కేసీఆర్ విశ్వరూపం


Sun,April 3, 2016 03:23 AM

కేసీఆర్ విశ్వరూపం చూశాం. ఆయన గురించి మేము ఇంతకాలం విన్న వ్యతిరేకాంశాలు దూదిపింజల్లా తేలిపోయాయి. ఆయనను ఇప్పటిదాకా పరిపాలించిన మరో ముఖ్యమంత్రి ఎవరితోనూ పోల్చలేము. ఆయన ఒక ఉద్యమకారునిగా, ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా, అసాధారణమైన మేధోసంపత్తి కలిగి న నేతగా విజయం సాధించారు. కలిసి బతుకుదాం. నీళ్ల పంచాయితీలు వద్దు అని ఆయన చెప్పిన మాట మా వాళ్లకు ఎంతగా నచ్చిందో. మా ప్రాంత ప్రజలు మాకు ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుండు అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో అని ఇప్పుడు తలుచుకుంటే గుబులుగా అనిపిస్తుంది. కేసీఆర్ వంటి ఒక బలమైన నాయకుడు రాకపో యి ఉంటే అటు చంద్రబాబు, ఇటు కాంగ్రెస్ కొత్త రాష్ర్టాన్ని ఎంతగా ఆగం పట్టించి ఉండేవారో తెలిసివస్తున్నది. నీటిపారుదల ప్రాజెక్టులపై శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం, ప్రజెంటేషన్ నభూతో నభవిష్యతి అని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మేధావి అభివర్ణించారు.

shekarకేసీఆర్‌పై మాకో చిన్న చూపు ఉండేది. ఆయన గురించి ఉద్యమ సమయంలో, ఆ తర్వాతా మేము విన్నవి అన్నీ అబద్ధాలని తేలిపోయింది. ఆయన తెలంగాణకు వరం. తెలంగాణ వనరులను మేము ఉన్నతాధికారులమై ఉండీ ఇంతవరకు ఎప్పుడూ ఇంత లోతుగా అధ్యయనం చేయలేదు. నదులు, ప్రాజెక్టుల స్వరూపాలను ఇంచుఇంచూ చెబుతుంటే ఆశ్చర్యం వేసింది అని ఒక ఇరిగేషన్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో చాలారోజులు అందరికంటే ఆఖరుకు నిద్రపోయింది కేసీఆర్‌గారే కావచ్చు. ఒక్కోరోజు తెల్లవారుజామున రెండు మూడు గంటలు కొట్టే వరకు కంప్యూటరు ముందు కూర్చుని గూగుల్ ఎర్త్‌ను బ్రౌజ్ చేస్తుంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడేవాళ్లం. కానీ ఆయన పట్టిన పట్టు విడువరు. ఏదైనా ఒక అంశాన్ని ముందేసుకున్నారంటే, దాని అంతుచూసే దాకా నిద్రపోరు. సంపూర్ణంగా అధ్యయనం చేస్తారు. అడిగి తెలుసుకోవడానికీ వెనుకాడరు. ఏదైనా గొప్పగా, అత్యంత ప్రయోజనకరంగా, పకడ్బందీగా, పరిపూర్ణంగా చేయాలనేది ఆయ న తాపత్రయం అని ఆయన సహాయకుల్లో ఒకరు మాటల సందర్భంగా చెప్పారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలపై ఎందుకు ఇంతగా శ్రద్ధపెడుతున్నారో ఎవరికయినా ఇప్పటికే అర్థం కావాలి. తెలంగాణ ఈ ఆరు దశాబ్దాల్లో బాగా నష్టపోయింది, అష్టకష్టాలపాలయింది, అప్పుల పాలయింది సాగునీరు, తాగునీరు, కరెంటు లేకనే. ఆయన ముఖ్యమంత్రి కాగానే కరెంటు విషయం పరిష్కరించారు. కరెంటు సమస్యను ఎదుర్కోవడానికి ఏమి చేయాలో అధికారులను పిలిచి అడిగారు. లెక్కలు వేశారు. డిమాండు సైప్లెల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తేల్చారు. ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ట్రాన్సో, జెన్కోలపై పెట్టకుండా ఇంజనీర్లుగా అక్కడే ఉన్నతస్థానాలకు ఎదిగిన ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి వంటి టెక్నోక్రాట్స్‌కు బాధ్యతలు అప్పగించారు. కరెంటు కోసం జనం వీధుల్లోకి రాకూడదు ఏం చేస్తారో మీష్టం. ఎంత ఖర్చయినా పర్వాలేదు అని ఆయన వారిని పురమాయించారు. వారు వారం తిరుగకుండానే ఒక పరిష్కారంతో ముందుకు వచ్చారు. అదనంగా ఎంత ఖర్చవుతుందో చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్య తలెత్తలేదు. అంతేకాదు పాత విద్యుదుత్పత్తి కేంద్రాల ఉత్పాదన సామర్థ్యం పెంచారు.

వృథాను అరికట్టారు. కొత్త విద్యుత్ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. కేసీఆర్‌ను జనం శభాష్ అనుకున్న తొలి సందర్భం అది. మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన అధికారులు అయితే ఏం చేయగలరో రుజువయిన సన్నివేశం అది. కరెంటు ఉంది సరే. మరి నీళ్ల సంగతి ఏమిటి? తెలంగాణలో రైతులు సాగునీరు లేక బోర్లు వేసీ వేసీ అప్పుల పాలయి, పంటలు చేతికి రాక ఆగమయిపోతున్నారు. కాలువల్లో నీరు లేదు. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. చెరువులు పూడుకుపోయాయి. బోర్లు వందల ఫీట్ల లోతుల్లోకి పోతున్నాయి. అయినా నీళ్లు లభించని పరిస్థితి. గోదావరి, కృష్ణా డెల్టాల్లో కేవలం రెండొందల రూపాయల నీటితీరువా కడితే ఏడాదిపాటు పొలాలకు నీరు వస్తుంది. ఇక్కడ ఒక్క రైతు ఒక్కోసారి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా పారించడం కష్టం అవుతున్నది. తెలంగాణ రైతులు భూగర్భ జలాలకోసం ఏటా 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పిన విషయం అక్షర సత్యం. రైతుకు నీళ్లివ్వగలిగితే ఆ 25 వేల కోట్లు తెలంగాణకు మిగులు. రైతుకు మిగులు. తెలంగాణ వెనుకబాటుకు ప్రధాన కారణం అదే. తెలంగాణ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూలం ఇందులోనే ఉంది. ఊళ్లు పాడుబడిపోయి యువకులు పొట్ట చేతపట్టుకుని బొంబాయి, దుబాయి, బొగ్గుబావుల వెంట తిరగాల్సి వస్తున్నది. జీవితానికి ఇతరత్రా భరోసా లేక ప్రభుత్వోద్యోగాలకోసం వెంపర్లాడాల్సి వస్తున్నది. ఈ సమస్యలన్నింటినీ జయించడానికి ఒకటే పరిష్కారం...నీళ్లు... నీళ్లు... నీళ్లు. తెలంగాణ ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్యలు రాయాల్సివస్తే ఒకటి నుంచి పదిదాకా సాగునీరు, తాగునీరు గురించే రాయవలసిన పరిస్థితి. అందుకే కేసీఆర్ ప్రాజెక్టుల సమస్యను అంతగా ముందేసుకున్నారు.
జలయజ్ఞం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే కదా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. నిజమే. మన నాయకులకు, కొందరు ఇంజనీర్లకు, కొందరు మేధావులకు ఇంతకాలం అర్థం కానిది అదే. వాళ్లు మనకు కొండను చూపిస్తూ నేలకింద భూమిని తవ్వడం మొదలుపెట్టారు. కొండ వస్తుందని మనం అటే చూస్తుండిపోవాలి. మన పాదాల కింద మట్టి కదలిపోయి మనం బొందలో పడాలి. వాళ్లు హెడ్‌వర్క్స్ చేసుకున్నారు. మనకు టెయిల్ వర్క్స్ మొదలుపెట్టారు. వాళ్లు కాంట్రాక్టులు, కమీషన్లు తీసుకున్నారు. మనవాళ్లకు పదో పరకో చిన్న చిన్న ప్యాకేజీలో పడేశారు.

వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నీళ్లు తీసుకెళ్లారు. మన ప్రాజెక్టులు, కాలువలు చెట్లు దుప్పలు మొలిచి పడువబడి పోయాయి అని ఒక జర్నలిస్టు చేసిన పరుషమైన విశ్లేషణ. అంతపెద్ద పోతిరెడ్డిపాడు కాలువను ఏ అనుమతులూ లేకుండా రెండేళ్లలోపే నల్లమల కొండలను నిట్టనిలువునా చీల్చుతూ 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆ రెగ్యులేటర్ నుంచి నాలుగు కాలువలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను స్పర్శిస్తూ ముందుకు సాగిపోయాయి. ఇవిగాక హంద్రీ-నీవా కర్నూలు జిల్లాలో మొదలై చిత్తూరు ఆ చివరన కుప్పం దాకా సాగిపోయింది. అవి కేవలం కాలువలు కాదు, ఒక నది మళ్లింపు ప్రయత్నం. పోతిరెడ్డిపాడు ఒక పెద్ద అతిక్రమణ. దుర్మార్గం. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గ్రేట్. తన ప్రజలకు తాను చేయదల్చుకున్నది చేసి పారేశారు. ఎవరి ఆమోదం కోసమూ ఎదురు చూడలేదు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తలకిందులుగా తపస్సు చేసినా ఆయన వెరువలేదు. పోతిరెడ్డిపాడు నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ఎండమావిని సృష్టించారు. వేల కోట్ల రూపాయలను మట్టిలో పోశారు. పదేళ్ల తర్వాత కూడా ఒక్క చుక్క నీరు పారలేదు. ఎందుకంటే తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్తకుండా చేవెళ్ల వద్ద టన్నెలు తవ్వించే క్రూరమైన పరిహాసానికి దిగారు అప్పటి పాలకులు. 22 లిఫ్టులు, రెండే రెండు రిజర్వాయర్లతో 180 టీఎంసీలు వాడాలని లెక్కలు వేశారు. రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు మించదు. మరి 180 టీఎంసీలు ఎలా వాడతారయ్యా అంటే నది పారుతున్న కాలంలో ఆగకుండా మోటార్లు నడిపి నీళ్లు ఎత్తిపోసి పొలాలకు మళ్లించాలట.

ఈ ప్రాజెక్టుకు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో, ఎంత ప్రయోజనం జరిగిందో లెక్కలు తీస్తే, ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేసిన వారందరినీ కటకటాల వెనుక కూర్చోబెట్టాల్సి వస్తుంది. విచిత్రం ఏమంటే ఆ కుట్రలకు భాగస్వాములుగా ఉన్నవాళ్లు ఇప్పటికీ తెలంగాణకు జరిగిన మోసాన్ని గుర్తించకపోవడం. తమ్మడిహట్టి వద్ద ప్రాణహిత హెడ్‌వర్క్స్ పక్కనబెట్టి చేవెళ్ల దగ్గర తవ్వకాలు ఎందుకు జరిగాయో ఇప్పటికీ ఎవరూ ఎందుకు మాట్లాడరు? మూడు దశాబ్దాల క్రితం పోతిరెడ్డిపాడుతోపాటే ఆలోచన చేసిన ఎస్‌ఎల్‌బీసీ నానాతెర్వూ ఎందుకు అయిపోయింది? మహబూబ్‌నగర్‌లో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు ఎందుకు?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజానికి కాంగ్రెస్‌ను తిట్టడం కోసం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టలేదని విన్నవారెవరికయినా అర్థం అవుతుంది. తెలంగాణకు అత్యంత అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి అందరి ఆమోదంతో ఏకోన్ముఖంగా పనిచేయాలని, పంచాయితీలు, వివాదాలతో కాలయాపన జరుగరాదని ఆయన భావించారు. తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం కలిగే విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేయాలన్నది ఆయన ప్రయత్నం. తెలంగాణ నేల ఒట్టిపోయింది. భూగర్భ జలాలు సైతం దొరకని పరిస్థితి వచ్చేసింది. భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండబోతున్నది. అందుకే తెలంగాణ రాగానే శాశ్వత ప్రాతిపదికన నీటి వనరుల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రారంభించింది. ఇవి రెండు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అయితే వీటికి కూడా నీరు కావాలి. ఎంత గొప్ప లక్ష్యాలయినా నీరు లేకపోతే ప్రయోజనం శూన్యం.

తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాల పునర్జీవం లక్ష్యాలుగా నీటిపారుదల ప్రాజెక్టులను సమగ్రంగా రీడిజైన్ చేయాలని భావించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను జీర్ణించుకోలేని కొన్ని పత్రికలు ఎంత వంకరగా ఆలోచిస్తున్నాయంటే, కాళేశ్వరం వ్యయం పెరిగింది, విద్యుత్ అవసరం పెరిగింది అని రాశాయే తప్ప, రీడిజైనింగ్ వల్ల గోదావరి నుంచి తీసుకునే నీటి మొత్తం పెరిగింది, రిజర్వాయర్లు పెరిగాయి, నిల్వ సామర్థ్యం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణ నేలను రీచార్జి చేసే యజ్ఞం మొదలయింది అని రాయలేదు. రాయలేవు. తెలంగాణ ఏది చేసినా వంకరగా చూడడం వారి జన్యువులోనే ఉందనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులకు కుంభకోణాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు నిర్మించడం అంటే కాసులు పండించడం. నీళ్లు మళ్లించడం కాదు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అందరూ తమలాగే కాసులు పండించుకుంటారని వారు భావిస్తుండవచ్చు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఇంతకాలం జరిగిన నష్టం ఏమిటో, తను చేయదల్చుకున్నదేమిటో పూసగుచ్చినట్టు వివరించి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టాలని నిర్ణయించుకుని, అందుకు ఒక సాకు వెతుక్కున్నారు. ఇటువంటిది మునుపెన్నడూ జరుగలేదన్నది వారి వాదన. కొత్తబాటలో నడవడం అంటే కాంగ్రెస్‌కు మంట. అసెంబ్లీ అంటేనే ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించే వేదిక.

అది తెలుసుకోవడానికి కామన్‌సెన్సు చాలు. రూల్సు బుక్ అవసరం లేదు. అనుభవజ్ఞులైన మాజీ స్పీకర్లు అవసరం లేదు. విజువలా, ఆడియో విజువలా అన్న చర్చ కూడా అత్యంత తెలివి తక్కువ, కాలం చెల్లిన ఆలోచన. మావాళ్ల ప్రయాణం అసమర్థుని జీవయాత్రలాగా ఉంది. వారు మారరు. అప్‌డేట్‌కారు. గతకాలపు భావదారిద్య్రాలు వారిని వదలవు. వారిలో చాలామందికి హెడ్‌వర్క్స్‌కు, టెయిల్‌వర్క్స్‌కు తేడా తెలియదు. టీఎంసీలకు, క్యూసెక్కులకు వివరణ తెలియదు. కమీషన్లు బాగా సంపాదించిపెట్టే కాలువలు, వాటి కాంట్రాక్టుల గురించి తప్ప రిజర్వాయర్లు, రీచార్జింగు గురించి సున్నా జ్ఞానం అని ఒక కాంగ్రెస్ అభిమాన మేధావి ఆక్రోశం వ్యక్తంచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే మంచి అవకాశాన్ని మావాళ్లు చేజేతులా వదిలేశారని ఆయన వాపోయారు.
అసెంబ్లీలో ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను గెల్చుకున్నారు. గత రెండు రోజులుగా నలుగురు కూర్చున్న ప్రతిచోటా ఇదే చర్చ. అందరిలోనూ కేసీఆర్‌ను కొత్తగా చూసిన ఒక ఆశ్చర్యం,సంబరం. తెలంగాణ నీటిపారుదల సమస్యను కొత్తగా తెలుసుకున్నామన్న తృప్తి, ఆత్మవిశ్వాసం. తాగునీటి, సాగునీటి సమస్య నుంచి తెలంగాణను విముక్తి చేయలగలరన్న నమ్మకం ఇప్పుడు అందరిలోనూ కలిగించారు. కొత్త ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించిన ఈ యజ్ఞం అధికారులు, కాంట్రాక్టర్లతోపాటు మొత్తం యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతుంది. తలపెట్టిన లక్ష్యాలు సకాలంలో పూర్తికావడానికి తెలంగాణ సమాజానికి ఈ చైతన్యం ఉపయోగపడుతుంది.
[email protected]

2301

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా