యథాజ్ఞానం తథా ప్రజెంటేషన్


Sun,April 10, 2016 01:00 AM

తెలంగాణ నేతలను ఎగతాళి చేసిన శక్తులన్నీ వాస్తవంలోకి వచ్చి ఇప్పుడు పాహిమాం పాహిమాం అని చేతులు జోడిస్తున్నాయి. తెలంగాణ సమాజానికి మునుపెన్నడూ లేని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన కలిగించింది. ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ ఇంతసాధించిందీ అంటే అది కేవలం కేసీఆర్ అందించిన నాయకత్వం. తాను విశ్రమించడం లేదు. ఎవరినీ విశ్రమించనీయడం లేదు. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ముందున్న లక్ష్యాలు సాధారణమైనవి కాదు.

ఈ పదేళ్లూ పునర్నిర్మాణ కంకణబద్ధులై ముందుకు సాగితే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రయోజనం నెరవేరదు.. పంతాలు, ప్రజెంటేషన్లు మాని రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలకోసం అన్ని పక్షాలూ కలసి పనిచేయడం మంచిది. ప్రభుత్వం చేసే పనులలో లోపాలే లేవని కాదు. విమర్శలే చేయవద్దని కాదు. ఎక్కడైనా రాజకీయాలు చేయండి. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఒక్కమాటగా ఉండకపోతే తెలంగాణకు నష్టం. తెలంగాణ ప్రథమ ప్రాధాన్యం తాగునీరు, సాగునీరే. ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగడానికి, త్వరిత గతిన ప్రతి ఇంటికి,ప్రతి పొలానికి నీరందించడమే లక్ష్యంగా మీ శక్తియుక్తులు ఉపయోగింండి.

shekar
వ్యతిరేకించడమే ప్రతిపక్షం పని అయితే ఈ దేశంలో ఒక్క పనీ ముందుకు సాగదు. వ్యతిరేకించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. సందర్భోచితంగా ఉండాలి. సహేతుకమైన కారణాలు చూపాలి. ఒక సమగ్ర దృష్టితో మాట్లాడాలి. వ్యతిరేకించడంలో అక్కసు, ఏడుపు, ఉక్రోషం కనిపించకూడదు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని గ్రూపులు చేస్తున్న వాదనల్లో డొల్లతనం తప్ప బలమైన కారణాలు కనిపించవు. ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరణి తప్ప ప్రజల బాగుకోరే తపన కనిపించదు. కొందరయితే మండలస్థాయికి, నియోజకవర్గస్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. కొందరు జిల్లా నేతలుగా మాట్లాడుతున్నారు. ఒకే పార్టీలో కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. కాంట్రాక్టులు తీసుకున్నవాళ్లు ఒకరకంగా, తీసుకోని వాళ్లు మరోరకంగా...వీళ్లెవరూ విశాల ప్రయోజన దృష్టితో మాట్లాడటం లేదు. అధికారంపోయి, ఆశలు ఛిద్రమైన దుగ్ధతో మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. మంచిని మంచిగా చెడును చెడుగా చూసే ధోరణిలేకపోతే రాజకీయాలు ఆరోగ్యకర స్థాయి నుంచి హీనస్థాయికి దిగజారుతాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఒక మహాయజ్ఞం. ఒట్టిపోయిన తెలంగాణను తిరిగి జలాభిషేకంతో పునర్జీవింపజేసే ప్రయత్నం. కాంగ్రెస్ నాయకులకు గానీ, కొందరు మేధావులకు గానీ అర్థం కానిదేమంటే ప్రాజెక్టులు కట్టడం అంటే కాలువలు తవ్వడం కానే కాదు. నదుల్లో నీరు వస్తున్నప్పుడు ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవడం. అందుకనుగుణంగా రిజర్వాయర్లు నిర్మించడం. అన్ని చెరువులను సంధానం చేయడం.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అంతకు ముందు చంద్రబాబు చేసిన పని అదే. వారు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా రిజర్వాయర్లు నిర్మించారు. ముప్పైకి పైగా రిజర్వాయర్లలో ఇంకా కొన్ని పూర్తికావలసి ఉంది. ముందు రిజర్వాయర్లు నిర్మించి ఆ తర్వాత వాటికి తగినంత నీరు తీసుకోవడానికి వీలుగా పోతిరెడ్డి కాలువ సామర్థ్యాన్ని 44000 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడు కాలమైతే, వరదవస్తే చాలు ముప్పై రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున కనీసం120 టీఎంసీల నీటిని తరలించుకుపోయే సామర్థ్యం ఆ కాలువకు ఉంది. సుమారు 220 టీఎంసీల నీటిని నింపుకునే రిజర్వాయర్లు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు లేదంటే నాగం జనార్దనరెడ్డి వంటి నాయకులు అర్థం చేసుకోవలసింది అదే.

పోతిరెడ్డిపాడు కింద అన్ని కాలువలు, రిజర్వాయర్లు నిర్మించిన పెద్దమనిషి ప్రాణహిత-చేవెళ్లను నీళ్లొచ్చినప్పుడే వాడుకునే విధంగా ఎందుకు రూపొందించారో చెప్పాలి. తగినన్ని రిజర్వాయర్లను ఎందుకు ప్లాను చేయలేదో చెప్పాలి. హెడ్‌వర్క్స్ వదిలేసి టెయిల్‌వర్క్స్ ఎందుకు ముందు చేశారో చెప్పాలి. ప్రాణహిత-చేవెళ్ల తెలంగాణపై రుద్దిన పెద్ద ఫ్రాడ్. దానిని సరిదిద్ది తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే పనిని కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. వీలైనంత ఎక్కువ నీటిని నదుల నుంచి మళ్లించి నిల్వ చేసుకునే విధంగా రీడిజైనింగ్ జరిగింది. నిల్వ సామర్థ్యం పెంచితేనే తెలంగాణకు బతుకు, భవిష్యత్తు. భూగర్భాన్ని తిరిగి రీచార్జి చేయకుండా తెలంగాణ వ్యవసాయం కలకాలం మనజాలదు. రీచార్జి చేయాలంటే రిజర్వాయర్లు, చెరువులు నిండాలి. జాలు జలాలతో వాగులు, వంకలు పునర్జీవం పొందాలి. ఎండిపోయిన బావులు తిరిగి నీటితో కళకళలాడాలి. వందల అడుగులు బోర్లు వేసే దుస్థితి నుంచి రైతును విముక్తి చేయాలి. ఇవేవీ ఆలోచించకుండా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పట్టుకుని కాంగ్రెస్ నాయకులు, వామపక్షాలు గోలచేయడం విచిత్రం.

ప్రతిపక్షాలు ముందుగా తెలంగాణ తాగునీటి, సాగునీటి సమస్యను ఆకళింపు చేసుకోవాలి. వారికి ఇప్పటికీ నదుల గురించి, వాటి పరీవాహక ప్రాంతాల గురించి, ఆయకట్టు గురించి, నీటివాలు గురించి అవగాహనలేదంటే కోపపడవలసిన పనిలేదు. క్యూసెక్కులు, టీఎంసీల లెక్కలు తెలియవంటే బాధపడనక్కరలేదు. తెలంగాణ ఉద్యమసారథిగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పదమూడేళ్లు ఆ లెక్కలు పత్రాలు వందలు వేలు చదివారు. నిష్ణాతులైన ఇంజనీర్లతో అనేక దఫాలుగా చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వానికి అసలు అసెంబ్లీలో కూర్చునే ఓపికలేదు. సమస్యలను తెలుసుకునే ఓపిక లేదు. కేసీఆర్‌ను విమర్శించాలంటే కేసీఆర్‌కు తెలిసినన్ని విషయాలు ప్రతిపక్షానికి తెలియాలి. ప్రతిపక్షాలు మూస పద్ధతుల్లో ఆలోచిస్తున్నాయి. వాదనలో విషయం లేకుండా డబ్బాలో రాళ్లువేసి చప్పుడు చేసినట్టు ఎంతకాలం ఎంతగట్టిగా మాట్లాడితే ఏమి ప్రయోజనం? కేసీఆర్ వారికంటే రెండు మూడు దశాబ్దాలు ముందుకెళ్లి మాట్లాడుతున్నారు.

సృజనాత్మకంగా ఆలోచించే అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు. ఐఫోను వచ్చిన కొత్తలో అనుకుంటా ఆయన తనకు ఆ ఫోను కావాలన్నారు. అది ఇంకా ఇక్కడ విడుదల కాలేదని ఎవరో చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెప్పించాలో చూడండి అని ఆయన పురమాయించారు. మరుసటిరోజుకు ఆ ఫోను చేతికివచ్చింది. ఐఫోను ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో ఆయన ముందే చూసి, మరుసటిరోజు అందరికీ వివరించి చెప్పారు. ఐప్యాడ్ వచ్చినప్పుడూ అంతే. ఈ దేశంలో గూగుల్ ఎర్త్‌ను సమర్థవంతంగా వాడుకున్న ఒకే ఒక నాయకుడు, ముఖ్యమంత్రి బహుశా కేసీఆరే కావచ్చు. అందుకే అన్ని అంశాలపై ఆయనకు అంతగా పట్టు. కొత్తగా, భిన్నంగా ఆలోచించడం ఆయన తత్వం. నిరంతర శోధన ఆయన ప్రపంచం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆలోచనల పుట్ట. మరో లోకం లేదు. మరి ఆయనపై విమర్శలు చేయడానికి ప్రతిపక్ష నాయకులకు కూడా అంతే అవగాహన ఉండాలా లేదా?

ప్రతిపక్ష నాయకులు ప్రజెంటేషన్ ఒక్కరివ్వాలా వందమందివ్వాలా అన్న దగ్గరే ఆగిపోయారు. ఎందుకంటే ఒక్కరికే అన్ని ప్రాజెక్టుల గురించి అవగాహన లేకపోవడం. జిల్లానాయకుల స్థాయి నుంచి ఎవరూ రాష్ట్ర నాయకుని స్థాయికి ఎదగకపోవడం. ఒక రాష్ర్టానికి నాయకత్వం వహించే దమ్మూ ధైర్యం, విశాలదృక్పథం ఎవరూ అలవర్చుకోకపోవడం. ఒక్కరు కూడా కాలంతోపాటు ఎదగకపోవడం. పాత భావజాలాలు, పాత పద్ధతుల్లోనే రాజకీయాలు చేయాలనే ధోరణిని మార్చుకోకపోవడం. రాజకీయాల్లో ఎదగడానికి ఏమాత్రం కష్టపడకుండా, ఇంకా దగ్గరి దారిలోనే నిచ్చెనమెట్లెక్కాలనుకోవడం. అందుకే ప్రతిపక్షానికి అస్ర్తాలే లేకుండాపోయాయి.

తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో, రాసిచ్చిన స్క్రిప్టులతో ప్రభుత్వంపైకి ఏదో ఒక బాణం విసిరినా అవి మధ్యలోనే దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి. నిజానికి తెలంగాణలో ఇంత తొందరగా రాజకీయ బాగోతాలు మొదలుపెట్టనవసరం లేదు. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇన్నేళ్ల ఆధిపత్య వ్యవస్థల నుంచి సంకెళ్లు తెంచుకుని, కాళ్లూ చేతులూ కూడదీసుకుని అభివృద్ధి పరుగు ప్రారంభించడానికి ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తున్నది. తెలంగాణ నాయకులకు పరిపాలించుకోవడం చేతగాదు, ఉత్తగనే ఆగమైపోతరని చెప్పిన ఒకప్పటి పెత్తందారుల దిమ్మదిరిగేట్టు, అనతికాలంలోనే తెలంగాణ ఒక అజేయమైన రాష్ట్రంగా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. కేసీఆర్‌కు దేశంలో మరే నాయకునికీ లభించని పేరు దక్కింది.

తెలంగాణ నేతలను ఎగతాళి చేసిన శక్తులన్నీ వాస్తవంలోకి వచ్చి ఇప్పుడు పాహిమాం పాహిమాం అని చేతులు జోడిస్తున్నాయి. తెలంగాణ సమాజానికి మునుపెన్నడూ లేని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన కలిగించింది. ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ ఇంతసాధించిందీ అంటే అది కేవలం కేసీఆర్ అందించిన నాయకత్వం. తాను విశ్రమించడం లేదు. ఎవరినీ విశ్రమించనీయడం లేదు. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ముందున్న లక్ష్యాలు సాధారణమైనవి కాదు. ఈ పదేళ్లూ పునర్నిర్మాణ కంకణబద్ధులై ముందుకు సాగితే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రయోజనం నెరవేరదు.

పంతాలు, ప్రజెంటేషన్లు మాని రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలకోసం అన్ని పక్షాలూ కలసి పనిచేయడం మంచిది. ప్రభుత్వం చేసే పనులలో లోపాలే లేవని కాదు. విమర్శలే చేయవద్దని కాదు. ఎక్కడైనా రాజకీయాలు చేయండి. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఒక్కమాటగా ఉండకపోతే తెలంగాణకు నష్టం. తెలంగాణ ప్రథమ ప్రాధాన్యం తాగునీరు, సాగునీరే. ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగడానికి, త్వరిత గతిన ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి నీరందించడమే లక్ష్యంగా అన్ని పక్షాలూ తమ శక్తియుక్తులను ఉపయోగించాలి.

2044

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా