బాబ్బాబ్బాబ్బాబోయ్ !


Fri,October 28, 2011 10:47 PM

రాజకీయ కుట్రకు జన్మించినవాడు
వెన్నుపోటుకు పెట్టిన పేరు,
నమ్మకవూదోహానికి అసలైన నిర్వచనం
అబద్ధానికి ఆత్మబంధువు
అవినీతికి నిలు
అవకాశవాదానికి పితామహుడు
మ్యానిప్యులేషన్‌లో మాకియ
విధ్వంసం మొదలు పెట్టినవాడు
తెలంగాణ నొసట చావుశాపం రాసినవాడు
పదివేల మంది రైతుల ఉసురుతీసినవాడు
పదేళ్లు అధికారంలో ఉండి దోచినవాడు
పదేళ్ల తెలంగాణ ఉద్యమాన్ని వెక్కిరిస్తున్నవాడు
హైదరాబాద్‌ను టోకున అమ్మకానికి పెట్టినవాడు
స్ప్రెక్ట్రం, జీఎమ్మార్, ఐఎంజీ, రహేజా,
లిక్కర్, ఏలేరు, బిగ్‌బాస్....ఎన్ని స్కామ్‌లు?
కుంభకోణం ఆయన కొత్త పేరు
బిగ్‌బాస్ కుంభకోణం బట్టబయలు చేసినవాడిని
రాత్రికి రాత్రి బుట్టలో వేయగలిగిన మాయగాడు
బ్యాంకులు ముంచిన వాళ్లకు, ఊళ్లను కబ్జాపెట్టిన వాళ్లకు
చందాలిచ్చినవాళ్లకు టిక్కెట్లు అమ్మిన ఘనాపాఠి
కొనుగోళ్లు, వసూళ్లలో
రాంలాల్, సుఖ్‌రామ్‌లకు పెద్దన్న!
ముఖంలో ఉక్రోషం, ఆక్రోశం తప్ప
సంతోషం ప్రదర్శించలేని అసహాయుడు
అనుబంధాలు, ఉద్వేగాలకు అతీతుడు
యూజ్ అండ్ త్రో ఆయన పాలసీ
స్కీమింగ్ అతని చావుతెలివి
సకల అవలక్షణాల కలనేత ఆయన
ఇప్పుడు నీతిపాఠాలు వల్లిస్తున్నాడు
ఎవరో చెప్పుకోండి చూద్దాం?
చంద్రబాబు పప్పెట్ షో
చంద్రబాబు పప్పెట్ షోలో
చేతిలో బొమ్మలు వాళ్లు!
కీ ఇచ్చినట్టే రోజుకో బొమ్మ తెరపైకి వస్తుంది!
స్క్రిప్టు ఇచ్చినట్టే మురుగు ప్రవహిస్తూ ఉంటుంది
నోరుకు మోరికి తేడా లేకుండా!
వాగడం తప్ప వాదనకు నిలబడనివాళ్లు
ప్రాంప్టింగ్ ఉంటే తప్ప పలుకలేని వాళ్లు!
విషయమేమీ లేకున్నా వాళ్ల ధాటికి
విలేఖరులు తడిసిపోతారు
మైకులు జామైపోతాయి!
చంచాగిరిలో రేసు గుర్రాలు వాళ్లు!
ఒకరు తుపాకీ రాముడు!
మరొకరు తెలంగాణ తివారీ!
ఇంకొకరు వీలర్ డీలర్!
చివరివాడు గేమ్ ఛేంజర్!
ఎవరో చెప్పుకోండి చూద్దాం!
తెలంగాణ ఒక ఫీనిక్స్
ఎన్ని దెబ్బలు, ఎన్ని విద్రోహాలు,
ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని విశ్వాసఘాతుకాలు!
ఈ నేలకు సొంత నాయకుడుదయించకూడదు
ఈ గడ్డకు సొంత గొంతుక ఉండకూడదు
ఇక్కడి నేతలు పరాన్నజీవులుగా తప్ప
వెన్నెముకను ప్రదర్శించకూడదు
సొంత అస్తిత్వం తెలంగాణకు నిషేధం
ఇక్కడ పత్రికలు వికసించకూడదు
ఇక్కడ ప్రశ్నించే గళమొకటి వినిపించకూడదు
ఇక్కడ ఒక పారిక్షిశామికుడు తలెత్తుకుని నిలబడకూడదు
తెలంగాణ పదాన్నే నిషేధించినవాడొకడు
పొత్తిళ్లలోనే గొంతు నులిమేయాలని చూసినవాడొకడు
కొనుగోళ్లతో అడుగడుగునా బ్రూటస్‌లను సృష్టించినవాడొకడు
ఆధిపత్య పితామహులు, అణచివేతకు ఆదిపురుషులు
బాబో, రెడ్డో, నాయుడో....
ఎవరయితేనేం అందరి ఎజెండా ఒక్కటే!
తెలంగాణను బొందపెట్టడం
తెలంగాణను వినిపించకుండా చేయడం
అందుకు ఎటువంటి మార్గం అనుసరించాలన్నది అప్రస్తుతం
అడ్డదారా దొడ్డిదారా అన్న మీమాంసా వద్దు
తప్పా ఒప్పా అన్న సందేహం వద్దు
ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా అన్న సమీక్ష వద్దు
తెలంగాణకు వ్యతిరేకంగా ఏం చేసినా తప్పు కాదు!
ఆంధ్రా బిస్కట్లకు అలవాటుపడినవాళ్లను
ఎన్నికల నిధులకు బానిసలుగా మారినవాళ్లను
ఆత్మాభిమానాన్ని పాతాళంలో పాతరేసినవాళ్లను
జన్మభూమిని, సొంత ఉనికిని తాకట్టుపెట్టినవాళ్లను
స్వామిని మించిన స్వామి భక్తులను.....
ఎవరయితేనేం పురిపెట్టి ఉసిగొల్పండి!
తెలంగాణ ఐక్యం కావడానికి వీలు లేదు!
యుద్ధంలో నీతి లేదు! రాజ్యం పోతే మళ్లీ రాదు!
తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినవాడు హీరో!
తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపె ధీరుడు!
డబ్బుసంచులతో రాజ్యం చేసినవాడు మొనగాడు!
సకలపాపాలకు సత్ప్రవర్తన సర్టిఫికెట్
ఇచ్చేందుకు పత్రికలున్నాయి
విద్రోహాలను, వెన్నుపోట్లను
పవివూతీకరించేందుకు చానెళ్లు ఉన్నాయి
అందరూ తోడు దొంగలే! అందరి లక్ష్యం ఒక్కటే!
తెలంగాణను పాతరేయడం!
అయినా ఆ గొంతులు మూగపోలేదు
ఆ నినాదం ఆగిపోలేదు
ఆ జ్వాల ఆరిపోలేదు
ఫీనిక్స్‌లాగా తెలంగాణ పదేపదే
పునరుత్థానం చెందుతూనే ఉంది!
అలుపూ సొలుపూ లేకుండా
ఒక గొంతుక పదేళ్లుగా నినదిస్తూనే ఉంది
అరవయ్యో పడిలో కూడా ఒక పాదం
అనాయాసంగా గజ్జెకట్టి నర్తిస్తూనే ఉంది
జీరబోయినా ఆ గళం ఎలుగెత్తి పాడుతూనే ఉంది!
ఇప్పుడు తెలంగాణ
కోట్లాది గళాల కోరస్!
లక్షలాది పిడికిళ్ల లాంగ్ మార్చ్
వేనవేల ఆకాంక్షల ప్రవాహం...దానికి ఓటమి లేదు
అడ్డొచ్చినవారిని అది ముంచెత్తకమానదు!
కెరటం ఉప్పెన కాకపోతుందా!
కెరటాలకు పడిపోవడమే కాదు
ఉప్పెనలా ఎగసిపడడమూ తెలుసు
గాలికి స్తంభించిపోవడమే కాదు
ప్రచండ మారుతంలా పరిణమించడమూ తెలుసు
మేఘానికి మౌనంగా కదలిపోవడమే కాదు
ఉరుములూ, పిడుగులూ కురిపించడమూ తెలుసు
సిపాయీల తిరుగుబాటు ఓడిపోయి ఉండవచ్చు
సహాయ నిరాకరణోద్యమాలు చల్లారిపోయి ఉండవచ్చు
విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం పనిచేయకపోయి ఉండవచ్చు
కాలం కదలిపోయి ఉండవచ్చు, ఉద్యమ రూపాలు మారి ఉండవచ్చు
కానీ క్విట్ ఇండియా ఉద్యమ జ్వాలలను ఏ శక్తులు ఆపగలిగాయి?
స్వాతంత్య్ర పతాక రెపపలను ఏ ఫిరంగులు నిలువరించాయి?
ఇది తుపాను ముందు ప్రశాంతత కావచ్చు
శాంతికాలం యుద్ధ సన్నాహాల కోసమే కావచ్చు
తెలంగాణ మరోసారి తిరగబడనూ వచ్చు!

పిల్లి, పిట్టల కథ
మరో మెయిల్ కథ: పిట్టలు తగవులాడుతున్నాయి. పిల్లి పంచాయతీ చెబుతోంది. ఒక పిట్ట మాట్లాడుతోంది- ‘మాకు పేదోళ్ల తెలంగాణ కావాలె. పెద్దోళ్ల తెలంగాణ కాదు’. ‘నువ్వన్నది నిజమే’ -పిల్లి సంఘీభావం. మరో పిట్ట అడ్డం పడింది-‘మాకు సామాజి క తెలంగాణ కావాలె. దొరల తెలంగాణ కాదు’. ‘అదీ నిజమే. అందులోనూ న్యాయముంది’-పిల్లి ముక్తాయింపు. మూడో పిట్ట-‘మాకు దళిత తెలంగాణ కావాలె. రిజర్వేషన్లు అయినంకనే తెలంగాణ కావాలె’. ‘దళితులకు అధికారంలేని తెలంగాణ అనవస రం’- పిల్లి గట్టిగానే సమర్థించింది. ఈ తగవు చూసి మిగిలిన పిట్ట లు విలవిలలాడుతున్నాయి. ఆవు లేకుండా పొదుగుకోసం కొట్లాడినట్టు, భూమి లేకుండా కోండ్రకోసం తన్నుకున్నట్టు, యుద్ధం గెలువకుండా వాటాలకోసం వాదులాడుకున్నట్టు పిట్టలు తన్నుకోవడం చూసి మిగిలిన పిట్టలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని పిట్టలు పిల్లి మాయలోపడి అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. పిల్లి మాత్రం సంబరపడిపోతోంది. తన వేట మరికొంతకాలం యథేచ్ఛగా కొనసాగించవచ్చని ఉబలాటపడుతోంది. కానీ పిట్టలు తిరగబడితే పిల్లి పారిపోదా!

332

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా