పుష్కరాలు ఆత్మగౌరవ సంబురాలు


Sun,July 26, 2015 02:41 AM

చంద్రబాబునాయుడు కానీ, ఆయన పల్లకీ మోసే సమైక్య వాదులు కానీ తమకు గత్యంతరం లేక హైదరాబాద్‌కు
వచ్చామని, హైదరాబాద్‌తోపాటు తామూ పెరిగామని ముందుగా గుర్తించాలి. హైదరాబాద్‌ను, తెలంగాణ ప్రజలను ఏదో ఉద్ధరించడానికి, బాగుచేయడానికి, జ్ఞానం నేర్పడానికి ఇక్కడికి వచ్చినట్టు డాబులు కొట్టడం మానుకోవాలి.

అప్పుడెప్పుడో మనం కోల్పోయింది తిరిగి మనకు దొరికినప్పుడు కనిపించే ఉత్సవం, ఉత్సాహం ఎంత గొప్పగా ఉంటుంది? ఇంతకాలం మనదో కాదో తెలుసుకోలేకపోయినది మనదే అని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందోత్సాహాలు ఎలా ఉంటాయి? మనల్ని మనం తిరిగి కనుగొన్నప్పుడు కలిగే భావన ఎంత ఉద్వేగ భరితంగా ఉంటుంది? తెలంగాణ ప్రజలకు గోదావరి పుష్కరాలు అటువంటి సంబరాన్నే కలిగించాయి. ఎన్ని కోట్ల మంది పుష్కర స్నానం చేశారన్న లెక్కలతో పనిలేదు. తెలంగాణలో ఇంతమంది పుష్కర స్నానం చేయడం మాత్రం ఇదే ప్రథమం. తెలంగాణ ప్రజలు గోదావరిని రీడిస్కవర్ చేశారు.

kattashekar


గోదావరి స్నానాలు అస్తిత్వ చేతనకు ప్రతీకగా మారాయి. నమ్మకమా, మూఢనమ్మకమా అన్న చర్చ కూడా అసంగతం, అప్రస్తుతం. వరంగల్ జిల్లాకు ఈ పక్కన ఉంటాం. కానీ ఎప్పుడూ గోదావరి మన నది అని, అక్కడ దాకా వెళ్లొచ్చని, చూడొచ్చని, మునగొచ్చని అనిపించలేదు. మొదటిసారి గోదావరిలో అడుగుపెడుతున్నప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. గోదావరిలో స్నానం చేశానన్న భావనే గొప్పగా అనిపించింది అని జనగామ ప్రాంత అధ్యాపకుడొకరు వ్యాఖ్యానించారు.

ఇది చాలా మంది భావన కావచ్చు. అవును. గోదావరిని ఎందుకు మరచిపోయాం? ఎక్కడ కోల్పోయాం? ఇది ఎలా జరిగింది? ఏదైనా అనుభవంలో ఉన్నది, చూసినది, ప్రయోజనం పొందినది, మాట్లాడుకున్నది, పాడుకున్నది మనిషికి కలకాలం గుర్తుంటుంది. గోదావరి ఇప్పటికీ మనకు పూర్తిస్థాయిలో అనుభవంలోకి రాలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తప్ప అక్కడి నుంచి రాజమండ్రి దాకా మరో ప్రాజెక్టు నిర్మించలేదు. మొన్నమొన్న ఎల్లంపల్లి నిర్మించారు కానీ అది కూడా ఇంకా అనుభవంలోకి రాలేదు. తెలంగాణలో గోదావరిలో నీళ్లు లభించే ప్రాంతాలన్నీ వదిలేసి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టారు.

బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిర్మించాలని తలపెట్టిన ఇచ్చంపల్లిని చల్లగా చాపకింద చుట్టి ఏమీ ఎరగనట్టు పోలవరం ప్రాజెక్టుకోసం ప్రణాళికలు తయారు చేశారు. ప్రధాన గోదావరి నదిపై పోలవరం దాకా ఏ ప్రాజెక్టు రాకుండా చూసే కుతంత్రంలో భాగంగానే గోదావరిని మనం మరిచిపోయేంతగా మరుగునపడేశారు. స్వరాష్ట్ర ఉద్యమం మొదలయిన తర్వాతనే తెలంగాణకు గోదావరిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఆగమేఘాలపై హెలికాప్టర్లో మేస్త్రీని తీసుకెళ్లి దేవాదుల వద్ద ఓ శిలాఫలకం వేసి వచ్చారు. గోదావరిని కనుక్కోవడం అలా మొదలయింది. అప్పటిదాకా గోదావరి అంటే రాజమండ్రి. గోదావరి అంటే గోదావరి జిల్లాలు.

వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా వికసించే రాజమహేంద్రీ అని విన్నామే కానీ వింధ్యాద్రి దక్షిణ ప్రాంతే విలసద్ గౌతమీ తటే మంత్రకూటం(మంథని) సహస్రాణాం లింగానాం స్థానముత్తమం(కాశీఖండం) అని చదువుకోలేదు. ఇక్కడ బాసర పుణ్యక్షేత్రం ఉంటుంది. మంజీరా, హరిద్ర, గోదావరి నదుల సంగమం ఉంటుంది. ప్రాణహిత గోదావరి ఒడిని చేరే సంగమ ప్రదేశంలో త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర క్షేత్రం ఉంటుంది. అహో కాళేశ్వరే చిత్రం న లింగో న నరాకృతిః, దర్శనాత్ ముక్తి నాథస్య పునర్జన్మ జన్మ నవిద్యతే అని కూడా ఇప్పటివరకు ఏ పాఠంలో చదువుకోలేదు. ధర్మపురి లక్ష్మీ నరసింహుడు గోదావరి తీరాన కొలువై ఉంటాడు. మల్లూరు కొండల మధ్య హేమాచల నరసింహుడూ ఉంటాడు.

భద్రాచల రాముడూ ఇక్కడే కొలువు దీరాడు. ఇదిగో భద్రాద్రీ, గౌతమి, అదిగో చూడండీ అని పలవరించలేదు. ఇక్కడ వేదాలు ఘోషించలేదు. ఇక్కడ మంత్రాలు వినిపించలేదు. వినిపించినా అవి తెలంగాణ ప్రజల చెవిని చేరలేదు. మన పాఠ్యపుస్తకాలు, మన చదువులు మనలను పరాయీకరించాయి. ఎంతగా పరాయీకరించాయంటే గోదావరి తెలంగాణలోనే ఉందా? గోదావరికి నీళ్లు రాజమండ్రి నుంచి వస్తాయా? అని అడిగేంత అమాయకులు ఇక్కడ ఉన్నారు.

సాంస్కృతిక ఆయుధాలు చేతబట్టినవాడే మన మెదళ్లపై రాజ్యం చేస్తూ ఉంటాడు. మొన్నొక ప్రధాన పత్రిక సంపాదకీయం రాసింది. ఒక్కమాటంటే ఒక్క మాట తెలంగాణ గోదావరి ప్రాశస్త్యాల ప్రస్తావన గానీ, అసలు తెలంగాణలో గోదావరి ఉందని గానీ గుర్తుపట్టకుండా రాశారు. భావజాల ఆధిపత్యం అంటే అదే. సమైక్య ప్రభుత్వాలన్నీ ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. తెలంగాణ ప్రజల మెదళ్లపై స్వారీ చేయించాయి. ఇప్పటికీ కొన్ని పార్టీల నాయకుల మెదళ్లను, కొంత మంది మేధావుల మెదళ్లను ఆ భావజాలమే డామినేట్ చేస్తున్నది. వాళ్లు ఇంకా తెలంగాణతనం పుణికి పుచ్చుకోలేదు. తెలంగాణకోణం నుంచి ఆలోచించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మార్పులు చేయదల్చింది.

ప్రాణహిత ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును రెంటినీ చేపట్టాలని తలపెట్టింది. కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అయితే ప్రాణహిత ప్రాజెక్టును ఆదిలాబాద్‌కు పరిమితం చేసి, నిత్యం నీరు లభించే ప్రధాన గోదావరి నదిపై కాళేశ్వరానికి దిగువన ఒక ప్రాజెక్టు నిర్మించి అక్కడి నుంచి నీటిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నది. విచిత్రంగా ఆదిలాబాద్‌కు అన్యాయం చేస్తున్నారని ఒకరు, ప్రాజెక్టును ఎట్లా మారుస్తారని మరొకరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. విషప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఒక్క ఎకరా ఆయకట్టు తగ్గించలేదు. పైగా పెంచడానికిగల అవకాశాలను ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు.

అయినా అడ్డం పడదల్చుకున్నారు కాబట్టి కరపత్రాలు వేస్తారు. రాస్తారు. కూస్తారు. ఇదే భావజాలం కలిగిన నాయకులు కంతానపల్లి వద్ద అసలు ప్రాజెక్టే నిర్మించవద్దని ఒక ఉద్యమమే మొదలు పెట్టారు. వీళ్లంతా తెలంగాణ మేలుకోరుతున్నారని ఎలా అనుకోవడం? పోలవరం వద్ద కనిపించని కరపత్రాలు, ఆంధ్రాలో వినిపించని ఉద్యమ నినాదాలు ఇక్కడే ఎందుకు వినిపిస్తున్నాయో, వీటి వెనుక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయో అర్థం చేసుకోవడం అంతకష్టమేమీ కాదు. ఆధిపత్య భావజాలం ఆడిస్తే ఆడే మనుషులు, కీ ఇస్తే ఎగిరే బొమ్మలు ఇంకా ఈ గడ్డపై ఉన్నాయి. అందుకే చంద్రబాబునాయుడు వంటి వారు ఇప్పటికీ తెలంగాణకు తాను ఏమేమి నేర్పాడో, హైదరాబాద్‌కు తాను ఏమేమి చేశాడో చెప్పుకోగలుగుతున్నాడు. ఇక్కడ రాజకీయాలు చేయగలుగుతున్నాడు. ఇక్కడ సమస్యలు సృష్టించగలుగుతున్నాడు.

చంద్రబాబు, ఆయన చేతి ప్రచారాయుధాలు ఏమి చేయగలవో చెప్పడానికి మరో ఉదాహరణ. నిన్న రాత్రి పడుకోబోయే ముందు ఏవైనా వార్తలు ఉన్నాయేమో చూద్దామని చానెళ్లు తిప్పుతున్నాను. అప్రకటిత చంద్రబాబు మౌత్ పీస్‌గా పేరున్న ఒక ప్రధాన చానెల్ మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు డీకొని పిల్లలు మరణించిన ఘటన జరిగి ఏడాదయిన సందర్భంగా ఒక విషాదభరితమైన కథనాన్ని ప్రసారం చేసింది. చనిపోయిన పిల్లల తలిదండ్రులు తమ పిల్లల సమాధులపై బడి బోరున విలపిస్తున్న దృశ్యాలను హృదయవిదారకంగా చూపించారు. సాధారణంగా అయితే అందులో తప్పు పట్టవలసిందేమీలేదు.

ఔరా ఈ చానెల్‌ది ఎంత గొప్ప మానవతా హృదయం అనుకుంటాం. కానీ ఈ ప్రచారాయుధాలు అన్ని సందర్భాల్లో అలా చేయవు. చంద్రబాబునాయుడు తన అలసత్వం, నిర్వాకం కారణంగా పుష్కరాల ప్రారంభం రోజునే 27 మందిని బలితీసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో గోదావరి స్నానాలు చేద్దామని వచ్చిన స్త్రీలు, వృద్ధులు, పిల్లలు తొక్కిసలాటలో పడిపోయి ఊపిరాడక, గుప్పెడు నీళ్లందక ప్రాణాలు వదిలారు. తెలంగాణలో ఏ చిన్న నేరం ఘోరం జరిగినా గోరంతలు కొండంతలు గోలకొండంతలు చేసే బాబు చేతి ఆయుధాలు ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నుంచి ఏమీ జరగనట్టే పుష్కరవార్తల కోలాహలంలో మునిగిపోయాయి. చంద్రబాబు నిద్రాహారాలు మాని పుష్కరాలకు ఎలా కాపలాకాస్తున్నారో వర్ణించడానికి పోటీపడ్డాయి.

చనిపోయినవారెవరు? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? అంత్యక్రియలు జరిగాయా? వారు ఏమనుకుంటున్నారు? ఎందుకిలా జరిగిందనుకుంటున్నారు? ఇవేవీ బాబు చేతి ఆయుధాలకు కనిపించలేదు. పుష్కర మరణాలకు ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా గుర్తు చేస్తారని కానీ, కథనాలు వండుతారనిగానీ నమ్మకం లేదు. ఆధిపత్యానికి అలవాటు పడిన శక్తులకు ఎప్పుడూ ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్‌లను వేటాడి, వెంటాడి, సాధించే ప్రయత్నం చేస్తుంటాయి. సమైక్య రాష్ట్రం ఉన్నంతకాలం వీరు ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది.

వీరి రాతలు రోతలు అన్నీ తెలంగాణ ప్రజలు భరిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఈ ఆయుధాల నిజస్వరూపాలను ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టింది. వీళ్లు ఏమి రాస్తారో, ఎందుకు రాస్తారో, ఎవరికోసం రాస్తారో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థం అవుతున్నది. ఏ చానెళ్లు ఏ వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నాయో ఇట్టే పసిగట్టగలుగుతున్నారు.

చంద్రబాబునాయుడు పైత్య ప్రకోపం ఇంకా తగ్గలేదు. తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు ఆయనను ఏకంగా ఆంధ్రా బాహుబలిని కూడా చేసేశారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించి తరిమేసినా ఆయన ఇంకా అహంకారపూరిత భాషణలు చేస్తూనే ఉన్నారు. తెలుగువారికి విడిపోయి మళ్లీ కలిసిన చరిత్ర ఉందంటాడు. మామూలు నగరమైన హైదరాబాద్‌ను తానే ఉద్ధరించినట్టు చెబుతాడు. రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతి ఒక్కరు రాజధానిలో ఉంటారు. రాజధాని ఉద్ధారణకోసం ఎంతో కొంత చేస్తారు. తమని తాము కూడా ఉద్ధరించుకుంటారు. చంద్రబాబు కూడా అదేపని చేశారు. హైదరాబాద్‌కు వచ్చిని రోజు ఆయనకు ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్నారు.

కేవలం 36000 రూపాయల వార్షిక వ్యావసాయిక ఆదాయం వస్తుందని 1988లో కోర్టుకు అఫిడవిటులో రాసిచ్చిన పెద్దమనిషి ఇప్పుడొక పెద్ద కంపెనీకి, వందల కోట్ల ఆస్తులకు యజమాని అయ్యారు. ఆయనతోపాటు నగరం పెరగదా? నగరంలో రోడ్లు సౌకర్యవంతంగా లేవు. విస్తరించారు. ైఫ్లెఓవర్లు కట్టించారు. నెక్లెస్ రోడ్డు కట్టించారు. అది సాధారణ పరిణామమే. ఆయన రాకముందే హైదరాబాద్‌కు ఎస్‌టీపీఐ వచ్చింది. మైత్రీవనం వచ్చింది. ఐటీ పరిశ్రమలు రావా? ఆయన రాకముందే హైదరాబాద్‌లో వందల పరిశ్రమలు వచ్చాయి. చంద్రబాబు రాకముందే బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, అల్విన్, ఏపీ స్కూటర్స్, రిపబ్లిక్ ఫోర్జ్... ఇంకా వందలాది కంపెనీలు లక్షలాది మంది కార్మికులతో వేల కోట్ల టర్నోవర్‌తో వర్ధిల్లుతూ ఉన్నాయి.

ఆయన రాకముందే యాభైకి పైగా జాతీయ పరిశోధనా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. వాళ్లంతా పొద్దుపోయేదాకా నిద్రపోతూ ఉంటే ఈయన వచ్చి మేల్కొలిపారని చెబితే జనం నవ్విపోరా? ఆయన పుట్టకముందు నుంచే ఇక్కడ గొప్ప నాగరికత వర్ధిల్లుతూ ఉంది. వంద జాతులు కలిసి జీవించిన చరిత్ర ఈ నగరానికి ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, డచ్చి, ఫ్రెంచి, జర్మనీ, గ్రీకు, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్, ఆర్మీనియా జాతీయులు 774 మంది ఇక్కడ నివసిస్తున్నారు అని 1931 సెన్సస్ నివేదిక వివరించింది. కాశ్మీరీల నుంచి బెంగాలీల వరకు, గుజరాతీల నుంచి బీహారీల వరకు అనేక భారతీయ జాతులు, ప్రపంచంలోని అన్ని మతాల వారు హైదరాబాద్ నగరంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు.

హైదరాబాద్ భారత దేశంలోనే నాలుగవ పెద్ద నగరం. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆరవ పెద్దనగరం. లండన్, సిడ్నీ, కలకత్తా, బొంబాయి, మద్రాసుల తర్వాత స్థానంలో ఉన్న నగరం. ప్రపంచంలోని పెద్ద నగరాల్లో 23వ స్థానం హైదరాబాద్‌దే అని 1931 సెన్సస్ నివేదిక ప్రచురించింది. హైదరాబాద్‌లో 1912లో నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. 1926లోనే 87 లక్షల రూపాయల బడ్జెటుతో డ్రైనేజీ ప్రాజెక్టును చేపట్టారు అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివేదిక పేర్కొంది. చంద్రబాబునాయుడు కానీ, ఆయన పల్లకీ మోసే సమైక్యవాదులు కానీ తమకు గత్యంతరం లేక హైదరాబాద్‌కు వచ్చామని, హైదరాబాద్‌తోపాటు తామూ పెరిగామని ముందుగా గుర్తించాలి.

హైదరాబాద్‌ను, తెలంగాణ ప్రజలను ఏదో ఉద్ధరించడానికి, బాగుచేయడానికి, జ్ఞానం నేర్పడానికి ఇక్కడికి వచ్చినట్టు డాబులు కొట్టడం మానుకోవాలి. చరిత్ర గురించి, సామాజిక పరిణామక్రమం, అభివృద్ధి డైనమిక్స్ గురించి అవగాహన ఉన్న నాయకుడెవరూ ఇలా పిచ్చి ప్రేలాపనలకు పాల్పడరు. చంద్రబాబుకు పట్టిన దయ్యం వదలడానికి సత్యాలు చాలవు. ఆధిపత్య భావాల ఆనవాళ్లు లేని తెలంగాణను నిర్మించుకోగలినప్పుడే అది సాధ్యమవుతుంది. గోదావరి పుష్కరాలు కూడా అందుకు ఒక సందర్భం.

సమైక్య రాష్ట్రంలో మనం ఏం కోల్పోయామా గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. తెలంగాణ ప్రభుత్వం మత విశ్వాసాలను పెంచి పోషిస్తున్నదని కొందరు మేధావులు వాపోతున్నారు. విశ్వాసమయినా, విశ్వాసరాహిత్యమయినా మౌఢ్యంగా మారనంతవరకు ప్రమాదం లేదు. దళితులు, బీసీలు పాల్గొంటున్నారా అని మరొక మేధావి ప్రశ్నిస్తున్నారు. దళితులు, బీసీలు పాల్గొనకపోతే గోదావరి తీరాలు అంతగా కిటకిటలాడేవి కాదు. అవును- ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను పెంచి పోషిస్తున్నది. లౌకిక ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం చేయాల్సిన పనే చేస్తున్నది. ఏదో ఒక మతాన్ని మోస్తే తప్పు.

అదికూడా సంక్షేమాన్ని, వ్యవసాయాన్ని, ఇతర అభివృద్ధి పనులన్నీ వదలి ఇదొక్కటే చేస్తున్నదంటే తప్పుబట్టాలి. మతాన్ని, ప్రజల అభిమతాన్ని ఒక్కటిగా చేసి ముందుకు నడిస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? గోదావరి పుష్కరాలు తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసే సంబరం. అందుకే తెలంగాణ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు ఇంతకంటే ఆమోదం ఏమి కావాలి?

2675

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా