మోదీ ఉత్తరాదితో కనెక్టు కాలేదా?


Sun,October 16, 2016 02:48 AM

ఆప్ గానీ, టీఆర్‌ఎస్ గానీ జనంతో కనెక్టు అయ్యే అంశాలపై పనిచేస్తున్నాయి. సామాన్యులకు పెద్ద పెద్ద విషయాలతో పనిలేదు.రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలే వారికి ముఖ్యం. ఏ పార్టీ అయి నా అది తెలుసుకుని మసలుకుంటే తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోక్‌సభ ఎన్నికలకు పెద్దపెద్ద విషయాలు ఉపయోగపడతాయి కావచ్చు. కానీ రాష్ర్టాలు, అసెంబ్లీలు గెలువాలంటే ఎక్కడికక్కడ స్థానిక ఆత్మను పట్టుకోవడమే అవసరం. దేశభక్తి, జాతీయవాదం, గోరక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటివి పెద్ద పెద్ద విషయాలు.పింఛన్లు, ఉపాధిఅవకాశాలు, రైతులకు అప్పులు, సబ్సిడీలు, విద్యవైద్యం వంటి అంశాలు, వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందుకే 2014కు 2016కు ఈ తేడా.

shekarreddy
ప్రధాని నరేంద్రమోదీ చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రపంచ దేశాలు చుట్టి వచ్చారు. దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. మెరుపు దాడులు చేసి ఉగ్రవా ద స్థావరాలను ధ్వంసం చేయించారు. ఆర్థిక రంగంలో మంచివీ చెడువీ అనేక కఠిన నిర్ణయాలు చేస్తున్నారు. విదేశాల్లోని నల్లధనం వచ్చినా రాకున్నా మన దేశంలోని నల్లధనం 65 వేల కోట్లను బయటికి తీసుకురాగలిగారు. ఆయనపై వ్యక్తిగత అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేవు. ఆయనకు మరే లోకం లేదు, అస్తమానం ప్రభుత్వం, పార్టీ తప్ప. అయినా ఆయన ప్రభ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నా యి. 2014 ఎన్నికల్లో బీజేపీని ఏకధాటిగా గెలిపించిన ప్రాభవం ఇప్పుడు తగ్గిపోతున్న జాడలు బయటపడతున్నాయి.

ఎన్నికల సర్వేలు, నిపుణుల విశ్లేషణలు ఇదే విష యం స్పష్టం చేస్తున్నాయి. మార్చి 2017లో నాలుగు రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సర్వేలు మొదలయ్యాయి. ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకోనక్కరలేదు కానీ అవి మారుతున్న పరిస్థితులకు సూచికలుగా మాత్రం ఉపకరిస్తాయి. బీజేపీ నాడు నరేంద్ర మోదీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్‌లో 42.63 శాతం ఓట్లతో 71 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. నేడు ఇండియా టుడే మరికొన్ని సర్వేలు బీజేపీ ఓట్ల శాతం 31కి పడిపోయినట్టుగా అంచనావేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా నాడు బీజేపీ మొత్తం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుం ది. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారినట్టు సర్వేలు చెబుతున్నాయి. పంజాబ్‌లో మెజారి టీ లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న బీజేపీ-అకాలీదళ్ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మోదీవన్నీ ఉపరితల విన్యాసాలు.

ఉన్నతవర్గాలకు ఉపయోగపడే చర్యలు అని ఓ సామాజిక మాధ్యమ వ్యాఖ్యాత ఇటీవల పేర్కొన్నారు. ఆయన ఎలా ఉంటే ఏం? ఆయనకు పునాది శక్తులుగా ఉన్నవాళ్లు జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో వీలైనంత గందరగోళం సృష్టించడానికి, వివిధ సామాజిక వర్గాలను బీజేపీ నుంచి దూరం చేయడానికి సంకల్పితంగానో, అసంకల్పితంగానో ప్రయత్నిస్తున్నారు అంటారాయన. పాకిస్థాన్ చుట్టూ దేశ రాజకీయాలను మలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.

ఉగ్రవాద మూకల ఆటను కట్టించడంలో విఫలమై, ఆ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మెరుపుదాడులు, యుద్ధ పరిభాషను ఉపయోగించడం ఏమిటి? మరో సామాజికుడి ప్రశ్న. దేశభక్తితో, భావోద్వేగంతో ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేయవచ్చు. కానీ ప్రజలంతా అలా అనుకోలేరు కదా? ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించి, పఠాన్‌కోట్ స్థావరంలో చొరబడినదాకా ఈ ప్రభుత్వం, ఇంటలిజెన్స్, సైనిక నిఘా విభాగాలు ఏమి చేస్తున్నాయి? పంజాబ్‌లో మిత్ర ప్రభుత్వం, దేశంలో సొంత ప్రభుత్వమే కదా ఉన్నాయి? యురీ సరిహద్దు స్థావరం. అక్కడ ఎంత అప్రమత్తంగా ఉం డాలో సైన్యానికి తెలుసు. ఇంటలిజెన్సుకు తెలిసే ఉండాలి. కానీ శిబిరంలోకి చొరబడి 21 మందిని ఊచకోత కోసేదాకా ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? ఇలా ఒకటేమిటి? అనేక ఉదాహరణలు. అనేక వైఫల్యాలు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి యుద్ధ పరిభాష.

దేశ ప్రజల్లో ఆవేశకావేశాలు రెచ్చగొట్టడానికి ఉగ్రవాద దాడులను ఒక సందర్భంగా ఉపయోగించుకోవడం. కార్గిల్ సమయంలో జరిగింది దాదాపు ఇటువంటి పరిస్థితే. పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు జమిలిగా మన భూభాగంలోని శిఖరాలను ఆక్రమించి యుద్ధానికి పొజిషన్స్ తీసుకునేదాకా మనం నిద్రపోయి ఉన్నాం. ఆ తర్వాత ఎన్నో త్యాగాలు చేసి ఆ శిఖరాలను విడిపించుకున్నాం. మన దేశభక్తి కోసం ఎంత మంది సైనికులు బలవుతున్నారు? హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై వంటి పట్టణాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను నిత్యం కనిపెట్టి కట్టడి చేయగలిగినప్పుడు సరిహద్దుల్లో చేయలేమా? అన్నది ఒక విధాన నిపుణుడి ప్రశ్న. లోతుల్లోకి వెళ్లే కొద్దీ మోడీ వ్యక్తిగత నిజాయితీ కూడా మసకబారుతుంది.

వ్యక్తిగత నిజాయితీ ప్రభుత్వ నిజాయితీగా, వ్యవస్థ నిజాయితీగా ఉండాలి. సం స్కరణలను మునుపెన్నడూ లేనంత వేగంగా అమలు చేస్తున్నారు. రక్షణరంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులు అనుమతించారు. స్వదేశీ రక్షణ రంగ సంస్థల పాత్ర ను కుదించేందుకు చేయవలసిందంతా చేస్తున్నారు. నిజానికి, ఈ విధానం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వదేశీ విధానాలకూ విరుద్ధం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదాస్పదం కావడం అందుకే. బేషరతుగా అడిగిన ధర(ఎక్కువ ధర) ఇచ్చి విమానాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది. యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. టెక్నాలజీ బదిలీ నిబంధనను వదిలేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ త్వరితగతిన జరుగుతున్నది.

వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడానికి చాలా చర్యలే తీసుకున్నారు. విధానాలు, చట్టాలు వస్తే ఏం ప్రయోజనం? ఇంకా అవేవీ ఫలితాలివ్వలేదు. ప్రభుత్వరంగ బ్యాంకులను ముంచేవాళ్లు ముంచుతూనే ఉన్నారు. తప్పించుకుతిరిగేవాళ్లు తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వమే చాలా మందికి ఛత్రం పడుతున్నది. సామాన్యులకు అప్పు లభించదు. పెద్దలు తీసుకున్న అప్పులు చెల్లించరు. సామాన్యుడికి ఈ అనుభవంలో మార్పు రానంతవరకు క్రమశిక్షణ ఫలితాలు జనానికి చేరనట్టే. మోదీ వల్ల నాకు ఈ మేలు జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఇంకా రాలేదు. కొన్ని పథకాలు ప్రజలకు చేరినా అవి మోడీ చేసినవా, స్థానిక ప్రభుత్వాలు చేసినవా, బ్యాంకులు చేసినవా తెలియని పరిస్థితి. ఇటీవల ఒక పల్లెటూరులో ఒక బ్యాంకుకు వెళితే మేనేజరు ఒక బాధితురాలికి చెక్కు అందజేస్తున్నారు. ఆమె భర్త ప్రమాదవశాత్తు చనిపోయారు. ప్రధాని బీమా యోజన కింద రెండు లక్షల బీమా ఇస్తున్నాం అని ఆయన చెప్పారు. బ్యాంకులో ఖాతా ఉన్నవాళ్లకు ఈ పథకం వర్తిస్తుందట.

ఎంత మందికి ఇచ్చారు ఇప్పటివరకు? అడిగితే, మా బ్యాంకు పరిధిలో పది మంది వరకు వచ్చి ఉంటాయి అని ఆయన సమాధా నం ఇచ్చారు. ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు గొప్ప ఆసరా. కానీ ఆ బాధితురాలికి ఎవరిస్తున్నారన్న విషయం తెలియదు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో ఎంత యుద్ధాలు చేసినా అట్టడుగుస్థాయిలో జనాన్ని చేరుతున్నామా లేమా అన్నదే ముఖ్యమవుతుంది. అట్టడుగు ప్రజానీకాన్ని చేరడానికి వారిని పరామర్శించే ఒక పార్టీ, ఒక యంత్రాంగం సజీవంగా నడుస్తూ ఉండాలి. ఇన్ని ఉండగా కూడా జనం జై కొట్టాలని లేదు. చాలా తేలికగా అభిప్రాయాలు మార్చుకునే స్వేచ్ఛ, పరిస్థితి జనానికి ఉంటుంది. చంద్రబాబు పరిస్థి తి కూడా మోదీ మాదిరిగానే ఉంది.

పైన అట్టహాసం, లోన గందరగోళం.ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడగూడని మాటలు కొన్ని ఇటీవల చంద్రబాబునాయుడు మాట్లాడాడు. ఆయన రాజకీయ వాస్తవికతల నుంచి దూరమవుతున్నారేమో అనిపించింది. ఇళ్లిచ్చి, పింఛను ఇచ్చి, బియ్యమిచ్చి,... ఇలా ఇంకా చాలా చాలా ఇచ్చినా ఓటర్లు స్వార్థపరులై ఆఖరులో ఇచ్చే ఐదొందల రూపాయల నోటుకే ఓటు వేస్తున్నారని ఒక పెద్ద బండ ప్రజలపై వేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడగూడని మాట. ఎందుకంటే ఓట్ల ధరలు చంద్రబాబు రాజకీయాలు చేయడం మొదలైన తర్వాతనే విపరీతంగా పెరిగాయి. ఓట్లను ప్లాట్లను వేలం వేసినట్టు వేలం వేసి కొనుక్కునే పరిస్థితులు వచ్చాయి. తెలంగాణలో చాలా నయం. ఊరుకు పది పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. జనం తమకు తోచినవారికి వేస్తారు. నచ్చడం నచ్చకపోవడం ముఖ్యం. ఆ తర్వాతనే ఏ ప్రయోజనమైనా. రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా జనం చేరువ కావ డం ముఖ్యం.

జనం హృదయాలను గెల్చుకోవడం ముఖ్యం. ఇటీవల ఒక సంస్థ కొన్ని నియోజకవర్గాలలో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేస్తారు? అని ప్రశ్నిస్తే 52 శాతం మంది టీఆర్‌ఎస్‌కు వేస్తామని చెప్పా రు. మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి అంటే 35 శాతం మంది బాగుంది అని చెప్పారు. అంటే అక్కడ ఓటు కేసీఆర్‌కు. ప్రభుత్వం పనితీరుకు వేసినట్టు. అంటే ప్రభుత్వం ప్రజలను చేరుతున్నట్టు, ప్రజల హృదయాలను చేరుతున్న ట్టు, నాయకులే ఇంకా కేసీఆర్ అనుకూల పవనాలను అందుకోలేకపోతున్నట్టు భావించాలి. ఈ పరిస్థితినే కేంద్రంలో మోదీకి అన్వయించి చూస్తే పూర్తి భిన్నమైన అంచనాలు వస్తున్నాయి. 2014 ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్ బాగా బలపడినట్టు సర్వేలు చెబుతున్నాయి. అదే కేంద్రంలో మోదీ బలహీనపడినట్టు వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న ట్రెండ్సు తెలియజేస్తున్నాయి. విచిత్రంగా కొన్ని రాష్ర్టాల్లో ఆప్ కూడా విస్తరించింది. పంజాబ్‌లో ఆప్ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నా యి.

నాయకులు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు, చేపట్టే పనులు ప్రజలకు ఎంతవరకు కనెక్టు అవుతున్నాయన్నదే ముఖ్యం. ఆప్ గానీ, టీఆర్‌ఎస్ గానీ జనంతో కనె క్టు అయ్యే అంశాలపై పనిచేస్తున్నాయి. సామాన్యులకు పెద్ద పెద్ద విషయాలతో పనిలేదు. రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలే వారికి ముఖ్యం. ఏ పార్టీ అయి నా అది తెలుసుకుని మసలుకుంటే తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోక్‌సభ ఎన్నికలకు పెద్దపెద్ద విషయాలు ఉపయోగపడతాయి కావచ్చు. కానీ రాష్ర్టాలు, అసెంబ్లీలు గెలువాలంటే ఎక్కడికక్కడ స్థానిక ఆత్మను పట్టుకోవడమే అవసరం. దేశభక్తి, జాతీయవాదం, గోరక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటివి పెద్ద పెద్ద విషయాలు. పింఛన్లు, ఉపాధిఅవకాశాలు, రైతులకు అప్పులు, సబ్సిడీలు, విద్యవైద్యం వంటి అంశాలు, వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందుకే 2014కు 2016కు ఈ తేడా.

1961

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు



        


Featured Articles