చావదిదేమి చిత్రమో...!?


Sat,November 5, 2011 03:01 PM

ముంచితి వార్ధులందు, గదల మొత్తితి, శైల తటంబులందు
ద్రొబ్బించితి, శస్త్ర రాజి పొడిపించితి, మీద నిభేంవూదపంక్తి
రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దావాగ్నులందు
త్రోయించితి, పెక్కుపాట్ల నలయించితి, చావడిదేమి చిత్రమో....!?
mataku-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ప్రహ్లాదుని హరినామస్మరణను మరిపించడానికి హిరణ్య కశపుడు చేసిన ఘోరాలివి. ‘సమువూదాల్లో ముంచితిని. గదలతో కొట్టించితిని. పర్వతశిఖరాలపై నుంచి తటాకాల్లో తోయించితిని. శూలాలతో పొడిపించితిని. మత్తగజాలతో తొక్కించితిని. శపించితిని. దారుణ దావాగ్నికీలలందు పడవేయించితిని...అయినా చావడు...ఇదేమి చిత్రమో!’ అని వాపోతాడు హిరణ్యకశపుడు.

తెలంగాణ ఉద్యమం ప్రహ్లాదుడయితే....

చీల్చితి నేతల పెక్కుభంగులన్, కూల్చితి నిలువున కూటములన్,
అణచితి శ్రేణుల అతి నిర్దయగన్, మోదితి దేహముల్ చిట్లునట్టు,
కురిపించితి బాష్పగోళములు ధారగన్, నింపితి చెరలన్ సొంతనేతలన్,
రాల్చితి, చితిపేర్చితి పసిమొగ్గలనేకులనగ్నికీలలన్, మార్చితి,
ఏమార్చితి పలుతెరంగుల హస్తిన పెద్దలన్, చల్లితినసత్యముల
కుంభవృష్టిగన్, అయినను చావదిదేమి ఉద్యమమో!

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆ నినాదాన్ని మరిపించడానికి, ఓడించడానికి, అప్రదిష్ఠపాలు చేయడానికి, ఉద్యమ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడానికి ఆధునిక హిరణ్య కశపులు చేయని కుట్రలు లేవు. లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు, అరెస్టులు, జైళ్లు, ఢిల్లీ స్థాయిలో మ్యానిప్యులేషన్లు, లొంగిపోయే ఎమ్మెల్యేలకు టయోటా ఫార్చ్యూన్లు, సూట్‌కేసులు, రకరకాల తాయిలాలు.... ఇవేవీ ఉద్యమ నినాదాల తరంగ తీవ్రతను తగ్గించలేకపోయాయి. తెలంగాణ నామ స్మరణ నుంచి దృష్టి మళ్లించలేకపోయాయి. ‘ఇన్ని చేసినా ఈ ఉద్యమం చావదేమీ’ అని వారు బాధపడి పోతున్నారు.

అదే దృశ్యం...అదే గాయం
అరవల మూతినాకి, అహహాయని తోకలు త్రిప్పి, నేలపై
దొరలుచు, వీలుచూచుకొని దూరుచు చీకటి సందుగొందులన్
దిరిగెడు గ్రామసింహముల తీరున నాయకులుండ, తెల్గుసో
దరుల యదృష్టమందుగలదా అభివృద్ధియున్ రాష్ట్ర సిద్ధియున్!

1950లలో మద్రాసు నుంచి విడిపోవడానికి ఆంధ్ర రాష్ట్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో ఆంధ్ర నాయకులు తమలో తాము కలహించుకోవడం చూసి ‘కరుణశ్రీ’ బిరుదాంకితుడైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పద్యమిది. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు కొందరు అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ సంకలో చేరి, ఉద్యమాన్ని ఎగతాళి చేస్తూ వచ్చారు. పట్టాభి సీతారామయ్య వంటివారు ఢిల్లీ పెద్దలకు నొప్పి కలుగ కుండా వారి కనుసన్నల్లో కర్ర విరగకుండా, పాము చావకుండా నడుచుకుంటుండేవారు. కొందరు రాయలసీమ నాయకులు రాజాజీ చేతిలో కీలుబొమ్మలుగా మారి షరతులపై షరతులు పెడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అడ్డుపడుతూ వచ్చారు. అటువంటి తరుణంలో కవికి వచ్చిన ఆగ్రహం ఇది. కరుణశ్రీ ఆగ్రహం తెలంగాణ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది.

ఆంధ్రుల మూతినాకి, అహహాయని తోకలు త్రిప్పి, నేలపై
దొరలుచు, వీలుచూచుకొని దూరుచు చీకటి సందుగొందులన్
దిరిగెడు గ్రామసింహముల తీరున నాయకులుండ, తెలంగాణ సో
దరుల యదృష్టమందుగలదా అభివృద్ధియున్ రాష్ట్ర సిద్ధియున్!

నాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఎదురయిన పరిస్థితే ఇప్పుడు తెలంగా ణ రాష్ట్ర ఉద్యమానికి దాపురించింది. సీమాంధ్ర పెత్తందారుల కనుసైగలకు కొందరు, కానులకకు కొందరు, పదవులకు కొందరు దాసులై తెలంగాణ రాష్ట్ర సాధన యజ్ఞానికి అడ్డుపడుతున్నారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసం కొంద రు, ఒప్పుదల కోసం కొందరు నోళ్లు కట్టేసుకున్నారు. ఎన్ని ఉద్యమాలు, ఎన్నెన్ని రూపాలు, ఎన్ని గుండెఘోషలు....అయినా చలించని కాంగ్రెస్, టీడీపీ నేతలను ఏమనాలి? తెలంగాణ ప్రజలు ముందుగా విముక్తి కావలసింది సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీల నుంచి! సీమాంధ్ర నాయకత్వానికి దాస్యం చేస్తున్న తెలంగాణ నేతల నుంచి! సాధించుకోవలసింది సొంత రాజకీయ అస్తిత్వం!
scan049-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
లేస్తే మనుషులు కారు
నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా, కానీ
ఇప్పుడక్కడ పులులే కాదు, పిల్లులూ ఉన్నాయి
యోధులే కాదు, అవకాశవాద జయచంవూదులూ ఉన్నారు!
శవాలపై ప్రమాణాలు చేసి, మీసం మెలేసినవారు
ఇప్పుడు పిల్లుల్లా సీఎం పేషీ చుట్టూ తిరుగుతున్నారు
తెలంగాణ ఇవ్వకపోతే బ్రహ్మాండం బద్దలవుతుందని
గుంపును తోసుకుని, సందుచేసుకుని, ముందుకు వచ్చి
టీవీ మైకుల ముందు భీకర ప్రతిజ్ఞలు చేసినవారు
ఇప్పుడు వాటిని తప్పించుకుని తిరుగుతున్నారు!
పదవులు తృణవూపాయమని చెప్పినవారు
కన్నార్పకుండా
మంత్రిపీఠాలకోసం గోతికాడ
కాపలాకాస్తున్నారు!
ఒకరు మన్నుదిన్న పాము
కదలడు, మెదలడు, దేనికీ చెలించడు
మాట్లాడితే అర్థంకాడు!
ఇంకో నేతకు మెమొరీలాస్!
ఎప్పుడు లేస్తాడో,
ఎందుకు మాట్లాడతాడో
ఆయనకే తెలియదు!
లేస్తే మనిషిని కాదంటాడు, కానీ లేవలేడు!
మరో ఇద్దరు పోలిటికల్ జాకాల్స్!
ప్రయోజనం ఉంటే తప్ప ఏదీ చేయరు!
పదవికోసం ఏదయినా చేస్తారు!
ఎవరో చెప్పుకోండి చూద్దాం!

హతవిధీ!
తెలంగాణపై
రెండు రోజుల్లోనే మాట మార్చిన పెద్దమనిషి
తానైతే రెండు నిమిషాల్లో తేల్చేసేవాడినని చెబుతున్నాడు!
ప్రతిపక్షనాయకునిగా తెలంగాణను ఏమార్చినవాడు
అధికారమిస్తే ఉద్ధరిస్తానని ఊదరగొడుతున్నాడు!
ఒక్క పార్టీని ఒక్క బాటలో నడిపించలేనివాడు
తెలుగుజాతిని ఐక్యంగా నడిపిస్తానని నమ్మమంటున్నాడు!
ఉట్టికి ఎగరలేడు, కానీ స్వర్గానికి ఎగురుతాడట!
ఐదువేల చదరపు అడుగుల భవంతిలో నివసిస్తాడు
మూడు గదుల్లో ఉంటున్నానని ‘కమ్మ’ని అబద్ధం చెబుతాడు!
హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా మార్చి,
ప్రభుత్వరంగ కంపెనీలను అణాకూ పావలాకూ తెగనమ్మి,
భూముల అంపకాలకు తలుపులు బార్లా తెరిచి,
రైతులను ఉరితాళ్లకు, విషం డబ్బాలకు వదిలేసి,
అణచివేతను, ఆక్రమణను వ్యవస్థీకృతం చేసి,
విధ్వంసాన్ని, విద్రోహాన్ని చట్టబద్ధం చేసి,
ప్రపంచబ్యాంకుకు పాదాక్షికాంతుడై..
తొమ్మిదేళ్లు ఆకాశవిహారం చేసిన సీఈఓ
ఇప్పుడు పాదయావూతలకని బయలు దేరాడు
పంచతంవూతంలో వృద్ధ సింహం-బంగారు కడియం
గుర్తుకు రావడం లేదూ!
అపనమ్మకాన్ని చక్రవడ్డీతో
పోగుచేసుకున్న చరివూతపురుషుడు
ఇప్పుడు ఏం చెప్పినా, ఎంత
నటించినా ఎవరు నమ్ముతారు?
నాడు చరివూతను
చదవద్దని చెప్పినవాడు
నేడు చరిత్ర గురించి
అబద్ధాలు వల్లెవేస్తున్నాడు
scan050-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
అబద్ధం
తెలుగు ప్రజలు మూడు వేల సంవత్సరాలు కలసి వున్నారు!

అసలు నిజం
తెలుగుకు మూడు వేల సంవత్సరాల చరిత్ర లేదు
వెయ్యేళ్లనాటి నన్నయ్యే మన ఆదికవి అని ప్రకటించుకున్న జాతి మనది!
మూడు వేల సంవత్సరాల్లో ఈ ప్రాంత ప్రజ కలిసుంది 300 ఏళ్లే!
అప్పుడు కలిసుండడం, ఇప్పుడు కలిసుండడం లాంటిది కాదు!
అది కూడా ఒక రాజ్యం కింద వందల సంస్థానాలుగా,
సామంతరాజ్యాలుగా విడివిడిగా జీవించడమే!
ఒక అబద్ధం వందసార్లు చెప్పినా నిజం కానేరదు!

ముసుగులో స్వేచ్ఛ
మెజారిటీ, ప్రజాస్వామ్యం అనే భావనలు చెల్లవట
నీతి కళ్లతో, స్వేచ్ఛ మనసుతో చూడాలట!
అజ్ఞానతత్వం ఔపోసనపట్టిన మేధస్సుకు
మోకాలికి బోడిగుండుకు తేడా తెలియదు మరి!
తర్కానికి, కుతర్కానికి భేదం ఉండదు సరి!
ప్రజాస్వామికవాది కానివాడు
స్వేచ్ఛావాది కాలేడు! నీతిమంతుడూ కాలేడు!
నీతి అమూర్త భావన
దానిని నిర్ధారించేది మెజారిటీయే!
స్వేచ్ఛ సాపేక్ష భావన
దానిని కాపాడేది ప్రజాస్వామ్యమే!
ఇంత చిన్న విషయమూ తెలియని పెద్దమనిషి
అష్టవంకరలు తిప్పి పెద్ద పెద్ద సూత్రాలు చెబుతుంటాడు!
ఆయన సరిహద్దులు ఉండకూడదని చెబుతుంటాడు
ప్రాంతీయ ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తుంటాడు!
ఇజాలకు కాలం చెల్లిందని, వద్దనీ చెబుతుంటాడు
కార్పొరేటిజానికి పక్కా స్క్రిప్టు రాస్తుంటాడు!
పులులు చెలరేగుతున్నా ఫర్వాలేదు కానీ
ఏనుగులొస్తాయని భయపెడుతుంటాడు
ఆంధ్రా దొరయినా, తెలంగాణ దొరయినా దొర దొరే కదా
అని, మావోకన్నా మహా విప్లవకారుడిలా సూత్రీకరిస్తాడు!
తాను పోలీసు దొరనన్న సంగతి దాచిపెడుతుంటాడు!
హక్కుల గురించి మాట్లాడేవాళ్లు మూకలట!
లాఠీ పట్టి చెలరేగేవాడు స్వేచ్ఛావాదట!
స్వేచ్ఛ గురించి స్వేచ్ఛగా పేరు పెట్టుకుని రాయలేడు
మారుపేరుతో దుర్భేద్యమైన అజ్ఞానాన్ని
ప్రపంచానికి పంచుతుంటాడు!
అది స్వేచ్ఛవాదమని మనల్ని నమ్మమంటాడు
ఆయన ఎవరో కాదు-జాహ్నవి

చిత్రవధ
ఒక మిత్రుడు పంపిన ఈమెయిల్ సందేశం: ముఖ్యమంత్రి ఎన్ని రచ్చబండలకు వెళితే అంత మంచిది. ఆ సారు ఎన్ని ప్రసంగాలు చేస్తే అంత మే లు. బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకోసం సారే ప్రచారం చేయాలని నేను డిమాండు చేస్తున్నాను. మొన్న ఆయన ప్రసంగం విన్నాక నాకు జ్ఞానోదయం అయింది. ఎన్ని భాషలు? ఎన్ని మాండలికాలు? ఎటువంటి వాగ్దాటి? సొంత రాష్ట్రంకోసం పోరాడడానికి తెలంగాణ ప్రజలకు వేరే మేలుకొలుపు అవసరం లేదు. ఆయన ప్రసంగం పదినిమిషాలు వింటే చాలు. మన ఆలోచనలే మారిపోతాయి. ఒకసారి మీరూ విని చూడండి!

360

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా