సంపూర్ణ తెలంగాణం


Sun,February 7, 2016 01:35 AM

రాజధాని, రాష్ట్రం కలిసి ప్రయాణం సాగిస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్న టీఆర్‌ఎస్ వాదన అందరికీ నచ్చింది. నగరంలో పనులు జరగాలంటే, నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే పురపాలక మండలి అవసరమని అందరూ అనుకున్నారు. పైగా కేసీఆర్, కేటీఆర్‌లు కలలుగంటున్న విశ్వ నగరం-ట్రూలీ గ్లోబల్ సిటీ సాఫల్యం కావాలంటే వారికే నగరపాలన రథసారథ్యం ఇవ్వడం మంచిదని నగర ప్రజలు భావించారు. అందుకే నభూతో నభవిష్యతి అన్న చందంగా టీఆర్‌ఎస్‌కు మహావిజయం సాధించిపెట్టారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాం. తెలంగాణకే సొంతమైన సరికొత్త అభివృద్ధి నమూనాతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనిచేసుకుపోతున్నారు. తెలంగాణ గురించి, హైదరాబాద్ గురిం చి చాలా పెద్ద పెద్ద కలలు కంటున్నారు. అయినా హైదరాబాద్ మనతో లేదే అనే వెలి తి ఒకటి ఇంతకాలం వెంటాడుతుండేది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హైదరాబాద్ నగరంలో ఆశించిన స్థానాలు రాలేదు. తెలంగాణవాదంతో సంబంధం లేనివాళ్లో, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లో ఎక్కువ స్థానాలు గెలుపొందారు.

kattashekar


వారే రాజధాని హైదరాబాద్ తెలంగాణను ఆమోదించలేద ని, తెలంగాణతో లేదని వాదిస్తూ వచ్చారు. రాష్ట్రం ఏర్పడితే ఏదో ఉపద్రవం వస్తుందని తెలంగాణ వ్యతిరేక శక్తులు, సమైక్యవాద పార్టీలు చేసిన ప్రచారం హైదరాబాద్ ప్రజలను అప్పట్లో అయోమయానికి గురిచేసింది. శాంతిభద్రతలు క్షీణిస్తాయని, కరెంటు కొరతతో నగరం చీకట్లో మగ్గిపోతుందని, ఆంధ్రప్రాంతం వాళ్ల ఆస్తు లు గుంజుకుంటారని, పరిశ్రమలు తరలిపోతాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని... ఇలా ఎన్ని ప్రచారాలు చేశారో! ఆ ప్రచారానికి అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నాయకత్వాలు సారథ్యం వహించాయి. రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆ పార్టీలు ఏనాడూ సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రజలతో కలసి ఆనందం పంచుకోలేదు.

టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా వారు ఆ ప్రచారాన్నే నమ్ముకున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ వ్యతిరేకులు చేసే దుష్ప్రచారాలకు వారసులుగా ఉండిపోయారు తప్ప, తెలంగాణపక్షం, తెలంగాణవాదులపక్షం వహించి ఇక్కడి ప్రజలతో మమేకం కాలేకపోయారు. తెలంగాణ సాధించి, స్వయం పాలన సాధించి, స్వయంపాలన ఫలాలను ప్రజలకు పంచుతున్న తెలంగాణ ప్రభుత్వంపై శత్రుశిబిరంలో ఉండి విచక్షణారహితంగా విమర్శలు గుప్పిస్తూ పోయా రు. ఈ రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఈ శక్తులే వీ గుర్తించలేకపోయాయి. అందుకే సమైక్యవాదుల ఎజెండాతోనే ఇప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఎన్నికలను ఎదుర్కోవాలని ఆ పార్టీలు ప్రయత్నించాయి.

కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఈ రెండేళ్లలో మరింత పతనస్థాయిలో ప్రచారాలకు దిగారే తప్ప, తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఒక్కటీ చేయలేదు. ఎమ్మెల్సీ, మెదక్, వరంగల్ ఎన్నికల ఫలితాలను ఈ పార్టీలేవీ ఆకళింపు చేసుకోలేదు. గుణపాఠం నేర్చుకోలేదు. మాకు ఓటేయకపోతే మళ్లీ తెలంగాణను, ఆంధ్రను కలిపేస్తాం అని ఒక మాజీ ఎంపీ అంటే, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైతే టీడీపీతో కలుస్తాం అని మరో ప్రస్తుత ఎంపీ అంటాడు. హైదరాబాద్‌లో సెక్షన్ ఎనిమిది, అంటే గవర్నరు పాలన అమలు చేయాలని కోరడం కాంగ్రెస్ నాయకుల దివాలాకోరుతనానికి, బుద్ధి మాంద్యానికి పరాకాష్ఠ. జిల్లా కాం గ్రెస్ నాయకుల అందరి గదుమలు పట్టుకుని బతిమాలి, చచ్చీ చెడీ ఎమ్మెల్సీగా గెలిచిన నాయకుడొకరు హైదరాబాద్ రాగానే పీసీసీ నాయకుడు పనికిరాడు, రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని అంతా మమ్మల్నే కోరుతున్నారు.

కేసీఆర్‌ను ఎదుర్కోవడం మావల్లే సాధ్యమవుతుందని కార్యకర్తలు నమ్ముతున్నారు అని టీవీ తెరలముందు వాగుతాడు. వాచాలత్వానికి, అల్పరాజకీయాలకు పేటెంటు పొందినట్టుగా ప్రవర్తించారు. టీడీపీ ఇక ఎప్పటికీ తెలంగాణ పార్టీ కాదు. వాళ్ల భావాలు, భాష, నినాదాలు అన్నీ తెలంగాణకు పరాయివే. అది స్థానికతను, సంబద్ధతను రెంటినీ కోల్పోయింది. భవిష్యత్తు అంధకారం. మిగిలింది సహజ మరణమే. ఎంతకాలం అన్నదే ప్రశ్న. లాలూప్రసాద్, నితీష్‌కుమార్‌లను జార్ఖండ్ ప్రజలు తిరస్కరించినట్టు ఇక్కడ టీడీపీకి ఈ తిరస్కారాలు తప్పవు. వాళ్లు ఎన్ని అవతారాలెత్తినా తెలంగాణవాదుల ఆమోదం పొందడం కష్టం. ఎందుకంటే వారెవరికీ తెలంగాణ ఆత్మపట్టలేదు. వారెవ రూ తెలంగాణ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేయడం లేదు.
ప్రతిపక్షాలు తిట్ల దండకంతో ప్రచారం చేస్తే, అధికారపక్షం చేసింది, చేయాల్సింది చెబుతూ ప్రచారం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిపక్షాలకు భిన్నంగా తాము గత రెండేళ్లలో ఏమి చేశామో, ఇక ముందు ఏమి చేయబోతున్నామో, తమ అభివృద్ధి దర్శనం ఏమిటో అడుగడుగునా చెప్పుకున్నాయీ. పనిచేసే ప్రభుత్వం అనిపించుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ కొద్ది కాలంలోనే అసాధారణ విజయాలు సాధించింది. మూడు దశాబ్దాల్లో ఏ ప్రభుత్వమూ చేయలేని పని ఈ ప్రభు త్వం తొలి ఆరుమాసాల్లో చేసింది. పట్టుబట్టి కరెంటు కోత లేకుండా చేసింది. నీటి కొరత తీర్చడానికి ప్రాజెక్టులను వేగిర పర్చడమే కాదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి సృజనాత్మకమైన పథకాలను అమలులో పెట్టింది.

నగరం చుట్టూ జలహారం నిర్మించేందుకు చర్యలు ప్రారంభించింది. 35 నుంచి 40 టీఎంసీలతో కొత్త రిజర్వాయర్లను నిర్మించడంతోపాటు నగరం చుట్టూ ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, శామీర్‌పేట చెరువు, అమీన్‌పూర్ చెరువు వంటే అనేక జలాశయాలను కృష్ణా, గోదావరి జలాలతో నింపేందుకు ఒక బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నది. జలసమృద్ధ నగరంగా తీర్చిదిద్దడానికి ఆలోచన జరుగుతున్నది. మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఈ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. ఈ ఆలోచనలన్నీ దీర్ఘకాలికమైనవి. పదికాలాలపాటు గుర్తుండిపోయేవి. అనేక తరాలకు పనికివచ్చే పనులు.

కేటీఆర్ కేసీఆర్ అడుగు జాడ. కేసీఆర్ ఆలోచనలు, మాటలు, చేతలు, వేగం అన్నింటినీ కేటీఆర్ అందిపుచ్చుకున్నారు. ఆచరణలోనూ, అవిశ్రాంతంగా దూసుకుపోవడంలోనూ తండ్రి బాణీయే. తండ్రి ఆలోచనలను ప్రజలకు చెప్పడంలోనూ, ఆచరణ ఫలాలను జనానికి చేర్చడంలోనూ ఆయన చాలా వేగంగా పని చేసుకుపోతున్నా రు. కేటీఆర్ ఉద్యమం నుంచే ఎదిగినా మాస్ లీడర్ కాదనే అభిప్రాయం ఇంతకాలం కొంత ఉండేది. కానీ ఆయన గత ఆరు మాసాల వ్యవధిలో సాగించిన జైత్రయాత్ర, సాధించిన విజయం ఆ అభిప్రాయాలు నిజం కాదని రుజువు చేశాయి. ఆయన ఇంత ఓపికగా ఇంతమందిని, ఇంత తక్కువ కాలంలో చేరగలుగుతారని, వారిని ప్రభావి తం చేయగలుగుతారని ఎవరూ ఊహించలేదు. కేటీఆర్ టాటా బిర్లాల సన్నిధిలో ఎం త ఆలవోకగా మాట్లాడగలరో సామాన్యుల వద్ద వారి భాషలో అంతే ఆలవోకగా మాట్లాడగలరు. ఎక్కడ, ఏ వేదికపై, ఏ మర్యాదలు అవసరమవుతాయో అక్కడ ఆ విధంగా వ్యవహరించగల దక్షత ఆయనకు అబ్బింది.

సూటూ బూటూ వేసుకుని అమెరికన్ ఇంగ్లీషు మాట్లాడగలరు. కాటను చొక్కా వేసుకుని సామాన్యులతో సహపంక్తి భోజనమూ చేయగలరు. గూగుల్ గురించి మాట్లాడగలరు, గల్లీ సమస్యల గురించి వివరించగలరు. ఈ లక్షణాలే ఆయనకు హైదరాబాద్‌లో అసాధారణ విజయం సాధించిపెట్టాయి. కేసీఆర్ విధానాలను, తెలంగాణవాదాన్ని అద్భుతంగా రాజధాని నగరం లో చెల్లుబాటు చేయగలిగారు. రాజధానిలో ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని డివిజన్ల లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించిన మరొక నాయకుడిని ఇంతవరకు చూడలేదు. కేసీఆర్ కూడా రాజధానిలో ఎప్పుడూ ఇంత విస్తృతంగా తిరిగిన దాఖలాలు లేవు. కేసీఆర్ వ్యూహం, మంత్రాంగం, మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీల కార్యదక్షత ఎన్ని ఉన్నప్పటికీ ఒక సానుకూల ప్రభంజనం సృష్టించడంలో కేసీఆర్ ప్రతినిధిగా కేటీఆర్ సాగించిన ప్రచార యుద్ధం ప్రధాన భూమిక పోషించింది. అందుకే అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు నగరం అంతటా టీఆర్‌ఎస్ అసాధారణ విజయాలను సాధించింది.

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం వారు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు వరమాల వేశారు. పాతబస్తీలో ఎంఐ ఎం సీట్లు తగ్గకపోయినా మొదటిసారిగా ఆ పార్టీని సవాలు చేసిన సందర్భం ఈ ఎన్నికల్లోనే కనిపించింది. నాలుగు డివిజన్లలో ఎంఐఎం కేవలం వెయ్యి లోపు ఓట్లతో టీఆర్‌ఎస్‌పై విజయం సాధించింది. మరో రెండు డివిజన్లలో రెండు వేల ఓట్ల తేడాతో బయటపడింది. ఈ ఒత్తిడి కారణంగానే ఎంఐఎం సహనం కోల్పోయి వ్యవహరించింది. ఎన్నికల రోజు చివరి తరుణంలో జరిగిన దాడులు, ఎన్నిస్థానాలు గెల్చినా ఎం ఐఎంను నగర ప్రజల దృష్టిలో దోషిగా నిలిపాయి.

ఇంత దారుణంగా ఓడిపోయారేమిటి అని ఒక మిత్రుడు ఒక టీడీపీ నాయకుడిని ప్రశ్నిస్తే, పిఠాపురం వాళ్లు మొదలుకుని పులివెందుల వాళ్ల దాకా అందరూ గులాబీ కండువాలు కప్పుకుని ఓట్లేశాక ఇంక మేమెక్కడ ఉంటామబ్బా అని ఆయన సమాధానమిచ్చాడు. నిజమే. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ఓటర్లలో కూడా గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రతిపక్షాలు ప్రచారం చేసిన భయాలేవీ వారికి కనిపించలేదు. వివక్షలేవీ వారికి ఎదురు కాలేదు. పైగా నగరంలో ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం డైనమిక్‌గా తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు అందరూ గమనిస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వం కూడా అందరినీ ఒక్కటిగా చూస్తున్నది. హైదరాబాద్‌లో హైదరాబాదీగా ఉండటం మంచిదన్న ధోరణి చాలా మందిలో కనిపించింది. హైదరాబాద్‌ను తెలంగాణకు ప్రతిపక్షంగా నిలబెట్టాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిన ప్రయత్నాలు చాలా మందికి రోత పుట్టించాయి. రాజధాని, రాష్ట్రం కలిసి ప్రయాణం సాగిస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్న టీఆర్‌ఎస్ వాదన అందరికీ నచ్చింది. నగరంలో పనులు జరగాలంటే, నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే పురపాలక మండలి అవసరమని అందరూ అనుకున్నా రు.

పైగా కేసీఆర్, కేటీఆర్‌లు కలలుగంటున్న విశ్వ నగరం-ట్రూలీ గ్లోబల్ సిటీ సాఫ ల్యం కావాలంటే వారికే నగరపాలన రథసారథ్యం ఇవ్వడం మంచిదని నగర ప్రజలు భావించారు. అందుకే నభూతో నభవిష్యతి అన్న చందంగా టీఆర్‌ఎస్‌కు మహావిజయం సాధించిపెట్టారు.గతంలో ఒక్కపార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు దాదాపు లేవు. ఎప్పుడూ కలగూర గంపలే. ఎప్పుడూ పంపకాలూ, తగవులే. అంత రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా కాంగ్రెస్ సాధించింది అధవా 56 స్థానాలు. ఎంఐఎంతో కలిసి కలహాల కాపు రం చేయవలసి వచ్చింది. 150 డివిజన్లు ఉన్న నగరంలో 76 స్థానాలు వస్తే సాధార ణ మెజారిటీతో మేయర్ పదవి కైవసం చేసుకోవచ్చు. ఆ మార్కు దాటుతుందా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ నాటి దృశ్యాలు, స్పందనలు టీఆర్‌ఎస్ విజయాన్ని పక్కా చేశాయి. గెలిచే స్థానాల సంఖ్య కూడా పెరిగింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ 85 దాకా వస్తాయని చెప్పాయి. అలా జరగాలని ఉన్నా, జరగదేమో, అందరూ అధికారంలో ఉన్నవారికి గాలికొడుతున్నారేమో అన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి.

99 స్థానాలు వస్తాయని మాత్రం ముఖ్యమంత్రి కూడా ఊహించి ఉండరు. హైదరాబాద్ ఓటరు నాడి దొరకడం అంతసులువు కాదు. కానీ పాజిటివ్ ప్రభంజనం అంతర్లీనంగా నగరాన్ని ముంచెత్తుతున్న విషయం లెక్కిం పు ప్రారంభం కాగానే అర్థం అయిపోయింది. మాధాపూర్ డివిజను అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా ఉన్నట్టు అంచనాలు వచ్చాయి. కానీ మొదట లెక్కింపు పూర్తి చేసుకుని విజయం ఖాయం చేసిన స్థానం అదే కావడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నగరంలో గులాబీ తుఫాను వస్తున్నట్టు సాయంత్రం నాలుగున్నర గంటలకే అర్థమయిపోయింది. ఎంత పెద్ద విజయం అంత బాధ్యతను తెస్తుంది.

ఎంత గొప్పగా విజయం చేకూర్చారో అంత గొప్పగా సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని కేసీఆర్ సంకల్పం ప్రకటించారు. ఇప్పుడు ప్రజలు ఆశించిన విజయాలు సాధించిపెట్టడం టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల బాధ్యత. చివరగా ఒక మాట. నమస్తే తెలంగాణలో కూడా సిబ్బంది అంతా సంబరాలు చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక పత్రిక ఇదంతా ఏమిటని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. ఎందుకంటే నేను రాజకీయాలకు అతీతం కాను. పైగా ఇప్పుడు తెలంగాణ సాధన సంపూర్ణం అయిందన్న ఆనందం ఉంది. ఆ ఆనందం నేనెందుకు దాచుకోవాలి? నేనెందుకు నటించాలి? అందుకే ఈ సెలబ్రేషన్ అన్నాడు మరో జర్నలిస్టు మిత్రుడు.

1467

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా