మతాలు మనిషిని మించినవా?


Sun,January 11, 2015 02:15 AM

భారతీయ తత్వంలో ఉన్న గొప్పతనం మరే తత్వంలోనూ లేదు. సహిష్ణుత, వైవిధ్యం, సహజీవనం భారతీయ తత్వానికే సాధ్యమైంది-చాలాకాలం క్రితం ఒక ఆచార్యుడు చెప్పిన మాటలివి. మా తత్వశాస్త్ర తరగతి గదిలో ఆ ఆచార్యుడు అలా ఒక తత్వాన్ని అంతగా కీర్తించడం ఎందుకో రుచించలేదు. మీకు ఇలా అనిపించినట్టే, అమెరికాలోని మరో తత్వశాస్త్ర ఆచార్యునికి ప్రాగ్మాటిజం(ప్రయోజనవాదం) గొప్పగా అనిపించవచ్చు. అరబ్బు విశ్వవిద్యాలయంలోని ఆచార్యులకు ఇస్లామిక్ తత్వశాస్ర్తానికి మించింది లేదనిపించవచ్చు. చైనాలోని తత్వశాస్త్ర ఆచార్యునికి కన్ఫ్యూసియన్ తత్వం అపూర్వం అనిపించవచ్చు. టిబెట్ ఆచార్యునికి బౌద్ధాన్ని మించిన తత్వం లేదనిపించవచ్చు.

shekarreddyభారత దేశంలోనే ఇంకా నాగరిక ప్రపంచంలోనికి రాని గిరిజన ప్రజల్లో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అడవుల్లో నేటికి ఈ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన తెగల్లో ఏ తత్వాన్ని, ఏ దేవున్ని, ఏ శక్తిని ఎక్కువ ఇష్టపడతారో, కొలుస్తారో తెలియదు. పుట్టిన పరిస్థితులు, పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న సవాళ్లు ఏ మనిషికి ఏ తత్వాన్ని, ఏ మతాన్ని ఇస్తుందో తెలియదు. మనమే గొప్ప అనుకోవడం ఎలా సార్?. ఆయన వెంటనే వాస్తవంలోకి వచ్చి తత్వానికి మతం లేదు, స్థలంలేదు, కాలం లేదు. ప్రజలకు ఇష్టమయిందాన్ని బట్టి, అర్థమయిందాన్ని బట్టి అది మనుగడ సాగిస్తుంది. లేదా వెనుకబడిపోతుంది. నాకు ఇష్టమయింది కాబట్టి భారతీయ తత్వాన్ని ఎక్కువగా భావించాను. మన ఇష్టాయిష్టాలకు అతీతంగానే తత్వాలను చూడాలి అని ఆచార్యులు సమాధానపరిచారు. ఈ ప్రశ్నలు, చర్చలు ఎడతెగనివి. ఏ దేవుడు గొప్ప? ఏ మతం గొప్ప? అన్న ప్రశ్నలు ముందుకు తేవడమే అనర్థం.

భారత దేశంలోని వారంతా మూలంలో హిందువులేనని ఒక నాయకుడంటే, ప్రపంచంలోని వారంతా అల్లాహ్ బిడ్డలే అని ఒక నాయకుడన్నారు. క్రైస్తవులు కూడా తమ దేవుడిని దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు అని భావిస్తారు. మన దేవుళ్లను పూజించడం, ఆరాధించడం, కీర్తించడం మన జీవన విధానం నుంచి వచ్చింది. ఎవరినీ పూజించకుండా జీవించేవాళ్లు, ప్రకృతిని ఆరాధించి బతికేవాళ్లూ ఉన్నారు. ఉంటారు. అవి వారివారి సాంస్కృతిక జీవన విధానాలు.

మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు...బూడిద.

ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యం మొన్న ఉంది, నిన్న ఉంది, రేపూ ఉంటుంది. వేదాలు రాసిన ఈ గడ్డపైనే వేదాలను తిరస్కరించిన చార్వాకులూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సహజీవనం కొనసాగుతూనే ఉన్నది. ఎటొచ్చీ ఎవరు గొప్ప అన్న ప్రశ్నలు వేసుకుని, ఒక మతంతో మరో మతాన్ని, ఒక దేవునితో మరో దేవుడిని పోటీ పెట్టాలని చూసినప్పుడు మాత్రమే ఘర్షణ పుడుతుంది. ఇటువంటి ఘర్షణలన్నీ చరిత్రలో అధికారంకోసం, రాజకీయాలకోసం మొదలయి యుద్ధాలదాకా వెళ్లాయి. మనం నాగరికులం అనుకుంటున్నాం. ఎదిగామనుకుంటున్నాం. ఖగోళ మూలాలను ఛేదించే బాటలో పయనిస్తున్నాం. సృష్టికి ప్రతిసృష్టి చేయడం గురించి పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటి మధ్యయుగాల వాదాలతోనే యుద్ధాలకు దిగుదామా?

విచిత్రం ఏమంటే అన్ని మతాలూ దేవుడిని కీర్తించే విషయాలు ఒకే విధంగా ఉంటాయి. దేవుడు ఒక్కడే, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, దయామయుడు-అన్ని మతాలూ దాదాపూ ఇలాగే కీర్తిస్తాయి. కొన్ని మతాలు దేవుడిని నిరాకారునిగా భావిస్తాయి. నిర్గుణుడిగానూ భావిస్తాయి. మరికొన్ని మతాలు దేవుడిని విశ్వరూపుడు, తేజోరూపుడు, సద్గుణ సంపన్నునిగా భావిస్తాయి. మనిషి పుట్టుక నుంచి, దేశకాల పరిస్థితుల నుంచి, వారివారి అనుభవాల నుంచి, ఒక్కో కాలానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో దేవుడు అవతరించాడు. ఇప్పుడు ప్రపంచమంతటా వందలు, వేల దేవుళ్లు ఉన్నారు. ఎవరి దేవుడు వాళ్లకు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి నమ్మకం వారిదే. ప్రపంచమంతటా మనుషులు తమకు రక్షణగా దేవుడిని ఆశ్రయించారు. దేవుడు అదే మనుషులను చంపమంటాడా? చంపి సాధించేది భక్తి కాదు, ఆధిపత్యం, అధికారం.

మతం, విశ్వాసం మనిషి, మనసుకు సంబంధించినవి. వాటిని అనుభవించనీయండి. ఆసరా పొందనివ్వండి. ఆ మనుషులను రాక్షసులను చేసే దిశగా మతం, విశ్వాసం ఎదగకుండా చూడండి. త్యాగరాజ కీర్తనలు వింటే నేను ప్రపంచాన్ని మరచిపోతాను. అందులో ఎంత తాదాత్మ్యత? ఎంత తాత్వికత? ఎంత భక్తి? ప్రపంచమంతా తిరిగాను. ఇంకే సంగీతం విన్నా నాకు ఇలా అనిపించలేదు అని ఒకసారి మా తత్వశాస్త్ర ఆచార్యులు అన్నారు. నేను పుట్టుకతో త్యాగరాజు కీర్తనలు వినలేదు. గుమ్మడికాయ బుర్రతో తయారు చేసుకున్న తంబురపై ఊరంతా తిరుగుతూ మా మాబాయి పాడిన రామదాసు కీర్తనలే నాకు బాగా గుర్తు. ఏక్‌తారతో సన్నని గొంతు కలిపి ఆయన పాడుతుంటే ఎంతో మైమరచిపోయేవాళ్లం.

ఆదిలాబాద్ అడవుల్లో గుస్సాడి నృత్యానికి, వారి పాటలకు అక్కడి గిరిజనం ఊగిపోతుంది. రష్యాలో జాజ్, రాక్, యూరప్‌లో పాప్, అమెరికాలో రాక్, జాజ్, తూర్పు ఆసియాలో బుద్ధిస్టు సంగీతమంటే చెవులుకోసుకుంటారు. ఇంకా దేశంలో ఎక్కడెక్కడి ప్రజలను ఏయే సంగీతాలు ఎలా కదిలిస్తాయో తెలియదు. మన నరాల్లో ఇంకిపోయిన సంగీత తంత్రులు మనకు మన జీవితం నుంచి సంక్రమించినవి. అంటే మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి. ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.

పెషావర్, బెంగళూరు, పారిస్, వజీరిస్థాన్... ప్రపంచంలో ఎక్కడ తూటాలు పేలుతున్నాయన్నా, ఎక్కడ బాంబులు పేలుతున్నాయన్నా, ఎక్కడ టార్పెడోలు రాలుతున్నాయన్నా....మత ప్రేరిత యుద్ధోన్మాదాలే కారణం. ఈ మతం ఆ మతం అన్న భేదం అక్కర లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒకప్పుడు మతోన్మాద భూతాన్ని సృష్టించి భూమండలంపై వదిలాయి. మధ్యయుగాల్లో మట్టికలసి పోయిన మతోన్మాద భూతాన్ని తట్టి లేపి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉసిగొల్పారు. కమ్యూనిజం పీడ నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయడంకోసమని ఇస్లామిక్ ఉగ్రవాదులను చిన్నపిల్లల్లా సాకారు. తుపాకి గొట్టం నుంచి అధికారం ఎలా సాధించుకోవచ్చో వారికి రుచి చూపారు. మతం పేరుతో రాజ్యాలను ఎలా కొల్లగొట్టవచ్చో అఫ్ఘనిస్థాన్‌లో వారికి అనుభవంలోకి వచ్చింది. అదే సూత్రాన్ని ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నారు. ఆ ఉగ్రవాదమే సర్వవ్యాప్తమై ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పుడు అదే అమెరికా ఉగ్రవాదాన్ని అణచివేత పేరుతో ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా గిల్లి గిల్లి యుద్ధాలు చేస్తున్నది.

చివరికి ఇది మతయుద్ధంగా పరిణమిస్తుందా అన్న భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో నాగరికతల సంఘర్షణ(clash of civilizations) జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త హంటింగ్టన్ రెండున్నర దశాబ్దాల క్రితం చెప్పిన జోస్యం ఆచరణ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో ప్రపంచయుద్ధం అంటూ వస్తే, అది క్రైస్తవ, ఇస్లామిక్ ప్రపంచాల మధ్య యుద్ధంగా జరుగుతుందని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు కొంతకాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు...బూడిద.

2150

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు



        


Featured Articles