చెట్టూ మనం కలిసి బతుకుదాం


Sun,July 10, 2016 01:51 AM

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంచి అదను చూసి మొక్కలు నాటే ఉద్యమాన్ని ముందుకు తెచ్చారు. జనం కరువుతో కటకటపడుతున్న సందర్భం. నీరు లేక,నీడ లేక జనం రాలిపోయిన సందర్భం. ఎండదెబ్బకు ఎంతమంది మరణించారో లెక్కలు తీస్తే మనం హతాశులమవుతాం. అందుకే హరితహారం ఈసారి చాలా మంది ప్రజల మనసుకెక్కింది. స్వచ్ఛందంగా ముందుకువచ్చి చెట్లు పెంచుకుందాం అన్న సోయి పెరిగింది.
నాయకుడిని పట్టి సమాజం.

shekar
మొక్కలూ, పిల్లలూ ఒకటే. పిల్లలను కన్నట్టే మొక్కకూ జన్మ ఇవ్వాలి. పిల్లలు పుట్టినప్పుడు సంబురం చేసినట్టే మొక్క పెట్టినప్పుడూ సంబురం జరగాలి. చెట్టుపెట్టనివారు పిల్లలు లేనివారితో సమానం. ఇంత పెద్ద భవంతులు కట్టగానే సరికాదు. అంతమంది జనానికి సరిపోయే గాలి ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే చెట్లు నాటడం మా జీవితంలో భాగమైపోయింది అని ఇటీవల ఒక కాలనీ పెద్ద అన్నాడు. ఆయన యథాలాపంగానే ఈ మాట చెప్పాడు. కానీ అందులో ఎంత తత్వం ఉందో లోతుగా వెళితే అర్థం అవుతుంది. ఆ కాలనీలో అన్నీ అపార్టుమెంట్లే. కానీ మొండి గోడల కంటే చెట్లే ఎక్కువ కనిపించాయి. రకరకాల చెట్లు. కదంబ వృక్షాలు మొదలు అన్ని వృక్షజాతులూ అక్కడ ఉన్నాయి. వాటిని నాటిన వారి వివరాలు. వాటి పోషణ బాధ్యత విధుల చార్టు. అన్నీ రికార్డులు నిర్వహిస్తారట. ఆ కాలనీకి మొక్కల లెక్క ఉంది.

అటువంటి కాలనీలు నగరంలో మరికొన్ని ఉన్నాయి. కానీ చాలా కాలనీలకు, అందులో నివసిస్తున్న వారికి అందమైన భవంతులు, అపార్టుమెంట్లు చూసుకోవడంలో ఉన్న మురిపెం, చెట్లను చూసుకోవడంలో లేదు. అందుకే ఎటువంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా పక్కవాడి ఇంట్లోకి చెయ్యి అందేంత వరకు అపార్టుమెంట్లు, భవంతులు కడుతున్నారు. గాలి ఆడనప్పుడు ఏసీలు పెడుతున్నారు లేదంటే రోడ్లపై పడుతున్నారు. నా భార్య అందమైన పూలతోట వంటి ఇల్లు కావాలంది. అందుకే ఇలా నిర్మించుకున్నాం అని ఇటీవల హైదరాబాద్‌లో అందరితోపాటే జీవిస్తున్న ఒక పౌరుడు చెప్పారు. ఆయన ఇల్లు తక్కువ కట్టాడు. చెట్లు ఎక్కువ పెట్టాడు. ఆ ఇంట్లో గాలి పీల్చి బతకవచ్చు అన్నాడు ఆ ఇంటి గురించి రాయడానికి వెళ్లొచ్చిన రిపోర్టరు.

అతిశయోక్తి కావచ్చు కానీ అంతటి భావన కలుగడం అసాధారణం కాదు. మొక్కలు పెంచడం కేవలం ఒక అవసరం కాదు. అది జీవితంలో భాగం. నల్లగొండలో ఇటీవల ఒక ఆఫీసుకు వెళ్లాను. ఆ ఆఫీసు ప్రాంగణంలో ఐదారు వేప చెట్లు గుబురుగా పెరిగాయి. ఆఫీసు సిబ్బంది వాహనాలన్నీ ఆ చెట్ల కిందే ఉన్నాయి. ఆ చెట్లు ఎంత పచ్చగా, దట్టంగా ఉన్నాయంటే చూడగానే అంత ఆహ్లాదం కలుగుతుంది. కానీ ఆ చెట్లు వాటంతట అవే పెరుగలేదు. ఒక కార్మికుడు చెబుతున్నాడు-సార్ ఆ చెట్లు దామోదర్ ప్రాణం. వాటిని సొంత పిల్లల్లా చూసుకుని పెంచి పెద్ద చేశాడు. ఇవ్వాళ ఇంతమందిమి ఉపయోగించుకుంటున్నాం.

ఆ చెట్టులో నాకు దామోదర్ కనిపించాడు. ముప్పైయ్యేళ్ల క్రితం తిరుపతిలో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకేసారి వేలాది మొక్కలు నాటాం. సెనేట్ సభ్యులు, పాలక మండలి సభ్యులు అంతా ఒక చోట చెట్లు నాటాం. ఈ చెట్లకు మీ పేరు పెడుతు న్నాం. జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మీదే అన్నారు అప్పటి వీసీ. అక్కడ చదివినన్ని రోజులు ఆ చెట్టు దగ్గరకి వెళ్లి చూసుకునేవాళ్లం. మొన్నా మధ్య తిరుపతికి ఆ వనంలోకి వెళ్లాను ఏది ఎవరిదో తెలియదు. కానీ ఆకాశాన్ని తాకుతూ ఎంత ఆనందాన్నిచ్చాయో ఆ చెట్లు. జీవితకాలం నిలిచి ఉండే కానుక ఏదయినా ఉందా అంటే. అది చెట్టు. మరణించిన తర్వాత కూడా నిలబడేది ఆ చెట్టే.

ఒకప్పుడు ఊరికింత అడవి ఉండేది. రైతుకింత కంచె ఉండేది. ఇండ్లకు కూడా ముందు వాకిలి. పక్కన దొడ్డి. ఇవి దట్టంగా చెట్లతో నిండిపోయి ఉండేవి. ప్రతి ఊరికీ వాగులూ, వంకలూ వాటివెంట వనాలూ ఉండేవి. పశువులను ఈ అడవికో కంచెకో వాగులోకో తోలుకుని పోయి మేపుకొచ్చేవారు. ఎడ్లు, ఆవులు, బర్లు, మేకలు కళకళలాడుతూ ఉండేవి. చెట్టూచేమపై ఆధారపడి పశుపక్ష్యాదులు హాయిగా బతికేవి. జనాభా విస్తరణ, ఆహారోత్పత్తి అవసరాలతో అడవులు, కంచెలు మాయమవుతున్నాయి. భూమి చదును అవుతున్నది. ఎక్కడికక్కడ చెట్టు చేమను నరికేసి పొలమో, చెలకో చేస్తున్నాం. నిర్మాణాలయినా చేస్తున్నాం. వందల అడుగులకొద్దీ భూమిని చీల్చి బోర్లు వేసి నీళ్లను తోడేస్తున్నాం.

ప్రకృతి మనకు సహజసిద్ధంగా ఇస్తున్నవాటిని కాకుండా అదనంగా అడ్డగోలుగా తీసుకునే పరిస్థితికి చేరుకున్నాం. పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణం. ఖాళీ స్థలం దొరికితే పాపం. కబ్జా అవుతుంది లేకపోతే ఏదో ఒక భవనం వచ్చేస్తుంది. ఏ కాలనీలో ఇవ్వాళ బహిరంగ స్థలాలు మిగలని దుస్థితి. చెట్టు అంటే ఏమిటో తెలియని పరిస్థితి తీసుకువస్తున్నాం. కొన్ని ఊర్లలో పొలాల వైపు వెళితే కనుచూపు మేర చెట్టు కనిపించదు. అబ్బో కోనసీమ అయిపోయిందే అనుకుంటాం. కనుచూపుమేర పొలాలే కనిపిస్తాయి. కానీ ఆ పొలం గట్లమీద ఊపిరాడదు. ఎందుకంటే ఆక్కడ గాలి దొరకదు. ఉక్కపోత. గొంతెండిపోతూ ఉంటుంది. ఎందుకిలా జరుగుతోందో మనం తెలుసుకునే లోపు ప్రకృతి సర్వనాశనం అయిపోతుంది. కొందరు ఎంత మూర్ఖులు ఉన్నారంటే, నాటే చెట్లపై నీడపడుతుందని ఉన్న పెద్ద చెట్లను నరికించారట. నిన్న రిపోర్టర్లు చెబుతున్నారు.

ఇది ఊళ్లలో కూడా ఉం టుంది. చేను మధ్యలో చెట్టు ఉండనివ్వరు. ఉంటే ఒక చెట్టు మందం పంటరాదు. అందుకే చెట్టును నరికేసి మొత్తం చదును చేస్తారు. కానీ ఆ చేను అంతా తిరిగి కాసేపు మేను వాల్చవలసివస్తే ఒక చెట్టు ఉండడం అవసరం అని గుర్తించరు. మనిషి అరణ్యంతో పుట్టాడు. చెట్టుతోనే జీవనం. చెట్టుతోనే ఇంత దూరం ప్రయాణం. ఇప్పుడు చెట్టును లేకుండా చేసేసి గాలి వీచినా భయపడే పరిస్థితి. గాలి ఆడకున్నా విలవిలలాడే దుస్థితి. మొన్న నాగార్జునసాగర్‌కు వెళ్లాం. రిజర్వాయరులో ఏలేశ్వరం కొండకు వెళ్లాలని ప్రయత్నం. పడవ సరంగు అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పడవ నడప లేము అన్నాడు. నిజంగానే సాగర్ రిజర్వాయరులో ఆ అలలు చూసి మేమే భయపడ్డాం. చుట్టూ నల్లమల అడవులు, కొండలు. అయినా అంతటి ఉధృతితో వీస్తున్న గాలి ఆ నీళ్లను అతలాకుతలం చేస్తున్నది. ఎందుకంటే ఆ కొండలు బోడివయ్యాయి. చిన్నచిన్న తుప్పలు తప్ప చెట్లు మిగల్లేదు. గాలివీస్తే అది కొండల వద్దో, చెట్ల వద్దో ఆగడం లేదు. నేరుగా నీళ్లనే తాకుతున్నది. అందుకే నీరు భయపెడుతున్నది.

నగరానిది కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు టోర్నడోలు, హారికేన్‌లు మనకు సంబంధించినవి కాదు అన్న భావన ఉండేది. మొన్న ఇరవై నిమిషాల వ్యవధిలో హైదరాబాద్ నగరం అనుభవించిన విధ్వంసం తర్వాత మనం వాటికి చాలా చేరువయ్యామని అర్థమైపోయింది. గాలిని ఆపగలిగిన శక్తి వనాలకు మాత్రమే ఉంది. సముద్ర తీరాల్లో కూడా అడవులు పెంచేది అందుకే. తుఫానులు, సునామీలు వస్తే నేరుగా వచ్చి ఊళ్లమీద పడకుండా అడ్డుకోవడం కోసమే అడవులు పెంచుతారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల అక్కడా అడవులు లేవు. బీచ్‌లు, రిసార్టులు, చేపల చెరువులు వచ్చేస్తున్నాయి. మనకు తీరం లేదు, ఆ సమస్య లేదు. కానీ నగరం ఉంది. జీవితం ఉంది. గాలి ప్రకోపమూ ఉంది. కాపాడుకోవడం కాపాడుకోకపోవడం మన చేతిలో ఉంది.

గేటెడ్ కమ్యూనిటీల పేర కొన్ని పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కడుతున్నారు. వాటిలో కొన్ని జైళ్లలాగా ఉన్నాయి. కొన్ని పార్కుల్లాగా ఉన్నాయి. కానీ అందులో జనానికి అవసరమైన వనాలు లేవు. ఇండ్లు విశాలంగా ఉంటే చాలదు. వాకిలి విశాలంగా ఉండాలి. అందులో ఒక చెట్టు ఉండాలి. నాలుగు పూలు పూయాలి. అప్పుడు హృదయం విశాలం అవుతుంది. ఎంత చెట్టుకు అంతగాలి అని సామెత ఊరకే రాలేదు. ఎంత చెట్టుకు అంతగాలినిచ్చే శక్తీ ఉంది. గాలి ప్రకోపాన్ని నిలువరించి, మనకు చల్లని సమీరాలను అందించే శక్తీ ఉంది. అందుకే చెట్టును పెంచుకుందాం. చెట్టూ మనమూ కలిసి పెరుగుదాం. చెట్టులో మన వయసును చూసుకుందాం. చెట్టులో మన పిల్లలనూ చూసుకుందాం. మొక్కుబడిగా కాదు. ఫొటోల కోసం కాదు. ప్రచారం కోసం కాదు. మనకోసం. భావితరాల కోసం.

చెట్లు నాటే కార్యక్రమం కొత్తగా మొదలు పెట్టింది కాదు. కానీ గతరెండు దశాబ్దాల్లో ప్రతిఏటా అధికారులు ప్రకటించే చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎవరయినా రికార్డు చేసి ఉంటే, వారు చెప్పిన సంఖ్య ఇప్పుడు మిగిలిన సంఖ్య నిర్ధారించగలిగితే మనం ఎక్కడ దారి తప్పిపోయామో అర్థమవుతుంది. లెక్కలు మిగిలాయి. మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడూ చాలాచోట్ల అంతే జరుగుతున్నది. కిందిస్థాయిలో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంచి అదను చూసి మొక్కలు నాటే ఉద్యమాన్ని ముందుకు తెచ్చారు. జనం కరువుతో కటకటపడుతున్న సందర్భం. నీరు లేక, నీడ లేక జనం రాలిపోయిన సందర్భం. ఎండదెబ్బకు ఎంతమంది మరణించారో లెక్కలు తీస్తే మనం హతాశులమవుతాం. అందుకే హరితహారం ఈసారి చాలా మంది ప్రజల మనసుకెక్కింది. స్వచ్ఛందంగా ముందు కు వచ్చి చెట్లు పెంచుకుందాం అన్న సోయి పెరిగింది.

నాయకుడిని పట్టి సమాజం. కానీ అధికార యంత్రాంగమే ఇంకా పాత బాణీలను వదలడం లేదు. ముఖ్యమంత్రికి, మంత్రులకు చెబుతున్న మొక్కల లెక్కలు సరైనవేనా అన్నది సరిచూసుకోవాల్సి ఉంది. పెంచేవాటికి లెక్కాపత్రం లేదు. చెప్పేవారూ లెక్కబెట్టి చెప్పడం లేదు. అంతా ఉజ్జాయింపు వ్యవహారం. అధికారులు ఫలానా చోట నర్సరీలో లక్ష, రెండు లక్షలు మొక్కలు ఉన్నాయని జిల్లాల్లో జాబితాలు విడుదల చేశారు. కొన్ని చోట్ల విలేకరులు వెళ్లి చూస్తే నర్సరీ లేదు, మొక్కలు లేవు. మరికొన్ని చోట్ల చెప్పిన సంఖ్యకు, వాస్తవ మొక్కలకు పొంతన లేదు. అన్ని చోట్ల పరిస్థితి ఇలాగే ఉండాలని లేదు. కానీ అధికార యంత్రాంగం ఈసారి కూడా ఎప్పటిలాగే మసిబూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నదన్న భావన అయితే కలుగుతున్నది.

నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధి కింది దాకా ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం కాలేవు. నిజాయితీగా కృషి చేసిన చోట మంచి ఫలితాలు వస్తున్నాయి. కొన్ని ఊర్లు నందనవనాల్ల్లా ఉంటున్నాయి. మరికొన్ని ఊర్లు బోసిపోయిన సిమెంటు గోడల్లా ఉన్నాయి. కొన్ని కాలనీలు చెట్ల మధ్య ఉన్నాయి. చాలా కాలనీలు చెట్టూ చేమా లేక దిగంబరంగా కనిపిస్తున్నాయి. ఈ రెండూ మనిషి సృష్టే. విధ్వంసమయినా, నిర్మాణమయినా మన చేతిలో పనే. చేస్తామా లేదా అన్నది మనం నిర్ణయించుకోవలసిందే. ఒకటి మాత్రం అనిపిస్తున్నది. నాటిన మొక్కల సెన్సస్ చేయగలమా లేదా? అలా చేయకుండా లెక్కలు తేల్చకుండా ఇంకా వందేండ్లు మొక్కలు నాటినా ప్రయోజనం ఉండదు.

7142

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా