డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు


Sun,August 23, 2015 01:41 AM

తెలంగాణకోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణపక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్యశక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభు త్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి.

నాయకుల్లో డొల్లతనం ఉంటే అది రాష్ర్టానికి నష్టం. నాయకులను చూసే జనం కదులుతారు. నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే జ్ఞానవంతులై ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ర్టాన్ని సాధించి ప్రజామోదంతో పాలన పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు. మంచి వినవద్దు, మంచి తెలుసుకోవద్దు, మంచి మాట్లాడవద్దు అని భీష్మించుకునే నాయకులు ఇప్పుడే కాదు ఎప్పుడూ కొరగాకుండాపోతారు.

kattashekar


తెలంగాణ ధన రాజకీయాల కాలాన్ని జయించి జ్ఞాన రాజకీయాలకు పట్టంగట్టింది. తెలంగాణ సమాజం గురించి తెలిసినవాళ్లు, తెలంగాణ సమస్యల గురించి అవగాహన ఉన్నవాళ్లు, ఆ సమస్యలకు పరిష్కా రం తెలిసినవాళ్లు ఇవ్వాళ అత్యధికశాతం మంది ప్రజాప్రతినిధులుగా వచ్చారు. అయి నా తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, ఈ పద్నాలుగు మాసాల పాలన నుంచి కానీ ప్రతిపక్షాలు ఒక్క గుణపాఠం కూడా నేర్చుకోలేదు. అదే డొల్లతనం. అదే రాజకీయ పిపాస. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడం. కొందరు నాయకుల్లో ఇది ఉన్మాదస్థాయికి చేరుకుంది. వారి ఉన్మాదం ఎవరికి మేలుచేస్తుందో, చివరికి వారికయినా మేలు చేస్తుందో లేదో తెలియని దుస్థితికి వారు జారిపోతున్నారు. తన మన గుర్తించలేని రాజకీయ అంధత్వం, వంధ్యత్వం వారిని కమ్ముకున్నది. ఇంకొందరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు.

వారు ఎంత యాంత్రికంగా రాజకీయాలు నడుపుతున్నారో ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. రవీంద్రనాథ్ టాగూర్ వర్ధం తి అని ఎవరో చెప్పారట. పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్షం నాయకుడు...ఒక్కరేమిటి ముఖ్య నాయకులంతా హాజరై ఆఫీసులో టాగూర్ ఫొటో పెట్టి పూలమాలలు వేశారు. భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించారు. ఆ తర్వాత ఎవరో గుర్తించి టాగూర్ వర్ధంతి ఎప్పుడో ఆగస్టులోనే జరిగిపోయిందని చెప్పారట. అప్పుడు ఒకరిపై మరొకరు తప్పును నెట్టుకునే ప్రయత్నం చేశారట. ఇదొక్కటే కాదు. ఇప్పుడే కాదు. ఉత్సవాలయినా, సమస్యలయినా వారిది ఎప్పుడూ యాంత్రిక స్పంద నే. అర్థం చేసుకుని, ఫీలయ్యి చేసింది చేసేది ఒక్కటీ కనిపించదు. ఒక తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు నీటిపారుదల మంత్రిగా పోతిరెడ్డిపాడుకు జెండా ఊపి వస్తాడు. అదే నాయకుడు తెలంగాణకు ఎందుకూ పనికిరాని దుమ్ముగూడెం-టెయిల్‌పాండు ప్రాజెక్టుకు డూడూ బసవన్న లాగా తలూపివస్తాడు. మరో నాయకురాలు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వచ్చిన మహానాయకులకు నివాళి పడుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నీటిపారుదల ప్రాజెక్టులంటే కాంట్రాక్టులు, ప్యాకేజీల భాష తప్ప ఎంత నీరు తేవాలి? ఎన్ని ఎకరాలు పారించాలి? ఎంత తొందరగా పూర్తి చేయాలి? అన్న ధ్యాస లేకుండాపోయింది. మహామహా నాయకులమని రొమ్ము విరుచుకునే నాయకులు ఒక్కరు కూడా తెలంగాణపైన, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంపైన దాడులు చేస్తుంటే రాజశేఖర్‌రెడ్డిని లేదా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించిన పాపాన పోలేదు. ఆంధ్ర నాయకత్వం సచివాలయం అడ్డాగా అనేక కుట్రలు చేస్తున్నా వారు మాట్లాడలేదు. వందలాదిమంది పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తున్నా వారు స్పందించలేదు. వారం తా ఇలా చేయడానికి వారి రాజకీయ అవకాశవాదం ఒక కారణం అయితే భావజాలానికి సంబంధించిన డొల్లతనం మరో కారణం. వారు ఈ ప్రాంతానికి జరుగబోయే నష్టాలను గుర్తించలేదు. చివరికి తమకు జరుగబోయే నష్టాన్ని కూడా వారు గుర్తించలేకపోయారు.

అందుకే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎత్తిన జెండా దించకుండా పోరాడిన కేసీఆర్‌కు ప్రజలు వరమాల వేశారు.తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు మాసాల్లోనే మన ప్రభుత్వానికి, మంది ప్రభుత్వానికి తేడా ఏమిటో చూపించగలిగింది. నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతాలు జరుగవు. కానీ కేసీఆర్ కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. కరెంటు కోత అనేమాట వినిపించకుండా చేశారు. ఎంత కష్టమైనా నష్టమైనా ఇచ్చే విద్యుత్ నాణ్యం గా, ఒక పద్ధతి ప్రకారం సరఫరా అయ్యేట్టు చూడాలని టెక్నోక్రాట్స్ అయిన మన విద్యుత్ అధికారులకు చెప్పారు. తెలంగాణ వచ్చినంతనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. కేవలం నాయకుడి చిత్తశుద్ధి, మన అధికారుల అంకితభావం కారణంగానే ఇది సాధ్యమైంది. విద్యుత్ సర్‌ప్లస్ రాష్ట్రమని చెప్పుకుంటున్న ఆంధ్రాలో ఇప్పటికీ విద్యుత్ కోత లు ఉన్నట్టు అనంతపురం, విశాఖపట్నం జిల్లాల మిత్రులు ఇటీవల కలిసినప్పుడు చెప్పారు.

కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. మన రాష్ట్రం మనదైంది కాబట్టి మన కష్టం మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము. ఇంతమాత్రానే తెలంగాణ కష్టాలన్నీ తొలగిపోయాయని చెప్పడం లేదు. సంక్షేమ పింఛన్లపై సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఖర్చు చేసిన దానికంటే నాలుగు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిపోయిన ఫీజు ల బకాయిలనూ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించింది. అడిగిన వారికి అడగని వారికి అందరికీ అన్నీ ఇస్తున్నారు. చెప్పినవి, చెప్పనివీ అన్నీ ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్న మాట వాస్తవమే. అయినా అరవయ్యేళ్లుగా జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి సమయం పడుతుంది.

ఆలోచనలు, ప్రణాళికలు, ప్రాజెక్టులు పట్టాలపైకి రావడానికి సమయం పడుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులపై రీడిజైనింగ్ అంటే అదేదో అర్థం కానట్టు కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పోలవరం వద్ద చేసింది రీడిజైనింగ్‌లో భాగమే. తక్షణం నీటిని తీసుకోవడానికి వీలుగా ఆయన పట్టిసీమ పథకాన్ని చేపట్టా రు. పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించి ఆయన ఆ నిర్ణయం చేసి ఉంటారు. రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం కూడా రీడిజైనింగులో భాగమే. తక్కువ వ్యవధిలో ఎక్కువ నీటిని తీసుకోవడం కోసం 11000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు కాలువను వెడల్పు, లోతుతో 55000 క్యూసెక్కులకు పెంచారు. అంతకు ముందు పెన్నా నదిపై నిర్మించుకున్న రిజర్వాయర్లన్నింటినీ శ్రీశైలం జలాలతో నింపుకునే విధంగా ప్రాజెక్టులు, పనులు పూర్తి చేశారు. వీటన్నింటికీ దగ్గరుండి దరువేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆచరణయోగ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల రీడిజైనింగుకు పూనుకుంటున్నారు. అందుకు పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీర్ల సహకారం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రాణహిత- చేవెళ్ల కాంట్రాక్టర్ల కోసం, రాజశేఖర్‌రెడ్డి ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రజలను మోసం చేయడంకోసం రూపొందించిన ప్రాజెక్టు. ప్రాణహిత నుంచి చేవెళ్ల దాకా నీరు రావడానికి ముందు మధ్యలో చాలా మతలబు ఉంది. శ్రీరాంసాగర్‌లో నీటిలభ్యత దెబ్బతిని చాలా కాలమైంది. శ్రీరాంసాగర్ మొద టి దశ కాలువలకే నీరు సరిగా అందని పరిస్థితి. వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతం నుంచి సూర్యాపేట దాకా, అటు మహబూబాబాద్ దాకా రెండో దశ కాలువలు తవ్వి కూడా పదేళ్లు దాటింది.

కానీ ఆ కాలువల్లో ఒకటి రెండు సార్లకు మినహా నీరు రాలే దు. గోదావరి నదిలో శ్రీరాంసాగర్ ఎగువ నుంచి సమృద్ధిగా జలాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 64 ప్రాజెక్టులు కానీ, బరాజ్‌లు కానీ నిర్మించి నీటిని నిలుపుకుంటున్నది. అంటే గోదావరిలో మనకు నీరు లభించేది ప్రాణహిత కలిసే చోటు నుంచి కిందికే. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన ఎంత చెండాలంగా జరిగిందంటే శ్రీరాంసాగర్ కాలువ, వరద కాలువలను దాటుకుని చేవెళ్లకు తీసుకువస్తామని చెప్పేంత. శ్రీరాంసాగర్‌కు ముందే ఆయకట్టును నిర్ధారించారు. వరద కాలువ కింద కూడా ఆయకట్టును నిర్ణయించి, కాలువలు తవ్వా రు. కొన్ని చోట్ల రిజర్వాయర్లు నిర్మించారు. కానీ ఈ ఆయకట్టుకు, ఈ రిజర్వాయర్లకే నీరు అందించే ప్రయత్నాలు జరుగలేదు. ఈ రెండు కాలువలను పారించకుండా, ఆ కాలువల మీదుగా చేవెళ్ల దాకా నీరు తెస్తారని కాంగ్రెస్ నాయకులు ఎలా భావించారో అర్థం కాదు.

ఇదంతా తెలంగాణ సమస్యతో రాజశేఖర్‌రెడ్డి ఆడిన మాయాజూదంలో భాగంగా జరిగింది. ఇప్పటికీ ఆ మాయా జూదాన్ని అర్థం చేసుకోలేక కాంగ్రెస్ నాయకత్వం ఏదేదో మాట్లాడుతున్నది. చేవెళ్లకు నీరు తీసుకురావాలి. మూసీ, ఈసీ నదుల ను పునరుజ్జీవింప జేయాలి. కృష్ణా నదీ జలాలను ఇదే నదీ పరివాహక ప్రాంతాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులకోసం కొట్లాడినా, మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులపై రాజకీయ కయ్యా లు రాజేయాలని చూడడమే వైపరీత్యం.

మరో విపరీతవాదం ఏమంటే... ఇన్నేండ్ల కష్టాలన్నీ ఒక్కేడుతో తీరిపోలేదే అని లాజిక్కులు తీయడం. తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని అడ్డగోలుగా మాట్లాడడం. కొందరు నాయకులయితే బచావో ఉద్యమాలే మొదలుపెట్టారు. తెలంగాణకోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణపక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్యశక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభు త్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి. ప్రభు త్వ నిర్ణయాలపై విచక్షణతో కూడిన విమర్శలు చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే వేళాపాళా లేకుండా టాగూర్ వర్ధంతి సభ నిర్వహించినట్టే ఉంటుంది.

2258

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా