తెలంగాణ తేజమే నిజం


Sun,January 18, 2015 01:33 AM

తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ కొందరు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనే దొరలు, భూస్వాములు ఉంటారని, ఇక్కడే అన్నిరకాల అణచివేతలు ఉంటాయని చారిత్రకంగా ఒక ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే మళ్లీ భూస్వాముల పాలన వస్తుందని ప్రచారం అప్పుడూ, ఇప్పుడూ కొనసాగుతున్నది. సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు సృష్టించిన మేధో భావజాలం ఇప్పటికీ ఇక్కడి మేధావులు, సామాజిక వేత్తల మెదళ్లను ఏలుతున్నది.

shekarreddy


తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు గుర్తున్నాయా? తొలు త రాజశేఖర్‌రెడ్డి, తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఉండవల్లి, లగడపాటి....వంటివారు తెలంగాణ గురించి ఏమన్నారో జ్ఞాపకం ఉందా? వీళ్లస లు ముందుగా తెలంగాణ ఉద్యమాన్నే గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమ నాయకులను గుర్తించలేదు. పైగా ఎగతాళి చేసి, ఆగం పట్టించాలని చూశారు. తెలంగాణకు అసలు నాయకులే లేరన్నారు. పరిపాలించుకోలేరన్నారు. విడిగా తెలంగాణ బతకలేదన్నారు. సంపన్న ఆంధ్ర జిల్లాలతో కలిసిఉంటేనే తెలంగాణకు బతుకుదెరువన్నారు. అక్కడి నిధులు తెచ్చి ఇక్కడ పెడుతున్నామన్నారు.

తెలంగాణకు తీరప్రాంతం లేదన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలుగుతేజాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.... ఇక తెలంగాణ ఇవ్వకతప్పదని తేలిపోయిన తర్వాత, కేంద్రం రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత, విడిపోతే మాకు నష్టం, కష్టం అని వాదించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లేకపోతే మాకు మనుగడ లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలన్నీ చేశారు. తెలంగాణ వచ్చినా ప్రశాంతంగా పనిచేసుకోలేని, పరిపాలించుకోలేని మెలికలెన్నో పెట్టి కూర్చున్నారు.

ఇప్పుడు అదే చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం ఆదుకోండని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సమస్త రాష్ర్టా న్ని పోషించామని చెప్పుకున్న నాయకులు ఇప్పుడు ఈ బేలతనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? రాష్ట్రంలోని అందరికీ జీతాలు తామే చెల్లించామని చెప్పుకున్న నాయకత్వం ఇప్పుడు ఇలా ఎందుకు వాపోతున్నది? ఆంధ్ర ప్రాంతం దన్నుతో తెలంగాణను ఉద్ధరించామని చెబుతున్నదంతా నిజం కాదన్నమాట. తెలుగు తేజం, ఆంధ్ర తేజం అని ఇంతకాలం వాళ్లు చెప్పినదంతా తెలంగాణ తేజమే. తెలంగాణ బలమే ఆంధ్రప్రదేశ్ బలంగా చెలామణి అయింది. తెలంగాణ సొమ్ములు, భూములు, వనరులతో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అధికార చక్రాలు తిప్పారని ఒక తెలంగాణ రచయిత, కవి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

అబద్ధాల సేద్యం కొసెల్లదు. అన్యాయపు వాదాలు నిలబడవు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పేర్చిన అబద్ధాల పేక మేడ కూలిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చంద్రబాబే దానిని కూల్చివేస్తుండడం ఇంకా ఆసక్తిని కలిగించే విషయం.

ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పడడం తెలంగాణకు వినోదం కాదు. అక్కడి ఉద్యోగులు, ప్రజలు సమస్యల్లో పడడం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షా కాదు. ఆంధ్ర నాయకత్వం వాస్తవిక దృష్టితో తెలంగాణ ఉద్యమాన్ని చూడలేకపోవడం, అబద్ధాలతో, ఆవేశకావేశాలతో ఉద్యమాన్ని తప్పుదోవపట్టించాలని చూడడం ఇవ్వా ల్టి పరిస్థితికి కారణం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజానీకాన్ని ఎగదోయాలని చూడడం ఇంకా విషాదం. సామరస్యంగా విభజన జిరిగి ఉంటే ఆంధ్ర ప్రాంతానికి కూడా మరింత న్యాయం జరిగి ఉండేది. సీమాంధ్ర నాయకులు తెలంగాణను ప్రతిఘటిస్తున్నామన్న రాజకీయ భ్రమలో పడిపోయి, తమ ప్రాంతానికి సాధించుకోవాల్సిన హక్కులు, నిధులు... అన్నింటినీ గాలికి వదిలేశా రు.

అవాస్తవిక నినాదాలతో వాస్తవిక సమస్యలను వదిలేశారు. ఆ పాపంలో సీమాంధ్ర నాయకులందరూ భాగస్వాములే. చంద్రబాబు ఇప్పటికయినా వాస్తవి క దృష్టికి రావడం మంచిదే. వరుస వాయి, సమయమూ సందర్భమూ తెలియని ఒక రాజకీయ అజ్ఞాన గుంపును వెంటేసుకుని, తెలంగాణలో ఇంకా ఏదో బావుకుందామని ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటువంటి చిల్లర పనులు మాని ఆంధ్ర ప్రాంత హక్కుల కోసం పోరాడితే తెలంగాణ ప్రజానీకం కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తుంది. పోలవరం కోసం ఆరు మండలాలను కలిపేయడమే బలవంతంగా జరిగింది. కొత్తగా బూర్గంపాడును కూడా కొట్టేయాలని చూడడం చంద్రబాబు దుర్భుద్ధికి నిదర్శనం. ఉమ్మడి సంస్థలు, ఉమ్మడి నిధులు, ఎంసెట్ వంటి అంశాలలో కూడా చంద్రబాబు ఇంకా తెలంగాణపై వంకర దృష్టితోనే స్వారీ చేయాలని చూస్తున్నారు.

ఇంకా విడ్డూరం ఏమంటే, విలువైన వస్తువులు, వాహనాలు, యంత్రాలు ఏవైనా కొనాల్సి వస్తే ఆంధ్రలో కొనండి. ఇక్కడ దొరకకపోతే చెన్నయ్, బెంగళూరులలో కొనండి. హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కొనవద్దని మా అగ్ర నాయకులు చెబుతున్నారు. ఈ ధోరణి మరీ రోతపుట్టిస్తున్నది అని తెలుగుదేశం సీనియర్ నాయకుడే ఒకాయన ఇటీవల వాపోయాడు. చంద్రబాబునాయుడు తన గీతను బాగు చేసుకోవడానికి బదులు ఎదుటివారి గీతను చెరిపేయాలని చూస్తున్నారు. ఇట్లా ఆలోచించిన వాళ్లెవరూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యను పెంచడానికి ఇవి ఏమాత్రం దోహదం చేయవు. ఇప్పుడు తెలంగాణతో కొట్లాడి ఆంధ్రలో బావుకునేది ఏమీ లేదు.

తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ కొంద రు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనే దొరలు, భూస్వాములు ఉంటారని, ఇక్కడే అన్నిరకాల అణచివేతలు ఉంటాయని చారిత్రకంగా ఒక ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే మళ్లీ భూస్వాముల పాలన వస్తుందని ప్రచారం అప్పుడూ, ఇప్పుడూ కొనసాగుతున్నది. సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు సృష్టించిన మేధో భావజాలం ఇప్పటికీ ఇక్కడి మేధావులు, సామాజిక వేత్తల మెదళ్లను ఏలుతున్నది. భూస్వాములు, అణచివేత, దుర్మార్గాలు ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనూ ఉన్నా యి. కానీ విశాలాంధ్రవాదులు ఉద్దేశపూర్వకంగా ఒక సత్యాన్ని మరుగున పడేశారు.

తెలంగాణను భూస్వాముల నుంచి, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి ముందుగా రంగంలోకి దూకిన నేతల సామాజిక నేపథ్యాలు ఒక్కసారి ఎవరయినా అధ్యయనం చేశారా? రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, రేణికుంట రాంరెడ్డి, గొట్టిముక్కల గోపాల్‌రెడ్డి, యానాల మల్లారెడ్డి, అల్గుబెల్లి వెంకటనర్సింహారెడ్డి, ఎలమరెడ్డి గోపాలరెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, బోయినపల్లి వెంకట్రామారావు, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, బద్దం ఎల్లారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, పశ్య ఇంద్రసేనారెడ్డి, కొండవీటి జగన్‌మోహన్‌రెడ్డి, గురునాథరెడ్డి, మంచికంటి రాంకిషన్‌రావు, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, గాండ్లూరి కిషన్‌రావు, కాంచనపల్లి వెంకటరామారావు, కాకి చంద్రారెడ్డి, దాయం రాజిరెడ్డి, వెదిరె రాజిరెడ్డి, పులిజాల రాఘవరంగారావు....ఇలా రాస్తూ పోతే ఈ జాబితాకు అంతులేదు.

తెలంగాణ సాయుధ పోరాటమే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అనేక మందిని మహాయోధులుగా మలిచింది. ఆ తర్వాత జరిగిన విప్లవోద్యమాలు కూడా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పైకొచ్చినవే. ఆ ఉద్యమాల్లో కూడా అత్యధికులు భూస్వామ్య, అగ్రకుల కుటుంబాల నుంచి వచ్చినవారే. భూస్వామ్యం నుంచి తొందరగా బయటపడింది, సామాజిక సామరస్యాన్ని సాధించింది తెలంగాణనే. దళితులు, పేదలపై సీమాంధ్రలో జరిగినన్ని దారుణాలు తెలంగాణలో జరగలేదని పౌరహక్కుల ఉద్యమాల నివేదికలే బట్టబయలు చేశాయి. తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరిస్తూ వచ్చాయి.

తెలంగాణ ఉద్యమం కూడా అటువంటి ప్రజాస్వామిక ఆకాంక్ష పర్యవసానమే. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు, హక్కులకు ప్రతీకగా కేసీఆర్ ముందు కు వచ్చారు. కేసీఆర్ ఏనాడూ భూస్వామ్య వర్గానికి ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమం రావడానికి ముందే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన కులానికి చెందిన వారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది. ప్రజల మనిషిగానే ఆయన రాజకీయ సోపానంలో ఎదిగా రు. సిద్దిపేటను ఒక నమూనాగా అభివృద్ధి చేశారు. ప్రజాకేంద్రక అభివృద్ధిని నమ్మి ఆచరించిన నాయకునిగా ఆయనకు పేరుంది. పేదల వాడల్లో తిరిగి, వారి అభివృద్ధికి ప్రణాళికలు వేయడం ఆయన మొదటి నుంచీ చేస్తున్నదే.

చలనశీలత ఆయన స్వభావంలోనే ఉంది. నిత్యనూతనంగా ఆలోచించడం, ఆలోచనలను ఆచరణలో పెట్టేదాకా విశ్రమించకపోవడం ఆయన తత్వమని ఆయనను దగ్గరగా చూస్తున్నవారందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, ప్రస్థానానికి ఆయనకు ఆ అనుభవమే పునాదిగా పనిచేసింది. అయినా తెలంగాణ ఉద్యమ నైతికతను దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమం భూస్వాముల ఉద్యమమని నిందించడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు ఆయనకు దొర బిరుదును ప్రసాదించాయి. ఆ పేరు తో నిందించడానికి తెలంగాణ లోపలా బయటా కొన్ని పెంపుడు చిలుకలను తయా రు చేశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ చిలుకలు ఇంకా ఆ పలుకులు మానలేదు. ఆ వంకర దృష్టి నుంచి విముక్తి కాలేదు. ఇటువంటి వారి నుంచి తెలంగాణ సమాజమే విముక్తి కావాలేమో.

2318

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన