నీటి సోయిలేకనే ఎండిపోయాం


Sun,September 28, 2014 02:21 AM

నీటి సోయి ప్రభుత్వానికి, నాయకత్వానికి ఉంటే చాలదు. అది మొత్తం అధికార యంత్రాంగానికి రావాలి. పనులు జరిపించడంలో లక్ష్యశుద్ధి ఉండాలి. ప్రాజెక్టులపై ఖర్చు పెడుతున్న ప్రతిపైసకూ లెక్క కావాలి. ప్రాజెక్టులపై నిద్రపోతున్న కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మేల్కొల్పాలి. ఒక్కో వర్షాకాలం కోల్పోతున్నామూ అంటే కొన్ని వేలకోట్ల రూపాయలు నష్టపోతున్నామని గుర్తించాలి.

shekarreddykనీటి సోయి ఉంటే మన ఊళ్లు ఇట్టా ఉండేయి కాదు. నాకర్థం అయితలేదు. కోట్లు కుమ్మరించి మా భూములు తీసుకుండ్రు. కాలువలు తవ్విండ్రు. పదేండ్లాయె. చిన్న చిన్న పనులకోసం పనులాపిండ్రు. నీటి చుక్కరాకపోయె. ఎవడు లాభపడ్డట్టురా అని వ్యవసాయం చేసుకుంటున్న మాజీ అధ్యాపకుడు వేసిన ప్రశ్న ఇది. చెరువుల పునరుద్ధరణ చేస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే చాలా సంబరమవుతున్నది. చెరువును పునరుద్ధరించడం అంటే బావులనూ పునరుద్ధరించడమే. చెరువులు నిండితే మా ఊరు బావులన్నీ అలుగులు పోస్తయి. చెరువులు పునరుద్ధరించడం అంటే వ్యవసాయాన్ని పునరుద్ధరించడం.

మసకబారుతున్న పల్లె జీవితాన్ని పునరుద్ధరించడం. పశువులు, పక్షులు, చేపలు...సకల జీవజాలాన్ని పునరుద్ధరించడం... అని మైమరచి చెప్పుకుపోతున్నారు ఆయన. నిజమే. మనకు నీటి విలువ ఇప్పటికీ తెలియలేదనే చెప్పాలి. నీటి విలువను తెలియజేసింది తెలంగాణ ఉద్యమమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేసీఆరే. క్యూసెక్కులు, టీఎంసీల భాషను ఎజెండాలోకి తెచ్చింది ఆయనే. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలను చర్చకు తెచ్చింది ఉద్యమ శక్తులే. ఇప్పటివరకు నీటి పారుదలను ప్రధాన ఎజెండాగా పనిచేయడం ఈ ప్రభుత్వంలోనే. తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు...వీళ్లు మారకుండా నీళ్లు రావు. కేసీఆర్‌కు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఇతర ఉద్యమశక్తులకు ఉన్న ఆరాటం వీళ్లకు ఉందా లేదా అన్నది కీలకమవుతుంది.

చాలా ప్రాజెక్టుల విషయంలో లోతుగా పరిశీలించి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎల్లంపల్లి పునరావాసితుల సమస్యను మంత్రి ఒక్క రోజు కూర్చోబెట్టి పరిష్కరించారు. ఇప్పుడు పనులు చకచకా జరిగిపోతున్నాయి. మంత్రి ఎన్నని చేయగలరు. చాలా ప్రాజెక్టుల విషయంలో చేయాల్సిన పనులు చిన్నచిన్నవే. కానీ ఏళ్లు పడుతుంది. కాంట్రాక్టరు చేయడు. ఇంజనీర్లు అదిలించరు. అధికారులకు పట్టదు. ప్రాజెక్టులను పూర్తి చేసే ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ధోరణిలోనే గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఒక కాలువలో ఒక ఆరొందల మీటర్ల తవ్వకం పూర్తి చేస్తే పది చెరువులకు నీళ్లు వస్తాయి. పది గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. కనీసం మూడు వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆ గ్రామాల రూపు రేఖలు మారిపోతాయి. కానీ ఎవరో ఒక రైతు కేసు వేశాడు. ఎక్కువ పరిహారం కోసం కావచ్చు. నాలుగేళ్లుగా ఆ కేసు నడుస్తూనే ఉంది. అది వరదకాలువ. ప్రతిఏటా ఒక సారయితే ఆ కాలువకు నీరొస్తుంది. ఆ చెరువులన్నీ నిండుతాయి. ఆ పొలాలన్నీ పండుతాయి. నాలుగేళ్లలో ఆ గ్రామాలకు జరుగుతున్న పంటనష్టం లెక్కవేస్తే ఆ ఒక్క రైతుకు ఇచ్చే పరిహారం లెక్కలోకి రాదు. కానీ అధికారులు ఇంతదూరం ఆలోచించరు. కాంట్రాక్టర్లకు వివాదం నడుస్తూ ఉండాలి. ఇంజనీర్లూ చూసీచూడనట్టు వెళుతుంటారు.

వీరి ధోరణి ఎలా ఉంటుందంటే-నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఆ ఊరి చివరిదాకా కాలువ పూర్తయింది. ఇవతలివైపు పెండింగులో పడింది.అయినా కాలం ఆగదు కదా! వరద నీరు వచ్చింది. మిగతా పని పూర్తి కాలేదన్న సాకుతో కాంట్రాక్టరు అక్కడ అడ్డుకట్టవేసి పక్కనే ఉన్న వాగులోకి మళ్లించాడు. కాలువ నీరు కళ్లముందే వాగులో కలిసి పోతుంటే కరువులో ఉన్న సమీప గ్రామాల రైతుల హృదయం ఎలా ఉంటుంది? తమ ఊరి చివరి దాకా వచ్చిన నీటిని అడ్డుకట్ట తొలగించి ముందుకు వదలాలని, రైల్వే కల్వర్టుల ద్వారా రెండు చెరువులు నింపుకుంటామని రైతులు అర్థించారు. కాంట్రాక్టరు ముందు సరేనన్నాడు, తర్వాత అడ్డం తిరిగాడు. రైతులు బలప్రయోగానికి దిగారు. కాంట్రాక్టర్ పోలీసులను దింపాడు. అందరూ కలిసి రైతాంగాన్ని బెదిరించారు. నీటి విలువ తెలిసిన మనుషులేనా వీళ్లు? నీటి విలువ తెలిసిన వ్యవస్థలేనా ఇవి? మాధవరెడ్డి కాలువపై ఉదయ సముద్రం పూర్తయి పదేళ్లవుతుంది.

కానీ ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో నిండలేదు. అది పూర్తిస్థాయిలో నిండితే డీ-40కి, మూసీకి నీరు ఇవ్వవచ్చు. కనీసం 40 చెరువులు నిండుతాయి. వేల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ఆ పంటల విలువ వందల కోట్లలో ఉంటుంది. అక్కడి జీవన విధానమే మారిపోతుంది. అదనంగా మరో ఐదారు టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఏదో తెలియని జబ్బు పట్టినట్టు ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. సమీక్షలు జరుగుతుంటాయి. సంవత్సరాలు గడుస్తుంటాయి. వివాదం మాత్రం తేలదు.

ఎస్‌ఎల్‌బీసీ ఎప్పటి ప్రాజెక్టు? దీనితో ఆలోచన చేసిన ఎస్‌ఆర్‌బీసీ గత పదిహేనేళ్లుగా నీళ్లందిస్తున్నది. దీనితర్వాత ఆలోచన చేసిన తెలుగు గంగ పూర్తయింది. కడప-కర్నూలు కాలువకు అనుసంధానమూ పూర్తయింది. దీని కంటే వెనుక మొన్నమొన్న ప్రారంభించిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విస్తరణ కూడా పూర్తయి ఆరేళ్లు దాటింది. వెలుగోడు టన్నెలు కూడా పూర్తి కావచ్చింది. కానీ ఎస్‌ఎల్‌బీసీ మాత్రం నత్త నడక నడుస్తూనే ఉంటుంది. జిల్లాలో పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలు చాలా కాలంగా చెబుతున్నారు. కానీ పట్టుబట్టి పనిచేయించింది లేదు. ఫ్లోరైడు బాధితులకు నీరందించడానికి అవకాశం ఉన్న ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయించింది లేదు.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ మూడవ దశ కాలువలు పూర్తయి పదేళ్లు దాటింది. ఆ కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టినట్టు చెబుతారు. కానీ నీళ్లు పారింది ఒకటి రెండేళ్లు మాత్రమే. దేవాదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కంతానపల్లి అనుసంధానం ప్రచారంలోకి తెచ్చారు. ఏది చెస్తారో తెలియదు. కానీ వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసి, వందల కోట్లు కూడా రాబట్టలేని దుస్థితి.

నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నామంటే అందుకు అనేక రెట్లు అధికంగా ఆదాయం సృష్టించాలన్న లక్ష్యంతో చేస్తున్నామని అందరూ మరచిపోతున్నారు. ప్రాజెక్టులపై వందలు, వేలకోట్ల రూపాయలు కుమ్మరించి ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే ఆ ప్రాంత రైతాంగానికి ఎంత నష్టం? ప్రభుత్వానికి ఎంత లోటు? రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టులు ప్రారంభించడంపై చూపిన శ్రద్ధ, మొబిలైజేషన్ అడ్వాన్సులు తర్పణ చేయడంలో చూపిన శ్రద్ధ, ప్రాజెక్టులను పూర్తిచేయడంపై చూపలేదు. అలాగని అన్నింటినీ వదిలేశారా అంటే అదీ లేదు. తనకు కావలసిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను మూడేళ్లలో అడ్డంగా తవ్వుకున్నారు. ఆయనకు స్పష్టత ఉంది. నాడు తెలంగాణ నాయకత్వానికే లేకపోయింది.

ఆయన అడుగులకు మడుగులొత్తడంలోనే అందరూ తరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలి. నీటి సోయి ప్రభుత్వానికి, నాయకత్వానికి ఉంటే చాలదు. అది మొత్తం అధికార యంత్రాంగానికి రావాలి. పనులు జరిపించడంలో లక్ష్యశుద్ధి ఉండాలి. ప్రాజెక్టులపై ఖర్చు పెడుతున్న ప్రతిపైసకూ లెక్క కావాలి. ప్రాజెక్టులపై నిద్రపోతున్న కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మేల్కొల్పాలి. ఒక్కో వర్షాకాలం కోల్పోతున్నామూ అంటే కొన్ని వేలకోట్ల రూపాయలు నష్టపోతున్నామని గుర్తించాలి. అమూల్యమైన ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నామని గుర్తించాలి.

1082

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన