బాబు ఎత్తులు జిత్తులకు చిక్కొద్దు


Sun,November 9, 2014 03:55 AM

చంద్రబాబునాయుడు ఎంత రైతు పక్షపాతో అందరికీ తెలుసు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎంత మంది రైతులు బలయ్యారో తెలుసు. తెలంగాణలో ఆకలి చావులు జరిగిందీ, గంజికేంద్రాలు ఏర్పాటు చేసిందీ ఆయన పాలనలోనే. విద్యుత్ చార్జీలు పెంచొద్దన్నందుకు అసెంబ్లీకి ఫర్లాంగుదూరంలో ముగ్గురు ఉద్యకారులను కాల్చి చంపింది కూడా ఆయన ప్రభుత్వమే.

discription

చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, కంటిలోన నలుసు, కాలిలోన ముల్లు... ఏ పనీ చేసుకోనివ్వవు. మన శ్రద్ధను, శక్తిని, సమయాన్ని దారి మళ్లిస్తుంటాయి. వథా చేస్తాయి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు, ఆయన పత్రికలు, చానెళ్లు నిర్వహిస్తున్నది ఈ జోరీగ పాత్రనే. తెలంగాణ తొలి బడ్జెటు సమావేశాలు సంబరంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాధించిన విజయాలు అనేకం ఈ సందర్భంగా ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఒకప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన చోటే, ఇవ్వాళ తెలంగాణ గురించి తప్ప మరొకటి మాట్లాడాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ నేతలను పట్టుకుని, వాడు, వీడూ అని సంబోధించడమే కాకుండా తలెక్కడ పెట్టుకుంటావని నిందించి దురహంకారాన్ని ప్రదర్శించిన చోట, ఇప్పుడు ఆ ఉద్యమ నేతలే సభానాయకులై వర్ధిల్లుతున్న సన్నివేశం సాక్షాత్కరించింది. తెలంగాణ ఉద్యమాన్ని వెన్నువిరవడానికి టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అనేక అవమానాల పాలుజేసిన ఈ సభలోనే ఇప్పుడు టీఆరెస్ రాజ్యాధికారాన్ని దక్కించుకుంది.

సీమాంధ్ర అధికార మదాంధతకు ప్రతీకగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని కిరణ్‌కుమార్‌రెడ్డి హూంకరించిన చోటే ఇవ్వాల తెలంగాణ లక్ష కోట్ల బడ్జెటును ప్రతిపాదించి ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసింది. తెలంగాణ రాదు, రానివ్వము అని కొంతకాలం, తీరా వచ్చే వేళ తెలంగాణపై అనేక ఆంక్షలు పెట్టాలని కొంతకాలం తెలుగుదేశం కుట్రలు సాగించిన చోటే, ఇప్పుడు తెలంగాణ కొత్త తరం కొలువు తీరింది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెటును ప్రతిపాదిస్తున్న వేళ లక్షలాది మంది తెలంగాణ ప్రజల హదయాల్లో మెదిలిన జ్ఞాపకాలివి. అయితే చంద్రబాబునాయుడు తెలంగాణకు ఏ జ్ఞాపకాలూ మిగలనివ్వదల్చుకోలేదు. ఏ స్వేచ్ఛావాయువులూ ఆస్వాదించనీయదల్చుకోలేదు. ఏమాత్రం గాలి పీల్చుకోనివ్వ దల్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని పునర్నిర్మాణ పథం నుంచి దష్టిమళ్లించడానికి చేయగలిగినదంతా చేస్తున్నది. అందుకే జోరీగలను గుంపుగా చేసి తెలంగాణ ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నది.

నిజానికి వారికేదో తెలంగాణ ప్రజలపై మమకారం ఉండి కాదు. చంద్రబాబునాయుడు ఎంత రైతు పక్షపాతో అందరికీ తెలుసు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎంత మంది రైతులు బలయ్యారో తెలుసు. తెలంగాణలో ఆకలి చావులు జరిగిందీ, గంజికేంద్రాలు ఏర్పాటు చేసిందీ ఆయన పాలనలోనే. విద్యుత్ చార్జీలు పెంచొద్దన్నందుకు అసెంబ్లీకి ఫర్లాంగు దూరంలో ముగ్గురు ఉద్యమకారులను కాల్చి చంపింది కూడా ఆయన ప్రభుత్వమే. కాల్దరిలో రైతులను బలితీసుకున్నది కూడా చంద్రబాబే. టూరిజం తప్ప ఏ ఇజమూ లేదని చెప్పిందీ ఆయనే. ఎంతో దూరం ఎందు కు? సీమాంధ్రలో ఇప్పటికీ రుణమాఫీ జరుగలేదు. డ్వాక్రా మహిళలకు అన్ని రుణాలు మాఫీ చేస్తాం, చెల్లించకండి అని చెప్పి, ఇప్పుడు మనిషికి పదివేలు ఇస్తామని మాటమార్చిందీ ఆయనే. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఇంత యాగీ చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు సీమాంధ్రలో జరుగుతున్న ఆత్మహత్యలు కనిపించడం లేదు. ఒక్క అనంతపురంలోనే గత ఆరునెలల్లో 60 మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్రా లో ఒకరు, రాయలసీమలో మరొకరు పింఛను రాదని తెలిసి ఇద్దరు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి అక్కడి స్థానిక పత్రికల్లో ఎవరికీ కనిపించకుండా ప్రచురిస్తాయి. చంద్రబాబునాయుడు అక్కడ అంతా సుభిక్షంగా ఉన్నట్టు నటిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఆ పత్రికలు, ఆ నాయకులు తెలంగాణ లూటీపోతున్నట్టు, ఆత్మహత్యలతో తెలంగాణ ఖాళీ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తాయి. తెలంగాణలో ఆత్మహత్యలు తప్ప ఇంకేమీ జరుగడం లేదన్నట్టు ప్రచారం చేస్తారు. చిన్న గుంపు, పెద్ద నోరు పెట్టుకుని అరుస్తారు. ఏదో ఒకటి చేసి ఎప్పుడూ ప్రచారంలో ఉండడం, చెదరిపోతున్న తెలుగుదేశం శ్రేణులను కాపాడుకోవడం, తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చికాకుపర్చడం, వీలైనంత బద్నాం చేయడం చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికయినా చంద్రబాబు సిద్ధపడుతున్నాడు. తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం చేతకాదు అని ఇంటా బయటా ముద్రవేయడం వారి ఉమ్మడి వ్యూహంగా కనిపిస్తున్నది.
నిజానికి చెట్టంత మనిషి జోరీగల గోలకు తలొగ్గాల్సిన అవసరం లేదు.

తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం సష్టిస్తున్న అల్లరికి అవసరమైనదానికంటే ఎక్కువగా స్పందిస్తున్నది. తెలుగుదేశం తలకిందికి, కాళ్లు మీదికి పెట్టి తపస్సు చేసినా మరోసారి తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఆ పార్టీ ఎవరి పార్టీయో, ఏ ప్రాంత ప్రయోజనాలకోసం పుట్టిన పార్టీయో తెలంగాణ ప్రజలకు బాగా అర్థమయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మిగలదు. జార్ఖండులో లాలూ ప్రసాద్, నితీష్‌కుమార్‌ల పార్టీలకు పట్టిన గతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకీ పడుతుంది. ఇది చాలా సహజంగా జరిగే పరిణామం. అయితే ఈ సమస్యను ఓపికగా ఎదుర్కోవాలి. రైతుల ఆత్మహత్యలను తెలుగుదేశం ఒక పావుగా వాడుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యను దాటవేయడం వల్ల తెలుగుదేశానికి అటువంటి అవకాశం చిక్కుతున్నది.

ప్రభుత్వమే చొరవతీసుకుని ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే, తెలుగుదేశం పార్టీని ఎవరు పట్టించుకుంటారు? రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం కారణమని ఎవరూ అనుకోవడం లేదు. ఇందులో దాచుకోవాల్సిం ది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణకు వారసత్వంగా సంక్రమించిన సమస్య. సీమాంధ్ర ప్రభుత్వాలు యాభైయేళ్లపాటు తెలంగాణలో సాగునీరు, విద్యుత్ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల తలెత్తిన సంక్షోభం. ప్రభుత్వం మాట్లాడకపోతే, అవతలివాళ్లు మాట్లాడతారు. జూన్‌లో ప్రభుత్వంతో పాటే కరువు వచ్చింది. కాలం కాకపోవడం వల్ల నీటికొరత, విద్యుత్ కొరత అన్నీ మీదపడి వచ్చా యి. ఒక్క సంవత్సరం కాలంకాకపోయినా తట్టుకోలేని దారుణమైన పరిస్థితులు మన పల్లెల్లో ఉన్నాయి. అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

ఎంతమంది చనిపోయారన్న చర్చ కూడా అనవసరం. ఇది తెలుగుదేశం సమస్య కానే కాదు. వారికి ఇది ఒక అవకాశం మాత్రమే. కరెంటు సమస్యపై వారు మాట్లాడలేరు కాబట్టి, ఈ సమస్యను ముందేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు మన సమస్య. మన తెలంగాణ సమస్య. మనమే ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యం కోల్పోవద్దు. వ్యవసాయాన్ని పండుగ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కషిచేస్తున్నది. కరెంటు, సాగునీరు ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నది. ప్రైవేటు అప్పులు ఉన్నవాళ్లు కూడా మళ్లీ కాలం అయ్యేదాకా అప్పులు చెల్లించవద్దు.

ఎవరయినా అప్పులు అడిగితే స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయండి అని రైతాంగానికి భరోసా ఇవ్వాలి. మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు అన్నిస్థాయిల్లో రైతులకు ఆత్మైస్థెర్యం కలిగించే దిశగా నియోజకవర్గాల్లో ప్రచారం జరగాలి. సంక్షోభంలో అణగారుతున్న రైతులను ఆదుకోవడానికి రైతు సంక్షేమ నిధిని ఒక దానిని ఏర్పాటు చేయవచ్చు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. ఇన్ని సంక్షేమ, అభివద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి మరో నాలుగైదు కోట్లు కేటాయించడం కష్టం కాదు. ఎదుటివారికి నినాదాలు లేకుండా చేయడంపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఆ విషయం బాగా తెలుసు.

955

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన