దాచేస్తే దాగని సత్యం


Sun,August 28, 2016 10:13 AM

నీటి విలువ కంటే ఏదీ విలువైంది కాదు. కరెంటు ఖర్చు, ప్రాజెక్టు వ్యయం అంటూ తెగ మాట్లాడుతున్న వారంతా
ఒకటి గమనించాలి. తెలంగాణలో సుమారు 20 లక్షల మోటారు పంపులు పనిచేస్తున్నాయి. సాగు నీరివ్వకపోతే మరో 20 లక్షల పంపుసెట్లు వస్తాయి. ఒక్కో మోటారు పంపు, బోరు, కరెంటు కయ్యే ఖర్చు కనీసం లక్షన్నర. ఆ లెక్కన చూస్తే ఇరవై లక్షల పంపు సెట్లపై రైతులు ఇప్పటివరకు పెట్టిన ఖర్చు మూడు లక్షల కోట్లు. గోదావరిలో ఈ ఏడాది ఇప్పటివరకు సముద్రంలో కలిసిన 1500 టీఎంసీల నీటి విలువ కనీసం 30 వేల కోట్లు. ఒక ప్రాజెక్టు నిర్మిస్తే అది కొన్ని తరాలపాటు లక్షలాది ఎకరాలకు నీరిస్తుంది. రైతుపై భారాన్ని తగ్గిస్తుంది.
వేల కోట్ల సంపదలు సృష్టిస్తుంది. దూరదృష్టితో ఆలోచించండి.

shekarreddy
ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది కాం గ్రెస్ నాయకులకు. జరుగని ఒప్పందాన్ని జరిగినట్టుగా చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని తెల్లారేసరికి బద్నాం చేయాలన్న ఆదుర్దా కొద్దీ ముందూ వెనుకా చూడకుండా ఉత్తకాగితాలు ఊపుతూ ఆవేశప్రదర్శనలు చేశారు పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ, షబ్బీర్ అలీ వంటివారు. వారు మాట్లాడుతున్న తీరునుబట్టి మునుపెన్నడూ వీరు తమ్మిడిహట్టిని చూడటం గానీ, సాకల్యంగా తెలుసుకోవడం గానీ, చదవడం గానీ చేసి ఉండరు. కాంగ్రెస్ పేదరికం అది. తమ పేదరికం ఎక్కడ బయటపడుతుందేమో అన్న భయమో నమస్తే తెలంగాణ రాస్తున్న వాస్తవాలపై కోపమో తెలియదు కానీ విలేకరుల సమావేశాలకు నమస్తే తెలంగాణ విలేకరులను పిలువకుండా, నిషేధం విధించీ ఈ మధ్య మీటింగులు పెడుతున్నారు. అయినా వారి జ్ఞానం ఏదో ఒక రూపంలో ప్రసరించకుండా, సర్వవ్యాపితం కాకుండా ఎలా ఉం టుంది? పాపం ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి పెద్దమనిషి.

సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు. శుక్రవారం నాడు ఆయన అసలు విషయం బయటపెట్టారు. చెప్పాలని చెప్పినా చెప్పకుండా చెప్పినా విషయం మాత్రం గతంలో మహారాష్ట్రతో ఒప్పందం జరుగలేదన్నదే. బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశామని, మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదనీ, ఆ తర్వాత ఏదో హడావిడిలో ఒప్పందం పూర్తి చేయలేకపోయామని ఆయన చెప్పిన మాటల సారాంశం. గత విషయాలు మాట్లాడి ఎందుకు గందరగోళం చేస్తారని కూడా ఆయ న ఒక మాట చెప్పారు. గత విషయాలు మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆ మాట ఆయన తన పార్టీవారికే చెప్పి ఉంటే బాగుండేది. తెలంగాణ ప్రభుత్వం గతకాలపు నిర్లక్ష్యాలకు, కజ్జాకోరు రాజకీయాలకు స్వస్తి చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అంగీకారానికి వచ్చి తమ్మిడిహట్టి, మేడిగడ్డ, చనాకా కొరాట ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంది. కాంగ్రెస్ గత ఆరు దశాబ్దాల్లో చేయలేని పనిని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేసింది. కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండి కూడా చేయించలేకపోయిన ఒప్పందాన్ని, ఇప్పుడు తెలంగాణ ప్రభు త్వం బీజేపీ ప్రభుత్వంతో ఒప్పించి చేయించింది. మంచిని చూడదల్చుకోకపోతే చూడకపోయారు. కానీ లేని చెడును ఆపాదించే దుర్మార్గానికి ఎందుకు దిగుతున్నారన్నది ప్రశ్న.

రెండేళ్ల క్రితం వరకు ఈ రాష్ర్టాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. ఆరు దశాబ్దాల్లో అత్యధి క కాలం కాంగ్రెస్, ఇరవయ్యేళ్లపాటు టీడీపీ తెలంగాణను, రాష్ర్టాన్ని ఏలాయి. వారు ఎన్ని తప్పులు ఎన్నినా అన్నీ వారికే తగులుతాయి. తెలంగాణకు అన్యాయం జరిగి న కాలానికి ప్రతినిధులు వారు. తెలంగాణ గోస పడుతుంటే అధికారపీఠాల్లో కూర్చు ని చూస్తూ మిన్నకున్నారు కాబట్టే 2004 మే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను నేలకు కొట్టి టీఆర్‌ఎస్‌కు అప్పగించారు. ఇన్నేళ్ల అధికారం పోయిందని బాధ, అక్కసు ఉండవచ్చు. అందుకు అబద్ధాలు, వక్రీకరణలు అవసరమా. నిర్మాణాత్మకంగా వ్యవహరించవచ్చు కదా. ఏ అంశంపై మాట్లాడాలో ఏ అంశంపై మాట్లాడకూడదో కాంగ్రెస్ నాయకత్వానికి తెలియకపోతే ఎలా? అరవయ్యేళ్ల అవస్థ తర్వాత తెలంగాణకు అవసరమైన పద్ధతిలో ప్రాజెక్టులు నిర్మించడానికి తొలిసారిగా మన చేతికి అధికారం వచ్చింది.

ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. పునర్నిర్మాణం చేసేటప్పుడు, పునఃప్రణాళికలు రచించేటప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకుంటాం. వీలైనంత ఎక్కువ నీటిని వాడుకునే విధంగా ప్రాజెక్టులను కట్టుకుంటాం. మూడు మాసాలకు మించి తడి మిగలని దక్కను పీఠభూమిలో రిజర్వాయర్లు నిర్మించి, నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ అవగాహన కాకతీయుల కాలం నాటి నుంచి ఉంది. అంతకుముందు రాజులు కూడా తెలంగాణలో చెరువులే నిర్మించారు. నిజాం కూడా అదే కొనసాగించారు. ఆ సోయి లేకుండా వ్యవహరించింది కాంగ్రెస్, టీడీపీలే. వారికి కాంట్రాక్టులు ఇవ్వడం, కమీషన్లు పుచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ఏరోజూ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడం మీద లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ప్రాజెక్టులపై చేస్తున్న అల్లరి రభస నాడు పోతిరెడ్డిపాడు వంటి అక్రమ ప్రాజెక్టులపై చేసి ఉంటే తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగి ఉండేది. కానీ వారు అప్పుడెప్పుడూ నోరుమెదిపిన పాపానపోలేదు.

కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి ఎంత భావదారిద్య్రం ఉందంటే ఇప్పటికీ వారిలో కొందరు రాజశేఖర్‌రెడ్డికి, కిరణ్‌కుమార్‌రెడ్డికి పూజారులుగా పనిచేయగలరు. ప్రశ్నించడం అన్నది వారి డిక్షనరీలో లేదు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యంగా సోనియాగాంధీ అనుకూలంగా ఉన్నది అన్న విషయం బయటికి వచ్చింది కాబట్టి ఆ అంశంపై ఆ మాత్రమయినా మాట్లాడారు. సోనియాగాంధీ విముఖంగా ఉన్నారూ అంటే అభివృద్ధి చాలు తెలంగాణ వద్దు అని లేఖలు ఇచ్చేవారు. కొందరు డీసీసీ అధ్యక్షులు అలా లేఖలు ఇచ్చారు కూడా. అటువంటి వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించగలరు. ప్రశ్నించే అధికారం వారు తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే కోల్పోయారు. పైకి మంత్రి పదవులకు దూరంగా ఉన్నట్టు నటిస్తూ, ఇళ్లకు ఫైళ్లు తెచ్చుకుని సంతకాలు పెట్టినప్పుడే వారు తమ నైతికతను కోల్పోయారు.

వారి వాదనలు ఎంత బలహీనంగా, ఎంత నేలబారుగా ఉన్నాయో దిగువ అం శాలు పరిశీలిస్తే అర్థమవుతుంది-
1. తమ్మిడిహట్టితో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. వెంగళరావు హయాంలో జరిగినవీ చర్చలు, ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడాలే. ఒప్పందాలు కాదు. తమ్మిడిహట్టి వద్ద 2008 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడ పైసా పని జరుగలేదు. ఎందుకంటే 152 మీటర్ల ఎత్తుపై పేచీ వచ్చి అక్కడే ఆగిపోయింది. మా అనుమతి లేకుండా ప్రాజెక్టు కడితే మీ డబ్బు బూడిదలో పన్నీరవుతుందని నాటి మహాముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ హెచ్చరించారు. దీనికి కొనసాగింపుగా కేంద్రం సారథ్యంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

ఆ తర్వాతనే కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రెండు రాష్ర్టాల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఒకసారి సమావేశమై పరస్పర అంగీకారంతోనే ఎత్తుపై ఒక ఒప్పందానికి రావాలని నిర్ణయించింది. ఈ లోగా తెలంగాణ వచ్చింది. ఇదే విషయం ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి శుక్రవారం నాటి సమావేశంలో చెప్పారు. రిటైర్డు ఇంజినీర్లు కూడా వివిధ ప్రత్యామ్నాయాలు ప్రతిపాదిస్తూ, ఏదో ఒక ఎత్తుపై అంగీకారానికి వచ్చి త్వరితగతిన ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లు కాంగ్రెస్, టీడీపీ చేయలేని పనిని ఇప్పుడు పూర్తి చేసిం ది. 1975 నుంచి నలభై ఏళ్ల పాటు ప్రాజెక్టును పూర్తిచేయని పాపం ఎవరిది? 2008 తర్వాత కూడా ఆరేళ్లు అధికారంలో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ ప్రాజెక్టు జోలికి వెళ్లకుండా ఎవరి సేవలో తరిస్తూ కూర్చున్నారు? తెలంగాణకు ఇప్పుడు కూసేవాళ్లు కాదు, చేసేవాళ్లు కావాలి.

2. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయరు దాకా గ్రావిటీ ద్వారా నీరొస్తుందని మరో అబద్ధం ప్రచారం చేస్తున్నారు. తమ్మిడిహట్టి నుంచి కొద్ది దూరం మాత్ర మే గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది. అక్కడి నుంచి 30 మీటర్లు ఎత్తిపోస్తేనే 102 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లికి నీరొస్తుంది. ప్రాణహిత-చేవెళ్ల తొలి లిఫ్ట్ పాయింట్ ఇదే. అంతేకాదు ఈ ప్రాజెక్టు కింద మొత్తం 22 చోట్ల లిఫ్ట్ చేసి 493 మీటర్లు నీటిని ఎత్తిపోయాలి. మొత్తం 1055 కిలోమీటర్ల పొడవున ఈ నీటిని తీసుకుపోవాలి. ఏటా 3466 మెగావాట్ల విద్యుత్ కావాలి. ఇదంతా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రిపోర్టులోని విషయాలే. ఆ విషయాలన్నీ దాచిపెట్టి అదేదో బ్రహ్మాండమైన పథకం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది ఎంత పనికిమాలిన ప్రాజెక్టో కేంద్ర జలసంఘం నివేదికే తెలియజేస్తున్నది.

3. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లపై పట్టుబట్టి కూర్చుంటే ఇప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గ్రామంతో సహా అనేక గ్రామాలు మునుగుతాయి. అందుకే ఆ ఎత్తుకు ఆయన ఒప్పుకునేందుకు ససేమిరా అన్నారు. గ్రామాల ముంపు తగ్గిస్తే ఒప్పందానికి సిద్ధమని ఆయన పదేపదే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి 148 మీటర్ల వద్ద బరాజు నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. కొమురం భీం మంచిర్యాల జిల్లాకు మునుపటి కంటే ఎక్కువ నీళ్లు ఇచ్చే విధంగా ఆ ప్రాజెక్టును ఆ జిల్లాకు పరిమితం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించింది. అందుకు కూడా మహారాష్ట్రను ఒప్పించింది. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు బరాజు నిర్మిస్తే నిలిచేది 5 టీఎంసీలే. 148 వద్ద 1.8 టీఎంసీలు నిలబడుతాయి. మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీలు నిలబడుతాయి.

తమ్మిడిహట్టి వద్ద కంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్య త ఎక్కువ. ఆదిలాబాద్ అడవుల నుంచి ప్రవహించే సుమారు డజనుకు పైగా ఉపనదులు, వాగులు తమ్మిడిహట్టి తర్వాతనే ప్రాణహితలో గానీ గోదావరిలోగానీ కలుస్తాయి. అంటే మేడిగడ్డకు వచ్చే నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తమ్మిడిహ ట్టి వద్ద 3.2 టీంఎసీల నీటి నిల్వ తగ్గిందని కాంగ్రెస్ గోల చేస్తున్నది. మేడిగడ్డవద్ద అదనంగా మరో పదిహేను టీఎంసీల నీరు నిల్వ చేసుకునే ప్రాజెక్టు వచ్చిందని సం తోషించడం లేదు. ప్రాణహిత చేవెళ్ల కింద 20 టీఎంసీల నీటి నిల్వకు ప్రణాళిక వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 146 టీఎంసీల నీటి నిల్వకు రీడిజైను చేసిందని గుర్తించడం లేదు. కాంగ్రెస్, టీడీపీలది నీళ్ల సోయి లేని వ్యవహారం.

రెండు రోజుల కింద ఒక మిత్రుడు ఫోను చేశాడు. వీళ్ల గొడవ ఏమిటి? నిన్నగా క మొన్న తెలంగాణ తెచ్చుకున్నం. ప్రాజెక్టులు కట్టుకోవాలనుకుంటున్నం. పనిచేసుకోనివ్వరా. వీళ్లకు అంతగా పొద్దుపోకపోతే ఒకసారి గోదావరి పొంట ఆ సరిహద్దు నుంచి ఆంధ్ర సరిహద్దు దాకా నడిచి తిరిగి, గోదావరి స్నానం చేసొచ్చి అప్పుడు మాట్లాడమను. సమస్య అర్థం అవుతుంది. సమయం సందర్భం ఏమీ లేకుండా ఏమిటా మాట్లాడటం? మధుయాష్కీ బతుకు ఎంత? కేసీఆర్‌ను అనే మొనగాడా? అమాసకో పున్నానికో దిగ్గున లేచొచ్చి టీవీల ముందు ఏదో ఒకటి వాగేస్తే నాయకుడైపోతడా? అని కోపం చేస్తున్నాడు. ఆయన గొంతులో ఆవేశం క్రమంగా పెరుగుతున్నది. అలా చాలామంది. ఎక్కడో ఒకచోట. ఏదో ఒక రూపంలో. కాంగ్రెస్ వాళ్ల ను చూస్తే నవ్వొస్తుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు.

ఒకరికి మరొకరికి సమన్వయం ఉండదు. ఒకరు చెప్పిందాన్ని మరొకరు ఖండిస్తారు. మిడిమిడి జ్ఞానం. సగం సగం సమాచారం. నిజంగా వీళ్లకు అధికారం ఇస్తే ఏం చేసేవారో అని మరో మిత్రుని కామెంట్. నీటి విలువ కంటే ఏదీ విలువైంది కాదు. కరెంటు ఖర్చు, ప్రాజెక్టు వ్యయం అంటూ తెగ మాట్లాడుతున్న వారంతా ఒకటి గమనించా లి. తెలంగాణలో సుమారు 20 లక్షల మోటారు పంపులు పనిచేస్తున్నాయి. సాగు నీరివ్వకపోతే మరో 20 లక్షల పంపుసెట్లు వస్తాయి. ఒక్కో మోటారు పంపు, బోరు, కరెంటు కయ్యే ఖర్చు కనీసం లక్షన్నర. ఆ లెక్కన చూస్తే ఇరవై లక్షల పంపు సెట్లపై రైతులు ఇప్పటివరకు పెట్టిన ఖర్చు మూడు లక్షల కోట్లు. గోదావరిలో ఈ ఏడాది ఇప్పటివరకు సముద్రంలో కలిసిన 1500 టీఎంసీల నీటి విలువ కనీసం 30 వేల కోట్లు. ఒక ప్రాజెక్టు నిర్మిస్తే అది కొన్ని తరాలపాటు లక్షలాది ఎకరాలకు నీరిస్తుంది. రైతుపై భారాన్ని తగ్గిస్తుంది. వేల కోట్ల సంపదలు సృష్టిస్తుంది. దూరదృష్టితో ఆలోచించండి. సంకుచిత రాజకీయ దృష్టిని వదిలిపెట్టండి. ఎక్కడయినా కొట్లాడండి, నీళ్ల విషయం లో కాదు.

3352

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా