చెల్లనికాసుల చిల్లర పంచాయితీ


Sun,November 16, 2014 12:12 AM

ఇప్పుడు మనదంటూ ఒక ప్రత్యేక సభలో ఉన్నాం.బయటివాడు ఎవడో ఆడిస్తే ఆడే పరిస్థితి ఇప్పుడు కూడా మన సభకు ఉండకూడదు. మన శాసనసభ ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పాలి. చిల్లర పంచాయితీలతో మనలను బజారున పడేయాలని చూస్తున్నవాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. సభ సాఫీగా జరిగేందుకు అన్ని పక్షాలూ బాధ్యతగా వ్యవహరించాలి.

నీకు మంచిపేరు లేకపోతే అవతలివాడికి ఉన్న పేరును చెడగొట్టెయ్. నీవు చిన్న గీత అయితే, నీ గీతను పెంచుకోలేకపోతే పెద్ద గీతను చెరిపేసెయ్. ముఖం బాలేకపోతే అద్దం పగులగొట్టు. నీకు చేయడానికి ఏ పనీ లేకపోతే అవతలివాడి పనిని కూడా చెడగొట్టు. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు చాన్నాళ్లుగా అమలు చేస్తున్న వ్యూహం ఇది. చంద్రబాబు, వైఎస్సార్, తెలంగాణలోని వారి ఏజెంట్లు, ఆంధ్ర మీడియా... అందరిదీ అదే దారి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా అత్యంత నీచమైన దాడులకు కూడా వెనుకాడలేదు.

shekharreddy


తాగుడు, జూదం, వ్యభిచారం, ఆర్థిక నేరాలు, దందాలు, మోసాలు, ఏమాటకూ కట్టుబడని రాజకీయ అవినీతి వంటి సకల అవలక్షణాల పునాదులపై పుట్టిపెరిగిన సీమాంధ్ర నాయకత్వం తమ మచ్చలను కప్పి పుచ్చుకుని తెలంగాణ నాయకత్వంపై దాడులు చేయించింది. తెలంగాణలోని కొందరు కిరాయి కోటిగాళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణ నాయకత్వంపై విపరీతమైన విషప్రచారం చేయించింది. తెలంగాణ నాయకులు తాగుతారని, వారికి రాజకీయాలు చేతకాదని, పార్టీలను నడుపలేరని, టికెట్లు అమ్ముకుంటారని....ఇంకా నోటికి ఏమి వస్తే అవి మాట్లాడించారు. నిజానికి రాజకీయాలను లాభసాటి వ్యాపారంగా మార్చింది సీమాంధ్ర నాయకత్వమే. పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చింది వారే.

టిక్కెట్ల అమ్మకాలు కొనుగోళ్లు ప్రవేశపెట్టింది చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలే. హైదరాబాద్ చుట్టూ ఎస్టేట్‌లు, ఫామ్ హౌజ్‌లు, పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించుకుంది వారే. మొత్తం కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయా పార్టీలను కబ్జాపెట్టిందీ వారే. ఒక్కో కుటుంబం నుంచి అరడజను మంది, డజను మంది పార్టీల్లో, ప్రభుత్వాల్లో తిష్ట వేసిన చరిత్ర వారిది. తమ తమ కులాల వారికి ప్రభుత్వాల్లో, పార్టీల్లో పెద్ద పీట వేసి కుల పార్టీలుగా, కుల ప్రభుత్వాలుగా పేరుగడించిన చరిత్ర కూడా సీమాంధ్ర నాయకులదే. రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ప్రత్యర్థులను రాచి రంపానపెట్టిన నియంతృత్వ చరిత్ర కూడా వారికుంది.

నమ్మిన వారిని నట్టేట ముంచిన హీనమైన చరిత్ర కూడా వారిది. సీమాంధ్ర నాయకత్వం తమకు ఉన్న ఈ అవలక్షణాలన్నింటినీ తెలంగాణ నాయకత్వానికి అంటగడుతున్నది.. వారి చెంచా మీడియా కూడా చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ఎజెండాలను అమలు చేస్తూ వచ్చాయి. తెలంగాణ నాయకత్వానికి వారు ఏ రంగు వేయమంటే ఆ రంగు వేస్తూ వచ్చాయి.

విచిత్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతున్నది. తెలంగాణలో చంద్రబాబునాయుడు కోరుకుంటున్నదే జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు... వంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రోజూ పతాక శీర్షికల్లో కనిపిస్తున్నారు. అసెంబ్లీలో వారి గురించే మాట్లాడుతున్నారు. బయటా వారి గురించే మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిని, ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబునాయుడు ఎప్పుడూ అమలు చేసే వ్యూహమే ఇప్పుడు కూడా ఇక్కడ ఆచరణలో పెట్టారు. ఆయన వ్యూహాన్నే ఆయన చేలా మీడియా కూడా అనుకరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులపై మంచి చెడుల చర్చ జరుగకూడదు.

ఎంత నీచంగా, ఎంత అమర్యాదకరంగా మాట్లాడినా పర్వాలేదుకానీ చర్చను నీవైపు తిప్పుకో. అదే జరుగుతున్నది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా గమనించారో లేదో కానీ తెలుగుదేశం వ్యూహంలోనే పడిపోతున్నారు. నిజానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు చరిత్ర హీనులు. తెలంగాణ మొత్తం వీధిపోరాటాలు చేస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన చంద్రబాబుతో కలిసి చలిమంటలు కాచుకున్న బ్యాచ్. చంద్రబాబు ఉసిగొల్పినట్టల్లా తెలంగాణ ఉద్యమంపై అత్యంత నీచంగా దాడులు చేసిన నీతిబాహ్యులు. తెలంగాణ ప్రజల బాగోగుల కంటే చంద్రబాబు బాగోగుల గురించి, ఆయన ఇచ్చే ఎన్నికల పెట్టుబడుల గురించి మాత్రమే ఆలోచించిన అల్పబుద్ధులు. తెలంగాణ సమాజం ఆ పార్టీని తిరస్కరించింది. ఆ పార్టీకి తెలంగాణతో బంధం తెగిపోయింది. దానిని ఇక ఆంధ్రాపార్టీగానే తెలంగాణ చూస్తుంది.

గెలిచిన ఆ కొద్ది మంది బై డిఫాల్టు గెలిచినవాళ్లే. వాళ్లేమిటో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. వాళ్లకు మాట్లాడడానికి, చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. కేసీఆర్‌ను, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసి రోజూ పత్రికల్లో, చర్చలో ఉండాలన్నది వాళ్ల వ్యూహం. తెలంగాణ ప్రభుత్వానికి మనశ్శాంతి లేకుండా చేయాలన్నది వారి ఆంతర్యం. తెలంగాణలో రోజురోజుకు జారిపోతున్న తెలుగుదేశం శ్రేణులను కాపాడుకోవడానికి వీలైనంత అల్లరి చేయడమే సరైన మార్గమని చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన ఎంత ఖర్చు పెట్టడానికయినా వెనుకాడడం లేదు.

తెలంగాణతో సమానంగా ఆంధ్రలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే గత జనవరి నుంచి 60 మంది రైతులు, చేనేత కార్మికులు మరణించారు. అయినా అక్కడ రైతులను పట్టించుకున్నవారు లేరు. ఇక్కడ మాత్రం మరణించిన రైతు కుటుంబాలకు తలా 50 వేల చొప్పున ఇవ్వాలని నిధులు సమకూర్చారు. మంచిదే... తెలంగాణలో కొల్లగొట్టిన సొమ్ము తిరిగి తెలంగాణ రైతు కుటుంబాలకు ఏ రూపంలో వచ్చినా హర్షించాల్సిందే.

చంద్రబాబు దీనిని రాజకీయ పెట్టుబడిగా భావిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రైవేటు సంభాషణల్లో ఈ విషయమే అంగీకరిస్తున్నారు. ఏం చేస్తాం. ఏ పార్టీలోకి వెళ్లాలి? ఎలాగూ టీఆరెస్‌లోకి మమ్మల్ని తీసుకోవడం లేదు. ఇక్కడ ఉంటే చంద్రబాబు పెట్టుబడి అయినా పెడతారు. ఈ పార్టీని ఈ మాత్రం కూడా కాపాడుకోకపోతే మమ్మల్ని ఎవరు దేకుతారు? మేము గొడవ చేయకపోతే మా వెంట ఎవరూ మిగిలేటట్టు లేరు.

మాకు సరైన అవకాశం వచ్చేదాకా ఈ పార్టీని ఎంతోకొంత కాపాడుకోవాలిగదా అని ఇప్పుడు అల్లరికి నాయకత్వం
వహిస్తున్నవారిలో ఒకరు చెప్పుకున్న గోడు ఇది. అంతేకాదు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మాకు బలం ఉంది ఇక్కడే. దీనిని కాపాడుకోవాలి. హైదరాబాద్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలంటే మేము రోజూ లైమ్ లైట్‌లో ఉండాలి. అందుకే ఈ తాపత్రయం అంతా అని మరో నాయకుడు చెప్పారు. చంద్రబాబునాయుడికి, తెలుగుదేశం నాయకత్వానికి, వారికి మద్దతుగా ప్రచార యుద్ధం చేస్తున్న మీడియాకు తాము ఏంచేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో స్పష్టత ఉంది. తెలంగాణ నాయకత్వమే స్పష్టత తెచ్చుకోవలసి ఉంది. ఏ పాయింటూ లేనివాడే అడ్డగోలుగా మాట్లాడతాడు. ప్రజాసమస్యలపై మాట్లాడడానికి బదులు వ్యక్తిగత నిందలకు దిగుతాడు. రెచ్చగొడతాడు. తను ఎజెండాలోకి రావడానికి ఇదొక ఎత్తుగడ.

ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రజల దృష్టిలో టుమ్రీలు. తెలంగాణ నాయకత్వం, తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ మీడియా వాళ్ల వెంట పడాల్సిన పనిలేదు. ఎంపీ కవిత రెండు చోట్ల పేరు నమోదు చేయించుకున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణకు విలువలేదు. ఆ విషయంలో సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒక వేళ రెండు చోట్ల నమోదు చేయించుకున్నా కొంపలు మునిగేదేమీ లేదు. ఆమె ప్రభుత్వ ప్రయోజనాలేవీ పొందడం లేదు. పైగా ప్రతి కుటుంబ సర్వే రిపోర్టును ఆధార్‌కు లింకు చేస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఎక్కడయినా రెండుసార్లు నమోదయితే ఆటోమేటిక్‌గా ఒకటి చెల్లకుండా పోతుంది. కానీ గోరంతను కొండంత చేసి చూపడంలో చంద్రబాబువద్ద శిక్షణ పొందినవాళ్లు కదా. వాళ్లు అట్లాగే మాట్లాడతారు.
తెలంగాణ నాయకత్వమే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి తమ పనులు తాము చేసుకుపోవాలి.

మైనస్ టీడీపీ తెలంగాణ అసెంబ్లీ అర్థవంతంగా నడుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వామపక్షాలు ఈ సమావేశాలను సమస్యలపై చర్చించడానికి ఉపయోగించుకుంటున్నాయి. నిరసనలు, వాకౌట్లు, వాదోపవాదాలు సహజం. కాంగ్రెస్ సభా పక్ష నాయకులు జానారెడ్డి, డి.శ్రీనివాస్ పరిణతితో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పనితీరుపై విమర్శలే కాదు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. బీజేపీ కాస్త టీడీపీ దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నది.

కానీ అంతలోనే తమాయించుకుని ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నది. తెలుగుదేశం వాళ్లపై అనవసరమైన స్పందనలను పక్కనబెడితే ముఖ్యమంత్రి, మంత్రులు సభను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. వారి ప్రసంగాల్లో, సమాధానాల్లో పరిణతి, ప్రగాఢ ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి ప్రతి చర్చలోనూ భాగస్వామి కావడం, ఓపికగా సమాధానాలు చెప్పడం, కలుపుగోలుగా వ్యవహరించడం సభ గౌరవాన్ని పెంచుతున్నది. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి లోతైన అవగాహన, అభివృద్ధి గురించి ఒక దీర్ఘకాలిక దృక్పథం వారి ప్రసంగాల్లో తెలుస్తున్నది. ఎవరూ తడుముకోవడం, తడబడడం కనిపించలేదు. అయితే కొంతమంది మంత్రులు ఎక్కువసార్లు ఎదురుదాడికి దిగుతున్నారని, అది మంచిగా అనిపించడం లేదని సమావేశాలు గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా గత దశాబ్దకాలంగా తెలంగాణ సమస్యలపై శాసనసభలో చర్చలే జరుగలేదు. ఇప్పుడు మనదంటూ ఒక ప్రత్యేక సభలో ఉన్నాం. బయటివాడు ఎవడో ఆడిస్తే ఆడే పరిస్థితి ఇప్పుడు కూడా మన సభకు ఉండకూడదు. మన శాసనసభ ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పాలి. చిల్లర పంచాయితీలతో మనలను బజారున పడేయాలని చూస్తున్నవాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. సభ సాఫీగా జరిగేందుకు అన్ని పక్షాలూ బాధ్యతగా వ్యవహరించాలి.

1690

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా