ప్రతినాయకగణం


Sun,June 19, 2016 01:38 AM

ఏటిగడ్డ కిష్టాపూర్ రైతాంగం అర్థం చేసుకోవలసింది ఒక్కటే. రాజకీయాల కోసం తమను ఎగదోసేవారిని నమ్మకండి. నాయకుల లక్ష్యమల్లా ప్రాజెక్టును వీలైనంతకాలం అపడమే. ఎల్లకాలం వీరు రైతుల వెంట ఉండరు. వీరి ఆరాటం పరిహారం పెంచి ఇప్పించడం కాదు. ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం చూపించే నాయకులను, అధికారులను మాత్రమే నమ్మండి. ప్రాజెక్టును ఆపకండి. పరిష్కారానికి సహకరించండి.

shekar
ఒక చిన్న లిటిగేషన్ 30 గ్రామాలకు గత పదేళ్లుగా తాగునీరు, సాగునీరు లేకుం డా చేసింది. నలుగురు రైతులకు చెందిన ఐదెకరాల భూమి విషయంలో వివాదం మొదలయింది. సుమారు వంద కిలోమీటర్ల కాలువ తవ్వకం పూర్తయింది. మధ్య లో ఈ ఐదెకరాల పొడవున 400 మీటర్లు తప్ప మిగిలిన కాలువలు, లింకు కాలువలు అన్నీ పూర్తయ్యాయి. ఆ నాలుగువందల మీటర్ల కాలువ తవ్వకం పూర్తయితే 20 గ్రామాలకు తాగునీరు, 40 వేల ఎకరాలకు సాగునీరు 2009లోనే అందుబాటులోకి వచ్చేవి. కానీ కొందరు లిటిగెంట్ల చెప్పుడు మాటలతో రైతులు కోర్టుకెళ్లా రు. స్టే తెచ్చారు. ఇప్పటివరకు ఆ స్టే ఎత్తివేయించే మొనగాడు లేకపోయాడు. న్యాయమూర్తులు సైతం ఆ కేసుకు తొందరేముంది అని పక్కనపెడుతున్నారు. కానీ ఆ 40 వేల ఎకరాలకు ఈ ఏడేళ్లుగా నీరందివుంటే ఎన్నివందల కోట్ల పంట చేతికివచ్చేది? ఎంతమంది రైతుల జీవితాలు బాగుపడేవి? జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడేవి? భూముల విలువ ఎన్ని రెట్లు పెరిగి ఉండేది? ఒక్క వివా దం అన్ని గ్రామాలను ఎండబెడుతున్నది. నీటిపారుదల ఇంజినీర్లు రెవెన్యూ అధికారులవైపు వేలెత్తిచూపుతారు.

రెవెన్యూ అధికారులు కోర్టులో ఉంది కదా ఏమి చేయలేమని చేతులెత్తేస్తారు, కోర్టులు వందలవేల కేసులు ఉన్నాయి, దీనికేమి తొందర అని వాయిదాలు వేస్తుంటాయి. రైతులు మాత్రం అలా కునారిల్లిపోతూనే ఉంటారు. ఇది ఒక జిల్లాలో ఒక ప్రాజెక్టు కింద తలెత్తిన వివాదం, విషాదం కథ. కానీ చాలా ప్రాజెక్టుల కథలు ఇలాగే విషాదాల్లో కూరుకుపోతున్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎవరో వస్తారు. మీకు ఇన్నిలక్షలు అన్ని లక్షలు వస్తాయి. చలో కొట్లాడదాం అంటారు. రెచ్చగొడతారు. అది ఎన్నాళ్లకూ తెగదూ ముడిపడదు. ముందుగా భూములిచ్చి పరిహారం తీసుకుని ఎక్కడో దూరంగా వెళ్లి మళ్లీ భూములు కొనుక్కుని కొత్తజీవితం ప్రారంభించినవారు ముందుగా ఇబ్బందిపడినా నిక్షేపంగా ఉన్నారు. ఇప్పుడు వారి భూముల విలువలు కూడా పెరిగాయి. వాళ్లంతా ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారు.

మల్లన్నసాగర్ ఆషామాషీగా తలపెట్టిన రిజర్వాయరు కాదు. యాభై టీఎంసీల నీటిని నిల్వ చేయడం అంటే మెదక్ జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలిగిన ప్రాజెక్టు. మల్లన్నసాగర్ అటు హరిద్ర, మంజీర నదులను, ఇటు గంధమల్ల నుంచి మూసీదాకా ఉన్న ఉపనదులను సజీవం చేసేందుకు ఉద్దేశించిన రిజర్వాయరు. మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వందలాది చెరువులను నింపడానికి, లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన నిల్వ రిజర్వాయరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయువుపట్టు అది. అందుకే కొన్ని ప్రతిబంధక రాజకీయ శక్తులు అక్కడ దృష్టిని కేంద్రీకరించాయి.

నిజమే, ఉన్న ఊరు, చేసుకున్న భూమి వదిలిపోవాలంటే చాలా కష్టం. ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజల బాధను కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరూ త్యాగా లు చెయ్యకుండా ఏ నిర్మాణమూ జరుగదు. ప్రతినిర్మాణంతో పాటు కొంత విధ్వంసమూ ఉంటుంది. కానీ నిర్మాణం వల్ల జరిగే మేలు ఎంత? జరుగుతున్న విధ్వం సం ఎంత? అన్న విచక్షణతో ఆలోచించకపోతే గోదావరిని తెలంగాణకు మళ్లించే యజ్ఞం ఎప్పటికీ పూర్తికాదు. ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదలయింది ఏమీ కాదు. నాగార్జునసాగర్ సమయంలో వందలాదిమంది నల్లగొండ ప్రజలు నిరాశ్రయులయ్యారు. నల్లమల కొండలపై వారికి నివాసాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ ఊర్లకు ఇప్పటికీ రోడ్లు లేవు. కనీస వసతులు లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడక్కడికి రోడ్లు పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయరులో భూములు కోల్పోయిన మహబూబ్‌నగర్ వాసులకు ఇప్పటికీ పరిహారం, పునరావాసం కల్పించలేదు.

ఇప్పుడు కూడా దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఎంతో దూరం ఎందుకు? మంజీర కింద భూములు కోల్పోయిన వారికి దామోదర రాజనరసింహ ఎన్ని లక్షలు ఇప్పించారో ప్రభుత్వ రికార్డుల్లో దొరకదా? పరిహారం చెల్లించడానికి కూడా రైతులను ఎంత తిప్పుకున్నారో మంజీర చుట్టుపక్కల గ్రామాల్లో స్థిరపడిన రైతులను అడిగితే చెప్పరా? తెలంగాణ టీడీపీ నాయకులు భూసేకరణ గురించి మాట్లాడితే అసహ్యం కలుగుతుంది. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు అనుసరించిన పద్ధతుల గురించి ఎవరికి తెలియదు? అరటి తోటలు, చెరుకు తోటలు కూల్చి, రైతులను బెదిరించి భూములు తీసుకున్న విషయం నిజం కాదా?చంద్రబాబు అక్కడ ప్రాజెక్టుల కింద ఎంత పరిహారం చెల్లిస్తున్నారు? ఏ చట్టం ప్రకారం చెల్లిస్తున్నారో వివరించి చెబితే ఇక్కడి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. టీడీపీ నాయకులు ఇక్కడ కూతలు మాని అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకుని వచ్చి చెబితే బాగుంటుంది. తెలగాణలో జరిగిన అనేక విధ్వంసాలకు, పాపాలకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో! కొందరయితే సభ్యత సంస్కారం కోల్పో యి మాట్లాడుతున్నారు. వీళ్లా మన నాయకులు అని జనం సిగ్గుపడేట్టు వ్యవహరిస్తున్నారు. నువ్వేమన్నా చెప్పు, నేను మాత్రం వ్యతిరేకిస్తా అనే వాడిని ఏ ప్రభు త్వం ఒప్పించగలదు?

భూసేకరణ ఒక్క ఏడిగడ్డ కిష్టాపూర్‌లో మాత్రమే జరగడం లేదు. తెలంగాణ అంతటా జరుగుతున్నది. ఇప్పటికే 25 వేల ఎకరాల భూమిని ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభుత్వం సేకరించింది. దామరచర్ల అల్ట్రాపవర్ ప్లాంటు వద్ద కూడా పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టింది. పాలమూరు రైతులు కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని ఇస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉత్త కాలువలు తవ్వినప్పుడు చాలా గ్రామాల్లో పరిహారం అడగకుండానే కాలువ లు తవ్వనిచ్చారు. ఆ తర్వాత ఎప్పుడో పరిహారం ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందని. నీళ్లు వస్తాయని. కరువు పోతుందని. అనేక మంది బాగుపడతారని. అస్సలు బాధపడనివారు, ఎదురు తిరగని వారు లేరని కాదు. అప్పుడూ కొందరు వివాదాలకు వచ్చారు. ఆ తర్వాత రాజీపడ్డారు.

ఏడిగడ్డ కిష్టాపూర్ రైతులు కూడా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి. పంచాయితీ కోసం కాచుక్కూచున్న ప్రతిపక్ష నాయకుల భ్రమల్లో పడకుండా వాస్తవిక దృష్టితో సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలి. ఎప్పటికయి నా పరిహారం చెల్లించాల్సింది ప్రభుత్వమే. సంఘర్షణపూరిత వాతావరణం పెంచుకోవడం మంచిది కాదు. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా వారికి మెరుగైన పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లకు చెల్లించే ఎస్కలేషన్ డబ్బుతో పోల్చితే రైతులకు చెల్లించే పరిహారం స్వల్పం. ప్రాజెక్టు ఆలస్యం అయితే జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పరిహారం సమస్యను పరిష్కరించాలి. ఒక ప్రాజె క్టు ఒక సీజను ఆలస్యంగా మొదలయినా, ఒక సీజను ఆలస్యంగా అందినా ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే నష్టం వందలు వేల కోట్లలో ఉంటుందని అన్ని పక్షాలూ గమనించాలి. ఒక సీజనులో ఒక టీఎంసీ నీటితో సుమారు 25 కోట్ల పంట చేతికి వస్తుందని వ్యవసాయార్థిక వేత్తలు అంచనావేశారు.

అంటే మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టు ఒక సీజను ఆలస్యంగా పూర్తయితే జరిగే నష్టం సుమారు 1250 కోట్ల రూపాయలు. నిజానికి మల్లన్నసాగర్‌లో నిల్వ ఉంచేది 50 టీఎంసీల కావచ్చు, కానీ ఆ ప్రాజెక్టుకు ఎగువన ఇటు నిజాంసాగర్ వైపు, అటు గంధమల్ల వైపు ఉపయోగించే నీటి పరిమాణం ఇంకా ఎక్కువ. అంటే ఆ ప్రాజెక్టును ఎంత ఆపితే తెలంగాణకు అంత నష్టం.ఆరు దశాబ్దాలు తెలంగాణను ఏలిన రాజకీయ శక్తులు రాష్ట్ర ఆవిర్భావం తర్వా త ప్రజల తిరస్కారానికి గురయి రాజకీయ నిరుద్యోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తెలంగాణను తెచ్చుకున్నాం కదా. కొంతకాలం పనులు సాగనిద్దాం. బాగు చేసుకుందాం. కాళ్లలో కట్టెలు పెట్టకుండా నడవనిద్దాం. ఎన్నికల సమయంలో చూసుకుందాం అనుకోవడం లేదు. ఓడిపోయిన రోజు నుంచే కుట్రలు కుతంత్రాలు ఉక్రోశాలు బయటపెట్టుకోవడం మొదలుపెట్టాయి.

పరాజయం ఎదురయినప్పుడు అనుసరించాల్సిన రాజకీయ విజ్ఞత, పరిణతి వారిలో కనిపించ లేదు. క్రమంగా శక్తులు కూడదీసుకునే రాజకీయ సాధన ఏదీ వారు చేయడం లేదు. కేసీఆర్ ఎక్కడ గెలిచారో, తాము ఎక్కడ ఓడిపోయారో వాళ్లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తెలంగాణ రాకముందు తెలంగాణ వ్యతిరేక శక్తులు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉపయోగించిన భాషను, దాడినే ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నాయకులు కూడా ఉపయోగిస్తున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌లాగా ఎదగాలని ఒక్కరూ అనుకోవడం లేదు. ఒక్కొక్క నాయకుడు రోజురోజుకు పతనాంధోలోకంలోకి జారిపోతున్నారు. ఒకప్పుడు మోత్కుపల్లి నరసింహులు పోషించిన తిట్లపాత్రను ఇప్పుడు రేవంత్‌రెడ్డి పోషిస్తున్నాడు. ఒకప్పుడు జయప్రకాశ్‌రెడ్డి అనుసరించిన తీరును ఇప్పుడు కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారు. తీవ్రంగా మాట్లాడి రోజూ ఎదుగుతున్నామనుకుంటున్నారేమో! కానీ తిట్టేవాళ్లు నాయకులు కాలేరని మోత్కుపల్లిని చూసి అర్థం చేసుకోవాలి.

మోత్కుపల్లి చాలా సీనియర్ నాయకుడు. తెలివైనవారు. అనుభవం, అవగాహన ఉన్నవారు. మాట చాతుర్యం ఉన్నవారు. కానీ వాటన్నింటనీ ఉపయోగించుకోకుండా కేవలం చంద్రబాబు తిట్ల ఎజెండాను మోసి ఆయన ఏం సాధించుకున్నారు? ఎక్క డ ఆగిపోయారు? తిట్టునాయక గణం అంతా తెలుసుకోవలసింది గతం నుంచి గుణపాఠం నేర్చుకోవలసిందంతా ఒక్కటే-ప్రతీఘాత, ప్రతిబంధక, విధ్వంసకర పాత్రలతో సాధించేదేమీ ఉండదని. నిర్మాణాత్మక పాత్ర, నిర్మాణాత్మక విమర్శ మాత్రమే నాయకుడిని నిలబెడుతుందని. ఏటిగడ్డ కిష్టాపూర్ రైతాంగం అర్థం చేసుకోవలసింది ఒక్కటే. రాజకీయాల కోసం తమను ఎగదోసేవారిని నమ్మకండి. నాయకుల లక్ష్యమల్లా ప్రాజెక్టును వీలైనంతకాలం అపడమే. ఎల్లకాలం వీరు రైతు ల వెంట ఉండరు. వీరి ఆరాటం పరిహారం పెంచి ఇప్పించడం కాదు. ఈ సమస్య కు మెరుగైన పరిష్కారం చూపించే నాయకులను, అధికారులను మాత్రమే నమ్మం డి. ప్రాజెక్టును ఆపకండి. పరిష్కారానికి సహకరించండి.

1293

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా