే భూస్వామ్య దురహంకార నాయకత్వం తెలంగాణను నాశనం చేసింది.

ఇప్పుడు అదే నాయకులు ఉద్యమాలంటూ వీధుల్లోకి వస్తే జనం నవ్విపోరా! భూసేకరణ, నిర్వాసిత సమస్య లు ఇప్పుడే పుట్టుకొచ్చాయా? ఆరు దశాబ్దాల్లో శ్రీశైలం ముంపు బాధితులకు పరిహారం, ఉద్యోగాలు ఇప్పించగలిగారా? కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎక్కడయినా రైతులు ఇష్టంగా భూములు ఇచ్చారా? ఎంతోదూరం ఎందుకు అమరావతిలో రైతుల పొలాలను ఎందుకు తగులబెట్టి రైతులను బెదిరించి భూములు గుంజుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం అలా చేయడం లేదే. రైతులకు వీలైనంత మేలు జరిగే ప్యాకేజీలు ఇచ్చి భూ సేకరణ చేస్తున్నది వాస్తవం కాదా? ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటారు. భూములు మాత్రం సేకరించొద్దంటారు. కాళేశ్వరం వద్దంటారు. తుమ్మిడిహట్టి నిర్మించాలంటారు. ఎందుకీ వైరుధ్యాలు? ఎందుకూ పనికిరాని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జెండాలు ఊపిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు అత్యంత అధికంగా జలాలను వినియోగించడానికి వీలుగా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు ఎక్కువవుతుందని వాదిస్తున్నా రు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పరమ దండగ ప్రాజెక్టు అని సీడబ్ల్యూసీ చెప్పింది. అటువంటి ప్రాజెక్టును సమర్థించిన వాళ్లు, ఆ ప్రాజెక్టుకు రాళ్లేసినవాళ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత కాళేశ్వరం గురిం చి మాట్లాడితే బాగుండేది.
తెలంగాణ వచ్చి ఉండకపోతే మహబూబ్‌నగర్ బీళ్లు ఇంకో పదేళ్లకయినా తడిసి ఉండేవి కాదు. వేములవాడ నేలలకు ఎల్లంపల్లి జలాలు వచ్చి ఉండేవికాదు.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా 380వ కిలోమీటరు దాకా నీళ్లు ప్రవహించి ఉండేవి కాదు. చెరువులు నిండేవి కాదు. నాగార్జున సాగర్ కింద మన వాటా నీళ్లను మనం తీసుకోగలిగేవాళ్లం కాదు. ప్రాజెక్టుల కింద ఇంత గరిష్ఠస్థాయిలో నీటిని వినియోగించుకోగలి ఉండేవారం కాదు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్, టీడీపీలు చేయలేని పనిని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకత్వం రెండున్నరేండ్లలో చేయగలిగింది. మన రాష్ట్రం, మనం నిర్మించుకుందాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు దాం. అందరికీ వెన్నెలలు పంచుదాం అన్న భరోసా ఇవ్వాళ తెలంగాణ సమాజానికి అందించగలిగింది తెలంగాణ నాయకత్వం. సంక్షేమంపై 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిన చరిత్ర ఎప్పుడయినా ఉం దా? రైతుల రుణమాఫీకి 14 వేల కోట్ల రూపాయలు చెల్లించిన సాహసం ఎప్పుడయినా చేశారా? కానీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల కుటుంబాలు ఉంటే 30 లక్షల కుటుంబాల్లో ఎవ రో ఒకరికి ఏదో ఒక పింఛను అందుతున్నది. ఇది సామాజిక భద్రత కాదా? ఇవన్నీ చూడటానికి నిరాకరించడంతోపాటు సర్వం నాశనం అయిపోయిందన్న చందంగా ప్రకటనలు చేస్తున్నారు. అడవిలో నుంచి మావోయిస్టు జగన్ విడుదల చేసే ప్రకటనకు ఇందిరాపార్కు వద్ద కొందరు ప్రతిపక్ష నాయకులు చేసే ప్రకటనలకు పెద్దగా తేడా ఉండటం లేదు. జగన్ గీత గీసుకు ని లైను అవతల నిలబడి ఏదో సాధిద్దామని పోరాడుతున్నాడు. ప్రజాయుద్ధాన్ని విస్తృతం చేయాలని ఆయ న పిలుపునిస్తే మనం ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. తెలంగాణలో కిందిస్థాయిలో జరుగుతున్నది ఆయనకు పూర్తిగా తెలియకపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఉన్నవాళ్లు, జనం మధ్య తిరుగుతున్నవాళ్లు, జరుగుతు న్న మార్పులను చూస్తున్నవాళ్లు ఎందుకు యుద్ధాలు ప్రకటిస్తున్నారో ఆలోచించుకోవాలి.

అడవిలో ఉన్న జగన్ సంగతి సరే, జనంలో ఉండే జగన్‌లకేమైంది? వంకరతనం తప్ప ఒక్క మంచి మాటా మాట్లాడలేని దౌర్బల్యం ఎందుకు ఆవరించిం ది? శుక్రవారం నందిని సిధారెడ్డికి విశిష్ట సాహితీ పురస్కారాన్ని ఇచ్చే సభలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడు తూ సిద్దిపేటలో నందిని సిధారెడ్డి అనే పరుసవేది స్పర్శతో నేను ఇవ్వాళ ఇలా మీముందు నిలబడగలిగా ను అని వ్యాఖ్యానించారు. సిద్ధన్న గురించి చెప్పడాని కి అంతకంటే గొప్ప ఉపమానం అవసరం లేదు. ఆయ న స్పర్శతో తెలంగాణ ఉద్యమమూ పులకించింది. ఆయన సాహిత్య సౌరభాలతో ఎందరో యువకులు చైతన్య బావుటాలుగా మారారు. అటువంటి వారి స్పర్శ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక మానవీయ పరిమళాన్ని అబ్బింది. ఆయన ఒక్కరే కాదు, విప్లవోద్యమాల్లో పనిచేసిన అనేకమంది కవులు, కళాకారులు, నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంతో, కేసీఆర్‌తో కలిసి నడిచి తెలంగాణ సమాజానికి గొప్ప మానవ చైతన్యాన్ని అందించారు.

తెలంగాణను సాధించారు. స్వరాష్ట్ర మాధుర్యాన్ని, స్వయంపాలన అనుభవాన్ని జనానికి చూపారు. విప్లవోద్యమంతోనే నడుస్తున్నవారు ఏం సాధించారు? రోజుకో చావు వార్త. రోజు కో గుండెకోత. ఎడతెగని దుఃఖం. అంతులేని ఆక్రో శం. ఎవరికీ అర్థంకాని ఏడుపు? వాళ్లు ఇంకా 1949 లోనే ఉండిపోయారు. దేశం అరవైయేళ్లు ముందుకు సాగిపోయింది. ఎదురుగా ఉన్నది కొండ అని తెలుసు. తరగని బండ అని తెలుసు. అయినా ఢీకొనీ ఢీకొనీ తలలు పగిలి రక్తమోడి చనిపోవడమే విప్లవం. మంచి ని కొంచెమయినా మిగల్చని ఈ చావులు దేనికి, ఈ త్యాగాలు ఎవరికోసం అని ప్రసాద్ ఎడతెరిపి లేకుం డా ప్రశ్నలు కురిపించాడు. అవార్డు తీసుకుంటే ప్రభుత్వాన్ని సమర్థించినట్టే అయితే వంద నోటో, ఐదొంద ల నోటో వాడితే మోదీని, ఆయన నియమించుకున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను సమర్థించినట్టు కాదా సార్ అని మా సతీశ్ తర్కం తీశాడు.

మార్క్సిజం నేర్పి న తర్కబద్ధ ఆలోచనను అయినదానికి కానిదానికీ అన్వయించి తీర్పులు చెబితే ఇటువంటి ప్రతిస్పందన లే వస్తాయి. మనుషుల్లో మానవత్వాన్ని, మంచితనా న్ని ఇసుమంతయినా చూడలేకపోవడం, మనుషులకు, మనిషితత్వానికి దూరంగా సిద్ధాంతమనే ఒక కంచెలో నిలబడి, అందులోనే గిరికీలు కొడుతూ దేశానికంతా సర్టిఫికెట్లు ఇచ్చి ఆనందపడటం సొంతానికి తృప్తినివ్వవచ్చు, కానీ సమాజానికి ఏమాత్రం మేలు చేయదు. మంచితనాన్ని, మనిషితనాన్ని కాపాడదు. జీవితమం తా ఉద్యమానికే ధారపోశాను. ఇప్పుడు నన్ను బోను లో నిలబెట్టి తూకాలు వేస్తే నేనేమి చేయాలె అని విప్లవోద్యమంలో పుట్టిపెరిగిన ఒక గొప్ప కళాకారుడు చాలా రోజుల కిందట వాపోయాడు. ఎవరినీ మనుషులుగా మిగలకుండా చేసే వికృత వ్యాఖ్యాన విన్యాసం పూచిక పుల్లకు పనికిరాదు. ఇది అన్నిపక్షాలకూ వర్తిస్తుంది.
[email protected]

4216

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles