స్వయంపాలనే పరమావధి


Sun,October 2, 2016 02:26 AM

జిల్లాల విభజన వల్ల కలిగే ప్రయోజనాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒనగూరుతున్న ప్రయోజనాలే జిల్లాల కు వర్తిస్తాయి. వికేంద్రీకరణ వల్ల జిల్లాల పరిధి తగ్గుతుంది. జన సంఖ్య తగ్గుతుం ది. కేంద్రీకృత అభివృద్ధి జరుగుతుంది. జిల్లాలు పెద్దవి కావడం వల్ల అధికారులు, నాయకులు ఏ ఒక్క అంశంపై శ్రద్ధపెట్టడం సాధ్యం కావడం లేదు. దృష్టిని కేంద్రీకరించడం సాధ్యపడటం లేదు. అంతేకాదు పెద్ద జిల్లాలో తరతరాలుగా పాతుకుపోయిన నాయకత్వాల కింద బలహీన నాయకత్వాలున్న ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. జిల్లాల పునర్విభజన అటువంటి జాఢ్యాలన్నింటినీ బదాబదలు చేస్తుంది.

shekarreddy
జిల్లాల విభజనవల్ల ఏమిటి ప్రయోజనం? ఇటీవల కొందరు బుద్ధిజీవులు, మరికొందరు బుద్ధివిగత జీవులు పదే పదే ప్రశ్నిస్తున్నారు. విభజనలో ఏదో లోపం ఉన్నట్టు, ప్రభుత్వానికి ఏవో దురుద్దేశాలున్నట్టు విమర్శలు చేస్తున్నారు. సిద్ధాంతా లు, సూత్రాలు వల్లెవేస్తున్నారు. వీరి వాదనలు వింటుంటే కొన్నాళ్ల క్రితం తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు చేసిన వాదనలే గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే నష్టపోతుందని, సొంతంగా మనుగడ సాగించలేదని, తమ నిధులేవో తెచ్చి పేద ప్రాంతమైన తెలంగాణను పోషిస్తున్నామని కొందరు ఆధిపత్యవాదులు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ చివరికి ఏం జరిగింది? ఎవరు ఎవరిపై ఆధారపడ్డారు? ఎవరి నిధులతో ఎవరు సంబురాలు చేసుకున్నారు? ఈ రెండున్నరేళ్ల లో ఒక్కొక్క వాస్తవమే తెలిసివచ్చింది. స్వయంపాలనాధికారం తెలంగాణ ఉద్యమానికి తాత్విక భూమిక.

సుదీర్ఘ ఉద్యమాల తర్వాత స్వయంపాలనాధికారం సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ ఒక విశిష్టరాష్ట్రంగా, అభివృద్ధికి కొత్త నమూనాగా, ప్రజాసంక్షేమమే కేంద్ర బిందువుగా ముందుకు సాగుతున్నది. మన నిధులు మనం ఖర్చు చేసుకోవడం, మన ఉద్యోగాలు మనం భర్తీ చేసుకోవడం, మన నీళ్లు మనం వాడుకోవడం, మన భవిష్యత్తుకు మనం బంగారుబాటలు వేసుకోవడం, మన ప్రాజెక్టులను మనం మరింత ప్రయోజనకరంగా రూపకల్పన చేసుకోవడం, మన రాష్ట్రం-మన ఆత్మతో పనిచేయడం....ఇవన్నీ తెలంగాణ సాధించిన విజయాలు. మన ప్రభుత్వం, మన నాయకులు, మన కళ్ల ముందు. మన ప్రణాళికలు... అన్నీ మనకు తెలిసే జరుగుతున్నా యి. అయితే స్వయంపాలన సాధించడం అంటే మన రాష్ట్రం ఏర్పడటం, మన నాయకత్వానికి అధికారం రావడం ఒక్కటే కాదు.

కేసీఆర్ దానిని ఇంకా అట్టడుగు వర్గాల దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు. రాజకీయ, పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ మరింత విస్తృతంగా జరుగాలనుకున్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కావాలని తపనపడినట్టే తమకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణలో చాలా ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారుల కమిటీ, మంత్రివర్గ కమిటీ అందరూ అధ్యయనం చేసి, ప్రతిపక్షాలతో కూడా మాట్లాడిన తర్వాతనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజల అభిప్రాయాల ను కోరింది. వేలాది అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయి. అన్నింటినీ ప్రభు త్వం పరిశీలిస్తున్నది. ముఖ్యమంత్రి వివిధ ప్రాంతాల నుంచి విన్నపాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. స్థూలంగా ప్రజాభీష్టానికి అనుగుణంగానే తుది ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వం చెబుతున్నది.

జిల్లాల విభజన వల్ల కలిగే ప్రయోజనాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒనగూరుతున్న ప్రయోజనాలే జిల్లాల కు వర్తిస్తాయి. వికేంద్రీకరణ వల్ల జిల్లాల పరిధి తగ్గుతుంది. జన సంఖ్య తగ్గుతుం ది. కేంద్రీకృత అభివృద్ధి జరుగుతుంది. జిల్లాలు పెద్దవి కావడం వల్ల అధికారులు, నాయకులు ఏ ఒక్క అంశంపై శ్రద్ధపెట్టడం సాధ్యం కావడం లేదు. దృష్టిని కేంద్రీకరించడం సాధ్యపడటం లేదు. అంతేకాదు పెద్ద జిల్లాలో తరతరాలుగా పాతుకుపోయిన నాయకత్వాల కింద బలహీన నాయకత్వాలున్న ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. జిల్లాల పునర్విభజన అటువంటి జాఢ్యాలన్నింటినీ బదాబదలు చేస్తుంది. జిల్లాల మధ్య పోటీ ఏర్పడుతుంది. నాయకులు దృష్టిని కేంద్రీకరించి లక్ష్యాలు, ఫలితాలు సాధించడానికి సులువవుతుంది. పథకాల అమలులో పారదర్శకత ఏర్పడుతుంది. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుంది.

కలెక్టరాఫీసుకు పోవడం అంటే బ్రహ్మలోకం పోవడంలాగా ఎవరూ భారంగా భావించే పరిస్థితి ఉండదు. ఉన్నతాధికార యత్రాంగం సామాన్యులకు అందుబాటులోకి వస్తారు. అధికారులు జిల్లాలకు సంబంధించిన సమస్త అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అలవోకగా పనిచేయడానికి, ఫలితాలు రాబట్టడానికి వీలవుతుంది. ఖర్చు పెట్టే ప్రతిపైసాకు ఫలితాలను చూపించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, ఫలితాల గణన అన్నీ సునిశితంగా చేయడానికి వీలవుతుంది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు జిల్లాల పునర్విభజన గట్టి పునాదులు వేస్తుంది. కేవలం జిల్లాలను ఏర్పాటు చేయడం కార్యాలయాలు ఇవ్వడం కాకుండా, జిల్లాలను అభివృద్ధి కేంద్రాలుగా మల్చడానికి వీలుగా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జిల్లాల ప్రత్యేకతలను గుర్తించి, వాటికి తగిన పారిశ్రామిక వాడలు లేదా చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పడానికి ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా సాధిస్తున్న ముందడుగే రేపు జిల్లాలు సాధిస్తాయని ఏమాత్రం విచక్షణతో చూసినా అర్థమవుతుంది.

ఎటువంటి మార్పును మొదలుపెట్టినా అపశకునాలు పలికే వాళ్లు కొందరు ఉంటారు. తమ ఆలోచనల ప్రకారం లోకం స్తంభించిపోవాలని కొందరు కోరుకుంటుంటారు. తమకు నచ్చితే వైభవం, నచ్చకపోతే అధ్వాన్నం. ఇదీ వారి ధోరణి. కొన్ని ప్రాంతాల ప్రజలు తమకూ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుకోవడం న్యాయ మే కావచ్చు. కానీ భౌగోళిక, రాజకీయ పరిమితులన్నీ కలిసి రావాలి. కొన్ని రాజకీయ శక్తుల డిమాండ్లో, రియలెస్టేటు పక్షాల డిమాండ్లో ముందేసుకుంటే జిల్లాల సంఖ్య 27తో ఆగదు. సిరిసిల్ల, జనగామ ప్రజలు జిల్లాను కోరుకోవడంలో తప్పులేదు, కానీ రాష్ట్రం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలపై జరిగే తుది నిర్ణయాలను అర్థం చేసుకోవాలి. గద్వాల శాసనసభ్యురాలు డి.కె.అరుణ గతంలో మంత్రిగా పనిచేశారు.

ఆమె గద్వాలను జిల్లాను చేయాలని కోరడం వరకు బాగానే ఉంది. కానీ ఆ అంశంపై వ్యక్తిగత పట్టింపులు, పంతాలదాకా వెళ్లడం విచిత్రంగా ఉంది. గద్వాలను ఒక ప్రజాస్వామిక రాజకీయ కేంద్రంగా కాకుండా ఆమె అదేదో తన సొంత ఆస్తి వ్యవహారంలాగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కాదు. వనపర్తిని జిల్లాను చేసి మళ్లీ గద్వాలను కూడా జిల్లా చేయడం ఎలా సాధ్యమో ఆమె ఆలోచించాలి. రాష్ట్ర నాయకురాలిగా, మహబూబ్‌నగర్ జిల్లా నాయకురాలిగా కాకుండా కేవలం ఒక గద్వాలకే నాయకురాలిగా ఎందుకు రుజువు చేసుకోవాలనుకుంటున్నారు? జిల్లాల విభజన తుది దశకు చేరుకుంటున్న దశలో శాసనసభ్యత్వ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి పంపించడం అంటే దీనిని ఆమె తన వ్యక్తిగత సమస్యగా భావిస్తున్నారన్నమాట.

ప్రజాస్వామిక ప్రక్రియను అపహాస్యం చేసే ధోరణి. నిజానికి జిల్లాల విభజన విషయంలో ఎక్కువ కష్టపెట్టుకుందీ, ఇబ్బందిపడ్డదీ ముఖ్యమంత్రి తనయుడు, పురపాలకశాఖ మంత్రి తారకరామారావు. తన నియోజకవర్గ ప్రజలు జిల్లా కావాలని బలంగా కోరుకున్నారు. ఉద్యమాలు చేశారు. అందులో అన్ని పార్టీలవారూ ఉన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయితే బాగుంటుందని కేటీఆర్ కూడా గట్టిగానే భావించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి చుట్టూ కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు చేయగా సిరిసిల్లా జిల్లా ఏర్పాటు చేయడానికి తగిన భౌగోళిక అనుకూలతలు కనిపించలేదు. అయిష్టంగానే అయినా కేటీఆర్ కూడా వెనుకకు తగ్గవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కూడా తన మన అని చూడకుండా తుది నిర్ణయాలు చేస్తున్నారు. సొంత ప్రయోజనాలు, తక్షణ ప్రయోజనాల దృష్టితో కాకుండా విశాల ప్రయోజనాల దృష్టి తో జిల్లాల విభజనను అర్థం చేసుకోవాలి.

కొంత మంది మిత్రులు జిల్లాలు తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోతున్నాయని, బలహీనపడుతున్నాయని వాదిస్తున్నారు. ఎక్కువకాలం ఇదే జిల్లాల వ్యవస్థ ఉండటం వల్ల మనకు అలా అనిపించడం సహజమే. కానీ జిల్లాలు సుదీర్ఘకాలంపాటు పెద్దవిగా ఉండి అభివృద్ధిలో బలహీనపడిపోవడం, వెనుకబడిపోవడం కంటే చిన్నవిగా ఉండి బలమైన అభివృద్ధి కేంద్రాలుగా ఎదగడం మంచిది. ప్రస్తుతం ఉన్న జిల్లాలు మనకు ఈ వందేళ్లుగా తెలిసి ఉండవచ్చు, కానీ చరిత్ర అంతటా చిన్నచిన్న రాజకీయాధికార వ్యవస్థలే ఉన్నాయి. కాకతీయుల కాలంలో కూడా 70కి పైగా ప్రాంతీయ రాజ్యాలు ఉండేవని చెబుతారు. దేని ప్రత్యేకత దానికి ఉంది. కొంతకాలం చాలా సంస్థానాలూ రాజకీయాధికార కేంద్రాలుగా కొనసాగా యి. ఇప్పుడు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న ప్రాంతాలన్నింటికీ చరిత్రలో, సంస్కృతిలో ప్రత్యేకతలున్నాయి. వేటికవి తమ ప్రత్యేకతలను, ప్రతీకలను పునరుద్ధరించుకుని ఉన్నతంగా ఎదగాలి.

1634

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా