సూక్ష్మ పాలన-సత్వర ఫలితాలు


Sun,October 9, 2016 02:04 AM

అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండా లి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది.ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి.

shekarreddy
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరడం లేదు. ప్రభుత్వం రూపాయి ఖర్చుపెడితే లబ్ధిదారులకు 15 శాతానికి మించి చేరడం లేదు అని నాడు రాజీవ్‌గాంధీ మొదలు మొన్న బీజేపీ నాయకత్వం వరకు పదే పదే చెబుతు న్న మాట. ఆరు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేస్తున్నా ఇప్పటికీ 20 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. అవినీతి సహజం దానిని ఏమీ చేయలేమని ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను మార్చలేమా? ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదా? నాయకులు రాజనీతిజ్ఞులయితే, దీర్ఘదృష్టి, ప్రజాసంక్షేమాపేక్ష, పట్టుదల ఉంటే ఎందుకు మార్చలేము? సంక్షేమ పథకాల్లో 85 శాతం వృథాను అరికడితే పేదరికాన్ని జయించలేమా? అవినీతిని కట్టడి చేస్తే ప్రజలపై భారాన్ని తగ్గించి ప్రజారంజక పాలన అందించలేమా? సర్క్యులర్ రాజ్యాన్ని మార్చి, ప్రజలు పారిశ్రామికవేత్తలు తేలికగా పనులు చేసుకునే వెసులుబాటు తేలేమా? అభివృద్ధిని ఉరకలు వేయించలేమా? తెలంగాణ ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా ఇదే అంశంపై సంస్కరణలు మొదలు పెట్టారు.

ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, అందరిచేతా ఆలోచింపజేయడం, సమాధానాలు రాబట్టడం, విధానాలు రూపొందించడం, ఆచరణలో పెట్టడం తెలంగాణలో ఇవ న్నీ ఒక పరంపరగా జరుగుతున్నాయి. ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం కలిగించగల మార్గాలను అన్వేషించడంలో ఆయన నిత్య శోధకుడు. అస్తమానం ఏదో ఒక దేవులాటతో తపించే ముఖ్యమంత్రిని నేనింతవరకు చూడలేదు. పత్రికలు చదవడం, చానెళ్లు ఫాలోకావడం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతున్నదో కనిపెట్టడం, నిరంతరం ఏవో కొత్తకొత్త ఆలోచనలు చేయడం, అందరితో ఆ ఆలోచనలను పం చుకోవడం, ఆచరణకు ఉద్యుక్తులను చేయడం.. ఒక ముఖ్యమంత్రి ఇంతగా శ్రమపడడం అసాధారణం. గతంలో ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారులు పత్రికలు, చానెళ్లు చూసి సంక్షిప్త నివేదికలు ఇచ్చేవారు. వాటిని పైపైన చూసి పక్కన పడేసేవారు. కేసీఆర్ అలాకాదు. వార్తలు చదివి, వాటిపై అప్పటికప్పుడు సూచన లు చేయడం, ఆదేశాలు ఇవ్వడం ఆయనకు రివాజు.

ఆయన చుట్టూ ఉండే అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిందే. ఒక్కోసారి అనిపిస్తుంది-తెలంగాణ రాష్ట్రం, స్వయంపాలన, అసాధారణ అభివృద్ధి, సంక్షేమ విజయాలను సాధించిన ఒక ముఖ్యమంత్రి ఇంతగా కష్టపడటం అవసరమా అని. కానీ ఆయన విశ్రమించరు. ఎవరినీ విశ్రమించనీయరు. ఒక్కోసారి ఇబ్బంది అనిపించినా ఆయన ఓపిక, ఆయా అంశాలపై ఆయన చూపే శ్రద్ధ మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఉద్యుక్తులను చేస్తుంది. అది ఆయన తత్వం. శోధించాలి, సాధించా లి.. ఇది ఆయన కార్యాచరణలో కనిపించే తత్వం. ఆయన మనస్తత్వం. కొత్తగా ఆయన మారే అవకాశమే లేదు. ఆయన అసాధారణ ఆలోచనల పుట్ట. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి అని తన సహచరులకు పురమాయించడం ఆయన ఉద్యమకాలం నుంచీ చెబుతున్న మాట. ఇప్పుడూ అదే ఒరవడి.

జిల్లాల ఏర్పాటు నిర్ణయం కూడా ఆ ఆలోచనా స్రవంతిలో భాగమే. తెలంగా ణ సాధించడమే కాదు, సాధించిన తర్వాత ఏమి చేయాలో ఆయన చాలా కాలం నుంచి ప్రణాళికలు ఆలోచిస్తూ వచ్చారు. కొత్త జిల్లాల ఆలోచన కూడా అటువంటిదే. తెలంగాణ సాధించినంత గొప్ప చరిత్రాత్మక పరిణామం. మార్పు దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగు. చిన్న జిల్లాలు లక్ష్యాల సాధనకు దగ్గరి మార్గం. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేయడానికి, సత్వర ఫలితాలు సాధించడానికి ఒక ప్రగతిశీల పాలనా సంస్కరణ. నిర్వహణ, తనిఖీ, పర్యవేక్షణ, ఫలితాల సమీక్షకు అందనంత పెద్ద జిల్లాలు ఇంతకాలం కొనసాగాయి. కాలం చెల్లిన రాజకీయ ఆలోచనలతో, అభివృద్ధి నిరోధక ఆధిపత్య ధోరణులతో జిల్లాల్లో తరతరాలుగా పాతుకుపోయిన రాజకీయ పెత్తందారీ వ్యవస్థల పట్టునుంచి ప్రాంతాలను విముక్తి చేసే ప్రజాస్వామిక ప్రక్రియ జిల్లాల ఏర్పాటు. ప్రజలకోసం, ప్రజలకు చేరువగా ప్రభు త్వం ఉండాలని యోచించేవారెవరూ కొత్త జిల్లాలను వ్యతిరేకించరు.

వెనుకటికి ఎన్‌టీఆర్ మండలాల వ్యవస్థను తెచ్చినప్పుడు అప్పటిదాకా నిద్రాణమై ఉన్న సామాజికశక్తులు ఒక్కసారిగా స్వేచ్ఛను పొంది రాజకీయాధికార సౌధాల్లో అడుగు పెట్టగలిగాయి. కేసీఆర్ జిల్లాల సంస్కరణ అంతకంటే గొప్ప మార్పు. ఎన్ని జిల్లాలు, ఎంత జనాభా అన్న పంచాయితీ కూడా అర్థరహితమైనది. తెలంగాణకంటే తక్కువ వైశాల్యం కలిగిన బీహార్‌లో 38, పశ్చిమబెంగాల్‌లో 20, జార్ఖండ్‌లో 24, అసోంలో 35, పంజాబ్‌లో 22, హర్యానాలో 22 జిల్లాలు ఉన్నాయి. దేశంలో 29 రాష్ర్టాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 687 జిల్లాలు ఉంటే అందులో 250 జిల్లాలు పది లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఐదు లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు సుమారు 100 ఉన్నా యి. ఛత్తీస్‌గఢ్‌లో 24 జిల్లాలు ఉంటే 19 జిల్లాలు సుమారు పదిలక్షలు అంతకం టే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో 16 జిల్లాలు ఐదు నుంచి పదిలక్షల జనాభా కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో పది జిల్లాలు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. గుజరాత్‌లో పది, జార్ఖండ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 9 జిల్లాలు పదిలక్షల కంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. తక్కువ జనాభాతో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ర్టాలన్నీ అభివృద్ధి సూచికలో పైమెట్టులో ఉండటమో, పైస్థానానికి ఎదగడానికి గట్టిగా పోరాడుతుండటమో చేస్తున్నాయని వేరేచెప్పనవసరం లేదు. అధికార వికేంద్రీకరణ, సమర్థ నిర్వహణ, సూక్ష్మస్థాయి పర్యవేక్షణ, ఆశించిన ఫలితాల సాధన, చిన్న పాలనా కేంద్రాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనా లు. గాంధీ జయంతిరోజు ముఖ్యమంత్రి మరికొన్ని జల్లాలను కూడా అంగీకరించి ఆందోళన చేస్తున్నవారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. పంతాలు పట్టింపుల కు పోకుండా వీలైనంత విస్తృత ఆమోదంతో నిర్ణయాలు చేశారు. అయినా అక్కడక్కడా డిమాండ్లు, అలకలు, అసంతృప్తులు మిగిలిపోవడం సహజం. అందులో న్యాయమైనవీ, ఆచరణ సాధ్యం కానివీ ఉండవచ్చు. ఏదో ఒక పేచీ లేవనెత్తేవారు ఎప్పుడూ ఉంటారు. విశాలదృష్టితో ఏం జరుగుతున్నదన్నదే ముఖ్యం.

తెలంగాణ ప్రభుత్వం దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని సాహసాలు చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జాతి దృష్టిని ఆకర్షించాయి. అందరి మన్ననలూ పొందుతున్నాయి. నీటి విలువ తెలిసిన రాష్ట్రంగా అత్యంత వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. సుమారు 50 వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగాల్లో ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర జనాభాలో పది శాతం మందికి పింఛన్లు ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నది. ఆహార భద్రత విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు చేసింది. రెండు పడక గదుల ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలను ప్రారంభించినా అవి ఇంకా వేగంగా అమలు చేయవలసి ఉంది. కేజీ టు పీజీ, సంక్షేమ గురుకులాల ఏర్పాటు వేగంగా కార్యరూపం దాల్చాల్సి ఉంది.

ఇవన్నీ త్వరితగతిన అమలు చేయడానికి, నిర్వహించడానికి, ఫలితాలు సాధించడానికి దృష్టిని కేంద్రీకరించి పనిచేసే యంత్రాం గం కావాలి. ఒక అధికారి అరవై మండలాలు చూడటం వేరు. ఒక అధికారి పది నుంచి ఇరవై మండలాలు చూడటం వేరు. ఏళ్ల తరబడి పేదరిక నిర్మూలన పథకా లు అమలు చేస్తూ ఉంటే లాభం లేదు. అవి ఫలితం ఇవ్వాలి. ప్రజలకు పేదరికా న్ని జయించే సాధన సంపత్తి సమకూర్చాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 85శాతం లీకేజీలను అరికట్టగలిగితే ఈదేశంలో పేదరికం ఎప్పుడో అంతమయ్యే ది. పేదలకు పూరిగుడిసెల్లాంటి ఇండ్లు, ఏవో పప్పు బెల్లాలు అందించి చేతులు దులుపుకోవడం, రాజకీయ నాయకత్వం అంతకంతకూ ఎదగడం ఇప్పటిదాకా జరుగుతున్న తంతు.

ఇదే మూస ధోరణితో పనిచేస్తే ఇంకెన్ని దశాబ్దాలు పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేసినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నాలుగు దశాబ్దాల్లో కట్టించిన ఇళ్లన్నీ సరిగా ఉండి ఉంటే ఇప్పుడు సొంత ఇళ్లకు ఇంత డిమాండు ఉండే ది కాదు. నాణ్యత లేని ఇండ్లు ఇవ్వడం, అవి నాలుగు రోజులకే పాడైపోవడం, పేదలు మళ్లీ వీధుల్లో పడడం, మళ్లీ ఇండ్లకోసం దరఖాస్తులు చేసుకోవడం ఇదో చక్రభ్రమణంలాగా తయారైంది. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నగలిగే ఆస్తిని సమకూర్చాలి. అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి.

అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండా లి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి. ఒక పురోగామి రాష్ట్రం గా, ఉన్నత జీవన ప్రమాణాలను సాధించే రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.

2050

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా