తెలివితక్కువ ప్రదర్శన


Sun,August 21, 2016 01:42 AM

తెలంగాణ ఇప్పుడు జలఫలాలను తీసుకోవలసి ఉంది. వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకోవలసి ఉంది. మహబూబ్‌నగర్‌లో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ నీరివ్వడం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. టీఆర్‌ఎస్ వచ్చిన తర్వాతనే అన్ని ఎత్తిపోతల పథకాల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు, చేయిస్తున్నా రు. ఇవ్వాల రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీరు మహబూబ్‌నగర్ బీడు భూముల ను తడుపుతుంటే అక్కడి ప్రజలు హర్షాతిరేకాలకు అంతులేదు. జిల్లాలోని ఎత్తిపోతలన్నీ పూర్తయి పనిచేయడం మొదలుపెడితే ఒక్క
మహబూబ్‌నగర్ జిల్లాలోనే 100 టీఎంసీల నీరు వినియోగించవచ్చు. పదిలక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో అత్యధిక జిల్లాలు ప్రయోజనం పొందుతాయి.

shekarreddy
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోవడం ఒక్కటే కాదు తవ్వినదంతా నెత్తినపోసుకోవడం అంటే ఇదే. నీటిపారుదల రంగంలో జరిగిన గతకాలపు పాపాలకు, ద్రోహాలకు అన్నింటికీ తమదే బాధ్యత అన్నట్టు కాంగ్రెస్ జలదృశ్యం నడిచింది. సమైక్యరాష్ట్రంలో జరిగిన నిర్వాకాలన్నీ తమకు తెలిసే జరిగినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఒప్పేసుకుంది. జలదృశ్యం పేరిట జరిగిన విన్యాసం వారికి మంచి చేయలేదు సరికదా, వారి అవగాహనారాహిత్యాన్ని బట్టబయలు చేసింది. మంత్రులు, మహామంత్రులుగా పనిచేసిన వారంతా పక్కన కూర్చుని జోగుతూ ఉంటే పాపం డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్ కేసును వాదించడానికి నానా తంటాలు పడ్డారు. శ్రవణ్ మంచి వక్త. మేధావిగా పేరు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వాదించాల్సింది దోషుల తరఫున కదా. సుదీర్ఘకాలంపాటు తెలంగాణను పాలించి, అన్యాయాలు జరుగుతూ ఉంటే ప్రేక్షకపాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుల పక్షాన కదా. సగం తప్పులు, సగం అవాస్తవాలు, కొంత అజ్ఞానం.

కేసీఆర్ లాగా గూగులమ్మను ముందేసుకుంటే అది ప్రదర్శన కాజాలదు. ఈ రాష్ర్టాన్ని నలభైయేళ్లపాటు పరిపాలించిన కాంగ్రెస్‌లో పట్టుమని గంటసేపు సాగునీరు గురించి మాట్లాడే పెద్ద మనిషి లేకపోవడం ఆ పార్టీ పేదరికాన్ని తెలియజేస్తున్నది. కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆరు మాసాల దాకా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికి నోరుపెగలకపోవడం నీటిపారుదల సమస్యపై వారి చేతగానితనాన్ని బయటపెట్టింది. సుదీర్ఘకాలం నీటిపారుదల మంత్రిగా వెలగబెట్టినవారు ప్రేక్షకుల్లో కూర్చుంటే పాపం మునుపెన్నడూ ఏ పదవులూ నిర్వహించని డాక్టర్ శ్రవణ్ కాంగ్రెస్ వాదన వినిపించవలసి వచ్చింది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు ఏకబిగిన నాలుగైదు గంటలపాటు తెలంగాణ జలవనరుల చిత్రపటాన్ని ఆవిష్కరిస్తే, ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ నేతలు తలాకొంత ఆక్రోశమూ, ఆగ్రహమూ, అసత్యాలూ కలబోసి గంట సేపట్లో అలసిసొలసిపోయారు.

వారు పెద్దపెద్ద అబద్ధాలు ఎంత సులభంగా చెప్పా రో! ఆయకట్టు గురించి చెప్పినవి మరీ అబద్ధాలు. అసలు తెలంగాణలో సాగుభూమి ఎంత ఉంది? అందులో ఒకసారి పండేది ఎంత, రెండుమూడు సార్లు పండేది ఎం త? బహుషా కాంగ్రెస్ నాయకులకు ఒక్కరికీ ఆ పరిభాష తెలిసినట్టు లేదు. కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులు నిర్మించామని చెప్పేశారు. వారి జలదృశ్యంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి ఈ ఒక్క అంశం చాలు. వాస్తవానికి తెలంగాణలో మొత్తం సాగు భూమే కోటి 22 లక్షల ఎకరాలు. అందులో బోరుబావులు, తవ్వుడు బావుల కింద సాగయ్యేది 47.62 లక్షల ఎకరాలు. నీటిపారుదల ప్రాజెక్టుల కింద సాగవుతున్నది ఇప్పటికీ 19.56 లక్షల ఎకరాలు మాత్రమే. మిగిలినదంతా వర్షాధార సాగు భూమి. గతంలో తలపెట్టిన, ఇప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయి వినియోగంలోకి వస్తేనే మొత్తం కోటి ఎకరాల భూమిని సాగులోకి తేవడం సాధ్యం.
కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో మొత్తంగా కూడా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించలేదు.

అది మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఏవీ పూర్తికాలేదు. పూర్తి చేసే విధం గా పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ జల దృశ్యం లెక్కలు నిజమయితే తెలంగాణ కోనసీమలాగా ఉండాలి. కాంగ్రెస్ లెక్కలు కరెక్టు అయితే తెలంగాణలో బీడు భూములనేవే ఉండకూడదు. కాంగ్రెస్ వాదన సత్యమే అయితే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండకూడదు. కాంగ్రెస్ హయాంలో జరిగిందంతా ప్రాజెక్టుల తోకలు పూర్తిచేయ డం, తలలు వదిలేయడం. ఎక్కడా నదుల నుంచి నీళ్లు తోడే పని మొదలు పెట్టకుండానే అడ్వాన్సులు ఇచ్చి, అందులో కమీషన్లు స్వీకరించి, మట్టి పనులు చేయించి మమ అనిపించారు. కాంట్రాక్టరుకు, రాజకీయ నాయకులకు, అధికారులకు సులువుగా అయ్యేపని కాలువలు తవ్వడం. మట్టి పనిలో మిగిలేంత డబ్బు హెడ్‌వర్క్స్ లో మిగలదన్నా, అందుకే అంతా కాలువలు ముందు తవ్వేస్తారు అని ఒక కాంట్రాక్టరు స్వయంగా చెప్పిన విషయమే.

ఎల్లంపల్లి గేట్లు తెరిచి కిందికి నీళ్లు వదులుతుం టే గుండెలు పిండేసినట్టయింది. ఎల్లంపల్లికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిగువన మానేరులో చుక్క నీరు లేదు. ఎల్లంపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయ కాలువ ఎండిపోయి ఉంది. అక్కడి నుంచి మరో పది కిలోమీటర్ల దిగువ నుం చి వెళ్లే వరదకాలువలో నీరు లేదు. పక్కనే ఇంత కరువు పెట్టుకుని ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందకు వదలాల్సిన పరిస్థితి. ఎల్లంపల్లి నుంచి నీటిని ఉపయోగించుకోవడాని కి ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎత్తిపోసుకునే వ్యవస్థ అంతా రెడీ అయి ఉంటే కాకతీయ కాలువ, వరదకాలువల ద్వారా మానేరును నింపుకుని ఉండవచ్చు. హైదరాబాద్‌కు తాగునీరు పంపింగ్ చేయడానికి తప్ప ఇతర ఏర్పాట్లేవీ పూర్తి కాలేదు. హైదరాబాద్‌కు పంపింగ్ వ్యవస్థ ఏర్పాటు కూడా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చి న తర్వాతనే వేగంగా పూర్తి చేసింది అని ఎల్లంపల్లి గేట్లు ఎత్తినరోజు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బాధపడ్డారు.

విడ్డూరం ఏమంటే తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు, చేవెళ్ల సమీపంలో కాలువలు, సొరంగాల పనులు మొదలుపెట్టారు. ఇవ్వాళ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టి తామేదో ఉద్ధరించినట్టు వలపోస్తున్నారు. ప్రాణహిత నుంచి చేవెళ్ల దాకా నీరు రావాలంటే సుమారు ఆరు వందల కిలోమీటర్లు రావాలి. గ్రావిటీ ద్వారా వచ్చేవని ఒక పెద్ద అబద్ధాన్ని చాలా అందంగా చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఇక్కడిదాకా 22 లిఫ్టులతో నీరు ఎత్తిపోయనున్నట్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రిపోర్టులోనే ఉంది. ఇంత దూరం కాలువలు, సొరంగాల ద్వారా నీరు తెస్తారట. మైనరు ఇరిగేషను చెరువులను సంధానించడం తప్ప ఎక్కడా ఒక్క రిజర్వాయరు ప్లాను చేయలేదు. ఎల్లంపల్లి ఒక్కటే వారు సాధించిన ఘనకార్యం. ఆ ప్రాజెక్టు గేట్ల నిర్మాణం కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. ఆ ప్రాజెక్టులో మునిగి పోయే గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి వారిని ముంపు నుంచి తరలించింది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే.

ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వచేయడం ఇదే ప్రథమం. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి రాజశేఖర్‌రెడ్డి ప్రయోగించిన ఒక మాయపాచిక. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అప్పుడు బసవన్నల్లా తలలూపడం తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎప్పుడు ప్రదర్శించారు? కుక్కిన పేనుల్లా ఆయన చెప్పింది విని, ఆయన ఇచ్చింది తిని, ఫైళ్లపై సంతకాలు చేస్తూ పోయారు. నిజానికి తెలంగాణ నాయకత్వానికి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. స్వతంత్రించి సమైక్య నాయకత్వం చేసిన ద్రోహాలను గుర్తించి, వాటిని ఎండగట్టి తెలంగాణకు ఎలా ఉపయోగపడాలో ఆలోచించకుండా వారి పాపాలను నెత్తిన మోస్తున్నారు. తాము అప్పుడు చేసింది కరక్టే అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంత పెద్ద అక్రమ ప్రాజె క్టు పోతిరెడ్డిపాడు విస్తరణ ఏ అనుమతులు లేకుండా మూడున్నరేళ్లలో ఎలా పూర్తి చేయగలిగారు? తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టూ ఎందుకు పూర్తి కాలేదు? హంద్రీ నీవాకు రెండేళ్ల నుంచి నీళ్లు వెళ్తున్నాయి, కల్వకుర్తికి, నెట్టెంపాడుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చేదాకా నీరెందుకు రాలేదు? కాంగ్రెస్ నాయకత్వం గత ప్రభుత్వాల తప్పిదాలకు తామే బాధ్యత తీసుకుని అత్యంత తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారు. వారి పాపాల నుంచి తమను తాము వేరు చేసుకుని చూసుకునే అవకాశం ఉన్నా, మా తాతలు నేతులు తాగారని కాలు దువ్వడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనం.

తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో ఇంత డొల్లతనం ఉండడానికి కారణం ఏమి టి? వారు ఎప్పుడయినా ప్రాజెక్టులవద్దకు వెళ్లి ఉంటే కదా? ఎప్పుడయినా నదీ గమనాలను తెలుసుకుని ఉంటే కదా? ఏ నది ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రవహిస్తుందో తెలుసుకుంటే కదా? ఒకటి కాదు, రెండు కాదు జలదృశ్యంలో అన్నీ తప్పులే. కం తానపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీరు తీసుకురావాలనుకున్నారా? కంతానపల్లి ఎక్కడ నిర్మించదలిచారో, ఎందుకు నిర్మించదలిచారో, ఎక్కడికి నీరివ్వదల్చుకున్నారో డాక్టర్ శ్రవణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు. వరంగల్లు జిల్లాకే చెందిన నీటిపారుదల మాజీ మంత్రికి కూడా తెలియకపోవడం విషాదం. శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ రెండవదశ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం, దారిపొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు అందించడం కంతానపల్లి లక్ష్యం. అంతేగాక దేవాదుల పం పింగ్‌కు అవసరమైన స్టోరేజీగా కూడా ఈ ప్రాజెక్టు పనిచేస్తుందని భావించారు. ఎక్క డో ఏటూరునాగారానికి ఎగువన నిర్మించే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీరుతెస్తారని చెప్పారట. మరో తప్పిదం... రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) గురించి కూడా అవగాహన లేకపోవడం.

ఆర్డీఎస్ తుంగభద్రపై నిర్మించిన ప్రాజెక్టు. ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీలు మళ్లించి, గద్వాల నుంచి అలంపురం వరకు సుమారు లక్షా 75 వేల ఎకరాలకు నీరివ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆర్డీఎస్ ఆయకట్టుకు ఆలమట్టి, నారాయణపురంల నుంచి నీరు రాకపోవడానికి ఏమిటి సంబం ధం? ఆలమట్టి, నారాయణపురం కృష్ణా నదిపై నిర్మించారు. అక్కడి నుంచి వరదవచ్చినా ఆర్డీఎస్‌కు నీరివ్వడం సాధ్యం కాని పని. ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుం డా తెలంగాణ ప్రాజెక్టులపై నోటికొచ్చిందంతా మాట్లాడటం తెలంగాణకు మేలు చేయదు. కాంగ్రెస్‌కూ మేలు చేయదు. సరికదా, వారిని మరింత పలుచన చేస్తుంది.

తెలంగాణ ఇప్పుడు జలఫలాలను తీసుకోవలసి ఉంది. వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకోవలసి ఉంది. మహబూబ్‌నగర్‌లో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ నీరివ్వడం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. టీఆర్‌ఎస్ వచ్చిన తర్వాతనే అన్ని ఎత్తిపోతల పథకాల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు, చేయిస్తున్నా రు. ఇవ్వాల రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీరు మహబూబ్‌నగర్ బీడు భూముల ను తడుపుతుంటే అక్కడి ప్రజలు హర్షాతిరేకాలకు అంతులేదు. జిల్లాలోని ఎత్తిపోతలన్నీ పూర్తయి పనిచేయడం మొదలుపెడితే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 100 టీఎంసీల నీరు వినియోగించవచ్చు. పదిలక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో అత్యధిక జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. నీటి విలువ తెలుసుకుని మెలిగితే ఎవరికైనా భవిష్యత్తు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకించి బాగుపడిన పార్టీలేదు.

1442

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా