వాన కష్టం, వాన ఇష్టం


Sun,September 25, 2016 02:42 AM

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ముంపు బాధలు, అక్కడక్కడా పంట నష్టాలు తప్ప ఈ వర్షాలు ఎక్కువమందికి హర్షాన్నే మిగిల్చాయి. కాలం దాటిపోయింది. ఈసారి ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ నిండవేమో అని దిగులుగా ఉండె. మరోసారి కరువు దాడి చేస్తుందేమోనన్న భయం ఉండె. ఈ వానలు ఆ భయాలన్నింటినీ దూరం చేశాయి. శ్రీరాంసాగర్ నిండడమే కాదు, మొత్తం గేట్లు ఎత్తి కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీశైలంకు భారీగా వరద వస్తున్నందన అది కూడా నిండటం తథ్యం. ఇంకా సీజను ఉంది కాబట్టి నాగార్జున సాగర్‌కు కూడా నీరు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. సింగూరు, మంజీర నిండటం, అలుగులు పోయడం ఒక కొత్త చరిత్ర. నిజాంసాగర్‌కు వరద పోటెత్తడం మరో చరిత్ర. మిషన్ కాకతీయలో పూడికలు తీసి, కట్టలు పోసుకున్న వేలాది చెరువులు నిండాయి. వరుసగా పదేళ్లు కరువు మండలాలుగా ఉన్న చోట్ల కూడా ఈసారి అన్ని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి.

shekarreddy
చెరువులను మనం కబ్జా చేస్తే చెరువులు మనలను కబ్జా చేయవా? అని గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు లోచనాపరులు ప్రశ్నిస్తున్నారు. పౌరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్న వేస్తే కష్టం వేసే మాట నిజం. కానీ కష్టానికి కారణాలను తెలుసుకోవడం, వాటిని పరిహరించడానికి మార్గాలను అన్వేషించడం ఇప్పుడే చేయాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దానిని వంగదీయాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడే దానికి పరిష్కారాలు మొదలుపెట్టాలి. కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిన్న నిజాంపేట ప్రాంతంలో పర్యటించి అక్కడి జనంతో మాట్లాడుతుంటే చాలా కృతకంగా, నాటకీయంగా కనిపించింది. పాపాలభైరవులు పరామర్శలకు వచ్చినట్టుగా అనిపించింది. తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి ఒక్కరోజు వచ్చి రోడ్డుపై ధర్నా చేసి పత్రికలకు వార్తలిచ్చి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఒక్కరే హేతుబద్ధంగా, పెద్దమనిషిగా మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే మొదలు కాదు.

టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇటువంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. 1999లో, 2009లో, ఇంకా వేర్వేరు సందర్భాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం చూస్తూనే ఉన్నాం. అయినా నగరాన్ని బాగు చేయడానికి, చెరువులు, నాలాలు కాపాడటానికి, వరద సాఫీగా వెళ్లడానికి, డ్రైన్లు, నాణ్యమైన రీతిలో రహదారుల నిర్మాణానికి ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఈ లేఅవుట్లు ఎవరు వేశారో, అందులో బహుళ అంతస్థుల భవనాలు ఎవరు నిర్మించారో, లక్షలాది మంది మధ్య తరగతిని ఆ కూపంలో ఎవరు ఇరికించారో అందరికీ తెలుసు. వందలాది చెరువులు, కుంటలు మాయమ్యాయి. భూ రికార్డులు నాశనం చేశారు. రెవెన్యూ కార్యాలయాలు తగులబెట్టారు. నాలాలపై నిరాటంకంగా భవంతులు వెలిశాయి.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌లో ఈ భూదందాలకు అడ్డుకట్ట మొదలయింది. కబ్జాల బాగోతాలు మందగించాయి. ముఖ్యమంత్రి స్వయంగా హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. చెరువుల మరమ్మతులు కూడా చేశారు. రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన చికిత్స చేయడానికి ప్రయోగాత్మకంగా వైట్ టాప్ రోడ్లను పరీక్షించి చూసిన ప్రభుత్వం ఇదే. కనీసం ఇరవై ఏళ్లపాటు మన్నిక ఉండే రోడ్లను నిర్మించడానికి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించడం కూడా ఇదే ప్రథమం. హైదరాబాద్‌ను దీర్ఘకాలిక దృష్టితో బాగుచేయాలని నాయకత్వం మనసుపెట్టి ఆలోచించింది కూడా ఈ రెండేళ్లలోనే.

తారు రోడ్లు, తాలు రోడ్లు వేసి ఎప్పటికప్పుడు కాంట్రాక్టులు, ఆదాయాలకు అలవాటు పడిన వ్యవస్థను రూపుమాపాలని పురపాలక మంత్రి కేటీఆర్ చెప్పినప్పుడు కొందరు కాంట్రాక్టర్లు బయట వాపోయారు. తారు రోడ్లు వేయడం కోసం మేము చాలా చాలా యంత్రాలు కొన్నాం. చాలా వ్యవస్థ ఏర్పాటు చేసుకు న్నాం. ఇప్పుడు వద్దంటే ఎలా అని కాంట్రాక్టర్లు అధికారుల వద్ద గొడవకు దిగిన విషయాలూ తెలుసు. ఇదంతా జరుగుతుండగానే ఈసారి వరుణుడు తెలంగాణను కరుణించాడు. నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురవడం, అదీ ఎక్కువ వర్షపాతాలు నమోదు కావడం ఇటీవలి చరిత్రలో ఇదే ప్రథమం. ప్రాజెక్టులపై నిర్మించిన భారీ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి తెలంగాణ అంతటా హర్షామోదాలు వ్యక్తం అవుతుంటే, నగరంలో మాత్రం వరద ముంపు తీవ్రత అనుకోకుండా ఒక్కసారిగా మీదపడింది. దీంతో మునుపటికంటే సమస్య తీవ్రంగా బయటపడింది. తెలంగాణ ప్రభుత్వం తన అభివృద్ధి ప్రణాళికలకు తుది రూపు ఇచ్చే దశలో ఈ సమస్య తీవ్రంగా ముందుకు రావడం- కష్టం, నష్టం, బాధలు మిగిల్చినా- ఒక విధంగా మేలు చేసింది.

ఈ నగరానికి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. ప్రణాళికలు అమలయ్యేదాకా ప్రజల కష్టాలు ఆగవు కదా. అందుకే తక్షణ సాయం అందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికార యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా నగరంలో తిరుగుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనక కష్టపడుతున్నారు. జనానికి భరోసా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ వీలైన మేరకు సహాయం అందిస్తున్నారు. కొన్నిచోట్ల యుద్ధ ప్రాతిపదికన నాలాలు వెడల్పు చేసి నీటిని కిందికి పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం, పాలు, ఇతర నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నారు. పనిచేసే ప్రభుత్వం, స్పందించే ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు.

ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రభుత్వం రెండురోజుల పాటు సెలవులు ప్రకటించడం వల్ల నగరంలో ప్రాణనష్టం ఎక్కువ గా జరుగకుండా నివారించగలిగింది. మునుపెప్పుడయినా పురకపాలక మంత్రు లు ఇంతగా నగరంలో పర్యటించిన చరిత్ర ఉందా? పురపాలకశాఖ మంత్రి ఎవరో తెలియకుండానే కాలం గడిచిపోయిన సందర్భాలు ఎక్కువ. కేటీఆర్ ఆ చరిత్రను తిరగరాస్తున్నారు. దీనికంతటికీ మన రాష్ట్రం, మన నగరం, మన ప్రజలు అన్న భావనే ప్రేరణ. ఆత్మతో పనిచేసే తత్వమే నాంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి కొంతసమయం పట్టవచ్చు. ఈ నగరానికి మరోసారి ఈ తిప్పలు రానివ్వబోమని, ఒక్క ఏడాది కాలంలో చాలా మార్పులు చూస్తారని కేటీఆర్ ఇచ్చిన భరోసా చాలా మందికి నచ్చింది. ఈ ఆపదను ఒక సవాలుగా, ఒక పరీక్షగా పరిగణించి ఎదుర్కొంటామని ఆయన చెప్పిన మాటలు చాలా మందికి నమ్మకాన్ని కలిగించాయి.

ఈ నగరం తప్పక కోలుకుంటుంది. ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నదో, ఇకపై పౌరులు కూడా అంతే బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పద్ధతీ పాడు లేకుండా, అనుమతులు లేకుండా, ఎక్కడపడితే అక్కడ ప్లాట్లు, ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇటువంటి పాట్లు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇకపై కొనుగోళ్లు చేయాలి. చెరువులోనో, చెరువుకిందో, నాలాల వెంటో ఇండ్ల నిర్మాణాలు మానెయ్యాలి. అవి ఎప్పటికయినా ముప్పేనని గుర్తించాలి. నిజాంపేటలో ఒక పౌరుడు మాట్లాడుతూ అటెటో వెళ్లే నీటిని తమ కాలనీ మీదకు వదిలారని అదేదో చెత్త టీవీలో అదేపనిగా చెప్పించారు. నీటి ప్రవాహాన్ని ఎటుపడితే అటుమళ్లించడం కుదరదని, వాలు ఎటువుంటే అటు పరుగెడతాయని విపరీతంగా వర్షాలు వరదలు వచ్చినప్పుడే తెలిసేది.

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ముంపు బాధలు, అక్కడక్కడా పంట నష్టాలు తప్ప ఈ వర్షాలు ఎక్కువమందికి హర్షాన్నే మిగిల్చాయి. కాలం దాటిపోయింది. ఈ సారి ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ నిండవేమో అని దిగులుగా ఉండె. మరోసారి కరువు దాడి చేస్తుందేమోనన్న భయం ఉండె. ఈ వానలు ఆ భయాలన్నింటినీ దూరం చేశాయి. శ్రీరాంసాగర్ నిండడమే కాదు, మొత్తం గేట్లు ఎత్తి కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీశైలంకు భారీగా వరద వస్తున్నందన అది కూడా నిండటం తథ్యం. ఇంకా సీజను ఉంది కాబట్టి నాగార్జున సాగర్‌కు కూడా నీరు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. సింగూరు, మంజీర నిండటం, అలుగులు పోయడం ఒక కొత్త చరిత్ర. నిజాంసాగర్‌కు వరద పోటెత్తడం మరో చరిత్ర. మిషన్ కాకతీయలో పూడికలు తీసి, కట్టలు పోసుకున్న వేలాది చెరువులు నిండాయి. వరుసగా పదేళ్లు కరువు మండలాలుగా ఉన్న చోట్ల కూడా ఈసారి అన్ని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని నదులు, ఉపనదులు, వాగులు వంకలు అన్నీ పొంగిపొర్లాయి. మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండుగా జలాలతో కళకళలాడుతున్నాయి.

మూసీ రిజర్వాయరు గేట్లు ఇన్ని రోజులు తెరిచి ఉంచడం ఇటీవల మరో రికార్డు. పులిచింతల రిజర్వాయర్ నుంచి కూడా కిందికి నీళ్ళు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్లకు ఏళ్లు కొండకు ఎదురు చూసినట్టు, వానకు ఎదురుచూసిన గ్రామాల్లో ఈసారి వీధులన్నీ జాలువారుతున్నాయి. తెలంగాణ ఎప్పు డో మరచిపోయిన జ్ఞాపకాలను మళ్లీ నెమరు వేసుకునే అవకాశాన్ని ఈసారి వరుణుడు మళ్లీ కల్పించాడు. మా ఊరిలో ఎప్పుడు ఎక్కడ మాయమయ్యాడో తెలియని జాలరి మళ్లీ వలలతో ప్రత్యక్షమయ్యాడు. అలుగుకు చేపలు ఎదురెక్కడం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చూశాం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఇది వేలాది గ్రామాల అనుభవం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలను మరింత వేగంగా ముందుకు నడిపించడానికి, నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ఈ వానలు, వరదలు మనకు స్ఫూర్తినిస్తాయి.

2043

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా