అకాల యాత్రలు


Sun,October 12, 2014 01:53 AM

రాజకీయాల్లో సమయాసమయాలు, ఉచితానుచితాలు చూసి వ్యవహరించడం తప్పనిసరి. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్‌లు చేస్తున్న యాత్రలు, యాగీలు, విమర్శలు అకాల రాజకీయ దాడిలో భాగమే. తెలంగాణలో ఇవ్వాల ఉన్న పరిస్థితులకు కారకులుగా చెప్పాల్సివస్తే మొదట తెలుగుదేశాన్ని, తదుపరి కాంగ్రెస్‌ను చెప్పాలి. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలయ్యిందే తెలుగుదేశం పాలనలో. ఆ తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.

సీమాంధ్ర ఆధిపత్య ప్రభుత్వాలు వరుసగా రెండు దశాబ్దాలపాటు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభు త్వం విద్యుత్ సంస్కరణలు తెచ్చి ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లను అనుమతించింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్లాంటును కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు.

Kattashekarreddy

తెలంగాణలో అపారమైన బొగ్గు నిక్షేపాలుంటాయి. కానీ ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లన్నీ కోస్తాలో ఉంటాయి! ఇప్పుడు ఆ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చేది లేదు పొమ్మని చంద్రబాబు గురువారంనాటి పాత్రికేయుల సమావేశంలో కూడా ప్రకటించాడు. అంతేకాదు, తెలంగాణకు అవసరమైన ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా ఆయన పూర్తి చేయలేదు. జలసాధన ఉద్యమాలు, లోక్‌సభ ఎన్నికల్లో 485మంది నామినేషన్ల ఉద్యమాలతోపాటు నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తెగదెంపులదాకా కొట్లాడితే శ్రీశైలం ఎడమకాలువ ఒక్కటి ఉదయ సముద్రం దాకా వచ్చింది.

తెలంగాణ రైతులది కరెంటు మీద ఆధారపడిన వ్యవసాయం అని తెలుసు. కరెంటు మోటార్లు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని తెలుసు. పరిశ్రమల విద్యుత్ వినియోగం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉందని తెలుసు. అయినా కొత్త విద్యుత్ ప్లాంట్లన్నీ సీమాంధ్రకే ఎందుకు వెళ్లిపోయాయో ఈ రెండు దశాబ్దాలు తెలంగాణను పాలించిన చంద్రబాబునాయుడు, పొన్నాల లక్ష్మయ్య, ఒకనాటి విద్యుత్ మంత్రి షబ్బీర్ అలీ చెప్పాలి. తెలంగాణ విడిపోయే నాటికి తెలంగాణ విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం ఆంధ్ర కంటే అంత తక్కువగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి.

నేదునూరు, శంకర్‌పల్లి విద్యుత్ ప్లాంట్లు ఎందుకు పూర్తికాలేదో వారు చెప్పాలి. సీలేరు విద్యుత్‌ను కాజేసిందెవరో, కృష్ణపట్నం విద్యుత్‌ను ఇచ్చేది లేదని చెబుతున్నదెవరో తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రజలకు వివరించాలి. చంద్రబాబునాయుడు తెలంగాణకు న్యాయంగా రావలసిన విద్యుత్‌ను కూడా మళ్లించుకుని, ఆంధ్రాలో ఇరవైనాలుగు గంటలు విద్యుత్ ఇస్తామని చెబుతున్నాడు.

తెలంగాణ రైతుల పొలాలు కరెంటు కొరతతో ఎండిపోతున్నాయి. అందుకు విద్యుత్ లోటే కారణం. తెలంగాణ టీడీపీ నాయకులకు సోయి ఉంటే విద్యుత్‌కోసం చంద్రబాబు ఇంటిముందు ధర్నాచేయాలి.. పొలాల్లో ఏం పని అని టీఆరెస్ నాయకులు ప్రశ్నించడంలో న్యాయం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తొందరపడి కూయడంవల్ల రాజకీయ కాలక్షేపం జరగవచ్చు, కానీ సమస్య పరిష్కారం కాదు. ప్రతిపక్షాల ధోరణి రైతాంగంలో మరింత సంక్షోభాన్ని, గందరగోళాన్ని సృష్టించి, మరిన్ని ఆత్మహత్యలు ప్రోత్సహించే అవకాశం ఉంది. రైతుల ఆత్మహత్యలన్నీ దీర్ఘకాలిక వ్యవసాయ సంక్షోభం ఫలితం. అందుకు కారణాలను గుర్తించి పరిష్కరించడానికి ఏ ప్రభుత్వానికయినా కొంత సమయం పడుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు మాసాలు. అధికారుల విభజన, సిబ్బంది విభజన ఇంకా పూర్తికాలేదు. అధికారుల విభజనకు సంబంధించిన ఫైలు ప్రధాని ఆమోదానికి నోచుకోక పడిగాపులు పడుతున్నది. ఈ నాలుగు మాసాలలో టీఆరెస్ ప్రభుత్వం చేసిన తప్పులు లేవు. నాలుగు మాసాలలో విద్యుత్ ప్లాంట్లు తయారు కావు. నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తికావు. పైగా ఈ ఏడాది నైరుతి పవనాలు విఫలమయ్యాయి. వర్షాభావం మీదపడ్డది. శ్రీరాంసాగర్ నిండలేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు కూడా రెండు మాసాలు ఆలస్యంగా నిండాయి. ఇవన్నీ ఊహించని పరిణామాలు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నా, మరో ప్రభుత్వం ఉన్నా ఈ పరిస్థితులు మారేవి కాదు.

సహజంగానే వ్యవసాయం విఫలం కావడం చూస్తున్నాం. దీనిని అధిగమించడానికి నిర్మాణాత్మకమైన విధానం కావాలి. గందరగోళం సృష్టించి, గుబులు పుట్టించి, సంక్షోభాన్ని మరింత ప్రేరేపించే రాజకీయ గయ్యాళితనం వల్ల నష్టమే తప్ప మేలు జరుగదు. చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో తెలంగాణలో యాత్రలు చేయడం కుక్కతోకపట్టుకుని గోదావరి ఈదడం వంటిదే. ఎందుకంటే చంద్రబాబునాయుడు విభజన సందర్భంగా తెలంగాణలో ఫేసూ, స్పేసూ కోల్పోయారు. విభజనపై ఆయ న వేసిన పిల్లిమొగ్గలు, ఆయన చేసిన కుట్రలు ఆయనను తెలంగాణ ప్రజల్లో దోషిగా నిలబెట్టాయి.

సీమాంధ్ర ఆధిపత్యం తెలంగాణను వదిలిపెట్టే ముందు ఆ ఆధిపత్యానికి అతిపెద్దదిక్కుగా వ్యవహరించివారు చంద్రబాబు. సీమాంధ్ర ఆధిపత్య పార్టీగా టీడీపీకి వచ్చిన పేరు ఎన్ని సార్లు గంగలో మునిగినా పోదు. 2009 నుంచి తెలంగాణ అనుభవించిన క్షోభలకు కాంగ్రెస్‌తో సమానమైన పాపాన్ని పంచుకున్నవారు చంద్రబాబు. అందువల్ల ఆయన పక్కన నిలబడి మాట్లాడేవారిని తెలంగాణ ఎప్పటికీ తన మనుషులుగా చూడలేదు. అందుకే తెలంగాణలో ఆయన పార్టీ నానాటికీ తీసికట్టుగా తయారవుతూ వచ్చింది.

2009లో 20.8 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ, 2014లో 14.6 శాతం ఓట్లకే పరిమితమైంది. తెలంగాణపై చంద్రబాబునాయుడు క్లెయిము కొనసాగినంతకాలం తెలంగాణవాదానికి ఇబ్బంది లేదు. తెలంగాణ సెంటిమెంటుకూ ఇబ్బంది లేదు. టీఆరెస్‌పై ఒకవేళ ఏకారణంగానైనా కోపం వచ్చినా అది టీడీపీపై ప్రేమగా మారే అవకాశం ఎంతమాత్రం లేదు. టీడీపీ ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకపార్టీగానే తెలంగాణ ప్రజల్లో ఉండిపోతుంది. టీ-టీడీపీ నాయకులు చేసే యాత్రలు, ఆరోపణలు అన్నీ చంద్రబాబు ప్రేరేపిత చర్యలుగా ముద్రపడిపోతాయి.

చంద్రబాబు తొందరపాటు కారణంగానే టీ-టీడీపీలో చాలా మంది గోడదూకేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నాలుగు రోజులు కాలేదు. అస్తమా నం ఈ మీటింగులేమిటి? ఈ ఎగదోతలేమిటి? అని టీ-టీడీపీ నాయకుడొకరు విసుక్కున్నారు. తనను చూసి భయపడిపోయి టీడీపీని చీల్చుతున్నారని చంద్రబాబు, ఆయన మనుషులు ఆరోపిస్తున్నారు! రాజకీయ వాతావరణాన్ని అంచనావేయకుండా అతితెలివిని ప్రదర్శిస్తే అది మొదటికి మోసం తేవడం చాలా సార్లు చూశాం.

తెలంగాణ ప్రభుత్వాన్ని రాచిరంపాన పెట్టాలని చంద్రబాబు అదేపనిగా రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. తెలంగాణలో చంద్రబాబు ఆనవాళ్లు లేకుండా చేయాలని టీఆరెస్ మాత్రం ఎందుకు అనుకోదు. నిజానికి వీరిద్దరూ అనుకున్నంతనే జరిగిపోదు. తెలంగాణలో టీడీపీకి వికర్షించే పరిస్థితులు ఉన్నాయి. గత పదిహేనేళ్లుగా తెలంగాణలో టీడీపీ ఎన్నిక ఎన్నికకూ బలహీనపడి పోతున్నది. భవిష్యత్తు కనిపించడం లేదు. ఎప్పటికయినా కోలుకునే అవకాశాలు లేవు. అధికారంలోకి వచ్చే అవకాశాలు అస్సలు లేవు. ఇటువంటప్పుడు ఎవరయినా ఏం చేస్తారు? మరోవైపు టీఆరెస్ అధికారంలో ఉంది.

దీర్ఘకాలిక వ్యూహంతో ఒక బలమైన పార్టీగా అవతరించాలనుకుంటున్నది. బలహీనపడి ఉన్న పార్టీలలో అక్కడో ఇక్కడో మిగిలిపోయిన బలమైన నాయకులను దగ్గరకు తీసుకుంటున్నది. న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు తెలంగాణకు, ఆంధ్రకు మారవు. చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ వారు ఇతర పార్టీలలోకి వెళ్లడాన్ని తప్పుబడుతున్నారు. ఆంధ్రలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అం దరినీ పోగేస్తున్నారు. అక్క డ తప్పు కానిది ఇక్కడ తప్పెలా అవుతుందని ఆయనను ఎవరూ ప్రశ్నించరు. చంద్రబాబునాయు డు తెలంగాణలో తెలుగుదేశాన్ని సజీవంగా ఉంచుతున్నాననుకుని యాత్రలు చేయిస్తున్నారు. ఇది సజీవంగా ఉంచడం కాదు, చేజేతులా సాగనంపుకోవడమని, విలనీని పెంచుకోవడమని ఆయనకు ఎవ రు చెబుతారు?

అదను చూసి విమర్శ చేయాలి. గురిచూసి బాణా లు వేయాలి. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొంతకాలం పనిచేసుకోనివ్వాలి. మంచయినా, చెడయినా చేయడానికి అవకాశం ఇవ్వాలి. పొద్దెరగని కొత్తబిచ్చగాడిలాగా వేళాపాళా లేకుండా వ్యవహరించ కూడదు. ఎన్నికలు ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాత వస్తాయి. అప్పటికి అస్ర్తాలను, ఆరోపణలను, యాత్రలను మిగుల్చుకోవాలి. అన్నీ ఇప్పుడే ఉపయోగిస్తే అసలు సమయానికి ఏమీ మిగలవు. తొలి తెలంగాణ ప్రభుత్వం విఫలం కావాలని కోరుకోకండి. తొలి ప్రభుత్వం విఫలమైతే తెలంగాణ వైఫల్యంగానే చిత్రిస్తారు. రాజకీయాలు ఏమయినా తెలంగాణ విజయం సాధించాలని కోరుకుందాం.

1195

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా