రాజకీయస్వేచ్ఛ అక్కరలేదా?


Sun,September 14, 2014 12:47 AM

వాళ్లు విషం కక్కనివ్వండి....
మనం మాత్రం అమృతం పంచుదాం...
వాళ్లు విద్వేషాన్ని చిమ్మనివ్వండి....
మనం మాత్రం ప్రేమను పంచుదాం...
వాళ్లు అహంకారంతో చెలరేగనివ్వండి....
మనం మాత్రం మమకారాన్నే పంచుదాం...
shekarreddykఅవును... సంయమనంతో వ్యవహరించాల్సింది ఇటువంటి సందర్భాల్లోనే. సంస్కారాన్ని ప్రదర్శించాల్సింది ఇటువంటప్పుడే. వంద నోముల ఫలాన్ని ఒక్క ఆవేశం బలితీసుకుంటుంది. వంద మంచి పనుల ఫలాలను ఒక్క తొట్రుపాటు వెనుకకు ఈడ్చుతుంది. రాజకీయాల ఎజెండాలు మారిపోతాయి. అల్పమైన, అంగుష్ఠ మాత్రమైన ఎజెండాలు ముందుకు వస్తాయి. మీడియాపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలపై చిలువలు, పలువలుగా చర్చ జరుగుతున్నది. ఎవరూ లోతుల్లోకి వెళ్లడం లేదు.

సమస్యను అర్థం చేసుకోవడం లేదు. టైమ్సు నౌ ప్రధాన వ్యాఖ్యాత అర్నబ్ గోస్వామి అయితే పూనకం వచ్చినవాడిలా ఊగిపోయారే తప్ప ఎవరినీ మాట్లాడనివ్వలేదు. ఆయన హావభావ ప్రదర్శన మయసభ సీనులో దుర్యోధన ఏకపాత్రాభినయంలాగా అనిపించింది. అరుపులు తప్ప ఆలోచన లేని చర్చాగోష్టి అది. కారణం చూడకుండా కేవలం కార్యంపై మాత్ర మే రంకెలు వేసే జర్నలి జం అది. తెలంగాణ నాయకత్వం సున్నితంగా ఉండడంలోనూ, ఆవేశ పడడంలో నూ అన్యాయం ఏమీ లేదు. పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అస్తిత్వ చైతన్యానికి ప్రతీకగా అధికారంలోకి వచ్చిన నాయకత్వం. వారు ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల నుంచి కాస్త మర్యాదను ఆశించడంలో తప్పేముంది? వారితో సున్నితంగానే వ్యవహరించాలని ఎవరు చెప్పాలి?

ఎన్నికల్లో ప్రజల తీర్పును పొందిన నాయకుడిని పట్టుకుని నియంత అని నిందిస్తే తప్పు కాదా? మూడు దశాబ్దాలుగా ప్రజల తీర్పుతో రాజకీయాల్లో కొనసాగుతున్న ఒక నేతను పట్టుకుని దొరాగిరా అని రాతలు రాస్తే నేరం కాదా? పాపి, మహాపాపి అని కేసీఆర్ బొమ్మపై నేపథ్య గీతాన్ని ప్రసారం చేయడాన్ని ఏమనాలి? ఏ ప్రజల తీర్పు పొందకుండానే మీడియా ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే ప్రజల తీర్పు పొంది రాష్ర్టాన్ని ఏలుతున్న నాయకుడు ఏమనుకోవాలి?


ఇంతకాలం తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలాయించుకున్న మీడి యా సామ్రాజ్యాలు ఇప్పుడు చెల్లకపోయే సరికి కుతకుతలాడుతున్నాయి. మేము నియంత అని పేరుపెడితే, మీరు ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారా? మేము పౌండ్రక వాసుదేవుడని నిందిస్తే ఆయనను ఏకంగా కృష్ణ పరమాత్మను చేస్తారా? మేము పాపి, పరమ పాపి అని దూషిస్తే మీరు నెత్తినెత్తుకుంటారా? తెలంగాణలో టీఆరెస్ గెలుపును జీర్ణించుకోలేని శక్తులు పాత పద్ధతుల్లోనే తెలంగాణ నాయకులను ఎగతాళి చేయ జూశాయి.

మీడియా స్వేచ్ఛకు ఏదో జరిగిందని ఇంత గోలపెడుతున్నారే, తెలంగాణ ప్రజల రాజకీయ మనోభావాలపై ఇష్టారాజ్యంగా దాడి చేయవచ్చా? మీడియా స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ రెండూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనుంచి పొందినవే కాదా? నాయకత్వంపై అత్యంత ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు విశ్లేషణలు చేస్తూ వచ్చాయి. వీళ్లు ఇలా చెలరేగడానికి వీరిలో పాతుకు పోయిన దృష్టిలోపం ప్రధాన కారణం. పత్రికలు, చానెళ్లు చేతిలో ఉన్నాయి గనుక మేము ఏమైనా అంటాం... ఎటువంటి తీర్పులైనా చేస్తాం... మేము నీతి బోధకులం... మేము శాసకులం... రాజకీయ నాయకులు పనికి మాలిన వాళ్లు. అవినీతి పరులు. అల్పులు. వారిని ఏమైనా అనవచ్చు.

వారికి ఏ పేర్లయినా పెట్టవచ్చు. వారిపై ఎన్ని ఠావులైనా రాసుకోవచ్చు. ఎంత వాగుడైనా వాగవచ్చు అని కొందరు పత్రికాధిపతులు, చానెళ్ల అధిపతులు భావిస్తూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ రాజకీయ నాయకులదే ఉన్నతస్థానం. మంచి చేసినా చెడు చేసినా నాయకులదే భారం. వాళ్లదే బాధ్యతాయుత స్థానం. జనానికి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత నాయకులదే. ప్రజలకు గుణాత్మకమైన మేలు చేయగలిగిందీ వారే. మంచి చేసి చరిత్రకెక్కేదీ వారే, చెడు చేస్తే పతనమయ్యేదీ వారే. ఏ బాధ్యత తీసుకోకుండా చెలరేగే అవకాశాలు మీడియాకు ఉన్నట్టు రాజకీయ నాయకులకు ఉండవు. అందుకే జర్నలిస్టులుగా మనం ఎన్ని విమర్శలు చేసినా నాయకులకు అల్లంత దూరంలో ఉండి మాత్రమే చేయగలం. నాయకులకంటే ఉన్నతులం ఎప్పటికీ కాలేము.

నాయకులను ఉన్నతులుగా గుర్తించడానికి ఎంత సంస్కారం కావాలి? ఎంత సద్భుద్ధి కావాలి? ఎంత విశాల దృక్పథం కావాలి? వాటి కొరత చాలా తీవ్రంగా ఉందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మార్పు జరిగిన ప్రతిసందర్భంలోనూ మార్పు ఫలితాలు చేతికందడానికి కొంత సమయం పడుతుంది. ప్రతి నాయకుడికీ, ప్రతి ప్రభుత్వానికీ కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రభుత్వం వచ్చిన రెండవ రోజు నుంచే పంచాయితీ మొదలైంది.

రుణమాఫీపై గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించా రు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రులు... కొంతకాలం ఆగుదాం అన్న సోయి ఎవరికీ లేకపోయింది. అధికారుల విభజన, సిబ్బంది విభజన జరుగలేదు. సచివాలయంలో పని మొదలు కానే లేదు-వేచి చూద్దాం అన్న స్పృహే లేకపోయింది. సందుదొరికితే చాలు ఓ బండ మీదేసి చంపేద్దామన్న కసి అటు మీడియాలోనూ, ఇటు కొన్ని రాజకీయ పక్షాల్లోనూ కనిపించింది. వందరోజుల నాటికి ఇది మరింత ముదిరింది. కేసీఆర్ ఒక దొర అని మహాజన సోషలిస్టు నేత మంద కృష్ణ చేసిన వ్యాఖ్యే ఒక టీవీ చానెల్ ప్రధాన శీర్షిక అవుతుంది. కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చాలని తెలుగుదేశానికి వచ్చిన ఆలోచనే ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి వస్తుంది. టీవీ9కు అనిపించినట్టే పొన్నాల లక్ష్మయ్యకు అనిపిస్తుంది.

పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వంపై ఏకంగా వంద వైఫల్యాల జాబితా విడుదల చేశాడు. ధర్నాలు ఘెరావులు ప్రకటించారు. తిరుగుబాటు చేస్తామని ఆవేశపడ్డారు. కాంగ్రెస్ కోయిలలు తొందరపడి కూస్తున్నాయని సామాన్యులకు సైతం అర్థం అవుతున్నది. బీజేపీ కిషన్‌రెడ్డి కూడా కెమెరాలు కనిపిస్తే చాలు ఆవేశపడిపోతున్నారు. తెలంగాణ ప్రభు త్వం చీకటి పాలన సాగిస్తోందని చెబుతున్నారు. ఆ చీకటి పాలనలో కేంద్రాన్ని పాలిస్తున్న తమ పార్టీకి కూడా వాటా ఉందని ఆయన ఎందుకు గుర్తించడంలేదో అర్థం కాదు. టీడీపీ వాళ్ల సంగతి ఇంకా చెప్పనలవి కాదు. వాళ్లు ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతున్నారో, ఎవరికోసం మాట్లాడుతున్నారో చూసే వారికి ఇట్టే కనిపిస్తున్నది. వారందరి ముఖాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కనిపిస్తున్నారు.

వీళ్ల సంగతి ఎలా ఉన్నా మీడియాతో ఘర్షణ శాశ్వతం కాకూడదని ముఖ్యమంత్రి గుర్తించాలి. మీడియా సమాజాన్ని బాగు చేయకపోవచ్చు, ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయకపోవచ్చు, కానీ చెడగొట్టగలదు, రెచ్చగొట్టగలదు. ఎన్ని వైరుధ్యాలున్నా మీడియాతో సహజీవనం తప్పని సరి. మీడియా ఒక వాస్తవం. మీడియా స్వేచ్ఛ కూడా వాస్తవమే. ముఖ్యమంత్రి పెద్దరికం చూపాల్సింది ఇటువంటి సందర్భాల్లోనే. మెడలిరిసి అవతలేస్తం, పదికిలోమీటర్ల లోతున పాతరేస్తం అన్నవి యథాలాపంగా అన్న మాటలే. మీడియా ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలే కేసీఆర్ గురిం చి ప్రసారం చేసింది.

పత్రికల్లో రాశారు. కేసీఆర్‌ను పౌండ్రకునితో పోల్చిన వారిని ఏమనాలి? ఎన్నికల్లో ప్రజల తీర్పును పొందిన నాయకుడిని పట్టుకుని నియంత అని నిందిస్తే తప్పు కాదా? మూడు దశాబ్దాలుగా ప్రజల తీర్పుతో రాజకీయాల్లో కొనసాగుతున్న ఒక నేతను పట్టుకుని దొరాగిరా అని రాతలు రాస్తే నేరం కాదా? పాపి, మహాపాపి అని కేసీఆర్ బొమ్మపై నేపథ్య గీతాన్ని ప్రసారం చేయడాన్ని ఏమనాలి? ఏ ప్రజల తీర్పు పొందకుండానే మీడియా ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే ప్రజల తీర్పు పొంది రాష్ర్టాన్ని ఏలుతున్న నాయకుడు ఏమనుకోవాలి? కేసీఆర్‌ను రెచ్చగొట్టిందెవరు? తన పర్యటనకు పదేపదే అడ్డంపడడానికి ప్రయత్నించడాన్ని చూసి ఆయన ఒకింత అసహనానికి గురయి ఉండవచ్చు. కానీ ఆ వ్యాఖ్య లు ఒక పథకం వేసి, వ్యూహం పన్ని అన్న మాటలు కాదు.

ఎలా అన్నా ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటిని ఉపసంహరించుకోవ డం మంచిది. పత్రికా స్వేచ్ఛ పై గౌరవాన్ని ప్రకటించడం ఉత్తమం. ఈ సందర్భంగా నాకు పోలిక గుర్తుకు వస్తున్న ది. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడి యా 2004 ఎన్నికల తర్వాత రాజశేఖర్‌రెడ్డి విషయంలో ఎలాంటి తప్పులు చేసిందో మళ్లీ ఇప్పుడు అదే తప్పులు చేస్తోంది. చంద్రబాబు పదేళ్ల పాలనతో రోసిపోయిన ప్రజలు రాజశేఖర్‌రెడ్డిని గెలిపించారు. రాజశేఖర్‌రెడ్డిని కొంతకాలంపాటు ఏమీ అనకుండా ఉండాల్సిం ది.

కానీ తొలి మాసం నుంచే ఆయనపై దాడిని మొదలు పెట్టారు. తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ వైఎస్‌పై ప్రయోగించారు. 2009లో తీరా ఎన్నికలు వచ్చే సరికి వారి వద్ద ఆయుధాలేమీ మిగల్లేదు. పత్రికలను ప్రతిపక్షాల పుత్రికలని ముద్రేసి భ్రష్టుపట్టించాడాయన. ప్రతిపక్షాలు, పత్రికలు అన్నీకలిసినా 2009లో ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ఆ అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేరు. లేడికి లేచిందే పరుగులాగా తెలంగాణ ప్రభుత్వంపైన దాడి ప్రారంభించారు. ఈ ధోరణి ఎవరికీ మేలు చేయదు.

1421

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా