నయీం ఒక గుణపాఠం


Sun,August 14, 2016 01:22 AM

నయీం ఉదంతం రెండు దశాబ్దాలుగా పోలీసులపై స్థిరపడిపోయిన ఒక మచ్చను కొంత చెరిపేసింది. సమైక్య పోలీసులు నాటిపోయిన ఒక విషవృక్షాన్ని నేలమట్టం అయిపోయింది. నాయకుడిని బట్టి పోలీసు అధికారులు, వారిని బట్టి చట్టపాలన.నయీం ఉదంతం మిగిల్చిపోయిన సందేహా లు, ప్రశ్నలన్నింటికీ ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషశృంఖల నుంచి అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాలి. నయీంతో షరీకైన అధికారులనూ గుర్తించి వారిని చట్ట రక్షణ బాధ్యతల నుంచి తప్పించాలి. నయీం అవశేషా లు ఏవీ మిగులకుండా చేయాలి.

నరకాసుర వధ జరిగింది నయీముద్దీన్ కాల్చివేత వార్త తెలియగానే ఒక మిత్రుని ఎస్సెమ్మెస్ ఇది. భువనగిరిలో చాలా మంది ఇళ్లలో ఈరోజు దీపావళి. మళ్లీ తెలంగాణ వచ్చినంత ఆనందంగా ఉంది అని ఒక వ్యాపారి వాట్సాప్ సందేశం. కాదు నయీం ఒక మహిషాసురుడు. ఈ వ్యవస్థ సృష్టించిన భూతం. ఒక తుపాకి వ్యవస్థను ఎదుర్కోవడానికి మరో విధ్వంసక శక్తిని తయారు చేశారు. ఇవ్వాళ తమనే సవాలు చేసే పరిస్థితి వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంది అని మరో విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. ఏమైతేనేం నయీం ప్రభావిత ప్రాంతాలన్నీ గొప్ప ఊరట పొందాయి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల దమ్ము ధైర్యాలను కీర్తిస్తున్నాయి. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో మర్యాదగా, ప్రశాంతంగా, చట్టబద్ధంగా బతుకాలనుకుంటున్న పౌరులు, వ్యాపారాలు, వాణిజ్యాలు చేసుకోవాలనుకుంటున్న వర్గాలు- అన్నీ తెలంగాణ ప్రభుత్వాన్ని వేనోళ్ల కొనియాడుతున్నాయి.

ఒక నేరగాడి కాల్చివేత ఇంతగా ఊరటనివ్వడానికి, ఇంతగా చర్చ కావడానికి కారణం ఏమిటి? నయీంది ఒక వ్యక్తి హత్య కాదు. అత్యంత ప్రమాదకరమైన ఒక వ్యవస్థ హత్య. బాగా గుర్తు. బెల్లి లలిత, న్యాయవాది పురుషోత్తంల హత్యలు, ముగ్గురు యాదవ యువకుల ఊచకోత, నక్సల్స్ చేతిలో రాగ్యానాయక్ హత్య వరుసగా జరిగాయి. ఇదంతా 1998 నుంచి 2002 దాకా. చంద్రబాబును స్టార్ ఆఫ్ ఏసియాగా, విశ్వవిఖ్యాత సంస్కర్తగా, మహోన్నత నాయకునిగా మీడియా అంతా ఆకాశానికెత్తుతున్న కాలం. నక్సల్స్‌ను ఏరివేసే పేరుతో చంద్రబాబునాయుడు అండతో కొందరు పోలీసులు అనేక అరాచక దండులను రంగంలోకి దింపిన కాలం. నయీం హత్యలు ఎంత భయంకరంగా చేసేవాడో లలిత హత్య గురించి తెలిసినవారికి అర్థమయింది. ఆ తర్వాత లలిత సోదరులతో సహా ముగ్గురు యాదవ యువకులను ఎత్తుకెళ్లి తలలు వేరుగా, మొండాలు వేరుగా, కాళ్లూ చేతులు వేరుగా నరికి రాచకొండ గుట్టల్లో ఎక్కడెక్కడో పాతిపెట్టిన విషయం ఇంకా భయంకరం.

కానీ మీడియా ఆ వార్తలేవీ పట్టించుకోలేదు. నయీంకు వ్యతిరేకంగా మాట్లాడేవారు లేరు. పత్రికల్లో గట్టిగా రాసేవారు లేరు. ముగ్గురు యువకులను అంత దారుణంగా చంపితే ఎక్కడో లోపలి పేజీల్లో కనిపించకుండా సింగిల్ కాలం వార్తలు ప్రచురించేవారు. హక్కుల సంఘాల నాయకులు భయకంపితులై పోయారు. ఒక మండలస్థాయి విలేఖరి మాత్రం ధైర్యం చేసి ఈ సమాచారాన్ని కనిపించిన వారందరికీ మొరపెడుతున్నాడు. అన్నా ఇంత అన్యాయం జరుగుతోంది. ఎవరూ మాట్లాడరేమన్నా. ఇదేం జర్నలిజం అన్నా అని అందరినీ వేధిస్తున్నడు. ఈ ముగ్గురు యువకుల హత్యలు జరిగిన వెంటనే రాగ్యా నాయక్ హత్య జరిగింది. ఇక చూడండి భూమి ఆకాశాలు బద్దలయ్యేలా మీడియా, రాజకీయ వ్యవస్థ వార్తలు, ప్రకటనల యుద్ధాలతో హోరెత్తించాయి.

ఒక హత్యకు మరో హత్యకు ఎంత తేడా? అప్పుడనిపించింది. ఈ పరిస్థితిని ప్రశ్నించాలని. మూడు దేహాలు, ఆరు ముక్కలు అని నయీం అరాచకాలపై వార్త పత్రికలో రాశాను. ఆ యువకుల హత్యలు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి ఆరోజు రాశాను. ఎవరు పట్టించుకున్నారని? ఒకరిద్దరు మిత్రులు మరుసటిరోజు ఫోను చేసి నీకేమన్నా పిచ్చా అతనిమీద ఎందుకు రాశావు. అతను ఊరుకోడు. విప్లవకారులంతా ఉన్నారుగా, వాళ్లు చూసుకుంటారుగా అని నామీద ప్రేమతోనే కసిరారు. పర్వాలేదు కానిమ్మని చెప్పాను. ఇది జరిగింది 2002లో. ఇప్పటికి పద్నాలుగేళ్ల క్రితం. ఈ పద్నాలుగేళ్లూ నయీం నిక్షేపంగా రాజ్యం చేస్తూనే ఉన్నాడు.

shekarreddy
బెల్లి లలితకు తెలంగాణ లలితగా పేరుంది. తెలంగాణ పాటలు పాడేది. మావోయిస్టులతో సంబంధాలుండేవేమో తెలియదు. కానీ మంచి వక్త, ధైర్యవంతురాలు. ఆమె ఎదుగడం అప్పటి మంత్రులకు, నాయకులకు కొందరికి గిట్టలేదు. అందుకే నయీంను ఉపయోగించి కడతేర్చారు. ఆ తర్వాత సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారుల్లో నయీం భయం వెంటాడింది. లలితకు వ్యతిరేకంగా ఉపయోగించినట్టే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నయీంను ఉపయోగిస్తారేమో, నాయకులకు హాని తలపెడతారేమోనన్న ఆందోళన అప్పట్లో చాలా మందిలో ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమ నాయకత్వం అటువంటి హింసాత్మక దారులకు తావివ్వకుండా, దుర్మార్గ ఆధిపత్య శక్తుల కుహకాలకు చిక్కకుండా ఉద్యమాన్ని ముందుకు సాగించింది. తెలంగాణ సాధించింది. ఇక్కడ అధికార పగ్గాలూ చేపట్టింది. ఈ పరిణామాలన్నీ తెలిసిన తెలంగాణ నాయకత్వం, ప్రభుత్వం ఇంకా ఎందుకు సహిస్తుంది? మావోయిస్టులకు వ్యతిరేకంగా ఇన్‌ఫార్మర్‌గా ఉపయోగించుకున్నాం అని ఒక పోలీసు అధికారి మొన్న బాహాటంగా ప్రకటించారు.

పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఉద్యమం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఓ ఏడాదిపాటు ఉపయోగపడతాడు కావచ్చు. కొన్ని మూలాలు చెబుతాడు కావచ్చు. కానీ రెండు దశాబ్దాలపాటు ఎవరూ ఇన్‌ఫార్మర్‌గా ఉండటం సాధ్యం కాదు. ఇంత బలగం, ఇన్ని విభాగాలు కలిగిన పోలీసుల కంటే నయీంకు మావోయిస్టుల గురించి ఎక్కువ తెలిసే అవకాశమే లేదు. 1997లో కొంతకాలం తప్ప నయీంను ఆ తర్వాత ఇన్‌ఫార్మర్‌గా ఉపయోగించిన దాఖలాలు లేవు. ఆ తర్వాత నయీంను ఉపయోగించింది హక్కుల సంఘాల నాయకులను, రచయితలను హత్యలు చేయడానికి. 1998 నుంచి నయీంతో పోలీసులు చేయించినవన్నీ నేరాలూ, ఘోరాలే. ఒక దశదాకా నయీంను పోలీసులు ఉపయోగించుకున్నారు. ఆయనకు రక్షణ కల్పించారు. ఆయుధాలతో దళాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సాధన సంపత్తి అంతా సమకూర్చారు. ఆయనను ఎక్కడా ఎవరూ ఆపకుండా మౌఖిక ఆదేశాలుండేవి. మంత్రులకు ఉన్నట్టే ఆయనకూ అనధికార పైలట్‌లు ఉండేవారు.

నయీంను ఉపయోగించి సెటిల్మెంట్లు చేసి ఆస్తులు కూడబెట్టిన పోలీసు అధికారులు ఉన్నారు. అధికారులు ఎప్పుడయితే నయీంను సొంత పనులకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారో, ఇక అక్కడి నుంచి నయీం మరీ రెచ్చిపోయాడు. వీళ్లు ఒకటి చెబితే ఆయన పది చేశాడు. చివరికి అధికారులను సైతం శాసించే స్థితికి చేరుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి పాలనాకాలంలో కూడా నయీంపై ఈగ వాలనివ్వలేదు. అప్పట్లో చాలామంది ఐపీఎస్‌లు నయీం సేవలు ఉపయోగించుకున్నారని విమర్శలు వచ్చాయి. మావోయిస్టులను, తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడానికి ఉపయోగపడతాడని అధికారులు చెప్పడం, ముఖ్యమంత్రులు తలూపడం గతంలో జరిగిపోయేది.

వాస్తవానికి నయీంతో షరీకైన పోలీసు అధికారులు ప్రజాస్వామిక వ్యవస్థకు ఉపయోగపడడం కంటే ఈ వ్యవస్థ భ్రష్టుపట్టడానికి ఎక్కువగా పాటుపడ్డారు. ఏదో ఒక సిద్ధాంతంతో అడవులపాలై అర్థంలేని త్యాగాలు చేస్తున్న ఒక సాయుధ గ్రూపును ఎదుర్కోవడం కోసం ఏ సిద్ధాంతమూ, ఏ విలువలూ లేని ఒక అరాచక శక్తికి ఆయుధాలు ఇచ్చారు. ఆ అరాచక శక్తి ఇంతింతై వటుడింతై మనచుట్టూనే ఒక పోటీ సామ్రాజ్యాన్ని నడుపుతుంటే కళ్లు మూసుకుని కూర్చున్నారు. లెక్కలేనన్ని హత్యలు, నేరాలు చేస్తుంటే, వందలు వేల ఎకరాల భూములను కొల్లగొడుతుంటే, ప్రభుత్వానికి చెందిన కొండలను గుట్టలను తొలిచి ఫెన్సింగులు వేస్తుంటే వ్యవస్థలన్నీ కళ్లప్పగించి చూశాయి. కొందరు పోలీసు అధికారులు, నాయకులు నయీం సంపాదనలో వాటాలు పొందారు. పెద్ద ఎత్తున భూములు భవంతులు కూడబెట్టారు. పెద్ద పెద్ద నాయకులు, వాణిజ్యవేత్తలు సైతం నోరు మెదపలేని పరిస్థితి. తృణమో పణమో ఇచ్చి రాజీ చేసుకోవలసిన పరిస్థితి.

నగర శివారులోని ఒక ఆసామి చెప్పాడు-ఎకరం డ్బ్బై లక్షల విలువ చేసే భూమిని 25 లక్షలకే ఇవ్వాలని మాపై ఒత్తిడి తెచ్చాడు. మేము నలుగురు అన్నదమ్ములం. మేము భూమి ఇవ్వడానికి ఇష్టపడలేదు. మరుసటిరోజు ఆరుగురు మనుషులు ఇంటికి వచ్చారు. మమ్మల్ని అందరినీ పిల్చి కూర్చోమన్నారు. టీపాయ్‌పై ఒకవైపు డబ్బుల కట్టలు పెట్టారు. మరోవైపు తుపాకి పెట్టారు. మధ్యలో గొడ్డలి పెట్టారు. ఇప్పుడు చెప్పండి మీకు ఏమి కావాలో అని బెదిరించారు. మేము ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా పట్టించుకోరని అప్పటికే విన్నాం. కోపం, దుఃఖం అన్నీ దిగమింగుకుని భూమి పత్రాలు ఇచ్చేశాం. చాలా కొనుగోళ్లు ఇలాగే జరిగాయి. హైదరాబాద్ చుట్టూ అటువంటి భయాన్ని పుట్టించడంలో నయీం విజయవంతం అయ్యాడు. అతని హత్యలు చేసే తీరు గురించి ఇప్పుడు పేపర్లు, చానెళ్లు పుట్లు పుట్లుగా కథలు రాస్తున్నాయి. కానీ ఈ విషయాలన్నీ చాలా మంది ప్రజలకు ఇంతకుముందే అనుభవం.

నయీం ప్లాను వేస్తాడు. ఒక కిరాతక ముఠా ఆ ప్లాను అమలు చేస్తుంది. ఇప్పుడు అరెస్టయిన వాళ్లలో చాలా మంది ఆ ముఠాలో సభ్యులుగా ఉన్నవాళ్లే. వాళ్లు హత్యలుచేసి అజ్ఞాతంలోకి వెళతారు. మరో ముఠా వచ్చి మేమే చంపామని పోలీసులకు లొంగిపోతారు. నమ్మకమైన న్యాయవాదులు వచ్చి వారికి బెయిలు ఇప్పిస్తారు. ఎక్కడయినా ఏవయినా సమస్యలు వస్తే మధ్యవర్తిత్వం చేయడానికి రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అండగా వస్తారు. ఇవేవీ పత్రికల్లో తీవ్రంగా రిపోర్టు కాకుండా చూడటం కోసం విలేకరులుంటారు. ఒక వేళ ఆ వార్తలు వారిని దాటుకుని వెళ్లి పత్రికలు, చానెళ్లలో పెద్దవాళ్ల దాకా చేరితే మేనేజ్ చేయడానికి కొందరు మీడియాధిపతులూ ఉంటారు. ఎవరికి అందాల్సినవి వారికి అందుతాయి. అంతా ఒక విషవలయం. ఎక్కడిదొంగలు అక్కడే గప్‌చుప్.

నయీంతో చేతులు కలిపిన వారంతా ఇష్టపడి చేరినవారు కాకపోవచ్చు, భయమూ, అవసరమూ ఏదో ఒకటి వారిని ఆయనకు చేరువ చేసి ఉండవచ్చు. చట్టబద్ధంగా ఉండాల్సిన వ్యవస్థలే ఆయనతో చేతులు కలిపి నడుస్తున్న కాలంలో సామాన్యులు, ఏ రక్షణ లేని నాయకులు నయీంతో మంచి చేసుకోక ఏమి చేస్తారు? ముఠాలో కీలకమైనవాళ్లు మాత్రం అమానుషంగా హత్యలు చేసేవారే. వాళ్లలో ఇప్పుడు చాలా మంది పోలీసులకు చిక్కారు. ఇంకా చిక్కాల్సినవారు కొందరున్నారు. మళ్లీ మళ్లీ ఇటువంటి హంతకమూకలు చెలరేగకుండా తెలంగాణ ప్రభు త్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి. నయీం ఉదంతం రెండు దశాబ్దాలుగా పోలీసులపై స్థిరపడిపోయిన ఒక మచ్చను కొంత చెరిపేసింది. సమైక్య పోలీసులు నాటిపోయిన ఒక విషవృక్షాన్ని నేలమట్టం అయిపోయింది. నాయకుడిని బట్టి పోలీసు అధికారులు, వారిని బట్టి చట్టపాలన.

నయీం ఉదంతం మిగిల్చిపోయిన సందేహా లు, ప్రశ్నలన్నింటికీ ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషశృంఖల నుంచి అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాలి. నయీంతో షరీకైన అధికారులనూ గుర్తించి వారిని చట్ట రక్షణ బాధ్యతల నుంచి తప్పించాలి. నయీం అవశేషా లు ఏవీ మిగులకుండా చేయాలి. మావోయిస్టులతోనయినా, టెర్రరిస్టులతోనయినా పోరాడడానికి పోలీసులకున్న అధికారాలు, ఆయుధ సంపత్తి చాలు. సంఘవిద్రోహులను ఉపయోగించుకోవలసి రావడం ప్రజాస్వామిక వ్యవస్థకే సిగ్గుచేటు. ఇటువంటి ఎత్తుగడలు చట్టబద్ధ పాలన పట్ల ప్రజలలో నమ్మకాన్ని నీరుగార్చుతాయి. వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచుతాయి. నయీం చేసే దుర్మార్గాలన్నీ యథేచ్ఛగా కొనసాగుతుంటే మనమెందుకు చేయగూడదని మరికొందరు తయారవుతారు. ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట వేయకపోతే మనం నాగరికులం అనిపించుకోలేము.

2353

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన